‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మౌళి.. ఇప్పుడు ‘దొంగ నా కొడుకు’ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీలో సుస్మిత శెట్టి హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీను కంబాల డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.
తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు మేకర్స్. ఓ మై గాడ్ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. రామ్ మిరియాల ఆలపించారు. ఈ సాంగ్‌ను సింజిత్ ఎర్రమిల్లి కంపోజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నవంబర్ 13న థియేటర్లలోకి రానుంది.


