breaking news
Mitraaw Sharma
-
‘వర్జిన్ బాయ్స్’ రివ్యూ
బిగ్‌బాస్ ఫేం మిత్ర శర్మ శ్రీహాన్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం వర్జిన్ బాయ్స్. గేమ్ ఆన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న గీత్ ఆనంద్, జెనీఫర్ ఇమాన్యుయల్, వంటి వారు ఇతర కీలకపాత్రలలో నటించిన ఈ సినిమాని గేమ్ ఆన్ డైరెక్టర్ దయానంద్ డైరెక్ట్ చేశాడు. రాజా దారపునేని నిర్మించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫైనల్లీ నేడు(జులై 11) ఈ సినిమా ధియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాంకథేంటంటే..డూండీ (శ్రీహాన్), ఆర్య (గీత ఆనంద్), రోని(రోనిత్ రెడ్డి) ఒక యూనివర్సిటీలో కలిసి చదువుకుంటూ ఉంటారు. ఎలా అయినా వర్జినిటీ కోల్పోవాలని తహతహలాడుతున్న వీరికి వీరి ఫ్రెండ్ (కౌశల్) ఒక ఛాలెంజ్ ఇస్తాడు. తాను మళ్ళీ అమెరికా వెళ్లి వచ్చేటప్పటికి మీరంతా వర్జినిటీ కోల్పోవాలని ఛాలెంజ్ చేస్తాడు. ఎలాగైనా వర్జినిటీ కోల్పోవాలని ఉద్దేశంతో శ్రీహాన్ జెనీఫర్ ను, గీత్ ఆనంద్ మిత్ర శర్మను, రోనిత్ రెడ్డి అన్షులా ధావన్‌ను ప్రేమిస్తారు. వర్జినిటీ కోల్పోవడానికి వీరితో ప్రేమలో పడిన ముగ్గురు వర్జినిటీ కోల్పోయారా? ఛాలెంజ్‌లో గెలిచారా? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందేఎలా ఉందంటేఓ ముగ్గురు కాలేజీ కుర్రాళ్ళు వర్జినిటీ కోల్పోవడానికి చేసే పోరాటమే ఈ కథ. కథలో కొత్తదనం లేదు కానీ తనదైన శైలిలో నవ్విస్తూ ఎంగేజ్ చేసేలా రాసుకోవడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు. సెక్స్ ముఖ్యమని భావించి దాని వెనుకబడి తర్వాత ప్రేమ మాధుర్యాన్ని చవిచూసి, ప్రేమే గొప్పదని ఒప్పుకునే లైన్‌తో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. వర్జిన్ బాయ్స్ కథ కూడాఅదే లైన్ లో రాసుకున్నాడు దర్శకుడు. కాకపోతే నేటి యూత్ ను టార్గెట్ చేసుకొని వారిని ఎంగేజ్ చేసేలా చాలా సీన్స్ రాసుకోవడంతో కొంతవరకు యూత్ ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. సినిమా ఓపెనింగ్ నుంచి చివరి వరకు ప్రేక్షకులకు ఎక్కడా కొత్తదనం కనిపించకపోయినా కొన్నిచోట బోల్డ్ జోక్స్, అమ్మాయిల అందాలతో కనివిందు చేస్తూ చాలావరకు సినిమా నడిపించే ప్రయత్నం చేశారుఒక ముగ్గురు యువకులు నగ్నంగా రోడ్డు మీద పరిగెత్తే సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది.ఆ తర్వాత ఈ ముగ్గురి క్యారెక్టర్ లోని ఎస్టాబ్లిష్ చేస్తూ కథనం సాగుతుంది. అమ్మాయిల చేతిని తాకితేనే ఎంతో అదృష్టం అని భావించే ముగ్గురు యువకులు న్యూ ఇయర్ రోజుకి వర్జినిటీ కోల్పోవాలని లక్ష్యంతో ముగ్గురు అమ్మాయిలతో ప్రేమలో పడటం, వారితో ప్రేమ కయ్యాలు ఇలా ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్లో ఏదో ట్విస్ట్ ఇచ్చిన ఫీలింగ్ ఇస్తారు కానీ అదేమీ ఉండదు, సెకండాఫ్ మొదలయ్యాక వీరి ప్రేమ మీద అనుమానాలు తర్వాత మళ్లీ కలిసేందుకు ప్రయత్నాలు అంటూ రొటీన్ గానే సాగుతుంది చివరలో ఒక మంచి మెసేజ్ తో సినిమాని క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు.ఎవరు ఎలా చేశారంటే.. ఈ సినిమాలో శ్రీహాన్ పాత్ర అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది ఎందుకంటే మన కాలేజీలలో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి వ్యక్తులను మనం చూసే ఉంటాం. ఈ పాత్రలో శ్రీహాన్ ఒదిగిపోయాడు.తర్వాత కొంతవరకు గీత్ ఆనంద్ పాత్ర కన్వెన్సింగ్ గా ఉంటుంది. మిత్ర శర్మ పద్ధతి అయిన అమ్మాయి పాత్రలో ఆకట్టుకుంది. జెనీఫర్ అన్షుల ఒకపక్క అందాలు ఆరబోస్తూనే అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్ర పరిధి మేరకు పరవాలేదు అనిపించారు. సినిమాటోగ్రఫీ బాగుంది సంగీతం పర్వాలేదు నేపథ్య సంగీతం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది నిర్మాణ విలువలు బాగున్నాయి ఎడిటింగ్ సినిమాకి సరిపోయేలా కట్ చేశారు.రేటింగ్: 2.75/5 -
సినిమా టికెట్ లాటరీ.. ఐఫోన్ గెలుచుకున్న యువకుడు
మిత్రాశర్మ, బిగ్‌బాస్ శ్రీహాన్, గీతానంద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'వర్జిన్ బాయ్స్' ఈ మూవీ జూలై 11న థియేటర్లో విడుదలైంది. థియేటర్లలో టికెట్ కొన్న ఆడియెన్స్‌కు ఐఫోన్‌ను గిఫ్ట్‌గా ఇస్తామని ట్రైలర్ లాంఛ్ మేకర్స్ వెల్లడించారు. వారు చెప్పిన విధంగానే మొదటిరోజు మాట నిలబెట్టుకున్నారు. దర్శకుడు దయానంద్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాజ్ గురు ఫిలిమ్స్ నుంచి రాజా దారపునేని నిర్మించారు.వర్జిన్ బాయ్స్ విడుదల సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. "మేం పెట్టిన స్కీమ్ టికెట్ కొట్టు – ఐఫోన్ పట్టు,’ మనీ రైన్ కాన్సెప్ట్స్ జనాల్లోకి బాగా వెళ్లింది. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని, థియేటర్లకు ప్రేక్షకులను ఎక్కువ శాతం వచ్చేలా చేయాలని మేమీ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. అలాగే దర్శకుడు కూడా మంచి కథను సెలెక్ట్ చేసుకున్నారు. కథ ఏదైతే చెప్పారో అదే నేటి యువతకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు. అలాగే సినిమా కోసం ఆర్టిస్ట్‌లు ప్రతి ఒక్కరూ ఎంతగానో కృషి చేశారు. ప్రమోషన్స్ కూడా వినూత్నంగా చేస్తున్నారు. మిత్ర శర్మ ప్రమోషన్ కోసం కూడా బాగా కష్టపడుతున్నారు. గతంలో ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కూడా పలువురికి ఆమె సాయం అందించారు.' అని తెలిపారుతొలి ఫోన్ గెలుచుకున్న ప్రవీణ్హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతంలో ఓ షాప్ ఓపెనింగ్‌లో పాల్గొన్న మిత్ర శర్మ, వర్జిన్ బాయ్స్ టీం అడ్వాన్స్ టికెట్ తీసుకున్న వారిని వివరాలతో లాటరీ తీయగా చందానగర్‌కు చెందిన ప్రవీణ్ ఐఫోన్ గెలుచుకున్నారు. ఇది మొదటి ఫోన్ మాత్రమేనని. ఇంకా దాదాపు పది లాటరీస్ ఉన్నాయని సినిమా టీం తెలిపింది. -
వర్జిన్ బాయ్స్ హీరోయిన్ గొప్పమనసు.. నల్గొండ కుర్రాడికి సాయం!
