
సినిమా బాలేకపోతే ఎంత ప్రచారం చేసినా జనాలు అస్సలు పట్టించుకోరు. అదే కంటెంట్ నచ్చితే మాత్రం భాషతో సంబంధం లేకుండా ఎగబడి చూస్తారు. 2022లో వచ్చిన కాంతార (Kantara Movie) అనే కన్నడ సినిమా ఇందుకు నిలువెత్తు ఉదాహరణ. దాదాపు రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
కాంతార బ్లాక్‌బస్టర్ హిట్
నిర్మాతలు సినిమా హిట్టని ఊహించుంటారు కానీ ఇలా వందల రెట్ల లాభాలు వస్తాయని మాత్రం కలలో కూడా ఊహించి ఉండరు. ఈ సినిమాను రిషబ్ శెట్టి డైరెక్ట్ చేయడమే కాకుండా అందులో ప్రధాన పాత్రలో నటించాడు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా హోంబలే ఫిలింస్ బ్యానర్ నిర్మించింది. ఈ బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రానికి ప్రీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే!
కాంతార 3లో తారక్?
ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల కానుంది. అంటే ఇది ఫస్ట్ పార్ట్ కాగా, ఇప్పటికే రిలీజైంది రెండో పార్ట్ అన్నమాట! తాజాగా ఓ ఆసక్తికర విషయం ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. రిషబ్ శెట్టి కాంతార 3 కూడా తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నాడని, అందులో టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా భాగం కానున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ రూమర్ కనక నిజమైతే అభిమానులకు మాత్రం పండగే!
సినిమా..
ప్రస్తుతం ఎన్టీఆర్.. వార్ 2 మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తారక్ కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. తారక్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి డ్రాగన్ టైటిల్ పరిశీలిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ పౌరాణిక సినిమా కూడా చేయనున్నాడు. దేవర 2 కూడా లైన్‌లోనే ఉంది.