భారత్‌లో ఒకరోజు ముందే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ | Avengers: Doomsday Releasing On 17th December In India | Sakshi
Sakshi News home page

భారత్‌లో ఒకరోజు ముందే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’

Oct 28 2026 3:09 PM | Updated on Oct 28 2026 3:22 PM

Avengers: Doomsday Releasing On 17th December In India

హాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ఇండియన్‌ థియేటర్లలో ఒకరోజు ముందుగానే సందడి చేయనుంది. ఈ ఏడాది డిసెంబర్ 17న ఈ చిత్రం భారత్‌లో విడుదల కానుంది. అమెరికాలో డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది.

సినిమా విడుదలకు మరో 50 రోజులు మాత్రమే ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సందర్భంగా హాలీవుడ్ ప్రముఖ నటులు రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్ భారతీయ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 

(చదవండి: శ్రీనిధి శెట్టి పాదాలకు నమస్కరించిన త్రివిక్రమ్‌.. అసలేం జరిగింది?)

ఆంథోనీ రుస్సో, జో రుస్సో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో క్రిస్ హేమ్స్‌వర్త్, పెడ్రో పాస్కల్, పాల్ రూడ్ తదితర ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రత్యేక ప్రీమియం ఫార్మాట్లతో పాటు మార్వెల్ స్టూడియోస్ ఇన్ఫినిటీ విజన్ ఫార్మాట్‌లోనూ ఈ చిత్రం ప్రదర్శితం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement