Virgin Boys Teaser: యూత్‌ని ఆకట్టుకునేలా ‘వర్జిన్ బాయ్స్’ టీజర్‌ | Virgin Boys Movie Teaser Out | Sakshi
Sakshi News home page

Virgin Boys Teaser: యూత్‌ని ఆకట్టుకునేలా ‘వర్జిన్ బాయ్స్’ టీజర్‌

May 14 2025 5:12 PM | Updated on May 14 2025 6:05 PM

Virgin Boys Movie Teaser Out

‘వర్జిన్ బాయ్స్’ టీజర్ విడుదలైంది. గీతానంద్, మిత్రా శర్మ జంటగా నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీలో శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దయానంద్ దర్శకత్వంలో రాజా దరపునేని నిర్మాణంలో రాజ్‌గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది.

టీజర్‌లో యూత్‌ఫుల్ ఎనర్జీ, కలర్‌ఫుల్ విజువల్స్, ఫ్రెష్ వైబ్స్ ఆకట్టుకుంటున్నాయి. స్మరణ్ సాయి సంగీతం టీజర్‌కు జోష్‌ను జోడించగా, వెంకట ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఎనర్జిటిక్‌గా ఉంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ టీజర్‌ను క్రిస్పీగా, ఆకర్షణీయంగా మలిచింది. గీతానంద్, మిత్రా శర్మ కెమిస్ట్రీ టీజర్‌లో హైలైట్‌గా నిలుస్తుంది. హాస్యం, రొమాన్స్, ఎమోషన్స్‌తో నిండిన ఈ కథ ఆధునిక రిలేషన్‌షిప్స్‌ను సరికొత్త శైలిలో చూపించనుంది. 

బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ కామెడీ టైమింగ్, క్యారెక్టర్ టీజర్‌లో సందడి చేస్తున్నాయి, ఇంకా ఎక్కువ ఫన్‌ను సినిమాలో ఆశించవచ్చని తెలుస్తోంది. డైలాగ్స్, సీన్స్‌లో ఫన్ ఎలిమెంట్స్ యూత్‌ను ఆకర్షిస్తున్నాయి. ఈ సమ్మర్‌లో ‘వర్జిన్ బాయ్స్’ థియేటర్లలో యూత్‌ను అలరించే ఫుల్ ఎంటర్‌టైనర్‌గా నిలవనుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.

నిర్మాత రాజా దరపునేని మాట్లాడుతూ, "‘వర్జిన్ బాయ్స్’ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. గతంలో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్‌ను మించేలా, రొటీన్‌కు భిన్నంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. యూత్ ఈ సినిమాతో తప్పకుండా రిలేట్ అవుతారు," అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement