'మదరాసి' ఫస్ట్‌ సాంగ్‌.. అనిరుధ్‌ మ్యాజిక్‌ | Sivakarthikeyan Madharasi Movie First Song Out Now | Sakshi
Sakshi News home page

'మదరాసి' ఫస్ట్‌ సాంగ్‌.. అనిరుధ్‌ మ్యాజిక్‌

Aug 1 2025 12:54 PM | Updated on Aug 1 2025 1:19 PM

Sivakarthikeyan Madharasi Movie First Song Out Now

కోలీవుడ్హీరో శివ కార్తికేయన్‌, మురుగదాస్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'మదరాసి'(Madharaasi ). ఇందులో హీరోయిన్గా రుక్మిణీ వసంత్‌ నటిస్తుంది. తాజాగా మూవీ నుంచి ఫస్ట్సాంగ్ను విడుదల చేశారు. శ్రీ లక్ష్మీ మూవీస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 5న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం సరికొత్త ఎగ్జయిటింగ్‌ యాక్షన్‌ ప్యాక్డ్‌ కథను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్లో విద్యుత్‌ జమాల్, బిజు మీనన్, షబ్బీర్, విక్రాంత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రేక్షకులను మెప్పించేలా ఉన్న ఈ సాంగ్‌ను సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఆలపించారు. అయితే తెలుగు వర్షన్‌ను ధనుంజయ్ సీపాన ఆలపించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement