రజనీకాంత్‌ 'కూలీ' సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో | Nagarjuna Enter In Rajinikanth Coolie Movie | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌ 'కూలీ' సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో

Aug 29 2024 6:22 PM | Updated on Aug 29 2024 8:17 PM

Nagarjuna Enter In Rajinikanth Coolie Movie

కోలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌- దర్శకుడు  లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో  తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కూలీ’. సన్‌పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌లోకి టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున సడెన్‌గా ఎంట్రీ ఇచ్చేశాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్బంగా తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. అందుకు సంబంధించిన ఆయన లుక్‌ను కూడా అభిమానులతో పంచుకున్నారు.

కూలీ సినిమాలో సిమాన్‌ పాత్రలో నాగార్జున కనిపిస్తారని చిత్ర యూనిట్‌ పేర్కొంది. అయితే, అదీ రజనీకాంత్‌ను ఢీ కొట్టే పాత్ర‌ అని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. రజనీకాంత్‌తో మొదటిసారి నాగార్జున కనిపించనున్నారు. విలన్‌ పాత్ర నిజమే అయితే.. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు భారీగానే ఉంటాయని అప్పుడే అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో కన్నడ స్టార్‌ ఉపేంద్ర కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడనే విషయం తెలిసిందే.

రజనీకాంత్‌ చిత్రాల్లో సపోర్టింగ్‌ పాత్రలకు ఇతర భాషా నటీనటులు పేరిగిపోతున్నారనే చెప్పాలి. ఈయన నటించిన జైలర్‌ చిత్రంతో ఈ ఫార్ములా మొదలైందని చెప్పవచ్చు. ఆ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌, కన్నడ స్టార్‌ నటుడు శివరాజ్‌కుమార్‌, బాలీవుడ్‌ స్టార్‌ నటుడు జాకీష్రాష్‌, టాలీవుడ్‌ నటుడు సునిల్‌ వంటి వారు కీలక పాత్రల్లో నటించి ఆ చిత్రానికి స్టార్‌ విలువ పెంచేశారు. అదేవిధంగా తాజాగా రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన వేట్టైయాన్‌ చిత్రంలోనూ బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌, మలయాళ స్టార్‌ నటుడు ఫాహత్‌ ఫాజిల్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పుడు కూలీ సినిమాలో కూడా ఉపేంద్ర, నాగార్జున నటిస్తున్నారు.  కన్నడ నటి రచితరామ్‌ కూడా కూలీ సినిమాలో ముఖ్య పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. కూలీ సినిమాకు  అనిరుధ్‌ సంగీత అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement