
'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. మహా విష్ణువు దశావతారాల ఆధారంగా 'మహావతార్' సినిమాటిక్ యూనివర్స్ (ఎమ్.సి.యు) పేరుతో తొలి చిత్రంగా జులై 25న విడులైంది. క్లీమ్ ప్రొడక్షన్స్, ప్రఖ్యాత హోంబలే ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాలను పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. ఈ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన తొలి చిత్రం ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద మెప్పిస్తుంది. చాలాచోట్ల థియేటర్స్ కూడా హౌస్‌ఫుల్ అవుతున్నాయి. అయతే, హరిహర వీరమల్లు వల్ల పెద్దగా ఈ చిత్రానికి థియేటర్స్ దొరకలేదు. కానీ, మొదటిరోజునే మంచి టాక్ రావడంతో మెల్లిగా బాక్సాఫీస్ వద్ద జోరందుకుంటుంది.
యానిమేటెడ్ రూపంలో తెరకెక్కిన భారతీయ చిత్రాలకు ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారని సినిమా క్రిటిక్స్ చెబుతున్నారు. 'మహావతార్ నరసింహ' విడుదలైన మొదటిరోజు రూ. 1.75 కోట్ల నెట్ రాబట్టింది. రెండోరోజు రూ. 5.20 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 7 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే కలెక్షన్స్ గ్రాస్ పరంగా చూస్తే రూ. 10 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే, నేడు ఆదివారం కావడంతో బుక్మైషోలో ఏకంగా 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. సినిమాకు మంచి టాక్ రావడంతో రోజురోజుకు టికెట్లు తెగడం పెరుగుతుందని చెప్పవచ్చు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ఫలితం ఎలా ఉంటుంది అన్న దానికి తాజా నిదర్శనం 'మహావతార్ నరసింహ'. నరసింహ స్వామి, భక్త ప్రహ్లాదుడు ఇతివృత్తాలతో ఇంతకుముందు చాలా చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి కూడా. అదే ఇతిహాసంతో యానిమేషన్ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే నమ్ముకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి జయ పూర్ణ దాస్ కథను, అశ్విన్ కుమార్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. సీఎస్ శ్యామ్ సంగీతాన్ని, అందించిన ఈ భక్తి రస చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. శ్రీమహావిష్ణువు భక్తులను రక్షించడానికి ఎత్తిన అవతారాల్లో ఒకటి నరసింహ అవతారం. అలాంటి ఇతివృత్తంతో రూపొందిన చిత్రం మహావతార్ నరసింహ. ఇది పూర్తిగా యానిమేషన్లో రూపొందడం విశేషం.