
రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూలీ. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఆగస్టు 14న థియేర్లలో విడుదలైన కూలీ తొలి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.151 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. విజయ్ సినిమా లియో రికార్డ్‌ను కూలీ అధిగమించింది. కూలీ మూవీ రిలీజైన వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.222.5 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది
తాజాగా ఈ మూవీ నుంచి కొక్కి అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను అమోగ్ బాలాజీ పాడగా.. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. ఈ మాస్ రజినీకాంత్ను ఫ్యాన్స్ తెగ ఆకట్టుకుంటోంది. కాగా.. కాగా.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించి ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ నటించారు.
Electrifying & Addictive #Kokki lyric video is out now!🖤🔥 #Coolie
▶️ https://t.co/XC6UiW0qcZ #Coolie ruling in theatres worldwide🌟@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja… pic.twitter.com/Sxn6Xu4Xe7— Sun Pictures (@sunpictures) August 22, 2025