breaking news
Sekhar Kammula
-
హ్యాపీ డేస్ సీక్వెల్‌పై శేఖర కమ్ముల ఫోకస్
-
కుగ్రామం నుంచి 'కుబేర' వరకూ..!
ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న కుబేర సినిమా అనేక మంది విమర్శకుల ప్రశంసలను అందుకుంటూ దూసుకెళ్తోంది. ఎప్పుడూ కొత్త తరహా కథలను తెరకెక్కించే శేఖర్ కమ్ముల ఈ సారి సామాజిక కథాంశంతో పాన్ ఇండియా స్థాయిలో సినిమా తీశారు. ఇది ఎంతగానో ప్రజాదరణ పొందుతోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ టీంలో ఛీప్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు అరవింద్ ఏవీ. తాను తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా విద్యార్థి. ట్రావెలర్, ఫొటోగ్రాఫర్‌గా అందరికీ సుపరిచితమే. నల్లగొండ జిల్లా దేవరకొండ తాలుక మారుమూల కుగ్రామమైన మేడారంలో పుట్టి పెరిగారు. బాల్యదశలో బతుకు కోసం కుటుంబం సాగించిన వలసలో నడుస్తూ.. హుజూర్ నగర్, నిడమానూరు, మిర్యాలగూడ, హలియ అనేక ప్రాంతాల్లో జీవించాల్సి వచ్చింది. సంక్షేమ హస్టల్స్లో చదువుకుంటూ క్యాటరింగ్, రైస్ మిల్లుల్లో నైట్ షిఫ్ట్స్ చేయడం.. సొంత ఖర్చులను సమకూర్చుకుంటూ చదువుకున్నారు. మరోవైపు దేశభక్తి, ఇతర సామాజిక అంశాల్లో క్రియాశీలకంగా పనిచేయడం బాధ్యతగా భావించారు. యూనివర్సిటీలో అడుగులు.. యూనివర్సిటీ విద్యార్థిగా తమ గ్రామం నుంచి వచ్చిన మొదటి తరం విద్యార్థి. మాస్ కమ్యూనికేషన్ చదవుతూనే వార, మాస పత్రికలు నడిపారు. చిన్నతనంలో పేపర్ బాయ్‌గా పనిచేయటం వల్ల సాహిత్య పఠనం అలవడింది. అనేక సామాజిక, సాహిత్య అంశాలను స్పృశిస్తూ.. కవితలు, వ్యాసాలు రాశారు. సాహిత్య ప్రచారం.. కథ, కవిత్వం, నవలలు విరివిగా చదవటం. చదివిన పుస్తకాలను నలుగురికీ పంచడం అవసరమని.. ‘ఆలోచన’ అనే సంస్థ ద్వారా గ్రామీణ, పట్టణ విద్యార్థులకు చిట్టి–పొట్టి జానపద కథల నుండి దేశభక్తుల జీవిత చరిత్రల వరకూ పరిచయం చేయడం, చదివించడం చేశారు. నగరంలోని యూనివర్సిటీల్లో స్టడీ సర్కిల్స్ నిర్వహణ, పుస్తకాలు, సినిమాలు, ఆర్ట్‌పై సదస్సులు, సభలు నిర్వహించేవారు. యాత్రలు.. ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్.. దక్షిణ భారతదేశం మొత్తం యాత్రలు చేయడం. ఇందులో భాగంగా ఫొటోగ్రఫీపై అభిరుచి ఏర్పడింది. ఆయ ప్రాంతాల సంస్కృతిని, వైవిధ్యాన్ని, ప్రకృతిని, ఆర్కిటెక్చర్‌ను కెమెరా లెన్స్‌లోంచి చిత్రించారు. వాటిని యూనివర్సిటీల్లో, పట్టణాల్లో ప్రదర్శించారు. సినిమా రంగంలోకి.. దర్శకులు అనుదీప్ కేవీ సాహిత్య పాఠకుడిగా ఉన్న రోజుల్లో నుంచి స్నేహం వల్ల సినిమాల్లోకి ప్రవేశం దొరికింది. ఆయన కథలను చర్చిస్తుడడం.. రాస్తుండడం.. ఆ క్రమంలోనే ప్రిన్స్ సినిమాకు రచన విభాగంలో పని చేయడం.. రచన నైపుణ్యాన్ని నేర్చుకోవడం జరిగింది. అత్యంత మరపురాని క్షణాలు.. కుబేర షూటింగ్ మొదలవుతుంది అనుకున్న రెండు నెలల ముందు పిలిచారు. మొదట ఇంటర్న్‌షిప్ జాయిన్ అయ్యాను. యాత్ర అనుభవాల వల్ల ఈ సినిమా కథకు ముంబయి దగ్గర ఉండే లొకేషన్స్ వెతికిపెట్టే పని అప్పగించారు. చాల మేరకు హైదరాబాద్ లొకేషన్స్‌లో ఓకే చేయించుకోవడం.. క్రమంగా ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జిగా ఉండడం.. లెజెండరీ మనుషులైన తోట తరణి, శేఖర్ కమ్ముల నేతృత్వంలో పనిచేయడం.. జీవితంలో ఓ మైలురాయి. డైరెక్టర్ విజన్, ప్రొడక్షన్ డిజైనర్ విజువల్‌ని సెట్లో ప్రతిబింబిచడానికి నిద్రాహారాలు పక్కనపెట్టి పనిచేశా.. అయినా కష్టం అనిపించలేదు.. సెట్లో తరణి, శేఖర్ అనుభవాలు వినడం జీవితంలో అత్యంత మరపురాని క్షణాలుగా ఉండిపోయాయి. ఆర్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంద్రాణితో సమన్వయంలో ఉండడం.. టీం చరణ్, రాజు, భార్గవ్లతో రాత్రి, పగలు ఆడుతూ.. పాడుతూ షూటింగ్ కంప్లీట్ చేశాము. నేను, మా టీం ఇప్పుడు వీస్తున్న విజయపు గాలిని ప్రశాంతంగా ఆస్వాదిస్తున్నాం. – అరవింద్ ఏవీ, అసోసియేట్ డైరెక్టర్ (చదవండి: అర ఎకరం భూమి లేకుండానే డ్రాగన్ పంట..! రిటైర్డ్ ఉపాధ్యాయురాలి సక్సెస్ స్టోరీ) -
చిరంజీవి గారి వల్లే సినిమాల్లోకి..
-
మీరు చేసిన సాయం జీవితాంతం గుర్తుంచుకుంటా: రష్మిక
తమిళ స్టార్ హీరో ధనుష్‌పై నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna ) ప్రశంసల వర్షం కురిపించింది. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఆయన చేసే పనులు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడింది. అందరితో చాలా మర్యాదగా మాట్లాడతాడని చెప్పు, అలాంటి గొప్ప నటుడితో పని చేయడం ఆనందంగా ఉందని సోషల్ మీడియా వేదికగా ధనుష్‌ని పొగడ్తలతో ముంచేస్తూ.. ఆయనతో దిగిన సెల్ఫీ ఫోటోని షేర్ చేసింది.‘మీతో అంతపెద్ద సినిమా(కుబేర) చేసినప్పటికీ.. మనమిద్దరం కలిసి ఒక్క సెల్ఫీ మాత్రమే తీసుకున్నాం. మీరు చాలా అద్భుతమైన వ్యక్తి. ప్రతి రోజు కష్టపడి పని చేస్తున్నందుకు ధన్యవాదాలు. మనం మాట్లాడుకున్న ప్రతి సారి వేరు వేరు నగరాల్లో ఉండేవాల్లం. విశ్రాంతి ఎంత అవసరమో చర్చించుకునే వాళ్లం కానీ..మనం మాత్రం విశ్రాంతి తీసుకోలేదు. కుబేరలో మాత్రమే కాదు..ప్రతి సినిమాలోనే మీ నటన అద్భుతంగా ఉంటుంది. నాతోనే కాదు చుట్టూ ఉన్నవాళ్లతో చాలా మర్యాదగా మాట్లాడతారు. సెట్లో నాకోసం తెచ్చిన లడ్డూలను ఎప్పటికీ గుర్తించుకుంటాను. అలాగే నాకు తమిళ డైలాగుల విషయంలో మీరు చేసి సాయం.. నేను ఏదైనా డైలాగు చెబితే మీరు ప్రశంసించిన తీరు.. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అయినా.. జీవితాంతం గుర్తుంటాయి ధనుష్ సార్’ అని రష్మిక ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.కుబేర( Kuberaa ) విషయానికొస్తే.. ధనుష్, నాగార్జున హీరోలుగా నటించిన ఈ చిత్రంలో రష్మిక కీలక పాత్ర పోషించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలైన హిట్ టాక్ని సంపాదించుకుంది. ధనుష్ నటనపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
బాక్సాఫీస్ వద్ద కుబేర.. వరల్డ్ వైడ్‌గా ఏకంగా 9వ స్థానం!
