
మిత్రాశర్మ, బిగ్‌బాస్ శ్రీహాన్, గీతానంద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'వర్జిన్ బాయ్స్' ఈ మూవీ జూలై 11న థియేటర్లో విడుదలైంది. థియేటర్లలో టికెట్ కొన్న ఆడియెన్స్‌కు ఐఫోన్‌ను గిఫ్ట్‌గా ఇస్తామని ట్రైలర్ లాంఛ్ మేకర్స్ వెల్లడించారు. వారు చెప్పిన విధంగానే మొదటిరోజు మాట నిలబెట్టుకున్నారు. దర్శకుడు దయానంద్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాజ్ గురు ఫిలిమ్స్ నుంచి రాజా దారపునేని నిర్మించారు.
వర్జిన్ బాయ్స్ విడుదల సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. "మేం పెట్టిన స్కీమ్ టికెట్ కొట్టు – ఐఫోన్ పట్టు,’ మనీ రైన్ కాన్సెప్ట్స్ జనాల్లోకి బాగా వెళ్లింది. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని, థియేటర్లకు ప్రేక్షకులను ఎక్కువ శాతం వచ్చేలా చేయాలని మేమీ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. అలాగే దర్శకుడు కూడా మంచి కథను సెలెక్ట్ చేసుకున్నారు. కథ ఏదైతే చెప్పారో అదే నేటి యువతకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు. అలాగే సినిమా కోసం ఆర్టిస్ట్‌లు ప్రతి ఒక్కరూ ఎంతగానో కృషి చేశారు. ప్రమోషన్స్ కూడా వినూత్నంగా చేస్తున్నారు. మిత్ర శర్మ ప్రమోషన్ కోసం కూడా బాగా కష్టపడుతున్నారు. గతంలో ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కూడా పలువురికి ఆమె సాయం అందించారు.' అని తెలిపారు
తొలి ఫోన్ గెలుచుకున్న ప్రవీణ్
హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో ఓ షాప్ ఓపెనింగ్లో పాల్గొన్న మిత్ర శర్మ, వర్జిన్ బాయ్స్ టీం అడ్వాన్స్ టికెట్ తీసుకున్న వారిని వివరాలతో లాటరీ తీయగా చందానగర్కు చెందిన ప్రవీణ్ ఐఫోన్ గెలుచుకున్నారు. ఇది మొదటి ఫోన్ మాత్రమేనని. ఇంకా దాదాపు పది లాటరీస్ ఉన్నాయని సినిమా టీం తెలిపింది.