బిగ్ బాస్ బ్యూటీ మిత్రా శర్మ ప్రస్తుతం వర్జిన్ బాయ్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా.. యూత్ ఆడియన్స్‌ను ఓ రేంజ్లో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించారు. దయానంద్ గడ్డం దర్శకత్వంలో రాజా దారపునేని నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ జూలై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో మిత్రా శర్మ తన మంచి మనసును చాటుకుంది. నల్గొండ నుంచి వచ్చిన ఓ దివ్యాంగుడు ఈవీ ఇప్పించాలని కోరడంతో మిత్రా శర్మ అతని వివరాలు అడిగి తెలుసుకుంది. నీకు 15 రోజుల్లోనే ఈవీ వాహనం అందజేస్తామని అతనికి హామీ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ హీరోయిన్ మిత్రా శర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు.అయితే ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్ ఇస్తామని అనౌన్స్ చేశారు. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్‌తో కొన్ని థియేటర్లలో డబ్బు వర్షంలా కురిపిస్తామని.. ఆ డబ్బు ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చు అని బంపరాఫర్లు ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతాన్ని అందించారు. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా, జేడీ మాస్టర్ కొరియోగ్రఫర్‌గా పని చేశారు. Heroine @Mitraaw_sharma encounters a need boy at #VirginBoysTrailer Launch Event and extends her helping hand for an EV 👏#VIRGINBOYS IN THEATERS FROM JULY 11th ! pic.twitter.com/YYC6euA504— Rajesh Manne (@rajeshmanne1) July 7, 2025 -
హీరోయిన్గా మిత్రా శర్మ.. ఎంతందంగా ఉందో! (ఫోటోలు)
-
నాలో ఏదైనా లోపం ఉందా..? మిత్రా శర్మ ఎమోషనల్
-
ఈ సినిమాకు వెళ్తే థియేటర్లలో డబ్బుల వర్షం..
మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం వర్జిన్ బాయ్స్. దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో రాజా దారపునేని నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ జూలై 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తుండగా వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా, జేడీ మాస్టర్ కొరియోగ్రఫర్‌గా పని చేశారు. శనివారం నాడు వర్జిన్ బాయ్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా.. ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్ ఇస్తామన్నారు. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్‌తో కొన్ని థియేటర్లలో డబ్బు వర్షంలా కురిపిస్తామని, ఆ డబ్బు ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చు అని బంపరాఫర్లు ప్రకటించారు.ఈ సందర్భంగా నటుడు రోనిత్ మాట్లాడుతూ... "నేను, దర్శకుడు దయ కాలేజ్ ఫ్రెండ్స్. అప్పటినుండే ఇద్దరం సినిమాలు చేయాలని అనుకునే వాళ్ళం. చూస్తే పది సంవత్సరాల తర్వాత ఒక సినిమా స్టేజిపై ఉన్నాము. చిన్న సినిమాలకు ఊపిరి పోసే సినిమాగా వర్జిన్ బాయ్స్ నిలుస్తుందని అనుకుంటున్నాను" అన్నారు. నటుడు శ్రీహాన్ మాట్లాడుతూ.. తనను నమ్మి తనపై ఎంతో ఖర్చు పెట్టి ఎంకరేజ్ చేసిన నిర్మాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.నటి మిత్ర శర్మ మాట్లాడుతూ... "ఈ సినిమాలో నా క్యారెక్టర్ కొంచెం కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దయానంద్ కు థాంక్స్. ఏదైనా సాధించాలి అనే సంకల్పంతో ముందుకు వచ్చాడు. తన కష్టం వల్లే మేము ఈరోజు ఈ స్టేజి మీద ఉన్నాము. రోనిత్ ఎంతో మంచి పర్ఫార్మెన్స్ చేశారు. శ్రీహాన్ చేసిన క్యారెక్టర్ లేకపోతే సినిమాలో కిక్ ఉండదు. అలాగే గీతానంద్ తో కలిసిన నటించడం బాగా ఎంజాయ్ చేశాను. చాలా సైలెంట్ గా ఉండే వ్యక్తి, బాగా సపోర్ట్ చేస్తారు. నేను మీ అందరిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను" అంటూ ముగించారు. -
నాలో ఏదైనా లోపం ఉందా? సరైన దారిలో లేనా?.. ఏడ్చేసిన బిగ్‌బాస్ బ్యూటీ
బిగ్‌బాస్ బ్యూటీ మిత్రా శర్మ (Mitraaw Sharma) హీరోయిన్గా, నిర్మాతగా అందరికీ సుపరిచితురాలే! తను బిగ్‌బాస్ నాన్‌స్టాప్ (ఓటీటీ) సీజన్లో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఎప్పుడూ ఎవరో ఒకరికి సాయం చేస్తూ తన మంచి మనసు చాటుకుంటూ ఉంటుంది. మిత్రా శర్మ కథానాయికగా నటించిన తాజా చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ మూవీ జూలై 11న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మిత్ర భావోద్వేగానికి లోనైంది. అమ్మ-నాన్నను కోల్పోయానేను పుట్టగానే అమ్మను కోల్పోయాను. చిన్నవయసులోనే నాన్నకూ దూరమాయ్యాను మా నాన్న టీచర్. ఆయన నాకు ఇచ్చింది విద్య మాత్రమే! ఆయన చనిపోయేముందు కూడా నువ్వు లేకుండా నేను బతకలేను నాన్న అని చాలా బాధపడ్డాను. ఆయన వెళ్లిపోయాక నాకంటూ ఎవరూ లేకుండా పోయారు. నా జీవితంలో ఎవరైనా ఉంటే వారికోసం ఏదైనా చేయాలనుకున్నాను. కానీ, అర్హత ఉన్నవారికే సాయం చేయాలి. ఎందుకంటే జీవితంలో ఎన్నో రిజెక్షన్స్ చూశాను.తలరాత మార్చలేరుగాతిరస్కరణకు గురైనప్పుడల్లా నాకేమనిపించేదంటే.. నాలో ఏమైనా లోపం ఉందా? సరైన దారిలో లేనా? లేదంటే టైం బాగోలేదా? ఇలా నన్ను నేనే ప్రశ్నించుకునేదాన్ని. తర్వాత మళ్లీ నాకు నేనే సర్ది చెప్పుకునేదాన్ని. మన దగ్గరున్న డబ్బు ఆఖరి రూపాయి వరకు ఎవరైనా తీసుకెళ్లవచ్చు. కానీ మన తలరాతను తీసుకెళ్లలేరు కదా అని రియలైజ్ అయ్యేదాన్ని. సాయం చేయాలి.. నాకంటూ మంచి మనుషులను సంపాదించుకోవాలి అనే లక్ష్యంతోనే ముందుకువెళ్తున్నాను అంటూ మిత్ర శర్మ కన్నీళ్లు పెట్టుకుంది.సినిమాగీతానంద్, మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వర్జిన్ స్టోరీ. శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్ కీలక పాత్రల్లో నటించారు. దయానంద దర్శకత్వం వహించగా దారపునేని రాజా నిర్మించారు. జూలై 11న ఈ సినిమా రిలీజవుతోంది. సినిమా చూసినవారికి ఐఫోన్లు కూడా రిటర్న్ గిఫ్ట్‌గా ఇస్తామని ప్రకటించారు. సినిమా చూశాక.. టికెట్ ఫోటో తీసి 8019210011 నెంబర్‌కు వాట్సాప్ చేయాలని.. లక్కీ డ్రా ద్వారా 11 మందిని సెలక్ట్ చేసి ఐఫోన్ పంపిస్తామని క్రేజీ ఆఫర్ ఇచ్చారు.చదవండి: ప్రభాస్ రూ.50 లక్షల సాయం? ఒక్క రూపాయి అందలేదు: ఫిష్ వెంకట్ -
మిత్రా శర్మ ‘వర్జిన్ బాయ్స్’ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
Virgin Boys Teaser: యూత్‌ని ఆకట్టుకునేలా ‘వర్జిన్ బాయ్స్’ టీజర్