ధనుశ్, నాగార్జున కీలక పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తందా మూడు రోజుల్లోనే రూ.87 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ వసూళ్లతో ఈ వీకెండ్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. హాలీవుడ్ హీరో డకోటా జాన్సన్ నటించిన మెటీరియలిస్ట్స్ మూవీని అధిగమించింది. ఇండియా వ్యాప్తంగా చూస్తే మూడు రోజుల్లో కుబేర మూవీ రూ.48.60 కోట్ల నికర వసూళ్లను సాధించింది. దేశవ్యాప్తంగా రూ. 57 గ్రాస్ కోట్ల వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్లో రూ.23 కోట్లకు పైగా వసూళ్లు రాగా.. ఓవరాల్‌గా రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే నాగ చైతన్య చిత్రం తండేల్ రూ.88.25 కోట్ల వసూళ్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ప్రధాన పాత్ర పోషించారు.మరోవైపు అదే రోజు విడుదలైన ఆమిర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ సినిమా రూ.88 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమాలపరంగా చూస్తే హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్, 28 ఇయర్స్ లేటర్, ఎలియో వంటి చిత్రాలు ఈ జాబితాలో ముందంజలో ఉన్నాయి. బాలేరినా మూవీ సితారే జమీన్ పర్కు కాస్తా దగ్గరగా ఉంది. -
కుబేర... తెలుగు 'వీర' లేవరా
తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల తెలుగులో ఇప్పటిదాకా పలు చిత్రాలు తీశారు. మంచి అభిరుచి ఉన్న దర్శకుడు అనే పేరు మాత్రం తెచ్చుకోగలిగారు. కానీ ఆయనతో ఇప్పటివరకు తెలుగు అగ్రనటులు ఎవరూ పనిచేయలేదు. ఎందుకని? బహుశా వైవిధ్యభరిత పాత్రలను మాత్రమే ఆయన రూపకల్పన చేస్తారనా? లేదా తమ సూపర్‌మ్యాన్ ఇమేజ్‌కి తగ్గ హీరో పాత్రల్ని ఆయన సృష్టించలేరనా? ఇప్పుడు శేఖర్ కమ్ముల పేరు దక్షిణాది చిత్ర పరిశ్రమలో మార్మోగుతోంది. ఆయన తీసిన 'కుబేర' కమర్షియల్‌గా మాత్రమే కాకుండా దాదాపు 100శాతం పాజిటివ్ రివ్యూలతో అనూహ్య విజయం సాధించింది.(ఇదీ చదవండి: 'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?)ఇటీవలి కాలంలో ఒక్కసారి పరిశీలించి చూస్తే వెంకీ అట్లూరి, శేఖర్ కమ్ముల లాంటి తెలుగు దర్శకులు.. తమిళ హీరోలతో కలిసి పనిచేసినప్పుడు విజయవంతమైన చిత్రాలను అందించారు. సర్, లక్కీ భాస్కర్‌తో ఇప్పుడొచ్చిన 'కుబేర' చిత్రాలే స్పష్టమైన ఉదాహరణలు. ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర రాణించడంతో పాటు బలమైన, వైవిధ్యభరిత కథాకథనాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.మరోవైపు తెలుగు స్టార్లతో కలిసి పనిచేసిన తమిళ దర్శకులేమో అంతవరకూ చవిచూడని దారుణమైన డిజాస్టర్లకు తెర తీశారు. మహేష్ బాబు 'స్పైడర్' నుంచి రామ్ 'ది వారియర్', నాగ చైతన్య 'కస్టడీ', రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. ఇలా ఇవన్నీ తమిళ దర్శకులు తీసినవే. ఈ సినిమాలు అటు కలెక్షన్ల పరంగా, ఇటు క్వాలిటీ పరంగా ఏ వర్గం ప్రేక్షకులనూ మెప్పించలేకపోయాయి. ఈ సినిమాల పరాజయాలకు తమిళ దర్శకులేనా బాధ్యులు?(ఇదీ చదవండి: రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?)ఇప్పటికైనా ఒప్పుకోక తప్పని వాస్తవం. ఆ బాధ్యత తీసుకోవాల్సింది తెలుగు హీరోలు, వారి ఆలోచనా ధోరణి మాత్రమే అని. నిజం చెప్పాలంటే 'కుబేర'లో ధనుష్ పోషించిన బిచ్చగాడి పాత్రను పోషించేంత ధైర్యం.. బహుశా ధైర్యం అనకూడదేమో! నటనపై అంతటి ఇష్టం తెలుగు హీరోలకు ఉందా? ఇమేజి, గిమేజి అంటూ చేయబోయే పాత్ర విలువ కేజీల్లో కొలవకుండా ఆ బిచ్చగాడి పాత్రకి సై అనేవారా? అసాధ్యమే అనాలి. (నిజానికి ఈ పాత్ర కోసం శేఖర్‌కమ్ముల ఒకరిద్దరు తెలుగు హీరోలను ఒప్పించడానికి విఫల యత్నం చేశారని సమాచారం) కానీ అదే సమయంలో తమిళ్లో టాప్ హీరోగా వెలుగొందుతున్న ధనుష్ ఆ పాత్రను అద్భుతంగా పండించాడు. ప్రేక్షకుల ప్రశంసలు అందుకంటున్నాడు. అదే విధంగా మళయాల హీరో దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' సినిమా విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రను తెలుగు హీరోలు అంగీకరించలేరు. సురక్షితమైన, తమ కెరీర్‌కు గానీ, ఫాలోయింగ్‌కు గానీ ఎలాంటి ఇబ్బంది పెట్టని , హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఫ్యాన్స్‌కు క్రేజీ హీరోగా నిలిపి ఉంచే లాంటి పరిమితులు... తెలుగు హీరోలను అనూహ్యమైన పాత్రల ఎంపిక నుంచి దూరంగా నెట్టేస్తున్నాయి. కలెక్షన్ల సునామీలు సృష్టిస్తున్నట్టే, అభినయపరమైన అద్భుతాల ఆవిష్కరణలోనూ ముందుండాలంటే.. 'కుబేర' లాంటి విజయాలు చెబుతున్న పాఠాలను తెలుగు స్టార్స్ నేర్చుకోవాల్సిందే.(ఇదీ చదవండి: 'కుబేర' రెండో రోజు కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు?) -
'కుబేర' సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
నేను నటించగలనని శేఖర్ కమ్ముల నిరూపించారు: రష్మిక
రీసెంట్గా థియేటర్లలోకి వచ్చిన 'కుబేర' సినిమాకు అన్నివైపుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్ పేరిట ఈవెంట్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. ఈ కార్యక్రమంలోనే మాట్లాడిన హీరోయిన్ రష్మిక.. తన యాక్టింగ్, చిరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ప్రతి సినిమా ఒప్పుకొనేటప్పుడు చాలా విషయాలు ఆలోచిస్తుంటానని, కానీ 'కుబేర' విషయంలో అలా చేయలేదని రష్మిక చెప్పుకొచ్చింది. అలానే సెట్లో అడుగుపెట్టిన తర్వాత దర్శకుడికి సరెండర్ అయిపోయానని తెలిపింది. తాను నటించగలనని శేఖర్ కమ్ముల నిరూపించారని చెప్పింది. రీసెంట్గా సినిమా చూసిన వెంటనే.. 'ఓ మై గాడ్. ఎప్పుడూ మీ ఫెర్ఫార్మెన్స్‌కి ఫిదా' అని ధనుష్ సర్కి మెసేజ్ చేసినట్లు తెలిపింది. అలానే తన తొలి తెలుగు మూవీ నుంచి చిరంజీవిగారు తన సినీ ప్రయాణంలో భాగమైపోయారని రష్మిక పేర్కొంది.(ఇదీ చదవండి: 'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?)రష్మిక చెప్పినట్లు ఇదివరకు చేసిన సినిమాల్లో ఈమె ఫెర్ఫార్మెన్స్ బాగానే చేసింది. కానీ 'కుబేర'లో పాత్ర నిడివి తక్కువైనప్పటికీ డిఫరెంట్ రోల్లో ఆకట్టుకుంది. ధనుష్, నాగార్జున యాక్టింగ్‌తో పాటు రష్మిక గురించి కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. వరస పెట్టి పాన్ ఇండియా హిట్స్ కొడుతోందని అనుకుంటున్నారు. ఎందుకంటే యానిమల్, పుష్ప 2, ఛావా.. ఇప్పుడు 'కుబేర'తో బ్లాక్ బస్టర్ హీరోయిన్ అయిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో రష్మిక మేనియా నడుస్తోంది.'కుబేర' విషయానికొస్తే.. ఆయిల్ రిగ్ని దక్కించుకోవాలని బడా వ్యాపారి నీరజ్(జిమ్ షర్బ్).. రూలింగ్ పార్టీకి లక్ష కోట్ల రూపాయల లంచం ఇవ్వాలనుకుంటాడు. ఈ పనిచేసేందుకు జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. అయితే ఈ డబ్బంతా పంపిణీ చేయడానికి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని ఎంచుకుంటారు. వాళ్లలో ఒకడు దేవా(ధనుష్). ఇతడి పేరు మీద విదేశాల్లో ఓ షెల్ కంపెనీ సృష్టించి, దాని ద్వారా మినిస్టర్లకు డబ్బులు ఇవ్వాలనేది ప్లాన్. కానీ దేవా.. వీళ్ల దగ్గరనుంచి తప్పించుకుంటాడు. తర్వాత ఏమైంది? సమీర(రష్మిక) ఎవరు అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?) -
‘కుబేర’లో నాదే మెయిన్ క్యారెక్టర్ అనిపించింది: నాగార్జున
‘‘మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ’ వంటి సినిమాల్లో హీరో ఎవరని చెప్పలేం. అందులో కథే హీరో... అవన్నీ కూడా డైరెక్టర్ ఫిలిమ్స్. ‘కుబేర’ కూడా ఔట్ అండ్ ఔట్ శేఖర్ కమ్ములగారి మూవీ ఈ సినిమా కోసం తను ప్రాణం పోశారు. మా సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’’ అని అక్కినేని నాగార్జున చెప్పారు. అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటించగా, జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (ఈ నెల 20న) తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. (చదవండి: నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడు.. కర్ణుడిలా ఆయన వెంట ఉంటా : మంచు విష్ణు)శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ ప్రెస్మీట్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘శేఖర్ చెప్పిన ‘కుబేర’ కథ వినగానే నాది మెయిన్ క్యారెక్టర్ అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలోని ప్రతి పాత్ర నేను చేసిన దీపక్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. నా పాత్రకి వచ్చిన స్పందన గొప్ప ఆనందాన్నిచ్చింది. నా అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు’’ అని చెప్పారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘ఇది సామాన్యమైన సినిమా కాదు. సరస్వతీ దేవి తల ఎత్తుకొని చూసే సినిమా అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను.. అది ఈ రోజు నిజమైంది’’ అన్నారు. ‘‘కుబేర’ పెద్ద హిట్ అవుతుందని కథ విన్నప్పుడే చెప్పాను’’ అని సునీల్ నారంగ్ పేర్కొన్నారు. ‘‘మా సినిమాకి బ్లాక్ బస్టర్ రిపోర్ట్ వచ్చింది. నిర్మాతలుగా చాలా సంతోషంగా ఉన్నాం’’ అని పుస్కూర్ రామ్మోహన్ రావు చెప్పారు. -
రష్మిక సాంగ్ ఎందుకు తీసేశారు?.. శేఖర్ కమ్ముల క్లారిటీ!
ధనుశ్, నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన లేటేస్ట్ మూవీ కుబేర. క్రేజీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. విడుదలైన మొదటి రోజే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో నాగ్ ఫ్యాన్స్‌తో పాటు ధనుశ్ అభిమానులు సైతం ఫుల్ ఖుషీ అవుతున్నారు. కుబేర సక్సెస్ కావడంతో ఇది శేఖర్ కమ్ముల మార్క్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ రష్మిక సైతం తన పాత్రకు వస్తున్న ఆదరణను చూసి సంతోషంగా ఉందని తెలిపింది.అయితే తాజాగా కుబేర సక్సెస్ కావడంతో టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో నాగార్జునతో పాటు డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా పాల్గొన్నారు. ఈ సినిమాలో పీపీ..డుమ్ డుమ్ అనే రష్మిక సాంగ్‌ను ఎందుకు తొలగించారంటూ దర్శకుడికి ప్రశ్న ఎదురైంది. దీనిపై శేఖర్ కమ్ముల క్లారిటీ ఇచ్చారు.పాన్ ఇండియా సినిమా కావడం వల్ల కొన్ని అలాంటి సాంగ్స్ ఉండాలకున్నామని శేఖర్ కమ్ముల తెలిపారు. అయితే ఈ సాంగ్‌ను కావాలని మేము తీయలేదన్నారు. కానీ కథలో ఎక్కడైనా ఈ పాట అడ్డుగా వస్తుందేమోనని వద్దనుకున్నట్లు వెల్లడించారు. వేరే మంచి సీన్ తొలగించి ఈ పాటను పెట్టడానికి నేను కథను అలా రాసుకోలేదన్నారు. ఈ చిత్రంలో ఒక్క సీన్, ఒక్క డైలాగ్ తీసేసినా ఈ సినిమా ఉండదు.. అలా కథ రాసుకున్నానని శేఖర్ కమ్ముల వివరించారు. -
శేఖర్ కమ్ముల కుబేర.. అసలు ఈ క్యారెక్టర్‌ను ఎలా ఒప్పుకున్నాడు?
