Coolie First Review: ‘కూలీ’పై డిప్యూటీ సీఎం రివ్యూ | Coolie First Review: Udhayanidhi Stalin Review On Coolie Movie | Sakshi
Sakshi News home page

Coolie First Review: ‘కూలీ’పై తమిళనాడు డిప్యూటీ సీఎం రివ్యూ

Aug 13 2025 2:06 PM | Updated on Aug 13 2025 3:51 PM

Coolie First Review: Udhayanidhi Stalin Review On Coolie Movie

మరికొన్ని గంటల్లో(ఆగస్ట్‌ 14) రజనీకాంత్‌ ‘కూలీ’(Coolie) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్‌ రివ్యూ ఇచ్చాడు. ఇదొక పవర్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ అంటూ సినిమాపై ప్రశంసలు కురిపించాడు.

‘ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజనీకాంత్‌కు ప్రత్యేక అభినందనలు. రేపు విడుదల కానున్న ‘కూలీ’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. దీన్ని ముందుగా చూసే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది. ఈ పవర్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ని బాగా ఎంజాయ్‌ చేశా. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది’ అని ఉదయనిధి ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

‘కూలీ’ విషయానికొస్తే..లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్‌ అగ్రహీరో నాగార్జున విలన్‌గా నటించాడు. సత్యరాజ్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement