
రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి నటింటిన తొలి చిత్రం గీత గోవిందం. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2018లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. విజయ్ కెరీర్‌లోనే తొలిసారి 100 కోట్లు వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. విజయ్, రష్మిక మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడం.. రిలీజ్‌కి ముందే పాటలు బాగా వైరల్ అవ్వడం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ చిత్రం విడుదలైన నిన్నటికి(ఆగస్ట్ 15) ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నాటి జ్ఞాపకాలను పంచుకుంది రష్మిక. తన కెరీర్‌లో ‘గీత గోవిందం’ చాలా స్పెషల్ మూవీ అంటూ విజయ్‌తో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
‘నా మొబైల్‌లో ఉన్న ఈ ఫోటోలు ఏడేళ్ల క్రితం నాటివి అంటే నమ్మలేకపోతున్నాను. గీత గోవిందం ఎప్పటికీ నాకు స్పెషల్ చిత్రమే.ఈ సినిమా నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ నేను గుర్తుచేసుకుంటున్నాను. మనమందరం కలుసుకుని చాలా కాలం అయింది.. కానీ వారంతా చాలా హ్యాపీగా ఉన్నారని భావిస్తున్నాను. అప్పుడే ఏడేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాను. చిత్రబృందానికి నా అభినందనలు’ అంటూ రష్మిక రాసుకొచ్చింది.
రిలేషన్‌లో ఉన్నారా?
విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నారనే పుకారు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గీత గోవిందం సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారని ఇండస్ట్రీ టాక్. బహిరంగంగా వీరిద్దరు తమ ప్రేమ విషయాన్ని చెప్పకపోయినా.. సోషల్ మీడియా వేదికగా మాత్రం పరోక్షంగా అభిమానులకు హింట్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా రష్మిక కూడా మరోసారి తమ ప్రేమ విషయాన్ని చెప్పకనే చెప్పింది.
గీత గోవిందం సినిమా ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా షేర్ చేసిన ఫోటోలలో విజయ్‌తో కలిసి ఉన్న ఓ రొమాంటిక్ స్టిల్ కూడా ఉంది. సినిమాలో విజయ్ ప్రేమగా రష్మిక తలను తుడుస్తుంటాడు. ఓ పాటలో వచ్చే ఆ స్టిల్‌ని రష్మిక షేర్ చేయడంలో మరోసారి వీరి ప్రేమ వ్యవహారంపై నెట్టింట చర్చ మొదలైంది. ‘ప్రేమలో ఉన్నది నిజమే’ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.