‘వర్జిన్ బాయ్స్’ టీజర్ విడుదలైంది. గీతానంద్, మిత్రా శర్మ జంటగా నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీలో శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దయానంద్ దర్శకత్వంలో రాజా దరపునేని నిర్మాణంలో రాజ్‌గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది.టీజర్లో యూత్‌ఫుల్ ఎనర్జీ, కలర్‌ఫుల్ విజువల్స్, ఫ్రెష్ వైబ్స్ ఆకట్టుకుంటున్నాయి. స్మరణ్ సాయి సంగీతం టీజర్‌కు జోష్‌ను జోడించగా, వెంకట ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఎనర్జిటిక్‌గా ఉంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ టీజర్‌ను క్రిస్పీగా, ఆకర్షణీయంగా మలిచింది. గీతానంద్, మిత్రా శర్మ కెమిస్ట్రీ టీజర్లో హైలైట్‌గా నిలుస్తుంది. హాస్యం, రొమాన్స్, ఎమోషన్స్‌తో నిండిన ఈ కథ ఆధునిక రిలేషన్‌షిప్స్‌ను సరికొత్త శైలిలో చూపించనుంది. బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ కామెడీ టైమింగ్, క్యారెక్టర్ టీజర్లో సందడి చేస్తున్నాయి, ఇంకా ఎక్కువ ఫన్ను సినిమాలో ఆశించవచ్చని తెలుస్తోంది. డైలాగ్స్, సీన్స్‌లో ఫన్ ఎలిమెంట్స్ యూత్‌ను ఆకర్షిస్తున్నాయి. ఈ సమ్మర్లో ‘వర్జిన్ బాయ్స్’ థియేటర్లలో యూత్‌ను అలరించే ఫుల్ ఎంటర్టైనర్గా నిలవనుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.నిర్మాత రాజా దరపునేని మాట్లాడుతూ, "‘వర్జిన్ బాయ్స్’ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. గతంలో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్‌ను మించేలా, రొటీన్‌కు భిన్నంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. యూత్ ఈ సినిమాతో తప్పకుండా రిలేట్ అవుతారు," అని అన్నారు. -
యువతిని మోసం చేసిన కేసు.. స్పందించిన హర్షసాయి
యువతిని మోసం చేసిన కేసులో యూట్యూబర్ హర్షసాయిపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, నగ్న చిత్రాలతో తనని బెదిరిస్తున్నాడని ఓ యువతి మంగళవారం ఫిర్యాదు చేసింది. ఇది జరిగినప్పటి నుంచి హర్షసాయి అందుబాటులో లేడు. ఇతడితో పాటు తండ్రి రాధాకృష్ణ గురించి పోలీసులు వెతుకున్నారు. ఇప్పుడు ఈ ఆరోపణలపై హర్షసాయి స్పందించాడు. ఇన్ స్టా వేదికగా క్లారిటీ ఇచ్చాడు.'అవన్నీ తప్పుడు ఆరోపణలు. డబ్బులు దండుకోవడం కోసమే నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నా గురించి మీకు తెలుసు. నిజానిజాలు త్వరలో బయటకొస్తాయి. మా లాయర్ తానికొండ చిరంజీవి ఈ విషయమై త్వరలో మీ ముందుకు వస్తారు' అని ఇన్ స్టా స్టోరీలో హర్షసాయి రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్షసాయిపై కేసు.. నిజాలు బయటపెట్టిన యువతి)వైజాగ్‌కి హర్షసాయి.. పేదోళ్లకు డబ్బులు సాయం చేస్తూ వాటిని వీడియోలుగా తీసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తుంటాడు. అయితే ఈ కుర్రాడికి ఇన్నేసి లక్షల రూపాయలు ఎక్కడనుంచి వస్తున్నాయనేది పెద్ క్వశ్చన్ మార్క్. ఇది కాదన్నట్లు బెట్టింగ్ యాప్స్‌ని విపరీతంగా ప్రమోట్ చేస్తుంటాడు. కొన్నిరోజుల క్రితమే ఈ విషయమై విమర్శలు వచ్చాయి.ఇవన్నీ పక్కనబెడితే సొంతంగా కథ రాసుకుని 'మెగా' అనే సినిమాని గతేడాది లాంచ్ చేశారు. ఇందులో హీరోయిన్గా నటిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తున్న అమ్మాయే.. ఇప్పుడు హర్షసాయిపై కేసు పెట్టింది. తన దగ్గర రూ.2 కోట్లు తీసుకున్నాడని ఆరోపిస్తోంది. ఇప్పుడు ఈ కేసు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ) -
యూట్యూబర్ హర్షసాయి కేస్ లో బిగ్ ట్విస్ట్
-
#MitraawSharma : ట్రెండింగ్‌లో హీరోయిన్ మిత్రా శర్మ (ఫొటోలు)
-
హర్ష సాయి హీరోగా మెగా సినిమా.. టీజర్ వచ్చేసింది
హర్షసాయి.. ఈ పేరుకే చాలామంది అభిమానులు ఉన్నారు. కష్టాల్లో ఉన్నవారికి నోట్ల కట్టలు పంచడం, నిరుపేద జీవితాల తలరాతను రాత్రికి రాత్రే మార్చేయడం, పొట్టకూటి కోసం బతుకుబండి లాగిస్తున్నవారికి లక్షల డబ్బు ఇచ్చి వారి ముఖాల్లో సంతోషాన్ని వెతుక్కోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మొత్తానికి దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్న హర్షసాయి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అది కూడా ఏకంగా పాన్ ఇండియా సినిమాతో! తాను నటించడమే కాదు, ఈ సినిమాకు స్వయంగా తనే దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి మెగా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆదివారం(సెప్టెంబర్ 17న) ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ ప్రారంభంలో ఏంటి డాక్టర్? ఏమీ అర్థం కావడం లేదు అని ఓ వ్యక్తి అడగ్గా.. ప్రపంచానికి తెలియని, ప్రపంచంలోని అత్యంత ఘోరమైన శిక్షల్లో ఇదీ ఒకటి అని వైద్యుడు చెప్తున్న డైలాగ్‌తో వీడియో కొనసాగింది. టీజర్ చూస్తుంటే కాన్సెప్ట్ కొత్తగా ఉంది.. కానీ డైలాగులకు సీన్లకు పొంతన కుదరకుండా పోయింది. కొన్ని డైలాగులు పవర్‌ఫుల్‌గా కనిపించాయి. విజువల్స్ కూడా బాగున్నాయి. ఈ చిత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరి బంధువైన కల్వకుంట్ల వంశీధర్ రావు సమర్పిస్తున్నారు. బిగ్‌బాస్ బ్యూటీ మిత్ర శర్మ తన సొంత బ్యానర్ శ్రీ పిక్చర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరి ఈ సినిమా రానున్న రోజుల్లో ఎలాంటి బజ్ క్రియేట్ చేయనుందో చూడాలి! చదవండి: ఓటీటీలోనూ భోళా శంకర్ డిజాస్టర్.. దూసుకుపోతున్న రామబాణం -
సినిమా ప్రకటించిన హర్షసాయి.. నిర్మాతగా బిగ్‌బాస్ బ్యూటీ
'అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు'.. కానీ ఇతడు మాత్రం ఎవరు కష్టాల్లో ఉన్నారో తెలుసుకుని వారికి తనవంతు సాయం చేస్తుంటాడు. గుడిసెల ముందు నోట్ల కట్టలు గుమ్మరించడం, తల దాచుకోవడానికి నీడ లేని వారికి ఇల్లు, పిల్లాడికో సైకిల్, పేద పిల్లాడి స్కూల్ ఫీజులు చెల్లించేందుకు చెక్కులు, బార్బర్‌కు షాప్ కట్టించడం.. ఇలా ఎన్నో మంచిపనులు చేశాడు, చేస్తూనే ఉన్నాడు. దీంతో ఆయనకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి లక్షలు సంపాదిస్తున్నారు. యూట్యూబ్‌లో అందరూ డబ్బుల కోసం వీడియోలు చేస్తుంటే ఇతడు మాత్రం డబ్బులు పంచుతూ వీడియోలు చేస్తుండటం విశేషం. అయితే తాజాగా హర్ష సాయి సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ ఈ నెల 17వ తేదీన జరగబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా టీజర్ అనౌన్స్మెంట్ కి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా విషయంలో పలు ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దగ్గరి బంధువైన కల్వకుంట్ల వంశీధర్ రావు ఈ సినిమాని సమర్పిస్తున్నారు. గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి సందడి చేసి ప్రేక్షకుల మనుసుదోచిన మిత్ర శర్మ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఆమె సొంత బ్యానర్ అయిన శ్రీ పిక్చర్స్ మీద ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. హర్షసాయి మొదటి సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేస్తున్నట్లు సమచారం. సెప్టెంబర్ 17న ఉదయం 10 గంటలకు ఈ టీజర్ లాంచ్ జరగబోతున్నట్లు మిత్ర శర్మ తన సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ఈ కార్య్రమం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' ఆడుకున్నాడు.. వాళ్లని నిద్ర పోనీయకుండా చేశాడు!) Our Next PAN INDIA PROJECT Further Details Very Soon #ShreePictures #HarshaSai pic.twitter.com/iCOWp0VISX — Mitraaw (@Mitraaw_sharma) September 13, 2023 -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న హర్షసాయి? నిర్మాత ఎవరో తెలుసా?