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన కుబేర ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మధ్య కాలంలో రిలీజ్ రోజే అటు పబ్లిక్, మీడియా నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఈ సినిమా దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల టేకింగ్, ధనుష్-నాగార్జునల నటనగురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఇక కుబేరలో నాగార్జున దీపక్ అనే ఒక సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఒక రకంగా చెప్పాలంటే కుబేరలో నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది.నిజానికి నాగార్జున టాలీవుడ్లో టాప్ లీగ్ హీరోలలో ఒకరు. ఇలా టాప్ లీగ్‌లో సినిమాలు చేసే నాగార్జున ఇలాంటి సినిమాలో ఒక పాత్ర చేయడానికి ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. అలా ఒప్పుకోవడమే ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్. ఆది కూడా నాగ్‌కి ఉన్న రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి డీ గ్లామ్ రోల్ చేయడం అభినందనీయం. ఈ సినిమాలో నాగార్జున పర్ఫామెన్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, విమర్శకుల నుంచి కూడా నాగార్జున మీద ప్రశంసలు వర్షం కురుస్తోంది.శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ ఒక క్రైమ్ డ్రామా చేస్తానని ముందుకు వస్తే.. ఆయనను ఎంకరేజ్ చేస్తూ పాత్ర ఒప్పుకోవడమే కాదు, తెలుగు ప్రమోషన్స్ బాధ్యతలు కూడా తన భుజాల మీదే వేసుకున్నాడు. ఒక రాకంగా ఆయన మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసాడు. దీంతో కేవలం ప్రేక్షకులు, విమర్శకులు, అభిమానుల నుంచే కాదు సోషల్ మీడియాలో కూడా ఈ పాత్రకు ఎనలేని రెస్పాన్స్ వస్తోంది. నటుడు అంటే సినిమాలో ఎలాంటి పాత్ర అయినా చేయాలి అనిపించేలా ఈ సినిమాలోని పాత్రలో నాగార్జున నటించాడు అనడం కన్నా జీవించాడు అంటేనే కరెక్ట్.శేఖర్ కమ్ముల సినిమాలో క్యారెక్టర్లు దాదాపు చాలా నేచురల్‌గా ఉంటాయి, అలాంటి పాత్రలో నాగ్ ఒదిగిపోయి నటించాడు. ఇలాంటి షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం కత్తి మీద సాము లాంటి విషయం. అలాంటి పాత్రలో కూడా ఆయన నటించి, కొన్ని సన్నివేశాలలో కళ్లతోనే భావాలు పలికించిన తీరు అత్యద్భుతం అనే ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమా చూసిన వారంతా ఆయన నటన చూసి ఆశ్చర్యపోతున్నారు. నాగ్ అసలు ఈ క్యారెక్టర్‌ను ఎలా ఒప్పుకున్నాడు? ఒప్పుకుని ఇలా ఎలా యాక్ట్ చేశాడు అనే చర్చ జరుగుతోంది. -
మీకు సడన్‌గా రూ.500 కోట్లు ఇస్తే ఏం చేస్తారు?.. శేఖర్ కమ్ముల ఏమన్నారో తెలుసా?
శేఖర్ కమ్ముల అంటే ఒక మార్క్. ఆయన సినిమా తీశాడంటే కథ మాములుగా ఉండదు. నాగచైతన్యతో లవ్ స్టోరీ మూవీ తీశాక అంటే.. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ధనుశ్, నాగార్జున ప్రధాన పాత్రల్లో కుబేర అనే సినిమాను తెరకెక్కించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య థియేటర్లలో గ్రాండ్ రిలీజైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.అయితే ఈ సినిమాకు రిలీజ్ ముందురోజే నాగచైతన్యతో కలిసి నాగార్జున, శేఖర్ కమ్ముల చిట్ చాట్ నిర్వహించారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా చైతూ వాళ్లిద్దరికి పలు ప్రశ్నలు సంధించారు. ఈ చిట్ చాట్ చాలా ఫన్నీగా, సరదాగా సాగింది. ఇందులో శేఖర్ కమ్ములకు ఓ ఆసక్తికర ప్రశ్న వేశాడు నాగచైతన్య.సడన్‌గా మీకు రూ.500 కోట్లు ఇచ్చి.. ఏం చేసినా పర్లేదు అంటే మీరు ఏం చేస్తారు? అని అడిగాడు. దీనికి శేఖర్ కమ్ముల ఆ ఐదొందల కోట్లు తీసుకుని ఏదైనా మంచి సినిమా చేస్తా అన్నారు. పక్కనే నాగార్జునను మీరేం చేస్తారని అడగ్గా.. నాకేందుకురా వద్దే వద్దు అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. #NagaChaitanya: Sudden gaa meeku ₹500 crores isthe, meeru em chestharu?#Nagarjuna: వద్దు… I don’t want. 😄#KuberaaInCinemasTomorrow pic.twitter.com/WOCNViedfH— Whynot Cinemas (@whynotcinemass_) June 19, 2025 -
'కుబేర'కు రివ్యూ ఇచ్చిన శేఖర్ కమ్ముల కూతురు
ఈ వీకెండ్ రెండు కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. వీటిలో 'కుబేర' ఒకటి. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. సాధారణంగా ఈ డైరెక్టర్ ఇంత పెద్ద మూవీస్ చేయడు. స్టార్స్ లేకుండా సింపుల్ బడ్జెట్‌తో సినిమా తీస్తుంటారు. అలాంటిది ఈసారి భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీ తీశారు. థియేటర్లలో చూసిన ప్రతిఒక్కరూ పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు.(ఇదీ చదవండి: కొత్త కారు కొన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. రేటు ఎంతో తెలుసా?)'కుబేర' చూసినవాళ్లు శేఖర్ కమ్ముల విజన్‌ని మెచ్చుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో సినిమా చూసేందుకు ఈయన కూతురు కూడా వచ్చింది. బయటకొచ్చి తనదైన రివ్యూ కూడా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 'టీమ్‌ని చూస్తుంటే గర్వంగా ఉంది. మేం చాలా చాలా చెప్పాం. దానికి మించి ఉంది సినిమా' అని శేఖర్ కమ్ముల కూతురు వందన చెప్పింది.దాదాపు 25 ఏళ్లుగా శేఖర్ కమ్ముల సినిమాలు తీస్తున్నాడు. కాకపోతే మిగతా దర్శకుల్లా కాకుండా బయట కనిపించరు. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా ఉండరు. దీంతో ఈయన కుటుంబం గురించి బయటవాళ్లకు తక్కువగానే తెలుసు. అలాంటిది శేఖర్ కమ్ముల కూతురు వందన.. అప్పుడప్పు కనిపిస్తోంది. మొన్నీమధ్య హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఇప్పుడు తండ్రి సినిమాకు రివ్యూ ఇస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. ఇది చూసిన పలువురు నెటిజన్లు.. శేఖర్ కమ్ములకు ఇంత పెద్ద కూతురుందా అని ఆశ్చర్యపోతున్నారు. చూస్తుంటే తండ్రిలానే సినిమాల్లోకి వస్తుందేమో అనిపిస్తుంది.(ఇదీ చదవండి: Kuberaa Review: ‘కుబేర’ మూవీ రివ్యూ) -
'కుబేర నాకెంతో స్పెషల్.. నా గురువు మరిన్ని గొప్ప కథలు చెప్పాలి'
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తాజాగా చిత్రం కుబేర. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi) ఆల్ ద బెస్ట్ చెప్పింది. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో ఓ ట్వీట్ వేసింది. చాలా కారణాల వల్ల కుబేర నాకు స్పెషల్ చిత్రంగా నిలవబోతుంది. ఛాలెంజింగ్ పాత్రలు ఎంచుకోవడం, అద్భుతంగా నటించడం ధనుష్ సర్ వల్లే సాధ్యమవుతుంది.ఎప్పటికీ గుర్తుండిపోతుందిశేఖర్ (Sekhar Kammula) గారి డైరెక్షన్లో నాగార్జున సర్ కిల్లర్ లాంటి పాత్రలో కనిపించడం మాకు కన్నుల పండగ్గా ఉంటుంది. ప్రియమైన రష్మిక.. శేఖర్ గారు తన సినిమాల్లో హీరోయిన్లకు శక్తివంతమైన పాత్రలు ఇస్తారు. కుబేరలో నీ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే నీ విజయాల పరంపరలో ఈ మూవీ కూడా చేరిపోతుంది. దేవి శ్రీ ప్రసాద్ గారు.. మీరు మరోసారి మ్యాజిక్ చేయడం ఖాయం! రక్తం ధారపోశారుచైతన్య, సూరి, అజయ్, స్వరూప్.. మీరంతా రక్తం ధారపోసి కష్టపడ్డారు. అందుకు ప్రతిఫలం, గుర్తింపు తప్పకుండా వస్తుంది. నిర్మాత సునీల్ గొప్ప కథల్ని ఎంచుకుని అందిస్తున్నందుకు దివంగత నారాయణ్‌దాస్ గారు పై నుంచి ఎంతో గర్విస్తుంటారు. శేఖర్గారిలాంటి స్వచ్ఛమైన హృదయం కలవారే ఇలాంటి సినిమాలు తీయగలరు. మీరు ఒక తరాన్నంతటినీ ప్రభావితం చేస్తున్నారు. అందులో నేనూ ఉన్నాను. నా గురువుగారు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. కుబేరఇలాంటి మంచి కథల్ని మరెన్నో అందించాలని ఆశిస్తున్నాను అని రాసుకొచ్చింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో సాయిపల్లవి ఫిదా, లవ్ స్టోరీ చిత్రాలు చేసింది. కుబేర సినిమా విషయానికి వస్తే.. నాగార్జున సీబీఐ ఆఫీసర్‌గా, ధనుష్ బిచ్చగాడిగా నటించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. నికేత్ బొమ్మరెడ్డి కెమెరామేన్‌గా పని చేశారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 20న రిలీజైంది. #Kuberaa is going to be special for many reasons! @dhanushkraja sir’s masterclass in acting & art of picking challenging characters that only he can pull off so effortlessly. @iamnagarjuna sir, It’s going to be a treat to watch you in a killer character under Sekhar garu’s…— Sai Pallavi (@Sai_Pallavi92) June 20, 2025 చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ -
'కుబేర' మూవీ HD స్టిల్స్
-
మీ నాన్న పాకెట్లో ఎంత కొట్టేసేవారు?.. కుబేర డైరెక్టర్‌కు నాగచైతన్య సరదా ప్రశ్న!
అక్కినేని నాగార్జున, ధనుశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఈ శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో నాగార్జున కూడా పాల్గొంటున్నారు. తాజాగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల, నాగార్జునను హీరో నాగచైతన్య ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరిని నాగచైతన్య సరదా ప్రశ్నలు అడిగారు. మీ చిన్నప్పుడు నాన్న పాకెట్ నుంచి ఎంత మనీ కొట్టేశారు? అంటూ చైతూ ఇద్దరినీ ప్రశ్నించారు. దీనికి శేఖర్ కమ్ముల ఆసక్తికర సమాధానమిచ్చారు. పతంగులు కొనేందుకు 50 పైసలు తీసుకునేవాడిని డైరెక్టర్ అన్నారు. ఆ తర్వాత నాన్న జేబు నుంచి రూపాయి, రెండు రూపాయల నోట్లు తీసుకునేవాడినని నాగార్జున వెల్లడించారు. అప్పుడు వాళ్ల పాకెట్లో కూడా అంతే ఉండేవని.. పెద్ద నోటు అంటే అప్పట్లో కేవలం పది రూపాయలేనని నాగార్జున అన్నారు. ఆ తర్వాత నా టైమ్‌లో బిగ్ నోట్ 500 రూపాయలని నాగచైతన్య నవ్వుతూ మాట్లాడారు. కాగా.. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నాగచైతన్య- సాయిపల్లవి జంటగా లవ్ స్టోరీ మూవీలో నటించారు. -
పారితోషికం తీసుకొని చాలా నష్టపోయా : శేఖర్ కమ్ముల
‘‘నా కెరీర్‌లోని మ్యూజికల్, లవ్‌స్టోరీ చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. దీంతో నా పై ఓ మార్క్ పడింది. కానీ కథకు ఏం కావాలో అదే చేశాను. ‘లీడర్’ చాలా నిజాయితీగా చెప్పిన కథ. ఈ కథలో లవ్‌స్టోరీ, మంచి పాటలు పెట్టాలనుకోలేదు. ‘హ్యాపీడేస్’ కాలేజ్ స్టోరీ కాబట్టి కాలేజీ స్టోరీలానే ట్రీట్ చేశాను. ‘కుబేర’ సినిమా కూడా అంతే. ఈ కథకు కావాల్సిందే చేశాను. చెప్పాలంటే... నేను కథను డైరెక్ట్ చేయడం కాదు... కథే నన్ను డైరెక్ట్ చేస్తుంటుంది’’ అని అన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. (చదవండి: నా కళ్లలో నీళ్లు తిరిగాయి.. అందుకే ఆమె పెళ్లికి సాయం చేశా: శేఖర్ కమ్ముల)ధనుష్, నాగార్జున హీరోలుగా నటించిన చిత్రం ‘కుబేర’. రష్మికా మందన్నా, జిమ్ సర్భ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రేపు విడుదల కానున్న సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశంలో శేఖర్ కమ్ముల చెప్పిన విశేషాలు. ⇢ ‘కుబేర’ సినిమా ముంబై నేపథ్యంలో సాగుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను చిత్రీకరించాం. ఒక సూపర్ రిచ్ ప్రపంచం, ఇంకొకటి అట్టడుగున ఉండే ప్రపంచం... ఇలా రెండు విభిన్నమైన ప్రపంచాలను ప్రేక్షకులు చూస్తారు. తనకి ఏమీ వద్దని, ఏ ఆశ లేని ఒక బెగ్గర్, ఈ ప్రపంచంలోని అన్నీ తనకే కావాలనుకునే ఒక బిలియనీర్ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే... బెగ్గర్ వర్సెస్ బిలియనీర్. ఈ తరహా కథలను చెప్పినప్పుడు పేదవారే గెలుస్తుంటారు. కానీ అది ఎలా ప్రజెంట్ చేశాం అన్నది ఈ సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఉంటుందీ సినిమా. ⇢ ‘మనం, ఊపిరి’ వంటి సినిమాల్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నాగార్జునగారు నటించారు. ‘కుబేర’లో కూడా ఆయన కొత్తగా కనిపిస్తారు. ఈ సినిమాలోని పాత్రలో ఆయన ఇమిడిపోయిన తీరు అద్భుతం. ఇక ఈ చిత్రంలోని దేవా పాత్రలో ధనుష్ సూపర్‌గా నటించారు. ధనుష్ బెగ్గర్‌గా కనిపిస్తారు. దేవా పాత్రలో ధనుష్గారిని తప్ప ఆడియన్స్ మరొకరిని ఊహించలేరు. రష్మికా మందన్నా తన యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేస్తుంది. బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్‌కు తెలుగు రాకపోయినా తెలుగు డైలాగ్స్‌ను బట్టీ పట్టి మరీ చక్కగా చెప్పారు. నా గత చిత్రాలతో పోలిస్తే నా మార్క్ ‘కుబేర’ సినిమాలో పదింతలు ఎక్కువగా ఉంటుంది. ⇢ నా పాతికేళ్ల జర్నీని చూసుకున్నప్పుడు ఎమోషనల్‌గా అనిపిస్తుంది. నా స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకుని సినిమాలు తీసిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. కానీ ఎక్కడా ఎదురు దెబ్బలు తగలలేదు. అది నా అదృష్టం. సినిమాల లాభాల విషయంలో కూడా నాకింత పర్సంటేజ్ కావాలని ఎప్పుడూ అడగను.. పారితోషికం తీసుకుంటానంతే. దీని వల్ల చాలా నష్టపోయాను. అయినా బాధలేదు. ప్రేక్షకుల ప్రేమే నాకు ముఖ్యం. నా కథలన్నీ నా జీవితంలో నేను చూసిన, నాకు తారసపడిన వ్యక్తుల జీవితాల్లోనివారివే. ఇక ‘లీడర్’కు సీక్వెల్ ఆలోచన ఉంది. కానీ ఇప్పటి రాజకీయ వ్యవస్థలో, ప్రజల్లో మార్పులొచ్చాయి. ఏదైనా స్ట్రాంగ్ పాయింట్‌ను పట్టుకోవాలి. ఇక నానీతో చేసే సినిమాకు వర్క్ జరగాల్సి ఉంది. -
నా కళ్లలో నీళ్లు తిరిగాయి.. అందుకే ఆమె పెళ్లికి సాయం చేశా: శేఖర్ కమ్ముల
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల( Sekhar Kammula) తెరకెక్కించిన చిత్రం 'కుబేర'. జూన్ 20న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆయన పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో సుమారు నాలుగేళ్ల క్రితం శేఖర్ కమ్ముల చేసిన సాయం గురించి యాంకర్ ప్రశ్నించారు. ఒక రైతు కుటుంబానికి రూ. 2 లక్షలు సాయం ఎందుకు శారో చెప్పాలని కోరారు. దీంతో శేఖర్ కమ్ముల పలు విషయాలను పంచుకున్నారు.కూతురు పెళ్లి చేద్దామని ఓ రైతు దాచుకున్న డబ్బు అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. దీంతో ఆయన తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డాడని వార్త తెలిసింది. అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. కూతురి పెళ్లి కోసం కష్టపడి దాచుకున్న డబ్బు అలా కాలిపోవడంతో నేను బాగా ఎమోషనల్ అయ్యాను. బాగా డబ్బున్నోడి నోట్ల కట్టలు మంటల్లో కాలిపోతేనే బాధేస్తుంది..అలాంటిది పేదోడి డబ్బు, అది కూడా ఎంతో కష్టపడి సంపాధించింటాడు. దీంతో ఆ రైతు బాధేంటో నాకు అర్థం అయింది. అందుకే సాయం చేశాను.' అని ఆయన చెప్పారు. కోవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు తన వంతు సాయం చేశారు. ఆయన ప్రొడక్షన్ హౌస్ అమిగోస్ నుంచి పలు సేవలు అందించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన వారికి ప్రతిరోజు ఆయన భోజనం అందించారు. అయితే, ఇవన్నీ ఆయన ఎక్కడా కూడా చెప్పుకోలేదు.2021 సమయంలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రికి చెందిన కప్పల లక్ష్మయ్య అనే రైతు పూరిల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో తన కూతురు పెళ్లి కోసం బీరువాలో దాచుకున్న రూ. లక్షలు మంటల్లో కాలిపోయాయి. ఆ వార్త తెలుసుకున్న శేఖర్ కమ్ముల.. ఆ రైతు కుటుంబానికి రూ. 2లక్షలు నేరుగా రైతు బ్యాంక్ ఖాతాకు పంపించారు. అదే సమయంలో రైతు కుటుంబంతో మాట్లాడిన ఆయన అవసరమైతే మరింత సాయం చేస్తానని.. ముందు కూతురు పెళ్లి మంచిగా జరిపించాలని కోరారు. 🚨కూతురు పెళ్లి కోసం దాచుకున్న రెండు లక్షల రూపాయలు కాలిపోయాయని తెలియగానే,నా కళ్లలో నీళ్లు తిరిగాయి అందుకే 2 లక్షలు పంపించాను …! – #SekharKammula | #Kuberaa pic.twitter.com/0pNLtXRq7X— Bharat Media (@bharatmediahub) June 18, 2025 -
కుబేర మూవీ.. ఫుల్ ఎమోషనల్ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోలుగా నటించిన చిత్రం 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక రిలీజ్ ఒక్క రోజే సమయం ఉండడంతో మేకర్స్ కుబేర చిత్రంలో నాలుగో పాటను విడుదల చేశారు. నా కొడుకా అంటూ సాంగే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించగా.. నందకిశోర్ లిరిక్స్ అందించగా.. సిందూరి విశాల్ ఆలపించారు. ఈ ఎమోషనల్ సాంగ్ విడుదలైన కొద్ది సేపటికే అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది.కాగా.. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ నటించగా.. బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు.The soul touching #Kuberaa4thSingle is out now ♥️A Rockstar @ThisIsDSP musical 🎶#NaaKoduka - https://t.co/EF9sJ4w7xW#Kuberaa in cinemas June 20, 2025.#SekharKammulasKuberaa #Kuberaa #KuberaaBookings #KuberaaOn20thJune pic.twitter.com/B3Zqmyr86y— Kuberaa Movie (@KuberaaTheMovie) June 18, 2025 -
శేఖర్ కమ్ముల కుబేర.. భారీగా కట్స్ చెప్పిన సెన్సార్ బోర్డ్!
నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కుబేర’. రష్మికా మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. దాదాపు రూ.10 వేల కోట్ల స్కామ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కించారు. సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.అయితే ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న కుబేర చిత్రానికి భారీగానే కట్స్ పడినట్లు తెలుస్తోంది. తెలుగులో 181 నిమిషాలు ఉండగా.. తమిళంలో 182 నిమిషాలు రన్టైమ్తో సీబీఎఫ్సీ అనుమతిచ్చింది. అయితే కుబేర సినిమాలోని 19 సన్నివేశాలకు కట్ చెప్పింది. దీంతో రన్‌టైమ్ దాదాపు 14 నిమిషాలు తగ్గిపోయింది. సెన్సార్ బోర్డ్ ట్రిమ్ చేసిన సీన్స్‌లో ధనుశ్, రష్మిక మందన్న, నాగార్జున కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తం 19 సన్నివేశాలు కట్ చేసిన సెన్సార్ బోర్డ్ యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అంటే 13 ఏళ్లలోపు పిల్లలు ఈ మూవీ చూసేందుకు అనుమతి లేదు. అయితే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇటీవలే కుబేర ట్రైలర్ విడుదల కాగా సినిమాపై అంచనాలు పెంచేసింది. -
వాట్సాప్ వాడని డైరెక్టర్.. రాజమౌళి ప్రశంసలు!
టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రస్తుతం కుబేరా మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కోలీవుడ్ స్టార్ ధనుశ్, అక్కినేని నాగార్జున కీలక పాత్రల్లో తెరెకెక్కించిన ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర కమ్ములపై ప్రశంసలు కురిపించారు.తాను నమ్మే సిద్ధాంతాలకు.. చేసే సినిమాలకు ఎలాంటి సంబంధం ఉండదని రాజమౌళి అన్నారు. కానీ శేఖర్ కమ్ముల తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారని తెలిపారు. శేఖర్ చాలా సాప్ట్‌గా ఉంటారని.. తన సిద్ధాంతాలకు ఏది అడ్డొచ్చినా కొంచెం కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వరని వెల్లడించారు. తాను నమ్మినా సిద్ధాంతాలపైనే సినిమాలు తీస్తారని... అందుకే ఆయనంటే ఎంతో గౌరవమని కొనియాడారు. మీరు వాట్సాప్ వాడుతారా అని శేఖర్ కమ్ములను రాజమౌళి అడగ్గా.. తాను ఉపయోగించనని ఆయన సమాధానమిస్తారు.ఈ కార్యక్రమంలో కుబేర ట్రైలర్‌ను కూడా రాజమౌళి విడుదల చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మించారు. -
‘కుబేర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'కుబేర' ట్రైలర్ రిలీజ్.. మీరు చూశారా?
నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కుబేర’. రష్మికా మందన్నా హీరోయిన్. ఇందులో ధనుష్ బిచ్చగాడిగా నటించడం విశేషం. ధనిక-పేద తేడా, రూ.10 వేల కోట్ల స్కామ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా ట్రైలర్‌ని తాజాగా లాంచ్ చేశారు. సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.ఆదివారం జరిగిన ‘కుబేర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు రాజమౌళి ఈ చిత్రం ట్రైలర్, బిగ్ టికెట్స్‌ను లాంచ్ చేశారు. ఈ వేదికపై ఇంకా రాజమౌళి మాట్లాడుతూ – ‘‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చూసి ఆశ్చర్యపోయాను. ఈ సినిమాలో రిచ్, పూర్ ప్రపంచాలను ఎలా కలిపారు? నాగార్జున, ధనుష్గార్లను ఏ విధంగా తీసుకొచ్చారు? వీరి మధ్య డ్రామా ఎలా ఉండబోతుందన్న నాకు ఈ సినిమా ట్రైలర్ ఇంకా ఆసక్తిని పెంచింది’’ అని అన్నారు. -
పులిలా నడవమని లోకేశ్ చెప్పేవాడు.. కమ్ముల మాత్రం: నాగార్జున
నాగార్జున హీరోగా కొత్త సినిమాలు చేయక చాన్నాళ్లయింది. అలా అని ఖాళీగా ఏం లేడు. కూలీ, కుబేర చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నాడు. ఇదివరకే వీటికి సంబంధించిన లుక్స్, గ్లింప్స్ వీడియోలు రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు మూవీస్‌తో నాగ్ సరికొత్తగా కనిపించబోతున్నాడనే హింట్ అయితే వచ్చేసింది. త్వరలో ఈ రెండు మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ క్రమంలోనే నాగ్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు. ఓ ఇంటర్వ్యూల మాట్లాడుతూ ఈ రెండు చిత్రాలు, దర్శకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'కూలీ' సినిమాలో రజినీకాంత్ హీరో. లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. కొన్నిరోజుల క్రితం చిన్న వీడియో లాంటిది రిలీజ్ చేశాడు. ఇందులో నాగార్జునని వెనక వైపు నుంచి చూపించారు. అలా కొన్ని సెకన్లపాటు కనిపించిన ఈ వీడియో స్టైలిష్‌గా ఉండేసరికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీలో నాగ్.. సైమన్ అనే ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించిన నాగ్.. 'లోకేశ్ ఎప్పుడు పులిలా నడవమని అనేవాడు. మిమ్మల్ని చూస్తే ప్రేక్షకులు భయపడాలి సర్ అనేవాడు' అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్ సినిమా)అదే టైంలో 'కుబేర' తీసిన దర్శకుడు శేఖర్ కమ్ముల మాత్రం 'మీరు హీరోలా నడుస్తున్నారు. కొంచెం తగ్గించండి' అని చెప్పేవాడు. వీళ్లిద్దరికీ అదే తేడా. కూలీ విషయానికొస్తే.. 'లోకేశ్ నన్ను చాలా అద్భుతంగా చూపించాడు. నన్ను నేను అలానే చూడాలనుకున్నాను. సినిమా చూస్తున్నంతసేపు విజిల్స్ వేస్తూనే ఉంటారు. గడిచిన నాలుగు దశాబ్దాలుగా ఎన్నో సక్సెస్‌లు చూశాను. మూవీ కలెక్షన్స్ నాకు ముఖ్యం కాదు' అని నాగార్జున చెప్పుకొచ్చాడు.రజినీకాంత్-లోకేశ్ కనగరాజ్ 'కూలీ' మూవీ.. ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. తెలుగులోనూ ఈ చిత్రానికి భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు శేఖర్ కమ్ముల తీసిన 'కుబేర' సినిమా.. ఈనెల 20న అంటే వచ్చే శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఇందులో ధనుష్, రష్మిక హీరోహీరోయిన్లు కాగా.. నాగ్ కీలక పాత్ర పోషించాడు. ఈ రెండు మూవీస్ హిట్ అయితే గనక నాగార్జునని ఇలా మరిన్ని సినిమాల్లో డిఫరెంట్ రోల్స్‌లో చూడొచ్చేమో?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) #Nagarjuna: Coolie Vs Kubera #Coolie: Lokesh is larger than life Filmmaker🔥. Loki says Walk in like a Tiger, people should scared with ur Look🐯👿#Kubera: Sekhar is very realistic filmmaker🫶. Director says you are waking like a Hero bring it down😀 pic.twitter.com/lVkVCkYE1r— AmuthaBharathi (@CinemaWithAB) June 13, 2025 -
విమాన ప్రమాదం.. 'కుబేర' ఈవెంట్ వాయిదా
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం వల్ల 'కుబేర' టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో నేడు (జూన్ 13)న జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దేశం మొత్తం దుఃఖంలో ఉండగా తామా కుబేర వేడుకను చేయలేమని వారు తెలిపారు. అభిమానులు దీనిని గ్రహిస్తారని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. ధనుష్- నాగార్జున-రష్మిక కలిసి నటించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో ఈ నెల 20న విడుదల కానుంది. శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కుప్పకూలింది. మొత్తం 265 మంది మృతి చెందారు. అందులోని 229 మంది ప్రయాణికులు ఉండగా 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానం వైద్యకళాశాల మీద పడటంతో 24 మంది విద్యార్థులు మరణించిన వారిలో ఉన్నారు. ఈ ఘటనతో దేశం మొత్తం తీవ్రమైన దుఃఖంలో ఉంది. దీంతో కుబేర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఈ ఆదివారం ఈ వేడుక జరగవచ్చని సమాచారం. -
నాగార్జున తప్ప మరొకరిని ఊహించుకోలేం : కుబేరా నిర్మాతలు
దర్శకుడు శేఖర్ కుబేరా కథ చెప్పినప్పుడే ఇందులో హీరోగా ధనుష్ అయితే బాగుంటుందని చెప్పారు. ధనుష్ కూడా కథ విని 20 నిమిషాల్లోనే సైన్ చేశాడు. ఇక ఇందులో మరో కీలక పాత్రని నాగార్జున చేశాడు. శేఖర్ మొదటి నుంచి ఈ పాత్రకు నాగార్జున తప్పితే మరొకరు చేయలేరని చెప్పాడు. నాగ్‌కి కూడా ఈ కథ బాగా నచ్చింది. దీంతో వెంటనే ఓకే చేశాడు. ఆ పాత్రలో నాగార్జునని తప్ప మరొకరిని ఊహించేకోలేనంత గొప్పగా పెర్ఫార్మ్ చేశాడు. సినిమా ప్రతి ఒక్కరికి కచ్చితంగా నచ్చుతుంది’ అన్నారు నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు . శేకర్ కమ్ముల దర్శకత్వంలో సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా మూవీ కుబేరా. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 20న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు మీడియాతో ముచ్చటించారు. ఈ విశేషాలు..- శేఖర్ కమ్ముల గారు 'లవ్ స్టోరీ' తర్వాత కుబేరా కథ మాకు చెప్పడం జరిగింది. ఈ కథకు ధనుష్ గారు అయితే బాగుంటుందని ఆయన భావించారు. ఆయనకి ఈ కథని చెప్పారు. ధనుష్ గారు కథ 20 నిమిషాలు విని వెంటనే సైన్ చేశారు. తర్వాత ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాము.- ధనుష్ గారు పాన్ ఇండియా స్టార్. ఆయన హిందీలో కూడా సినిమాలు తీశారు. నాగార్జున గారు కూడా ఎప్పటినుంచో హిందీ సినిమాల్లో ఉన్నారు. రష్మిక గారు గురించి అందరికీ తెలుసు. ఇండియాలో ఆమె పాపులర్ యాక్ట్రెస్. కథకి అనుగుణంగానే ఇంత బిగ్ స్టార్ కాస్ట్ తో ఈ సినిమాని చేయడం జరిగింది. ధనుష్ గారు, నాగార్జున గారు. రష్మిక గారు అందరూ అద్భుతంగా సపోర్ట్ చేశారు.- కుబేర తెలుగు, తమిళ్ స్ట్రయిట్ మూవీ. హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నామ. ఫస్ట్ కాఫీ ఆల్రెడీ రెడీ అయింది. సినిమా అద్భుతంగా వచ్చింది.- శేఖర్ కమ్ముల గారు మాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఆయన లీడర్ సినిమా ఎప్పుడు చూసినా సరే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఈసారి మరింత బిగ్గర్ స్టార్ కాస్ట్ తో తీశారు. కచ్చితంగా ఆడియన్స్ కి చాలా న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది.- శేఖర్ కమ్ముల గారు స్టార్స్ ని క్యారెక్టర్స్ గానే చూస్తూ సినిమా తీసే ఫిలిం మేకర్. ఈ సినిమాలో కూడా క్యారెక్టర్స్ కనిపిస్తాయి.- శేఖర్ గారు మంచి ఎమోషన్స్ తో ఆడియన్స్ ని టచ్ చేస్తూ ఫీల్ ఉండే సినిమాలను తీస్తారు. ఈ సినిమా కూడా అలాంటిదే. ఇందులో ఉండే ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి.- రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడం ఎప్పుడూ కూడా సవాల్ తో కూడుకున్నదే. ఈ సినిమా కోసం అన్ని రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశాం. రియల్ స్లమ్స్, గార్బేజ్, డంపింగ్ యార్డ్స్ లో తీసాము. బొంబాయిలో సినిమాని సూట్ చేయడం మరో ఛాలెంజ్. రియల్ వీధుల్లో సినిమాని సూట్ చేయడం జరిగింది. అది రియల్ ఛాలెంజ్.మేము బడ్జెట్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కంటెంట్ కు కావలసిన బడ్జెట్ తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశాం. సినిమాని చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాము. దాదాపు 1600 స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ కాబోతోంది. చాలా అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం ఉంది. - దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా కోసం చాలా డిఫరెంట్ సాంగ్స్ ఇచ్చారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ధనుష్ గారు రెండు పాటలు పాడారు. ఇది డైరెక్టర్ గారు, దేవిశ్రీ గారి కలెక్టివ్ డెసిషన్.- శేఖర్ కమ్ముల గారితో మరో సినిమా చేయనున్నాం. అయితే ఇంకా హీరో ఎవరనేది ఫైనల్ కాలేదు. -
Kuberaa: ‘పిపీ డుమ్ డుమ్... ’ అంటున్న రష్మిక
ధనుష్-రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటించారు. శేఖర్ కమ్ముల గిగోస్ క్రియేషన్స్‌తో కలిసి ఎస్వీసీ ఎల్‌ఎల్‌పీపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ‘పిపీ డుమ్ డుమ్’ అనే పాటను విడుదల చేశారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు చైతన్య పింగలి లిరిక్స్ అందించగా, ఇంద్రావతి చౌహాన్ అద్భుతంగా ఆలపించారు. -
ముంబయిలో ‘కుబేర’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
మై డియర్ శేఖర్.. నీలాంటి అభిమాని ఉండడం ఆనందకరం: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీకి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల వీరాభిమాని. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని సినిమాల్లోకి వచ్చాడట. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరంజీవిని కలిసి.. ఆయన ఈ విషయాన్ని చెప్పారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. శేఖర్ కమ్ములపై ప్రశంసలు కురిపించారు.‘మై డియర్ శేఖర్, మీలాంటి ఒక అభిమాని ఉండటం నాకూ అంతే ఆనందకరం. మీ ప్రస్థానానికి స్ఫూర్తి నిచ్చానని తెలిసి మరింత సంతోషించాను. మీ 25 ఏళ్ల జర్నీలో ఆ విధంగా నేనూ ఒక భాగమైనందుకు గర్వంగా ఉంది. సున్నితమైన వినోదంతో పాటు, ఒక సోషల్ కామెంట్ ని జత చేసి ఆలోచనాత్మకంగా తీసే మీ సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం. ఫిలిం మేకింగ్ లో మీ కంటూ ఒక ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకున్న మీరు ఇలాగే మరో 25 ఏళ్ళు, మరెన్నో జనరంజకమైన సినిమాలు 'వ్రాస్తూ’, తీస్తూ, మరెన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశాడు.'డాలర్ డ్రీమ్స్' సినిమాతో దర్శకుడిగా మారిన శేఖర్ కమ్ములు.. ఆనంద్ మూవీతో సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. గోదావరి, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ లాంటి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన తొలి పాన్ ఇండియా మూవీ కుబేర ఈ నెల 20న రిలీజ్ కాబోతుంది. ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నాగార్జున, రష్మిక కీలక పాత్రలు పోషించారు. మై డియర్ శేఖర్, @sekharkammula మీలాంటి ఒక అభిమాని వుండటం నాకూ అంతే ఆనందకరం. మీ ప్రస్థానానికి స్ఫూర్తి నిచ్చానని తెలిసి మరింత సంతోషించాను. మీ 25 years జర్నీలో ఆ విధంగా నేనూ ఒక భాగమైనందుకు గర్వంగా వుంది.సున్నితమైన వినోదంతో పాటు, ఒక సోషల్ కామెంట్ ని జత చేసి ఆలోచనాత్మకంగా తీసే మీ… pic.twitter.com/8MVKQdiiJ3— Chiranjeevi Konidela (@KChiruTweets) June 3, 2025 -
అందరిని మెప్పించేలా 'కుబేర' కొత్త సాంగ్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోలుగా నటించిన చిత్రం ‘కుబేర’. తాజాగా ఈ మూవీ నుంచి రెండో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 20న కుబేర చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు. తాజాగా విడుదలైన 'అనగనగా కథ' పాటను చంద్రబోస్ రచించారు. హైడ్ కార్తీ, కరీముల్లా ఆలపించారు. -
ఈ సినిమాతో మరో నేషనల్ అవార్డ్: శేఖర్ కమ్ముల కామెంట్స్
నాగార్జున, ధనుశ్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం కుబేర. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో సందడి చేయనుంది.ఇకపోతే ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీ అయిపోయారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆసక్తికర కామెంట్స్ చేశారు. కోలీవుడ్ హీరో ధనుశ్‌పై ప్రశంసలు కురిపించారు.శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. టఈ సినిమాతో హీరో ధనుష్ మరో జాతీయ అవార్డ్ అందుకుంటారు. ఈ సినిమా చాలా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రంతో మరో జాతీయ అవార్డు గెలుచుకుంటాడని భావిస్తున్నా. అతను తప్ప మరెవరూ ఈ పాత్రలో నటించలేరు" అని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. నాగార్జున మాట్లాడుతూ.. "ధనుష్ ఒక ఇంటర్నేషనల్ యాక్టర్. అతనిలో గొప్ప టాలెంట్ ఉంది. ధనుష్, శేఖర్ కమ్ముల.. మీరిద్దరూ నన్ను మళ్లీ ఎప్పుడు డైరెక్ట్ చేస్తారు" అంటూ ప్రశ్నించారు. -
చిరంజీవితో శేఖర్ కమ్ముల.. ఇది చాలా స్పెషల్
తెలుగు దర్శకుల్లో శేఖర్ కమ్ముల కాస్త డిఫరెంట్. చాలా సాధారణంగా అనిపించే కథలతో సినిమాలు తీసి హిట్స్ కొడుతుంటారు. ప్రస్తుతం 'కుబేర' అనే చిత్రాన్ని రిలీజ్‌కి సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఓ విషయమై కలిశారు. అందుకు సంబంధించిన ఫొటోలని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: హైదరాబాద్ పబ్‌లో తెలుగు నటి కల్పిక రచ్చ రచ్చ)'టీనేజీలో ఒక్కసారి చిరంజీవి గారిని దగ్గరగా చూశాను. 'ఈయనతో సినిమా తీయాలి' అనే ఫీలింగ్ అంతే. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు. 'లెట్స్ సెలబ్రేట్' అని మా టీమ్ అంటే నాకు గుర్తొచ్చింది చిరంజీవిగారే. కొన్ని జనరేషన్స్ని ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీ ఆయన. 'ఛేజ్ యువర్ డ్రీమ్స్, సక్సెస్ మనల్ని ఫాలో అయి తీరుతుంది' అన్న నమ్మకం ఇచ్చింది ఆయనే''కాబట్టి నా 25 ఏళ్ల జర్నీ సెలబ్రేషన్స్ అంటే ఆయన దగ్గరే చేసుకోవాలి అనిపించింది. థ్యాంక్యూ సరే ఈ మూమెంట్స్‌లోనే కాదు, నా టీనేజ్ నుండి మీరు నా ముందు ఇలాగే ఉన్నారు' అని శేఖర్ కమ్ముల తన ఆనందాన్ని అక్షరాల రూపంలో రాసుకొచ్చారు. 'డాలర్ డ్రీమ్స్' సినిమాతో దర్శకుడిగా మారిన ఈయన.. ఆనంద్, గోదావరి, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ.. ఇలా చాలా మంచి సినిమాల్ని అందించారు. జూన్ 20న 'కుబేర'తో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు) View this post on Instagram A post shared by Sekhar Kammula (@kammula.sekhar) -
‘పేషన్’ విజయం సాధించాలి: శేఖర్ కమ్ముల
యంగ్ టాలెంట్ సుధీస్, అంకిత హీరో హీరోయిన్లుగా అరవింద్ జాషువా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీ ‘పేషన్’. REDANT క్రియేషన్ బ్యానర్‌పై నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.., అరవింద్ జాషువా రాసిన ‘పేషన్’ నవల చదివాను, అది చాలా అథెంటిక్‌గా ఉంది. ఈ చిత్రం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. అరవింద్‌లో స్టోరీ టెల్లింగ్, రైటింగ్ స్కిల్స్ అద్భుతం. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.అరవింద్ జాషువా మాట్లాడుతూ, ఫ్యాషన్ కాలేజీలో సామాన్యుడి అనుభవాల నుంచి స్ఫూర్తి పొందిన కథ ఇది. శేఖర్ కమ్ముల నా గురువు, ఆయన స్ఫూర్తితోనే ఈ సినిమా తీశాను. నిర్మాతలు, సాంకేతిక బృందం అద్భుతంగా సహకరించారు. ఈ జనరేషన్‌కు కనెక్ట్ అయ్యే కథతో సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది అన్నారు.ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, శేఖర్ కమ్ముల సపోర్ట్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఛాయా పబ్లికేషన్స్ ప్రచురించిన నవల స్ఫూర్తితో ఈ సినిమా రూపొందిందని చెప్పారు. సినిమా గొప్ప విజయం సాధించాలని టీమ్ ఆకాంక్షిస్తోంది. -
హైదరాబాద్‌లో 'రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్'.. ఎప్పుడంటే?
బుక్ మై షో ప్రారంభించిన రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్ (Red Lorry Film Festival ) సౌత్‌కు వచ్చేస్తోంది. మార్చి 21 నుంచి 23వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఈ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమంలో సినీప్రముఖులు తమ అనుభవాలను, సినిమా వెనక ఉండే కష్టాలను, సాహసాలను పంచుకోనున్నారు. నిర్మాత రమేశ్ ప్రసాద్, సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్, దర్శకులు రామ్ గోపాల్ వర్మ, శిఖరన్ బీచరాజు, శేఖర్ కమ్ముల, నటులు శివ బాలాజీ, నవదీప్, సినిమాటోగ్రఫీ వెంకట్ సి.దిలీప్, దర్శకరచయితలు వీఎన్ ఆదిత్య, జి. నీలకంఠ రెడ్డి, రచయిత అంజున్ రాజాబలి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సినీ ఇండస్ట్రీలో గమనించిన అంశాలను, వైవిధ్యాన్ని, కావాల్సిన మార్పుల గరించి వీరు మాట్లాడనున్నారు.అంతేకాకుండా ఈ కార్యక్రమంలో టాలీవుడ్లో క్లాసిక్స్‌గా నిలిచిన మాయాబాజర్, పుష్పక విమానం, మిస్సమ్మ, ఆదిత్య 369, హ్యాపీ డేస్, నేనే రాజు నేనేమంత్రి, చందమామ, మన్మథుడు వంటి చిత్రాలను మరోసారి బిగ్స్క్రీన్పై చూసే అవకాశం కల్పించనున్నారు.చదవండి: అంబానీ ఎవరో మాకు తెలీదు.. అయినా పెళ్లికి వచ్చాం: కిమ్ కర్దాషియన్ -
చిరుతో పోటీకి ధనుష్..! కుబేర రిలీజ్ డేట్ లాక్
-
ఫిదా 2 లో నాని..!
