ఆ క్లబ్బులో చేరిన 'మహావతార్‌ నరసింహ'.. కలెక్షన్స్‌ ఎంతంటే? | Mahavatar Narsimha Movie One Week Collections | Sakshi
Sakshi News home page

Mahavatar Narsimha Movie: మహావతార్‌ నరసింహ.. కలెక్షన్స్‌ ఎంతంటే?

Aug 1 2025 4:16 PM | Updated on Aug 1 2025 4:31 PM

Mahavatar Narsimha Movie One Week Collections

ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద భారీ అద్భుతాలు సృష్టిస్తున్న చిత్రం మహావతార్‌ నరసింహ (Mahavatar Narsimha Movie). జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. నిజానికి ఈ చిత్రం మొదటి రోజు కేవలం రూ.1.75 కోట్ల నెట్‌ మాత్రమే రాబట్టింది. కానీ మౌత్‌ టాక్‌ బాగుండటంతో ఏరోజుకారోజు వసూళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. పలుచోట్ల థియేటర్లు హౌస్‌ఫుల్‌ అయ్యాయి. దీంతో వారం రోజుల్లోనే నరసింహ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.53 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ మేరకు హోంబలే ఫిలింస్‌ అధికారిక పోస్టర్‌ విడుదల చేసింది.

నరసింహస్వామి కథ
పురాణాల్లో ఉన్న భక్త ప్రహ్లాద- నరసింహస్వామి కథే మహావతార్‌: నరసింహ. ఈ యానిమేషన్‌ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌ నిర్మించింది. సామ్‌ సీఎస్‌ నేపథ్య సంగీతం అందించాడు. డైరెక్టర్‌ అశ్విన్‌ కుమార్‌ అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ .. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేశారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైంది.

విష్ణు దశావతరాలు
హోంబలే ఫిలింస్‌.. క్లీమ్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి పన్నెండేళ్ల ప్రణాళికతో మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ (ఎంసీయూ) అనే ప్రాజెక్ట్‌ ప్రారంభించింది. శ్రీవిష్ణువు దశావతారాల ఆధారంగా ఈ యూనివర్స్‌లో సినిమాలు తెరకెక్కనున్నాయి. ఈ యూనివర్స్‌లో వచ్చిన తొలి చిత్రం ‘మహావతార్‌ నరసింహ’. అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో శిల్పా ధవాన్, కుశల్‌ దేశాయి, చైతన్య దేశాయి నిర్మించారు. 

రాబోయే సినిమాలు..
ఈ చిత్రం 3డీ ఫార్మాట్‌లో ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2025లో నరసింహ (ఆల్‌రెడీ రిలీజైంది), 2027లో పరశురామ, 2029లో రఘునందన్, 2031లో ద్వారకాధీశ్, 2033లో గోకులానంద, 2035లో మహావతార్‌ కల్కి పార్ట్‌ 1, 2037లో మహావతార్‌ కల్కి పార్ట్‌ 2 ’ చిత్రాలను విడుదల చేస్తామని హోంబలే గతంలో వెల్లడించింది.

 

చదవండి: ప్రియుడితో బిగ్‌బాస్‌ బ్యూటీ వరలక్ష్మి వ్రతం.. ఫోటోలు వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement