
హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కోటి ఆశలు పెట్టుకున్న కింగ్డమ్ మూవీ (Kingdom Movie) జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు కొంత నెగెటివ్ టాక్ ఉన్నప్పటికీ పాజిటివ్ టాకే ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో ఫస్ట్ రోజు కలెక్షన్స్ ఎంతన్నదానిపై అందరి దృష్టి పడింది. కానీ, ఎవరి లెక్కలకు అందనంతంగా భారీ కలెక్షన్స్ వచ్చాయి. కింగ్డమ్.. తొలి రోజు ఏకంగా రూ.39 కోట్లు రాబట్టింది.

హిట్టు కొట్టినం
ఈ మేరకు చిత్రయూనిట్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌ను రౌడీ హీరో షేర్ చేస్తూ మనం (హిట్) కొట్టినం అని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇది విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్..! ఇకపోతే కింగ్డమ్ వీకెండ్‌లో రాలేదు, అందులోనూ హాలీడే అసలే లేదు. అయినా ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రావడంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. లైగర్ మూవీ వచ్చినప్పుడు ఎన్నెన్ని మాటలన్నారు.. అప్పుడు ఎత్తిన నోళ్లు దించుకునేలా మా హీరో కింగ్డమ్‌తో సమాధానం చెప్పాడని సంతోషపడుతున్నారు.
ఆ సినిమాలతోనే పోటీ
అయితే ఈ చిత్రానికి.. మహావతార్ నరసింహ, సయారా చిత్రాల నుంచి గట్టి పోటీనే ఉంది. హరిహర వీరమల్లును జనాలు ఎలాగో లైట్ తీసుకున్నారు కాబట్టి ఇదేమంత పోటీ కాదు. మున్ముందు కింగ్డమ్ ఎన్ని బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి! కింగ్డమ్ సినిమా విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించారు. సత్యదేవ్, వెంకటేశ్, కసిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు.
BOOM 💥🔥
Manam Kottinam 🤗❤️ https://t.co/FOqpt7dxjK— Vijay Deverakonda (@TheDeverakonda) August 1, 2025