
బోనాల నృత్య రూపకం ఆహూతులను ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టింది. గురువారం రవీంద్ర భారతిలో శ్రీ మహాకాళి మహేష్ గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలువురికి బోనాల పురస్కారాలను హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అందజేసి మాట్లాడారు.

ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ట్రస్ట్ చైర్మన్ కె.ప్రవీణ్‌కుమార్, అధ్యక్షుడు అరవింద్‌కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కె.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

అవార్డు అందుకున్న సాక్షి ఫోటో గ్రాఫర్ ఠాగూర్













