రూ. 100 కోట్ల క్లబ్‌లో 'మహావతార్‌ నరసింహ' | Mahavatar Narsimha Movie Enter In 100 CR Club | Sakshi
Sakshi News home page

రూ. 100 కోట్ల క్లబ్‌లో 'మహావతార్‌ నరసింహ'

Aug 4 2025 11:47 AM | Updated on Aug 4 2025 1:04 PM

Mahavatar Narsimha Movie Enter In 100 CR Club

'మహావతార్‌ నరసింహ' సినిమా వంద కోట్ల క్లబ్లోకి చేరిపోయింది. ఈమేరకు తాజాగా చిత్ర యూనిట్అధికారికంగా ప్రకటించింది.  అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్‌ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్‌ దేశాయ్, చైతన్య దేశాయ్‌ సంయుక్తంగా యానిమేటెడ్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. జులై 25 విడుదలైన చిత్రం మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో మరిన్ని స్క్రీన్స్‌ పెంచుకుంటూ వెళుతున్నారు. బుక్మైషోలో ఇప్పటికే 25 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి.

'మహావతార్‌ నరసింహ' చిత్రం పదిరోజుల్లోనే రూ. 105 కోట్లు సాధించింది. భారత్లో విడుదలైన యానిమేషన్చిత్రాలలో ఇదే అత్యధిక కలెక్షన్స్కావడం విశేషం. ఆల్టైమ్ఇండస్ట్రీ రికార్డ్గా చిత్ర యూనిట్ఇప్పటికే ప్రకటించింది. తెలుగులో గీత ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా రిలీజైంది.. ఈ సినిమాని విడుదల చేసేలా నరసింహ స్వామి అనుగ్రహించడం తన అదృష్టమని అల్లు అరవింద్‌ తెలిపారు. తెలుగులోనే ఏకంగా రూ. 20 కోట్లకు పైగా నెట్రాబట్టినట్లు తెలుస్తోంది. హిందీలో రూ. 70 కోట్లకు పైగానే నెట్కలెక్ట్చేసినట్లు ఇండస్ట్రీ లెక్కలు చెబుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement