
ఒకవైపు పేరిణి శివతాండవం.. మరోవైపు పాశ్చాత్య నృత్యం.. భిన్న సంస్కృతుల నాట్య సమ్మేళనం ఆహూతులను ఆకట్టుకుంది.

శుక్రవారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో స్టెప్ డ్యాన్స్ సంస్థ ఆధ్వర్యంలో శాస్త్రీయ, సమకాలీన నృత్యాలు అలరించాయి.

కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, యూఎస్ రాయబార కార్యాలయ కాన్సులర్ చీఫ్ రెబాకా డ్రామే, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, స్టెప్ డ్యాన్స్ స్టూడియో వ్యవస్థాపకుడు పృథ్వీరాజ్ రామస్వామి పాల్గొన్నారు.





