-
'కుబేర' మ్యూజికల్ గ్లింప్స్ విడుదల
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదలైంది. రష్మిక మందన్న కీలక పాత్రలో కనిపించనుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు.తాజాగా విడుదలైన గ్లింప్స్ ఎలాంటి డైలాగ్స్ అయితే లేవు. కానీ, ధనుష్ పాత్రను మాత్రం బిచ్చగాడిగానే కాకుండా డబ్బున్న వ్యక్తిలా చూపించారు. 52 సెకండ్ల పాటు ఉన్న ఈ గ్లింప్స్ మొత్తం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనే నడుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ప్రధాన హైలెట్‌గా ఉంది. పాన్ ఇండియా రేంజ్లో వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా విడుదల కానుంది. -
Anand Movie: చిరంజీవి సినిమాతో పోటీ.. ఏడు నంది అవార్డులు సొంతం
ఓ మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ అంటే ఏంటో తెలియాలంటే 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఆనంద్’ను చూడాలి. ఇది ఓ మంచి కాఫీ లాంటి మూవీ. ఫీల్ గుడ్ మూవీస్ తీసే దర్శకుడిగా పేరున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన రెండో సినిమా. ఆత్మాభిమానం, ఇండిపెండెంట్ భావాలు కొంచెం ఎక్కువ గల ఓ యువతి తన లైఫ్‌లో ఎదుర్కొనే సవాళ్లు, లవ్, ఫ్రెండ్షిప్ వంటి వాటిని తెరకెక్కించిన విధానం కట్టిపడేస్తుంది. ముఖ్యంగా యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయిన సినిమా. వారి ఆలోచనలు, డ్రీమ్స్, ప్రాబ్లమ్స్ అన్నీ ఇందులో ప్రతిబింబిస్తాయి. హీరోగా రాజా, హీరోయిన్గా కమలినీ ముఖర్జీ అద్భుతంగా నటించారు.పరిణతి గల ప్రేమఈ మూవీలో లవ్ స్టోరీ చాలా నేచురల్‌గా, హానెస్టీగా ఉంటుంది. అన్ని సినిమాల్లోలా కాకుండా ఇద్దరు మెచ్యూర్డ్ యూత్ మధ్య లవ్‌ను అద్భుతంగా చూపించారు డైరెక్టర్. కేవలం కోటిన్నర బడ్జెట్‌తో ఎటువంటి భారీ కాస్టింగ్ లేకుండా సాదా సీదా స్టోరీతో రిలీజై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. శేఖర్ కమ్ముల తొలుత 2000లో ‘డాలర్ డ్రీమ్స్’ తీశారు. ఇది విమర్శకుల మెప్పు రూపొందింది. సెకండ్ మూవీ ‘ఆనంద్’ కోసం చాలా మంది నిర్మాతల్ని కలవగా ఎవరూ ఇంట్రస్ట్ చూపలేదు. చేసేది లేక నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ సాయం కోరగా ఆ సంస్థ కొంత ఇన్వెస్ట్ చేయడానికి అంగీకరించింది. తెలుగులో ఓ కమర్షియల్ మూవీకి ఇన్వెస్ట్ చేయడం ‘ఎన్ఎఫ్డీసీ’కి ఇదే తొలిసారి.పద్మారావ్ నగర్లోనే...ఆనంద్ స్టోరీని పవన్ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసినా ఆయన్ను ఎప్పుడూ సంప్రదించలేదని శేఖర్ కమ్ముల ఓ సందర్భంలో చెప్పారు. హీరోయిన్ గా తొలుత ఆసిన్, సదాను అనుకున్నారు. చివరికి రాజా, కమలినీ ముఖర్జీతో పూర్తి చేసేశారు. హైదరాబాదులో తానుండే పద్మారావ్ నగర్లోనే ఓ ఇంటి స్థలంలో దాదాపు సినిమా మొత్తం పూర్తి చేసేశారు డైరెక్టర్. కమలి పాత్రకి సింగర్ సునీతతో డబ్బింగ్ చెప్పించగా ఎంత సహజంగా వచ్చిందంటే అందుకు సునీతని కూడా అవార్డు వరించింది. శేఖర్ కమ్ముల హోవర్డ్ యూనివర్శిటీలో తన మాస్టర్స్ డిగ్రీ థీసిస్‌గా ఈ సినిమా స్క్రీన్ ప్లేనే సబ్మిట్ చేసారనే విషయం చాలా మందికి తెలియదు. ‘ఆనంద్’ సినిమాను తమిళంలో ‘నినైత్తాలే’ పేరుతో రీమేక్ చేశారు.ఫార్ములా సినిమాలకు భిన్నంగా...ఆనంద్ మూవీ, చిరంజీవి భారీ సినిమా ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ ఒకే రోజు రిలీజయ్యాయి. అయినా... ఆ పోటీకి నిలబడి ఇంచుమించు అంతే పేరు తెచ్చుకుంది ‘ఆనంద్’. ఫార్ములా సినిమాలకు భిన్నంగా తీసిన ఆనంద్ ఏడు నంది అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఇప్పటికీ చాలా మంది ఇష్టంగా చూస్తారు. మీరు ఇప్పటికీ చూడక΄ోతే కచ్చితంగా ఓ సారి చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ -
నాగార్జున 'కుబేర'.. ఫ్యాన్స్‌కు దీపావళీ అప్డేట్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ ధనుశ్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం కుబేర. ఈ సినిమాను శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. దీపావళి సందర్భంగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈనెల 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ విడుదల చేస్తూ అనౌన్స్మెంట్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో ఇదివరకెన్నడూ చేయని ఓ సరికొత్తపాత్రలో ధనుష్ కనిపించనున్నరు. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని ఇప్పటికే చిత్రయూనిట్ పేర్కొంది. బాలీవుడ్ నటుడు జిమ్‌సర్భ్ కీలకపాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. Wishing you a sparkling Diwali from #SekharKammulasKubera! 💥The wait is almost over!!Catch the explosive #KuberaTeaser on Kartik Purnima, November 15th! 💥🔥@dhanushkraja KING @iamnagarjuna @iamRashmika @sekharkammula @jimSarbh @Daliptahil @ThisIsDSP @AsianSuniel @SVCLLP… pic.twitter.com/9vAsnAv4tu— Annapurna Studios (@AnnapurnaStdios) November 1, 2024 -
అర్థాలే వేరులే!
ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ధనుష్, నాగార్జునల పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో ధనుష్ చూపులు దీనంగా ఉన్నట్లు, నాగార్జున తీక్షణంగా చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఇద్దరు చూపులకు అర్థాలేంటో సినిమా చూస్తేనే తెలుస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సమర్పణ: సోనాలీ నారంగ్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి. -
కాంబినేషన్ కుదిరేనా?
హీరో నాని, దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ కొత్త కథను సిద్ధం చేశారట. ఈ కథలోని హీరో పాత్రకు నాని అయితే సరిపోతారని ఆయన భావిస్తున్నారట. దీంతో ఈ దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయని, అన్నీ కుదిరితే వీరి కాంబినేషన్లో ఓ సినిమా ప్రకటన అధికారికంగా రావొచ్చనే టాక్ వినిపిస్తోంది.కాగా ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమాతో బిజీగా ఉన్నారు నాని. ఈ చిత్రం ఆగస్టు 29న విడుదల కానుంది. మరోవైపు నాగార్జున, ధనుష్ హీరోలుగా నటిస్తున్న ‘కుబేర’ సినిమాతో శేఖర్ కమ్ముల బిజీగా ఉన్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఇలా నాని, శేఖర్ల ప్రస్తుత కమిట్మెంట్స్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత వీరి కాంబినేషన్లోని సినిమా గురించి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి.. ఈ కాంబి నేషన్ కుదురుతుందా? అంటే వేచి చూడాల్సిందే. -
'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'కుబేర'. ఈ సినిమా నుంచి ఇప్పటికే ధనుష్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తాజాగా కింగ్ నాగార్జున లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున కీలకపాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.కుబేర సినిమాలో ధనుష్ కొంత సమయం పాటు రిచ్‌గా కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. కానీ, ధనుష్ ఫస్ట్ లుక్‌లో మాత్రం బిచ్చగాడి పాత్రలో కనిపించారు. నాగార్జున మాత్రం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా కోసం నాగార్జున అభిమానులతో పాటు ధనుష్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేస్తామని డైరెక్టర్ శేఖర్ కమ్ముల చెప్పారు. -
పాన్ ఇండియా సినిమా.. ఆసక్తిగా 'కుబేర' ఫస్ట్ లుక్ పోస్టర్
ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేశారు. దీన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కుబేర అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ఈమేరకు తాజాగా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ధనుష్ టైటిల్‌కు భిన్నమైన లుక్‌లో చిరిగిన బట్టలు, మాసిన జుట్టు, గుబురు గడ్డంతో ఆసక్తికరంగా కనిపించారు. అదే పోస్టర్లో ధనుష్ వెనక అన్నపూర్ణ దేవి నుంచి శివుడు భిక్ష తీసుకుంటున్నట్లుగా ఉన్న పెయింటింగ్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. కాగా ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే తిరుపతి పరిసరప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణను, గోవాలో మరో షెడ్యూల్‌ను పూర్తి చేశారు మేకర్స్. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలో హైదరాబాద్‌లోప్రారంభం కానుందని తెలిసింది. తాజాగా విడుదలైన పోస్టర్‌ను బట్టి ఈ సినిమాలో ధనుష్, నాగార్జునల పాత్రలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
‘హ్యాపీడేస్’లాగే ‘పాషన్’ ఉంటుంది: శేఖర్ కమ్ముల
సుధీష్ వెంకట్, అంకిత సాహ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "పాషన్". ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంగా సాగే ప్రేమ కథా చిత్రమిది. ఈ సినిమాను తోలు బొమ్మలాట ఫిల్మ్జ్ బ్యానర్ పై డాక్టర్ అరుణ్ మొండితోక, నరసింహ, ఏ పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. "పాషన్" చిత్రంతో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. మంగళవారం హైదరాబాద్ లో "పాషన్" సినిమా లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మొండితోక కెమెరా స్విచ్ఛాన్ చేయగా...దర్శకుడు వేణు ఊడుగుల ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నిర్మాత పద్మనాభ రెడ్డి స్క్రిప్ట్ ను దర్శకుడు అరవింద్ జోషువాకు అందజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ - ఈ స్టోరీ రాయడం, దాన్ని నవలగా ప్రచురించడం, సినిమా తీసే ప్రయత్నం...నాకు అన్నీ తెలియజేస్తూ ఉన్నాడు అరవింద్. ఇది చాలా మంచి కథ. నేను అంతా కొత్తవాళ్ళతో తీసిన హ్యాపీడేస్ లా పాషన్ కూడా యూత్ ని ఆకట్టుకుని, ఇన్ స్పైర్ చేసే మంచి సినిమా అవుతుందని నమ్ముతున్నాను. అన్నారు నిర్మాత అరుణ్ మొండితోక మాట్లాడుతూ - ఎక్కడా కాంప్రమైస్ కాకుండా కేవలం కథని, దాన్ని హానెస్ట్ గా సినిమాగా తీయడాన్నే నమ్మిన డైరెక్టర్ అరవింద్. అదే సినిమాకి బలమని నమ్ముతున్నాం. త్వరలోనే మా సినిమాను రెగ్యులర్ షూటింగ్ కు తీసుకెళ్తాం. అన్నారు. దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ - పాషన్ నవల చదివాను. నాకు బాగా నచ్చింది మంచి వాక్యం, భావం ఉన్న రచయిత అరవింద్. డైరెక్టర్ గా కూడా అదే ప్రభావవంతమైన సినిమా తీస్తాడని ఆశిస్తున్నా. అన్నారు.నిర్మాత ఏ పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ - ఈ సినిమా స్క్రిప్ట్ నాకు నెరేట్ చేసినపుడు బాగా ఎంగేజింగ్ గా అనిపించింది. అందుకే భాగస్వామిని అవుతున్నాను. అన్నారు. -
అడ పిల్లల పై ఇలాంటి ఘటనలు చాలా దారుణం
-
ధనుష్ తో ఎలాంటి సినిమా తీస్తున్నానంటే.. ఎవరు ఊహించలేరు
-
కథ చెప్పడానికి వెళితే అవమానించేవారు: శేఖర్ కమ్ముల
-
అదృష్టవంతుడు ఎందుకంటే ఆ సినిమాలో లాభ పడింది దిల్ రాజు
-
ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ని హీరోగా అనుకున్న కానీ..!
-
బాహుబలి లాంటి సినిమాలు తీయాలంటే..!
-
సమాజంలో మార్పు కోసమే నా సినిమాలు..!
-
ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడ్ని: శేఖర్ కమ్ముల
-
ఏదో ఒక రోజు మన దేశం మారుతుంది అని అనుకుంటున్నా
-
పోస్టర్ లో చూసి విజయ్ సేతుపతి అనుకున్నాను..!
-
సాయి పల్లవిని పాన్ ఇండియా స్టార్ ని చేస్తున్న శేఖర్ కమ్ముల
-
శేఖర్ కమ్ములకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ?
