
తలైవా, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన మోస్ అవైటేడ్ చిత్రం కూలీ. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. నాగార్జున, శృతిహాసన్, అమిర్ ఖాన్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడైపోతున్నాయి. కేరళ ఫ్యాన్స్ ఏకంగా థియేటర్లకు వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అయితే తలైవాకు ఉన్న ఫ్యాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తమిళనాడులో అయితే ఆయనంటే పడిచచ్చేంత అభిమానులు ఉన్నారు. అంతే కాదండోయ్ ఆయనకు ఏకంగా గుడినే కట్టేశారు. 2023లో మధురైకి చెందిన కార్తీక్ ఇంటి పక్కనే రజినీకాంత్కు ఆలయాన్ని నిర్మించారు. దాదాపు 250 కేజీల బరువైన రజినీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయానికి అరుల్మిగు శ్రీ రజినీ టెంపుల్ అని నామకరణం చేశారు.
తాజాగా ఈ వీరాభిమాని రజినీకాంత్ విగ్రహానికి పూజలు చేశారు. ఆయన విగ్రహానికి పాలు, నెయ్యితో అభిషేకం నిర్వహించారు. సూపర్ స్టార్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆలయంలో దాదాపు 5500 పోస్టర్లతో అలంకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానం అంటే కేవలం సినిమాలు చూడడమే కాదు.. ఇలా ఏకంగా గుడి కూడా కట్టించే ఫ్యాన్స్ ఉన్నారంటే విశేషమే.
కాగా.. రజినీకాంత్ హీరోగా వస్తోన్న కూలీ.. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మూవీ 'వార్-2తో పోటీ పడనుంది. ఈ రెండు సినిమాలు ఆగస్టు 14న థియేటర్లలో రిలీజవుతున్నాయి. కూలీ మూవీకి సంబంధించి కేరళలో ఇప్పటికే రెండు లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ మరియు కన్నడ భాషలలో విడుదల కానుంది.
#WATCH | Madurai, Tamil Nadu: A die-hard fan of Rajinikanth, Karthik celebrated 50 years of the superstar by adorning the Arulmigu Sri Rajini Temple, a temple dedicated to Rajinikanth, with over 5,500 photos of the superstar and performing abhishekam. (07.08) pic.twitter.com/bYDN2wZUYS
— ANI (@ANI) August 8, 2025