 
													నాగార్జున హీరోగా కొత్త సినిమాలు చేయక చాన్నాళ్లయింది. అలా అని ఖాళీగా ఏం లేడు. కూలీ, కుబేర చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నాడు. ఇదివరకే వీటికి సంబంధించిన లుక్స్, గ్లింప్స్ వీడియోలు రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు మూవీస్‍తో నాగ్ సరికొత్తగా కనిపించబోతున్నాడనే హింట్ అయితే వచ్చేసింది. త్వరలో ఈ రెండు మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ క్రమంలోనే నాగ్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు. ఓ ఇంటర్వ్యూల మాట్లాడుతూ ఈ రెండు చిత్రాలు, దర్శకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'కూలీ' సినిమాలో రజినీకాంత్ హీరో. లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. కొన్నిరోజుల క్రితం చిన్న వీడియో లాంటిది రిలీజ్ చేశాడు. ఇందులో నాగార్జునని వెనక వైపు నుంచి చూపించారు. అలా కొన్ని సెకన్లపాటు కనిపించిన ఈ వీడియో స్టైలిష్‌గా ఉండేసరికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీలో నాగ్.. సైమన్ అనే ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించిన నాగ్.. 'లోకేశ్ ఎప్పుడు పులిలా నడవమని అనేవాడు. మిమ్మల్ని చూస్తే ప్రేక్షకులు భయపడాలి సర్ అనేవాడు' అని చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్ సినిమా)
అదే టైంలో 'కుబేర' తీసిన దర్శకుడు శేఖర్ కమ్ముల మాత్రం 'మీరు హీరోలా నడుస్తున్నారు. కొంచెం తగ్గించండి' అని చెప్పేవాడు. వీళ్లిద్దరికీ అదే తేడా. కూలీ విషయానికొస్తే.. 'లోకేశ్ నన్ను చాలా అద్భుతంగా చూపించాడు. నన్ను నేను అలానే చూడాలనుకున్నాను. సినిమా చూస్తున్నంతసేపు విజిల్స్ వేస్తూనే ఉంటారు. గడిచిన నాలుగు దశాబ్దాలుగా ఎన్నో సక్సెస్‌లు చూశాను. మూవీ కలెక్షన్స్ నాకు ముఖ్యం కాదు' అని నాగార్జున చెప్పుకొచ్చాడు.
రజినీకాంత్-లోకేశ్ కనగరాజ్ 'కూలీ' మూవీ.. ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. తెలుగులోనూ ఈ చిత్రానికి భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు శేఖర్ కమ్ముల తీసిన 'కుబేర' సినిమా.. ఈనెల 20న అంటే వచ్చే శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఇందులో ధనుష్, రష్మిక హీరోహీరోయిన్లు కాగా.. నాగ్ కీలక పాత్ర పోషించాడు. ఈ రెండు మూవీస్ హిట్ అయితే గనక నాగార్జునని ఇలా మరిన్ని సినిమాల్లో డిఫరెంట్ రోల్స్‌లో చూడొచ్చేమో?
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్)
#Nagarjuna: Coolie Vs Kubera #Coolie: Lokesh is larger than life Filmmaker🔥. Loki says Walk in like a Tiger, people should scared with ur Look🐯👿#Kubera: Sekhar is very realistic filmmaker🫶. Director says you are waking like a Hero bring it down😀 pic.twitter.com/lVkVCkYE1r
— AmuthaBharathi (@CinemaWithAB) June 13, 2025

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
