
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ట్రెండ్‌సెట్ చేసిన మూవీ శివ. నాగార్జున హీరోగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా 1990 డిసెంబరు 7న విడుదలై కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు 35 ఏళ్ల క్రిత రిలీజైన మరోసారి మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది. అయితే సరికొత్తగా అత్యాధునిక టెక్నాలజీ హంగులతో బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఇటీవల అన్నపూర్ణ స్టూడియో 50వ వార్షికోత్సవం సందర్భంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెలుగులో రీ–రిలీజ్ చేయనున్నట్లు నాగార్జున ప్రకటించారు.
అంతేకాకుండా ఇవాళ కూలీ మూవీ రిలీజ్ సందర్భంగా శివ 4కే ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. రజినీకాంత్ కూలీ సినిమాకు ముందు శివ ట్రైలర్ రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఎగిరి గంతేశారు. థియేటర్ దద్దరిల్లిపోయేలా శివ పేరుతో మార్మోగిపోయేలా చేశారు. దీనికి సంబంధించిన వీడియోను డైరెక్టర్ ఆర్జీవీ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆర్జీవీ, వెంకట్, నేను కలసి డాల్బీ ఆట్మాస్ సౌండ్‌తో, 4కే విజువల్స్‌తో మళ్లీ ప్రెజెంట్ చేస్తున్నామని నాగార్జున తెలిపారు.
నిర్మాతలు నాపై పెట్టిన నమ్మకమే ఈ సినిమాను ఇంత ఎత్తుకు తీసుకుని వెళ్లిందని డైరెక్టర్ ఆర్జీవీ తెలిపారు. ఈ సినిమాని రీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడం నాకు థ్రిల్ ఇచ్చిందన్నారు. అడ్వాన్డ్స్ ఏఐ టెక్నాలజీతో, మోనో మిక్స్‌ను డాల్బీ అట్మాస్‌కి మార్చాం.. శివని అందరూ చూసే ఉంటారు. కానీ ఈ కొత్త సౌండ్‌తో ఎవరూ ఇంతవరకూ ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. ఈసారి ఆ అనుభూతి గ్యారంటీ అని రామ్‌గోపాల్ వర్మ తెలిపారు..
— Ram Gopal Varma (@RGVzoomin) August 14, 2025