
బిగ్‌బాస్ బ్యూటీ మిత్రా శర్మ (Mitraaw Sharma) హీరోయిన్‌గా, నిర్మాతగా అందరికీ సుపరిచితురాలే! తను బిగ్‌బాస్ నాన్‌స్టాప్ (ఓటీటీ) సీజన్‌లో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఎప్పుడూ ఎవరో ఒకరికి సాయం చేస్తూ తన మంచి మనసు చాటుకుంటూ ఉంటుంది. మిత్రా శర్మ కథానాయికగా నటించిన తాజా చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ మూవీ జూలై 11న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మిత్ర భావోద్వేగానికి లోనైంది.
అమ్మ-నాన్నను కోల్పోయా
నేను పుట్టగానే అమ్మను కోల్పోయాను. చిన్నవయసులోనే నాన్నకూ దూరమాయ్యాను మా నాన్న టీచర్. ఆయన నాకు ఇచ్చింది విద్య మాత్రమే! ఆయన చనిపోయేముందు కూడా నువ్వు లేకుండా నేను బతకలేను నాన్న అని చాలా బాధపడ్డాను. ఆయన వెళ్లిపోయాక నాకంటూ ఎవరూ లేకుండా పోయారు. నా జీవితంలో ఎవరైనా ఉంటే వారికోసం ఏదైనా చేయాలనుకున్నాను. కానీ, అర్హత ఉన్నవారికే సాయం చేయాలి. ఎందుకంటే జీవితంలో ఎన్నో రిజెక్షన్స్ చూశాను.
తలరాత మార్చలేరుగా
తిరస్కరణకు గురైనప్పుడల్లా నాకేమనిపించేదంటే.. నాలో ఏమైనా లోపం ఉందా? సరైన దారిలో లేనా? లేదంటే టైం బాగోలేదా? ఇలా నన్ను నేనే ప్రశ్నించుకునేదాన్ని. తర్వాత మళ్లీ నాకు నేనే సర్ది చెప్పుకునేదాన్ని. మన దగ్గరున్న డబ్బు ఆఖరి రూపాయి వరకు ఎవరైనా తీసుకెళ్లవచ్చు. కానీ మన తలరాతను తీసుకెళ్లలేరు కదా అని రియలైజ్ అయ్యేదాన్ని. సాయం చేయాలి.. నాకంటూ మంచి మనుషులను సంపాదించుకోవాలి అనే లక్ష్యంతోనే ముందుకువెళ్తున్నాను అంటూ మిత్ర శర్మ కన్నీళ్లు పెట్టుకుంది.
సినిమా
గీతానంద్, మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వర్జిన్ స్టోరీ. శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్ కీలక పాత్రల్లో నటించారు. దయానంద దర్శకత్వం వహించగా దారపునేని రాజా నిర్మించారు. జూలై 11న ఈ సినిమా రిలీజవుతోంది. సినిమా చూసినవారికి ఐఫోన్లు కూడా రిటర్న్ గిఫ్ట్‌గా ఇస్తామని ప్రకటించారు. సినిమా చూశాక.. టికెట్ ఫోటో తీసి 8019210011 నెంబర్‌కు వాట్సాప్ చేయాలని.. లక్కీ డ్రా ద్వారా 11 మందిని సెలక్ట్ చేసి ఐఫోన్ పంపిస్తామని క్రేజీ ఆఫర్ ఇచ్చారు.
చదవండి: ప్రభాస్ రూ.50 లక్షల సాయం? ఒక్క రూపాయి అందలేదు: ఫిష్ వెంకట్