
మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం వర్జిన్ బాయ్స్. దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో రాజా దారపునేని నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ జూలై 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తుండగా వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా, జేడీ మాస్టర్ కొరియోగ్రఫర్‌గా పని చేశారు. శనివారం నాడు వర్జిన్ బాయ్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా.. ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్ ఇస్తామన్నారు. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్‌తో కొన్ని థియేటర్లలో డబ్బు వర్షంలా కురిపిస్తామని, ఆ డబ్బు ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చు అని బంపరాఫర్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా నటుడు రోనిత్ మాట్లాడుతూ... "నేను, దర్శకుడు దయ కాలేజ్ ఫ్రెండ్స్. అప్పటినుండే ఇద్దరం సినిమాలు చేయాలని అనుకునే వాళ్ళం. చూస్తే పది సంవత్సరాల తర్వాత ఒక సినిమా స్టేజిపై ఉన్నాము. చిన్న సినిమాలకు ఊపిరి పోసే సినిమాగా వర్జిన్ బాయ్స్ నిలుస్తుందని అనుకుంటున్నాను" అన్నారు. నటుడు శ్రీహాన్ మాట్లాడుతూ.. తనను నమ్మి తనపై ఎంతో ఖర్చు పెట్టి ఎంకరేజ్ చేసిన నిర్మాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నటి మిత్ర శర్మ మాట్లాడుతూ... "ఈ సినిమాలో నా క్యారెక్టర్ కొంచెం కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దయానంద్ కు థాంక్స్. ఏదైనా సాధించాలి అనే సంకల్పంతో ముందుకు వచ్చాడు. తన కష్టం వల్లే మేము ఈరోజు ఈ స్టేజి మీద ఉన్నాము. రోనిత్ ఎంతో మంచి పర్ఫార్మెన్స్ చేశారు. శ్రీహాన్ చేసిన క్యారెక్టర్ లేకపోతే సినిమాలో కిక్ ఉండదు. అలాగే గీతానంద్ తో కలిసిన నటించడం బాగా ఎంజాయ్ చేశాను. చాలా సైలెంట్ గా ఉండే వ్యక్తి, బాగా సపోర్ట్ చేస్తారు. నేను మీ అందరిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను" అంటూ ముగించారు.