యూట్యూబ్ స్టార్ హర్షసాయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అవసరంలో ఉన్నవారికి నేనున్నాంటూ సాయం చేస్తూ యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన హర్షసాయికి యూత్‌లో మాంచి క్రేజ్ ఉంది. యూట్యూబ్‌లో 8.64 మిలియన్ల ఫాలోవర్స్.. ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్ల ఫాలోవర్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హర్షసాయిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.చదవండి: 'పుష్ప-2'లో రష్మిక చనిపోతుందా? వైరల్ అవుతున్న ఫోటోలో నిజమెంత? తాజాగా హర్షసాయికి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. గత కొంతకాలంగా హర్షసాయి వీడియోలకు బ్రేక్ ఇచ్చాడు..దీనికి ఓ కారణం ఉందట. ఆయన త్వరలోనే హీరోగా లాంచ్ అవుతున్నట్లు తెలుస్తుంది. బిగ్‌బాస్ ఫేం మిత్రాశర్మ ఈ సినిమాను నిర్మిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కేవలం హీరోగానే కాకుండా దర్శకత్వం కూడా వహించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. మరి యూట్యూబ్ స్టార్‌గా పాపులర్ అయిన హర్షసాయి హీరోగా ఎంతవరకు సక్సెస్ అవుతాడన్నది చూడాల్సి ఉంది. చదవండి: సిద్దూ జొన్నలగడ్డతో సమంత? యంగ్ హీరోకు క్రేజీ ఆఫర్ -
బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్‌కి మళ్లీ వెళ్తా: మిత్ర శర్మ
బిగ్‌బాస్ ఓటీటీ నాన్‌స్టాప్‌లో టాప్ 5లో చోటు దక్కించుకుంది మిత్ర శర్మ. ఆమె ఫినాలేలో స్థానం సంపాదించినందుకు కొందరు సంతోషిస్తుంటే మరికొందరు ఈమె ఇక్కడిదాకా ఎలా వచ్చిందా? అని తలలు పట్టుకుంటున్నారు. బిగ్‌బాస్ షోలో ఆమె ఎక్కువగా కనిపించేది నామినేషన్స్‌లోనే. అందరి నామినేషన్ ఒక ఎత్తైతే మిత్ర నామినేషన్ మాత్రం వేరే లెవల్ ఉండేది. గంటల తరబడి వాదిస్తుంటే మిగతావాళ్ల కాళ్లు నొప్పులు పుట్టేవి. అన్న అన్న అనుకుంటూనే మహేశ్, శివను నామినేట్ చేసింది. బిందు, శివను నామినేట్ చేసేటప్పుడు మిత్రలో మరో యాంగిల్ బయటకు వచ్చేది. ఇమిటేట్ చేయడం, డ్రామా క్రియేట్ చేయడం, గార్డెన్ ఏరియాను అంతా వాడేసుకుంటూ పరిగెత్తుతూ అరిచేస్తూ గోలగోల చేసేది. ఎదుటివారిని మాట్లాడనీయకుండా తను చెప్పాలనుకున్న విషయాలను ముక్కుసూటిగా బల్లగుద్ది చెప్పేది. నామినేషన్స్‌లో ఓ రేంజ్లో విరుచుకుపడే మిత్ర తర్వాత మాత్రం అసలు ఎపిసోడ్లో ఎక్కడో ఓ చోట కనిపించేది. ఓపక్క గొడవపడుతూనే మళ్లీ వారితో సఖ్యతగా ఉండటానికి ప్రవర్తించేది. షో ప్రారంభంలో అయితే నోరు తెరిచి మాట్లాడేదే కాదు. తన అభిప్రాయాలను టిష్యూ పేపర్ల మీద రాసి వెల్లడించేది. ఈ ప్రవర్తనను అందరూ తప్పు పట్టడంతో అప్పటి నుంచి తన రూటు మార్చుకుంది. తనవరకు గేమ్‌లో బాగానే కష్టపడేది కానీ ఇతర హౌస్మేట్స్ నుంచి ఆమెకు ఎలాంటి సపోర్ట్ లభించేది కాదు. దీంతో ఎప్పుడూ తాను ఒంటరిని అని ఎక్కువగా ఫీల్ అయ్యేది. మొత్తానికి టాప్ 5లో చోటు దక్కించుకున్న మిత్ర తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ అమ్మాయిగా బిందు గెలిచినందుకు సంతోషంగా ఉందంది. తన నామినేషన్స్ జనాలకు బాగా నచ్చాయని, కాబట్టి తనకు మళ్లీ ఆఫర్ వస్తే ఆరో సీజన్‌కి తప్పకుండా వెళ్తానంది. మరి నిజంగానే బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు మిత్రకు పిలుపొస్తుందా? నెక్స్ట్ సీజన్లో మరోసారి మిత్రను బిగ్‌బాస్ హౌస్‌లో చూస్తామా? అన్నది వేచి చూడాలి! చదవండి 👉🏾 బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ ఎన్ని లక్షలు గెలుచుకుందో తెలుసా? నటితో ఎఫైర్ పెట్టుకో, ఫేమస్ చేస్తామన్నారు -
మిత్రా శర్మను మెచ్చుకున్న జీవిత, రాజశేఖర్..
Bigg Boss Non Stop Telugu OTT: Mithra Sharma Will Top 5 Contestants: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రియాలిటీ షో మరింత రసవత్తరంగా మారనుంది. హౌజ్ కంటెస్టెంట్స్ అందరూ టాప్ 5లో చేరండంపైనే దృష్టి పెట్టారు. ఇంటి సభ్యుల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న వాళ్లలో మిత్రా శర్మ ఒకరు. సాధారణంగా కంటెస్టెంట్‌గా చేరిన మిత్రా శర్మ ఇంటి సభ్యులకు మంచి పోటీ ఇస్తుంది. గత 70 రోజులకుపైగా జరిగిన రియాలిటీ షోలో రకరకాల టాస్కుల్లో పార్టిస్పేట్ చేస్తూ పర్వాలేదనిపించింది. ప్రత్యర్థుల ఆరోపణలకు సరైనా సమాధానాలు చెబుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లో ఒకరిగా మారింది. అంతేకాకుండా ఇటీవల ఇంటిలోకి అతిథులుగా వచ్చిన సినీ తారలు, సెలబ్రిటీల ప్రశంసలు కూడా అందుకుంది. శేఖర్ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో రాజశేఖర్, ఆయన సతీమణి, దర్శకురాలు జీవిత బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టారు. అయితే కంటెస్టెంట్లకు రకరకాల టాస్క్‌లు ఇస్తూ.. వారిలోని ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ఒక యాక్టింగ్ స్కూల్లో సీటు వస్తే ఎలా స్పందిస్తారు.. సీటు రాకపోతే ఎలా ఫీలవుతారు అనే థీమ్ ఆధారంగా నటించి చూపమన్నారు. దీంతో తనదైన శైలిలో రకరకాల భావాలు పలికిస్తూ నటించి చూపించింది మిత్రా శర్మ. ఓ దశలో భావోద్వేగంతో మిత్రా శర్మ నటించి చూపించిన తీరు చూసి జీవిత, రాజశేఖర్ మాత్రమే కాకుండా ఇంటి సభ్యులు కూడా ఎమోషనల్ అయ్యారు. అనంతరం మిత్రా శర్మను జీవిత, రాజశేఖర్ అభినందిస్తూ.. ఆమె నటనపై ప్రశంసలు కురిపించారు. ఇక ఆదివారం రోజున టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో తేలిపోనుంది. వారాంతంలో హోస్ట్ నాగార్జున వచ్చి తుదివారానికి, టైటిల్ రేసుకు పోటీపడే అభ్యర్థులను నిర్ణయిస్తారు. ఇలాంటి నేపథ్యంలో మిత్రా శర్మ టాప్ 5లో చోటు సంపాదించడానికి అన్ని అర్హతలను సాధించినట్లుగా తెలుస్తోంది. మరీ ఈ ఆదివారం ఏమవుతుందో వేచి చూడాలి. -
ఒక్క ఎపిసోడ్‌తో పాతాళానికి పడిపోయిన బిందు!
Bindu Madhavi: ఫ్యామిలీ ఎపిసోడ్‌తో బిగ్‌బాస్ ఓటీటీ మరింత రసవత్తరంగా మారింది. ముఖ్యంగా అఖిల్, బిందుమాధవి, యాంకర్ శివ మధ్యే టైటిల్ పోరు ఉందన్న విషయం స్పష్టమైంది. మరీ ముఖ్యంగా ఈసారి లేడీ కంటెస్టెంట్ గెలిచే అవకాశాలున్నాయంటూ సోషల్ మీడియాలో బిందుమాధవి గురించి విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఫినాలే దగ్గరపడిన తరుణంలో ఎంతో జాగ్రత్తగా, ఆచితూచి ఆటాడాల్సిన క్రమంలో బిందు మాధవి అదుపు తప్పుతోంది. గట్టిగట్టిగా అరుస్తూ తను చెప్పేదే రైట్ అని బల్లగుద్ది చెప్పే తను నిన్నటి ఎపిసోడ్లో చిత్రవిచిత్రంగా ప్రవర్తించింది. సాధారణంగా నామినేషన్స్‌లో మిత్ర తను నామినేట్ చేయాలనుకునేవాళ్లను ఇమిటేట్ చేసి ఇరిటేట్ చేస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం బిందు ఆ పనిని తన భుజానెత్తుకుంది. మిత్రను నామినేట్ చేస్తూ ఆమె ఎలా ప్రవర్తించేదో ఇమిటేట్ చేసి చూపించింది. ఈ క్రమంలో ఆమె ప్రవర్తన అతిగా అనిపించింది. ఒకరకంగా చెప్పాలంటే తనను చులకన చేస్తూ మాట్లాడింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో 'ఎలిమినేట్ బిందుమాధవి'(#Eliminate Bindu Madhavi) అన్న హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. మిత్ర మాట్లాడుతున్నంతసేపూ బిందు ఆమెను ఇమిటేట్ చేస్తూ పిచ్చి పిచ్చి చేష్టలతో ఈ సీజన్లోనే వరస్ట్ బిహేవియర్ అనిపించిందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దగ్గరైనవాళ్లకే వెన్నుపోటు పొడుస్తావని మిత్రను నిందించిన బిందు.. మరి తనకు క్లోజ్ అయిన శివను నామినేట్ చేయడం వెన్నుపోటు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా టైటిల్ రేసులో ఉన్న బిందు ఈ ఒక్క ఎపిసోడ్‌తో పాతాళానికి పడిపోయిందంటున్నారు. కానీ బిందు ఫ్యాన్స్ మాత్రం ముళ్లును ముళ్లుతోనే తీయాలని, మిత్రకు సరిగ్గా బుద్ధి చెప్పిందని సపోర్ట్ చేస్తున్నారు. Motham pre-planned nomination from #BindhuMadhavi Eliminate Bindu Madhavi pic.twitter.com/AaCw8tjKne — Wierd_explorer1 (@Explorer1Wierd) May 3, 2022 From the first day I didn't likes her she behaves very worst she should be kicked out of the house Eliminate Bindu Madhavi pic.twitter.com/LcoOhBrJmh — rajesh (@ujjwalsaaho3) May 3, 2022 Targeting someone on the personal aspects is worst from any contestants and she has been then worst in that Eliminate Bindu Madhavi pic.twitter.com/TbCRt9m3Iz — Chandini (@LoveForChandini) May 3, 2022 చదవండి: నేను కథ వినను: ఎడిటర్ ఆయన ఫోటో చూసి బోరున విలపించిన మిత్రాశర్మ -
Bigg Boss Non Stop: ఆయన ఫోటో చూసి భోరున విలపించిన మిత్రాశర్మ
బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లో తన ఆటతీరుతో దూసుకెళ్తోంది మిత్రాశర్మ. ‘తొలి సంధ్య వేళలో' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మిత్ర.. ఆ తర్వాత శ్రీ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి బాయ్స్ అనే సినిమాను కూడా నిర్మించింది. అయినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. తెలుగు ప్రజలకు మరింత చేరువయ్యేందుకే బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లోకి వచ్చింది. తొలుత కాస్త తడబడినా.. ప్రస్తుతం తనదైన గేమ్‌తో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారింది. హౌస్‌లో ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన మిత్ర..తాజాగా ఓ ఫోటో చూసి భోరున విలపించింది. వివరాల్లోకి వెళితే... గతవారం హౌస్‌లోకి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్‌ని పంపించాడు బిగ్‌బాస్. దాదాపు అందరి కుటుంబ సభ్యులు వచ్చారు. కానీ మిత్రాశర్మకి తల్లిదండ్రులు లేకపోవడంతో.. ఎవరిని ఇంట్లోకి పంపలేదు. ఇక వీకెండ్లో నాగార్జున వచ్చి మిత్రాశర్మ తండ్రి ఫోటోని హౌస్‌లోకి పంపించాడు. అది చూసి మిత్ర ఎమోషనల్ అయింది. ఇంట్లోకి అందరి కుటుంబ సభ్యులు వచ్చారు.. కానీ నాకు నా అనేవాళ్లు లేరంటూ భోరున విలపించింది. తను బిగ్‌బాస్ షోలో పాల్గొనడానికి తన తండ్రే కారణమని చెప్పింది. ఇక తనతో మాట్లాడానికి వచ్చిన సిరి, గంగాధర్‌లను చూసి కూడా మిత్రాశర్మ కనీళ్లు పెట్టుకుంది. గంగాధర్ తనకు తండ్రిలాంటి వాడని, ప్రతి విషయంతో నాకు సపోర్టుగా ఉన్నాడని చెప్పుకొచ్చింది. ఇక గంగాధర్ మాట్లాడుతూ.. మిత్ర సివంగి అని, బయట ఎలా ఉంటుందో...బిగ్‌బాస్ హౌస్‌లో కూడా అలానే ఉందని చెప్పాడు. ఇక సిరి హన్మంత్ అయితే మిత్రాశర్మపై ప్రశంసల వర్షం కురిపించింది. టాప్ 5లో కచ్చితంగా మిత్రాశర్మ ఉంటుందని జోస్యం చెప్పింది. -
అమ్మాయిలా, రాక్షసులా? మిత్ర చేయి విరగ్గొట్టేలా ఉన్నారే!
బాబా భాస్కర్ ఎంట్రీతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో మరింత రసవత్తరంగా మారింది. ఆయన వచ్చీరావడంతోనే బిందుమాధవిని సేవ్ చేయడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. తాజాగా అతడు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో సంచాలక్‌గా ఉన్నాడు. అరియానా, హమీదా, బిందుమాధవి, అజయ్, నటరాజ్ మాస్టర్ ఏలియన్స్ టీమ్‌లో, మిగిలినవారంతా హ్యూమన్స్ టీమ్‌లో ఉన్నారు. ఏలియన్స్ దగ్గర ఉన్న బ్యాటరీలను దొంగిలించి పగలగొట్టడం హ్యూమన్స్ పనైతే వారి చేతులకు రంగు పూయడం ఏలియన్స్ పని. ఈ టాస్క్ కోసం రక్తాలు కారేలా ఆడారు హౌస్మేట్స్. అమ్మాయిలా, ఆటంబాంబులా అనేలా రెచ్చిపోయారు ఏలియన్స్ టీమ్ సభ్యులు. అయితే ఈ క్రమంలో వారు గేమ్‌లో శృతి మించిపోయినట్లు కనిపిస్తోంది. హ్యూమన్స్ టీమ్‌లోని మిత్ర శర్మను దొరపుచ్చుకుని ఆమె చేతికి రంగు పూయాలని భావించింది ఏలియన్స్ టీమ్. అనుకున్నదే తడవు పదేపదే ఆమెను టార్గెట్ చేస్తూ దాడి చేసింది. ఆమె చేయి పట్టుకుని లాగుతూ, కిందపడేస్తూ నానారచ్చ చేశారు. కిందపడేసినప్పుడు తనకు దెబ్బలు తాకినా ఏమాత్రం పట్టించుకోకుండా బిందు మాధవి ఆమె చేయి పట్టుకుని లాగింది. ఒకరకంగా చెప్పాలంటే హమీదా, అరియానా, బిందు ఆమెను హింసించారు. దీంతో సోషల్ మీడియాలో వీరిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆమె చేయి విరగ్గొట్టేలా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిత్ర అవస్థను గుర్తించిన బాబా భాస్కర్వెంటనే వెళ్లి జుట్టు సరిచేసి చెమట తుడిచి గేమ్ పాజ్ చేశాడు. అటు అఖిల్ ఆమె షర్ట్ పైకి పోవడంతో దాన్ని కిందకు సరిచేశాడు. వీళ్లిద్దరూ అంత మానవత్వంతో ప్రవర్తిస్తుంటే ఆ ముగ్గురు మాత్రం మరీ దారుణంగా వ్యవహరించారని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. మిత్ర గేమ్ ఆడిన విధానం బాగుందని మెచ్చుకుంటున్నారు. చదవండి: యశ్ నుంచి ప్రకాశ్ రాజ్ దాకా.. కేజీఎఫ్ 2 నటీనటుల పారితోషికం ఎంతంటే? నన్ను కొట్టింది, నేనూ కొడ్తా: మిత్ర వెనకాల హమీదా పరుగు -
అషూకు ఆదిలోనే దెబ్బ, సిగ్గు లేదంటూ రెచ్చిపోయిన మిత్ర
బాబా భాస్కర్ ఎంట్రీతో బిగ్‌బాస్ హౌస్‌లో సీన్ మారిపోయింది. అతడు వచ్చీరావడంతోనే బిందుమాధవిని నామినేషన్స్‌లో నుంచి సేవ్ చేయడంతో అందరూ ఖంగు తిన్నారు. తన గురించి ఒక్క మాట మాట్లాడలేదేంటని అఖిల్ హర్టయ్యాడు. ఇక బిందును సేవ్ చేసి తనకు జనాల్లో ఎంత పాపులారిటీ ఉందో చెప్పకనే చెప్పేశాడు బాబా. ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ నడుస్తోంది. ఇందులో అషూ, శివ, మిత్ర, అఖిల్, అనిల్, బాబా భాస్కర్లను మనుషుల టీమ్‌గా, అరియానా, బిందుమాధవి, అజయ్, హమీదా, నటరాజ్ మాస్టర్లను ఏలియన్స్ టీమ్‌గా విభజించారు. ఈ క్రమంలో ఏలియన్స్ తమదగ్గరున్న వస్తువులను కాపాడుకునే ప్రయత్నం చేయగా హ్యూమన్స్ వాటిని తీసుకుని పగలగొట్టి హ్యూమన్స్ టీమ్‌లో నుంచి ఒక్కొక్కరిని గేమ్‌లో నుంచి తొలగించేందుకు ట్రై చేస్తారు. గేమ్ ఆడే క్రమంలో ఏలియన్స్ స్విమ్మింగ్ పూల్‌లో దూకగా అందుకు వీల్లేదని స్పష్టం చేశాడు బిగ్‌బాస్. అందుకు శిక్షగా అషూ తన దగ్గరున్న మైక్ ధరించడానికి వీల్లేదని ప్రకటించాడు. అయితే ఇదే విషయాన్ని అరియానా చెప్పడానికి ప్రయత్నించగా అషూ అస్సలు వినిపించుకోలేదు. సంచాలక్ చెప్తేనే వింటానంటూ మొండికేయడంతో బాబా భాస్కర్ జరిగింది చెప్పి ఆమె దగ్గర నుంచి మైక్ తీసుకున్నాడు. ఇక గేమ్‌లో హమీదా, మిత్ర కొట్టుకున్నంత పని చేశారు. మిత్ర కొడుతుందని, తాను కూడా కొడతానంటూ ఆమె వెనకాల పరిగెత్తింది హమీదా. తనను కింద పడేయడంతో సిగ్గు లేదు అంటూ అమ్మాయిల మీద అరిచేసింది మిత్ర. ఇక ఈ టాస్క్‌లో హ్యూమన్స్ టీమ్ గెలిచి అందులోని సభ్యులు కెప్టెన్సీ కంటెండర్స్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: నన్ను గర్భవతిని చేసి మోసం చేసింది ఆ డైరెక్టర్ కాదు! నిద్రలేని రాత్రులు, రక్తస్రావం, సాగిన చర్మం, గడ్డకట్టిన ప్యాడ్లు.. కాజల్ -
నా కన్నతల్లిని ఎప్పుడూ చూడలేదు: కన్నీళ్లు పెట్టుకున్న మిత్ర
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఎన్నో ప్రయత్నాల అనంతరం ఎట్టకేలకు కెప్టెన్ అయ్యాడు యాంకర్ శివ. మరోపక్క కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో అయోమయంతో నిర్ణయాలు తీసుకున్న అషూ వరస్ట్ కంటెస్టెంట్‌గా ఎంపికై జైలు పాలయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా బిగ్‌బాస్ వారికి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకునే అవకాశం కల్పించాడు. కొన్ని ఫ్యామిలీ ఫొటోలను పంపించి దానితో మీకున్న అనుభవాలను తెలియజేయమన్నాడు. ఈ సందర్భంగా నటరాజ్ మాస్టర్ తను డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉన్న ఫొటో చూపిస్తూ ఎమోషనలయ్యాడు. 'చదువుకోకుండా డ్యాన్సులేంట్రా? ప్రభు మాస్టర్ ఏమైనా ఫుడ్ పెడతాడా? అని తిట్టేవారు. కానీ ఈరోజు నేను ఫుడ్ తింటున్నాను, నా ఫ్యామిలీని చూసుకుంటున్నాను, ఇంతపెద్ద ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చి మీకు ఫుడ్ పెడుతున్నాను అంటే అదంతా ప్రభు మాస్టర్ వల్లే' అని చెప్పుకొచ్చాడు. శివ తన ఫ్యామిలీ ఫొటో చూపిస్తూ.. ఈ ఫొటో తర్వాత అమ్మవాళ్లతో కలిసిలేను. అమ్మ నన్ను ఇంట్లో నుంచి పంపించేసింది అని బాధపడ్డాడు. తర్వాత మిత్ర తన చిన్ననాటి ఫొటో చూపిస్తూ భావోద్వేగానికి లోనైంది. 'నన్ను పట్టుకున్న చేయి మా అమ్మది, కానీ నా కన్నతల్లిని నేనెప్పుడూ చూడలేదు. అమ్మ చేయి మాత్రమే నాకు తెలుసు' అని తెలిపింది. తర్వాత అనిల్ వంతు రాగా నా కంటే ముందు అన్నయ్య ఉండేవాడు, కానీ పుట్టిన రెండు రోజులకే చనిపోయాడు అంటూ ఏడ్చేశాడు. అటు బిందుమాధవి కూడా అన్నయ్యతో దిగిన ఫొటోలు చాలా తక్కువ అని, అతడిని మిస్ అవుతున్నానని చెప్పింది. చదవండి: ప్రియురాలితో యాంకర్ వివాహం, నెట్టింట ఫొటోలు వైరల్ ప్రేక్షకులు మెచ్చిన తెలుగు వెబ్ సిరీస్‌లు ఇవే.. -
మిత్ర నాకు రూ.5 లక్షలు ఇస్తానంది: స్రవంతి
అన్ని రకాల ఎమోషన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది బిగ్‌బాస్. కోపతాపాలు, ఆనందాశ్యర్యాలు, అరుపులు, కేకలు, ఏడుపులు, పెడబొబ్బలు, అలకలు, అసూయలు, ఆవేశాలు, దిగులు.. ఇలా అన్నింటినీ చూపిస్తున్నారు హౌస్మేట్స్. ప్రేక్షకులు వారి గేమ్, ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని ఓట్లు గుద్దుతున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ప్రారంభమై నెల రోజులు దాటిపోగా ఇప్పటివరకు ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. అందులో ముమైత్ తొలివారమే ఎలిమినేట్ కాగా ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి పంపించారు. కానీ ప్రేక్షకులు ఆమెను మరోసారి ఎలిమినేట్ చేయడం గమనార్హం. నిన్నటి ఎపిసోడ్లో డబుల్ ఎలిమినేషన్ ద్వారా ముమైత్‌తో పాటు స్రవంతి కూడా హౌస్ నుంచి బయటకు వచ్చింది. చదవండి: బుల్లితెర నటుడి కొత్త ఇల్లు.. కోట్లల్లో ధర.. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మిత్ర శర్మ గురించి చెప్పుకొచ్చింది. 'బిగ్‌బాస్ హౌస్‌లో నా లైఫ్ గురించి చెప్పినప్పుడు మిత్ర ముందుకు వచ్చి రూ.5 లక్షలు ఇస్తానంది. మీరు బాధపడకండి, నా ఇంట్లో పనిచేసే అమ్మాయికి రూ.10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాను. అలాంటిది మీరు నన్ను దగ్గరుండి చూసుకున్నారు. తినిపించారు. నా ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా బాగోగులు చూసుకున్నారు. అమ్మలా, అక్కలా చూసుకున్నారు. మీకు రూ.5 లక్షలిస్తాను అని చెప్పింది. నేనెవరో పూర్తిగా తెలియకపోయినా మిత్ర శర్మ నాకోసం అలా మాట్లాడటం నచ్చింది. అందుకే ఆమెకు ఎక్స్ట్రా హగ్ ఇచ్చాను' అని తెలిపింది స్రవంతి చొక్కారపు. చదవండి: లుంగీ ఎత్తడమేంటి? ఆ బూతులేంటి?: నాగార్జున ఫైర్ -
Bigg Boss: డబుల్ ఎలిమినేషన్, ఇద్దరు లేడీ కంటెస్టెంట్లు అవుట్!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ప్రారంభమై అప్పుడే ఆరు వారాలు పూర్తి కావస్తోంది. ఇప్పటివరకు ముమైత్ ఖాన్, శ్రీరాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. వీరిలో తొలివారంలోనే ఎలిమినేట్ అయిన ముమైత్ గతవారమే రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ వారం మిత్ర శర్మ, నటరాజ్, మహేశ్ విట్టా, అషూ రెడ్డి, హమీదా, బిందు మాధవి, యాంకర్ శివ, అజయ్, స్రవంతి, ముమైత్ ఖాన్ నామినేషన్లో ఉన్నారు. ఈ పది మందిలో ముమైత్ ఖాన్, స్రవంతి, మిత్ర శర్మకు తక్కువ ఓట్లు నమోదయ్యాయని, ఈ ముగ్గురే డేంజర్ జోన్లో ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. రాకరాక నామినేషన్లోకి వచ్చిన స్రవంతిని, వైల్డ్ కార్డ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన ముమైత్‌ను ఇంటి నుంచి బయటకు పంపుతున్నారంటూ లీకువీరులు దండోరా వేస్తున్నారు. ఇక ప్రతివారం నామినేషన్లో ఉంటూ వస్తున్న మిత్రశర్మ పెద్దగా గేమ్ ఆడకపోయినా సేవ్ అవుతూ వస్తుండటం గమనార్హం. ఈసారి కూడా ఆమె ఎలిమినేట్ అయ్యేట్లు కనిపించడం లేదు. ఫలితంగా నిజంగానే ముమైత్, స్రవంతి బ్యాగు సర్దేసుకుని బయటకు వచ్చేలా కనిపిస్తున్నారు. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే రేపు నాగార్జున అధికారికంగా ప్రకటించేవరకు ఎదురు చూడాల్సిందే! చదవండి: అతడి కోసం సిగరెట్ మానేసిన ముమైత్ ఖాన్ రెండేళ్లు సహజీవనం..బ్రేకప్..20 ఏళ్లకు మళ్లీ పెళ్లి! -
బిగ్‌బాస్ ఓటీటీ భామ మిత్ర శర్మ (ఫొటోలు)
-
ఇంద్రభవనం లాంటి ఇల్లు, కోటి 20 లక్షల కారు.. అదీ మిత్ర రేంజ్!
Bigg Boss Non Stop Telugu OTT Contestant: మిత్ర శర్మ.. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చూసేవాళ్లకు ప్రత్యేకంగా ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మిత్రబిందగా ఆడియన్స్‌కు ఇప్పుడిప్పుడే దగ్గరవుతోందామె. అయితే హౌస్‌లో అందరూ తనను దూరం పెడుతున్నారంటూ నిన్నటివరకు ఏడ్చి గోల చేసిన మిత్ర.. ఇలా సాఫ్ట్‌గా ఉంటే లాభం లేదనుకుని తిరగబడింది. నామినేషన్స్‌లో తన ప్రతాపం చూపించినట్లు బిగ్‌బాస్ రిలీజ్ చేసిన ప్రోమోలో తెలుస్తోంది. ఇప్పటినుంచి ఆమె గేమ్ వేరే లెవల్లో ఉండేట్లు కనిపిస్తోంది. ఇక మిత్ర శర్మ వ్యక్తిగత విషయానికి వస్తే ఆమె చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తండ్రి పోయాక ఫ్యామిలీ తనను దూరం పెట్టడంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయి ఒంటరిగా జీవిస్తోంది. అవకాశాల కోసం అనేక ఆఫీస్‌ల చుట్టూ తిరిగిన ఆమె తొలి సంధ్యవేళలో సినిమాతో హీరోయిన్గా మారింది. ఆ తర్వాత రెండు మూడు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో సొంతంగా శ్రీపిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను నెలకొల్పింది. చదవండి: కంటెస్టెంట్లపై నాగ్ ఫైర్, శ్రీ రాపాక అవుట్ ఈ బ్యానర్ ద్వారా బాయ్స్ సినిమా నిర్మించింది. అలా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ కోట్లు ఆర్జించింది. ఆమెకు హైదరాబాద్‌లో ఇంద్రభవనం లాంటి ఇల్లు, కోటి 20 లక్షలు ఖరీదు చేసే బెంజ్ ఆల్టర్ కారు ఉన్నాయి. ఈ లగ్జరీ కారు ఇండియాలో పది మాత్రమే ఉంటే అందులో ఒకే ఒక్కటి హైదరాబాద్‌లో ఉంది. ఆ ఒక్క కారు కూడా మిత్రదే కావడం విశేషం. ఈ కారుకు 999 అనే ఫ్యాన్సీ నంబర్ ఉంది. కుక్కపిల్లలంటే ఎంతో ఇష్టపడే మిత్ర శర్మ పది కుక్కలను ఇంట్లో పెంచి పోషిస్తోంది. కుక్కపిల్లల కోసం ప్రత్యేకించి 5 బెడ్ రూమ్స్ కూడా ఉన్నాయి. -
బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా ?
Bigg Boss NonStop Second Week Nominations: ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న రియాలిటీ షోలలో బిగ్‌బాస్ ఒకటి. ప్రస్తుతం ఓటీటీ వేదికగా వస్తున్న బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రసవత్తరంగా మారింది. బంధాలు, అనుబంధాలను పక్కన పెడితే కయ్యాలు, కొట్లాటలతో వేడెక్కుతోంది. కంటెస్టెంట్లను వారియర్స్, చాలెంజర్స్‌గా విడగొట్టినప్పటినుంచి బద్ధ శత్రువుల్లా ఒకరిపైఒకరు విరుచుకుపడుతున్నారు. బిగ్‌బాస్ హౌజ్ రూల్స్ పాటజ్ట్లేదంటూ ఒకరి బృందం మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇదిలా ఉంటే గతవారం ఎలిమినేషన్లో ముమైత్ ఖాన్ బయటకు వెళ్లిపోయింది. ఈ వారం మొత్తం 11 మంది నామినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. దీంతో రెండో వారం నామినేషన్లపై ఆసక్తి నెలకొంది. చదవండి: సరయుపై శ్రీరాపాక దాడి! షాకైన హౌస్మేట్స్ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో రెండో వారం నామినేషన్లలో మొత్తం ఏడుగురు సీనియర్లు, నలుగురు జూనియర్లు ఉన్నారు. వారిలో కేవలం ముగ్గురు మాత్రమే డేంజర్ జోన్లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ ముగ్గురు శ్రీరాపాక, అనిల్ రాధోడ్, మిత్ర శర్మ. అయితే నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టా కూడా డేంజర్ జోన్లో ఉండగా.. స్మగ్లర్ల టాస్క్‌లో వీరిద్దరూ బాగా రాణించడంతో ఓటింగ్ శాతం కొంచెం పెరిగిపోయింది. దీంతో ఈ ఇద్దరూ ఈసారికి బయటపడ్డారనే చెప్పుకోవచ్చు. టాప్ ప్లేస్‌లో ఉన్న అఖిల్ సార్ధక్కు అరియానా గట్టి పోటీ ఇస్తుంది. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉండటంతో యాంకర్ శివకు ఓటింగ్ శాతం బాగానే వస్తోంది. అంతేకాకుండా బిందు మాధవితో స్నేహం కారణంగా ఆమె ఫ్యాన్స్, అలాగే షణ్ముక్ జశ్వంత్ ఫాలోవర్స్ కూడా శివకే ఓటేస్తున్నారని సమాచారం. దీంతో శివ సేఫ్ అయినట్లే. ఇక ఓటీంగ్ శాతాన్ని బట్టి చూస్తే డేంజర్ జోన్లో ఉన్న శ్రీరాపాక ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: 'తగ్గేదే లే' టాస్క్‌లో రచ్చ, కొట్టుకునేదాకా వెళ్లిన కంటెస్టెంట్లు! -
బిగ్‌బాస్: తారుమారైన ఓటింగ్.. ముమైత్ ఖాన్ ఎలిమినేట్!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్.. తొలివారం పూర్తి చేసుకుంది. నో కామా నో ఫుల్ స్టాప్ అంటూ నాగార్జున మొదలుపెట్టిన ఈ షో నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్తో ముందుకి సాగుతుంది. . ఫన్, ఫ్రస్టేషన్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా 17మందితో మొదలైన బిగ్‌బాస్ షో రసవత్తరంగా సాగుతుంది. మాజీ కంటెస్టెంట్లతో పోటీపడి మరీ కొత్త కంటెస్టెంట్లు తమదైన ఆట కొనసాగిస్తున్నారు. ఇక 24/7 డిస్నీ హాట్ స్టార్‌లో ప్రసారం కానుండటంతో ప్రేక్షకులకు బోలెడంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఇక బిగ్‌బాస్ ఓటీటీలో మొదటి వారం నామినేషన్స్‌లో సరయు, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, ఆర్జే చైతు అరియానా గ్లోరి, నటరాజ్ మాస్టర్ ఉన్నారు. వీరిలో ఎవరు మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే చర్చ జరుగుతుంది. అయితే సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం.. ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. నిజానికి మిత్రా శర్మ ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. కానీ లాస్ట్ మినిట్‌లో ఓటింగ్ తారుమారు అవ్వడంతో ఆమె సేఫ్ అయ్యి ముమైత్ ఎలిమినేట్ అయినట్లు లీకు వీరులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరి నిజంగానే ముమైత్ ఎలిమినేట్ అయ్యిందా అనేది తెలియాలంటే రేపు జరగనున్న సండే ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. -
బిగ్‌బాస్ ఓటీటీ ఎలిమినేషన్స్: ఆ ఇద్దరిలో ఒకరు అవుట్!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌కు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. 24 గంటలు ప్రత్యక్ష ప్రసారం అంటూ ఊరించిన బిగ్‌బాస్ షో లైవ్ స్ట్రీమింగ్‌ను ఆపేస్తూ అభిమానులకు సడన్ షాకిచ్చింది. సాంకేతిక లోపాలు తలెత్తడంతో లైవ్ స్ట్రీమింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే గురువారం అర్ధరాత్రి నుంచి మళ్లీ స్ట్రీమింగ్‌ను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది హాట్‌స్టార్. ఇకపోతే షోలో అడుగుపెట్టిన కంటెస్టెంట్లు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచిపెడుతున్నారు. ఫన్, ఫ్రస్టేషన్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్, ఏడుపులు, అల్లర్లు, గొడవలు.. ఇలా అన్నింటినీ చూపిస్తున్నారు. 17 మందితో మొదలైన ఈ షోలో మాజీలతో పోటీపడి మరీ ఆడుతున్నారు కొత్త కంటెస్టెంట్లు. నామినేషన్స్‌లో కూడా తగ్గేదేలే అన్నట్లుగా వారియర్ల (సీనియర్ల) తప్పొప్పులను ఎత్తిచూపిస్తూ నామినేట్ చేశారు. ఈ వారం వారియర్స్ టీమ్‌లో నుంచి సరయు, నటరాజ్ మాస్టర్, అరియానా గ్లోరీ, హమీదా, ముమైత్ ఖాన్ చాలెంజర్స్ టీమ్‌లో నుంచి మిత్ర శర్మ, ఆర్జే చైతూ నామినేట్ అయ్యారు. ఈ ఏడుగురిలో అరియానా, హమీదాకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో వీరు ఎలిమినేషన్ దరిదాపుల్లో కూడా ఉండరు. ఆర్జే చైతూకు యాంకర్ శ్రీముఖి, ఆర్జే కాజల్ సహా పలువురి సపోర్ట్ ఉండనే ఉంది. కాబట్టి అతడు కూడా గండం గట్టెక్కినట్లే! ముమైత్ ఖాన్‌కు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉండటంతో ఆమె ఎలిమినేట్ అయ్యే దాఖలాలు కనిపించడం లేదు. మిగిలిందల్లా నటరాజ్ మాస్టర్, సరయు, మిత్ర శర్మ. ఈ ముగ్గురిలో నటరాజ్ మాస్టర్, సరయుకు బిగ్‌బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్ల నుంచి సపోర్ట్ లభిస్తోంది. అలాగే మాస్టర్ ఉంటే షోలో కొంత గొడవల మసాలా కూడా ఉంటుందని భావించేవాళ్లు చాలామందే. ఈ లెక్కన నటరాజ్ మాస్టర్ కూడా సేవ్ అయిపోతాడని తెలుస్తోంది. గత సీజన్లో మొదటివారంలోనే ఎలిమినేట్ అయింది సరయు. ఈసారి ఆమె ఆటతీరు చూడాలని ప్రేక్షకులు ఛాన్స్ ఇస్తే ఆమె కూడా హౌస్‌లో ఉండగలుగుతుంది. మిత్రశర్మ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. అందులోనూ నామినేషన్స్‌లో ఎక్కువతగా తడబడింది. తను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పలేకపోయింది. ఈ తడబాటు వల్లే వారియర్స్ ఆమెను ఏకగ్రీవంగా నామినేట్ చేశారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మిత్ర శర్మకు తక్కువ ఓట్లు నమోదయ్యాయట. పరిస్థితి ఇలాగే కొనసాగితే తొలి వారంలోనే మిత్ర శర్మ తిరుగుముఖం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది! -
వచ్చీరాగానే ఆర్జేకు షాకిచ్చిన హీరోయిన్!
'తొలి సంధ్య వేళలో' సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైంది మిత్ర శర్మ. ఆ తర్వాత పలు సినిమాలు చేస్తూ తెలుగు మాట్లాడటం కూడా నేర్చేసుకుంది. ముంబై నుంచి వచ్చి హైదరాబాద్‌లో సెటిల్ అయిన ఈ హీరోయిన్ సొంతంగా శ్రీ పిక్చర్స్ బ్యానర్ స్థాపించింది. బాయ్స్ సినిమాతో నిర్మాతగానూ మారింది. డ్రామా ట్యాగ్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది మిత్ర. హౌస్‌లోకి వచ్చీరాగానే చైతూను అన్నయ్య అని పిలిచి అతడికి పెద్ద షాకిచ్చింది. మరి ఈ హీరోయిన్ అందరికీ ఎలాంటి పోటీ ఇవ్వనుంది? తన గేమ్ ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి!