breaking news
Geethanandan
-
Virgin Boys Teaser: యూత్‌ని ఆకట్టుకునేలా ‘వర్జిన్ బాయ్స్’ టీజర్
‘వర్జిన్ బాయ్స్’ టీజర్ విడుదలైంది. గీతానంద్, మిత్రా శర్మ జంటగా నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీలో శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దయానంద్ దర్శకత్వంలో రాజా దరపునేని నిర్మాణంలో రాజ్‌గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది.టీజర్లో యూత్‌ఫుల్ ఎనర్జీ, కలర్‌ఫుల్ విజువల్స్, ఫ్రెష్ వైబ్స్ ఆకట్టుకుంటున్నాయి. స్మరణ్ సాయి సంగీతం టీజర్‌కు జోష్‌ను జోడించగా, వెంకట ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఎనర్జిటిక్‌గా ఉంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ టీజర్‌ను క్రిస్పీగా, ఆకర్షణీయంగా మలిచింది. గీతానంద్, మిత్రా శర్మ కెమిస్ట్రీ టీజర్లో హైలైట్‌గా నిలుస్తుంది. హాస్యం, రొమాన్స్, ఎమోషన్స్‌తో నిండిన ఈ కథ ఆధునిక రిలేషన్‌షిప్స్‌ను సరికొత్త శైలిలో చూపించనుంది. బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ కామెడీ టైమింగ్, క్యారెక్టర్ టీజర్లో సందడి చేస్తున్నాయి, ఇంకా ఎక్కువ ఫన్ను సినిమాలో ఆశించవచ్చని తెలుస్తోంది. డైలాగ్స్, సీన్స్‌లో ఫన్ ఎలిమెంట్స్ యూత్‌ను ఆకర్షిస్తున్నాయి. ఈ సమ్మర్లో ‘వర్జిన్ బాయ్స్’ థియేటర్లలో యూత్‌ను అలరించే ఫుల్ ఎంటర్టైనర్గా నిలవనుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.నిర్మాత రాజా దరపునేని మాట్లాడుతూ, "‘వర్జిన్ బాయ్స్’ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. గతంలో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్‌ను మించేలా, రొటీన్‌కు భిన్నంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. యూత్ ఈ సినిమాతో తప్పకుండా రిలేట్ అవుతారు," అని అన్నారు. -
రైతులు మరియు స్టీల్ ప్లాంట్ పై బీజేపీ మొండి వైఖరి
-
బడ్జెట్ లో ఏపీకి ఊరట దక్కనుందా?
-
2000వేల నోట్ల రద్దు మార్కెట్ పై ప్రభావం
-
ఆ ఇద్దరంటే ఇష్టం
‘‘టీవీ నుంచి సిల్వర్ స్క్రీన్కు రావడం హ్యాపీగా ఉంది. సినిమాల్లో అయితే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసే అవకాశం ఉంటుంది’’ అన్నారు చాందినీ భగ్వానాని. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో గీతానంద్, చాందినీ భగ్వానాని జంటగా రాజా దారపునేని నిర్మించిన ‘రథం’ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. చాందినీ మాట్లాడుతూ– ‘‘మాది ముంబై. ఆరేళ్లకే బాలనటిగా హిందీ సినిమాల్లో నటించాను. ఆ తర్వాత కొంచెం విరామం తీసుకుని చదువుపై దృష్టి పెట్టి ప్లస్ టు కంప్లీట్ చేశాను. ప్రముఖ టీవీ చానెల్స్‌లో నటిస్తూనే, మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ పూర్తి చేశా. ‘రథం’ సినిమాలో అవకాశం వచ్చింది. మగవారి పట్ల సరైన అభిప్రాయం లేని ఓ అమ్మాయి జీవితంలోకి వచ్చిన ఓ అబ్బాయి తీసుకొచ్చిన మార్పు ఏంటి? అనేదే ఈ చిత్రకథ. హీరో గీతానంద్ నాకు తెలుగు డైలాగ్స్ పలకడంలో సహాయపడ్డారు. దర్శకుడు చంద్రశేఖర్ కూడా హెల్ప్ చేశారు. నాకు ఆయన తెలుగు చెబితే, నేను ఆయనకు హిందీ చెప్పాను (నవ్వుతూ). ఎమోషనల్ సీన్స్‌లో బాగా నటించగలగడం నా బలం. అలాగే ఎవరైనా బాగా నవ్వించినప్పుడు ఆ నవ్వును తొందరగా ఆపుకోలేను. అది నా బలహీనత. హిందీలో డబ్ అయిన చాలా తెలుగు సినిమాలు చూశాను. నాని, నాగచైతన్యల నటన అంటే ఇష్టం. హీరోయిన్స్‌లో సమంత, రకుల్‌ప్రీత్ సింగ్ ఇంకా హెబ్బా పటేల్ తెలుసు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘టీవీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉండదు. నేను లైంగిక వేధింపులను ఎదుర్కొనలేదు. మహిళలు వేధింపులు ఎదుర్కొన్న వెంటనే స్పందిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నా భావన. ప్రస్తుతం ‘దిక్సూచి’ అనే సినిమాలో నటిస్తున్నాను. వేరే ఏ ప్రాజెక్ట్ కమిట్ కాలేదు’’ అన్నారు. -
ప్రదర్శన ఇస్తూ ఒక్కసారిగా ప్రాణాలు విడిచాడు