
రజినీకాంత్‌లో కాస్త హస్య చతురత ఎక్కువే. సినిమా ఈవెంట్స్‌లో మాట్లాడుతూ తనపై తానే జోకులు వేసుకుంటూ ఉంటారు. హైదరాబాద్‌లో సోమవారం.. 'కూలీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రుతిహాసన్, నాగార్జున, సత్యరాజ్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పాల్గొన్నారు. రజినీకాంత్ మాత్రం వీడియో బైట్ రూపంలో మాట్లాడారు. అయితే నాగ్ ఫిజిక్ గురించి చెబుతూ రజినీకాంత్ తన బట్టతల గురించి జోకులు వేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.
'తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను నటించిన 'కూలీ' ఆగస్టు 14న రిలీజ్ కానుంది. తెలుగులో రాజమౌళి ఎలాగో తమిళంలో లోకేశ్ కనగరాజ్ అలా. ఆయన చేసిన సినిమాలన్నీ హిట్. ఈ చిత్రంలో నాగార్జున విలన్‌గా చేస్తున్నారు. అసలు 'కూలీ' సబ్జెక్ట్ విన్న వెంటనే సైమన్ పాత్ర నేనే చేయాలనే ఆసక్తి కలిగింది. ఆ పాత్ర ఎవరు చేస్తారా అని ఎదురుచూశాను. ఎందుకంటే చాలా స్టైలిష్‌గా ఉంటుంది. నాగార్జునని ఈ పాత్ర కోసం తీసుకున్నామని లోకేశ్ చెప్పగానే ఆశ్చర్యపోయాను. చాలా సంతోషంగా అనిపించింది'
(ఇదీ చదవండి: రూ. 2 కూలీ ఇచ్చి స్నేహితుడే అవమానించాడు: రజనీకాంత్)
'నాగార్జున.. డబ్బు కోసం సినిమాలు చేసే వ్యక్తి కాదు. ఆయనకు విలన్‌గా చేయాల్సిన అవసరం లేదు. మేమిద్దరం 33 ఏళ్ల కిందట ఓ సినిమా చేశాం. అప్పుడెలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. నా జుట్టు ఊడిపోయింది. నాగార్జునతో పనిచేస్తుండగా.. మీ ఆరోగ్యం రహస్యం ఏంటి అని అడిగా. సైమన్ పాత్రలో ఆయన నటన చూస్తుంటే నాకే ఆశ్చర్యమేసింది. బాషా-ఆంటోని ఎలానో కూలీ-సైమన్ అలా ఉంటుంది' అని రజినీకాంత్ చెప్పుకొచ్చారు.
ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతున్న 'కూలీ' ట్రైలర్ శనివారమే రిలీజ్ చేశారు. కానీ ఇది కాస్త నిరారపరిచిందనే చెప్పొచ్చు. మరీ హై మూమెంట్స్ అయితే ఏం కనిపించలేదు. సినిమాలోనే ఏమైనా సర్‌ప్రైజులు ఉంటాయేమో చూడాలి? అదే రోజుల రిలీజ్ కానున్న ఎన్టీఆర్ 'వార్ 2' పోలిస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో 'కూలీ'కే ఎక్కువ హైప్ ఉంది.
(ఇదీ చదవండి: మెగా కోడలు ఉపాసనకు తెలంగాణ సర్కారు కీలక బాధ్యతలు)
Superstar @rajinikanth garu shares a heartfelt message with all the lovely Telugu audience and talks about his experience working on #Coolie ❤️🔥❤️🔥#CoolieFromAug14 @iamnagarjuna #AamirKhan @Dir_Lokesh @anirudhofficial @sunpictures #TeluguFilmNagar pic.twitter.com/OP1ozqM98G
— Telugu FilmNagar (@telugufilmnagar) August 4, 2025