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్‌రెడ్డి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్‌ను దక్కించుకున్న విజయ్‌కు లైగర్ డిజాస్టర్ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. దీంతో తాను తర్వాత చేయబోయే సినిమాల విషయంలో విజయ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇప్పటికే శివ నిర్వాణతో ఖుషి సినిమా చేస్తున్న విజయ్ ఈ సినిమా అనంతరం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా తాజాగా విజయ్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమాకు సైన్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి చర్చలు పూర్తయ్యాయని, కథ నచ్చడంతో విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. చదవండి: తన ఆరోగ్యంపై కీలక అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ -
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
దర్శకుడు శేఖర్ కమ్ముల కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
యమలీల చేసిన వాణ్ణి మరో లీల చేయలేనా ?: ఎస్వీ కృష్ణారెడ్డి
‘ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు అంటే ఒక రిలీఫ్. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలను చక్కగా ఏర్చి, కూర్చి అద్భుతమైన సంగీతంతో మనకు అందిస్తారు. ఉరుకు, పరుగుల ప్రస్తుత జనరేషన్‌కు రిలీఫ్ కోసం కృష్ణారెడ్డిగారి సినిమాలు ఎంతో అవసరం అని నా భావన. ఆయన సినిమాలలో కమర్షియల్ హంగులతో పాటు పిల్లలకు కావాల్సిన అంశాలన్నీ ఉంటాయి. ‘ఆర్గానిక్ మామ`హైబ్రిడ్ అల్లుడు’ మూవీ కృష్ణారెడ్డికి మంచి కమ్‌బ్యాక్ సినిమా అని ప్రముఖ దర్శఖుడు శేఖర్ కమ్ముల అన్నారు. సోహైల్, మృణాళినీ రవి జంటగా, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా సినిమా ‘ఆర్గానిక్ మామ– హైబ్రీడ్ అల్లుడు’. ఈ సినిమాను కల్పన కోనేరు నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ టీజర్ చాలా బాగుంది. ఈ సినిమాను ఇంత అద్భుతంగా నిర్మించిన నిర్మాత కోనేరు కల్పన గారికి యూనిట్ సభ్యులకు నా కృతజ్ఞతలు. కృష్ణారెడ్డి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాత సీ.కల్యాణ్ మాట్లాడుతూ.. దాదాపు 30 ఏళ్ల క్రితం ఆలీని హీరోగా పరిచయం చేస్తూ కృష్ణారెడ్డి గారు ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత మళ్లీ సోహెల్‌ను ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తుండటం మేం సెంటిమెంట్‌గా భావిస్తున్నాం. చిరంజీవి గారు కెరీర్ ప్రారంభంలో ఎలా కష్టపడ్డారో అలాగే ఈ సినిమా కోసం సోహెల్ కూడా కష్టపడ్డాడు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ సినిమా అందరికీ హిట్ ఇస్తుందని ఆశిస్తున్నా అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఆర్గానిక్ మామ ` హైబ్రిడ్ అల్లుడు సినిమా ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అవుతోంది అంటే దానికి నేను కూడా ఒక కారణం తప్ప.. నేనే కారణం కాదు. నేను 40 దాకా సినిమాలు చేశాను. ఈ సినిమా నిర్మాత కల్పన గారి డెడికేషన్, ప్లానింగ్ చూసిన తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ నా కెరీర్లో ది బెస్ట్ అని చెపుతున్నాను. ఈ సినిమా విషయంలో అచ్చిరెడ్డి గారికి, నిర్మాత కల్పన గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. 44 రోజుల్లోనే సినిమా పూర్తయిపోయింది. ఆర్టిస్ట్‌ల విషయంలో కూడా నేను బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని పాత్రలకు చిన్న వారిని, కొత్త వారిని ప్రపోజ్ చేసినా, ఆమె మాత్రం పేరున్న ఆర్టిస్ట్‌లను మాత్రమే తీసుకోవాలని పట్టుబట్టి మరీ వారి డేట్స్ సంపాదించారు. సోహైల్ కథ విని ఈ సినిమా చేస్తే నేను ఎక్కడికో వెళ్లిపోతాను సార్ అని ఆనందపడిపోయాడు. అతని కలవగానే.. యమలీల చేసిన వాణ్ణి మరో లీల చేయలేనా అనిపించింది. రాజేంద్రప్రసాద్ గారు అయితే.. డబ్బింగ్ టైంలో కొన్ని సీన్లు చూసి ఏంటి నేను ఇంత బాగా చేశానా, ఇంత ఎమోషన్ ఈ కేరెక్టర్లో ఉందా? అని ఆశ్చర్య పోయారు. ఇంతమంది మంచి మనుషులు నా చుట్టూ ఉంటే నా నుంచి ఒక పెద్ద హిట్ ఎందుకు రాకుండా ఉంటుంది?. ఈ సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు. కచ్చితంగా అందరికి నచ్చుతుంది’ అన్నారు. ‘చిన్నప్పటి నుంచి కృష్ణారెడ్డి గారి సినిమాలు చూసి పెరిగాను. ఇప్పుడు ఆయన దర్వకత్వంలో నటించడం అంటే ఇప్పటికీ నమ్మలేని విషయంగానే అనిపిస్తుంది. నాలోని టాలెంట్‌ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత కల్పన గారికి నా థ్యాంక్స్. బిగ్‌బాస్ వల్ల నేను చాలా మందికి పరిచయం అయ్యాను. ఇప్పుడు కృష్ణారెడ్డి గారి సినిమా అంటే ఇక ప్రతి కుటుంబానికి చేరువౌతాను అనే నమ్మకం ఉంది. ప్రతి సినిమా కోసం ఇలానే కష్టపడతాను’అన్నారు సోహైల్. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకుడు, ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి , నటుడు అలీ, హేమ, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక
తమిళసినిమా: తక్కువ సమయంలోనే నటిగా విశేష గుర్తింపును సొంతం చేసుకున్న నటి రష్మిక. ఈ శాండిల్ వుడ్ బ్యూటీ తన మాతృభాషలో పెద్దగా చిత్రాలు చేయలేదు. టాలీవుడ్లో తొలి చిత్రమైన ఛలో మార్కులు తెచ్చుకోవడం, గీత గోవిందం ఊహించని విజయాన్ని సాధించడం చకాచకా జరిగిపోయాయి. దీంతో అమ్మడు బాలీవుడ్ వరకు వెళ్లింది. అక్కడ తొలి చిత్రం గుడ్ బై ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది కూడా. అయితే ఆ చిత్రం మంచి వసూళ్లు రాబట్టలేకపోయింది. కానీ రష్మికకు నటిగా మంచి వర్కులే పడ్డాయి. ఇంకా అక్కడ రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఇక తెలుగులో తనను బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన పుష్ప చిత్రం సీక్వెల్లో నటించడానికి రెడీ అవుతోంది. ఇదేవిధంగా ద్విభాషా చిత్రం వారీసు చిత్రంలో విజయ్‌తో రొమాన్స్ చేస్తోంది. ఈ చిత్రం రష్మికకు కీలకం. ఎందుకంటే కోలీవుడ్‌లో ఇంతకు ముందు కార్తీ సరసన సుల్తాన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా అది ఆమె కెరీర్‌కి పెద్దగా ప్లస్‌గా కలసిరాలేదు. అయితే అవకాశాలు మాత్రం తగ్గేదేలే అంటున్నాయి. ఇప్పటికే మరోసారి కార్తీతో జత కట్టడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం. తాజాగా మరో స్టార్ హీరో ధనుష్‌కు జంటగా నటించే అవకాశం కూడా ఈ బ్యూటీ తలుపు తట్టినట్లు సమాచారం. ధనుష్ హీరోగా టాలీవుడ్ ప్రామినెంట్ దర్శకుడు శేఖర్ కమ్ముల ద్విభాషా చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నటి రష్మికను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాల్సి ఉంది. -
ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.. నాగచైతన్య ఎమోషనల్ ట్వీట్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్‌స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై నేటికి(సెప్టెంబర్ 24) ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందానికి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ నాగచైతన్య ఓ ట్వీట్ చేశాడు. ‘ఇలాంటి స్పెషల్ చిత్రాన్ని నాకు అందించిన చిత్ర యూనిట్‌కి, బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ చిత్రం నాకెన్నో విషయాలను నేర్పించింది. ‘లవ్‌స్టోరీ’ సినిమా జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను’అని చైతన్య ట్వీట్ చేశాడు. (చదవండి: సలార్’ షురూ.. పుట్టెడు శోకంలోనూ షూటింగ్‌కి ప్రభాస్ హాజరు) కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అని బడా సినిమా నిర్మాతల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి 2021లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలే ప్రధానంగా శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరి’ మూవీని రూపొందించారు. ఇందులో అణగారిన సామాజిక వర్గానికి చెందిన రేవంత్‌గా చైతూ, పెద్దింటి అమ్మాయి మౌనికగా సాయి పల్లవి అద్భుతంగా నటించి మెప్పించారు. Thank you so much to the entire team and audience for making this one special ! A film that taught me in so many ways .. memories I will always cherish https://t.co/gGWbzmZbT0 — chaitanya akkineni (@chay_akkineni) September 24, 2022 -
రానాను పక్కన పెట్టిన శేఖర్ కమ్ముల? ఆ హీరోతో లీడర్-2
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల కూడా ఒకరు. తనదైన స్టైల్‌తో క్లాసిక్ సినిమాలు తీసే శేఖర్ కమ్ముల రీసెంట్గా లవ్‌స్టోరీతో హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఆయన కెరీర్లో తీసిన బెస్ట్ మూవీస్‌లో లీడర్ ఒకటి. రానా దగ్గుబాటిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా సీక్వెల్ కోసం ఆడియెన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: కూతురి కోసం చిరంజీవి ఊహించని బహుమతి శేఖర్ కమ్ముల కోసం ఈ సినిమా సీక్వెల్ తప్పకుండా ఉంటుందని గతంలోనే వెల్లడించారు. తాజాగా ఈ సీనిమా సీక్వెల్‌పై ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. తమిళ స్టార్ హీరో సూర్య లీడర్-2లో నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కెనున్న ఈ చిత్రానికి సూర్య పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది త్వరలోనే తెలియనుంది. చదవండి: అనాథ పాపను దత్తత తీసుకోవాలనుకున్నా : స్టార్ హీరోయిన్ -
రానా.. శేఖర్ కమ్ముల 'లీడర్' 2 ఎప్పుడంటే..!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దగ్గుబాటి రానా నటించిన చిత్రం 'లీడర్'. ఆ చిత్రంతోనే 2010వ సంవత్సరంలో రానా హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. శేఖర్ కమ్ముల మార్క్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఆ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ చిత్రాల్లోనే ఓ మంచి క్లాసిక్ అని చెప్పొచ్చు. 'లీడర్' కథని చాలా మంది హీరోలకి శేఖర్ కమ్ముల వినిపించినట్టు అప్పట్లో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ హీరోలు కథలో కొన్ని మార్పులు చేయాలని కోరడంతో చివరికి రానాతో ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే రానాకి 'లీడర్' మొదటి సినిమా అంటే ఎవ్వరూ నమ్మరేమో అనేలా అతను అంత మెచ్యూర్డ్‌గా నటించి అందరినీ మెప్పించాడు. ఇక రానా తప్ప ఆ పాత్రకి మరెవ్వరూ న్యాయం చేయలేరనేలా అర్జున్ ప్రసాద్ పాత్రలో జీవించాడు. అయితే ఇదిలా ఉండగా 'లీడర్' చిత్రానికి సీక్వెల్ ఉంటుందని 'అరణ్య' 'లవ్ స్టోరీ' సినిమాల రిలీజ్ సమయంలో శేఖర్ కమ్ముల తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా 'భీమ్లా నాయక్' ప్రమోషన్లలో భాగంగా దీని గురించి ఆ చిత్ర హీరో రానా స్పందించాడు. "శేఖర్ కమ్ముల 'లీడర్' సీక్వెల్ గురించి నాకు రెండు మూడు సీన్లు చెబుతుంటారు మళ్ళీ సైలెంట్ అయిపోతుంటారు. అది పూర్తిగా ఆయన చేతుల్లోనే ఉంది" అంటూ రానా బదులిచ్చాడు. ఇక దీని బట్టి చూస్తే.. 'లీడర్' సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే శేఖర్ కమ్ముల మొదలు పెట్టేశాడని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
సాయి పల్లవిని పక్కన పెట్టిన శేఖర్ కమ్ముల
శేఖర్ కమ్ముల ఇటీవల డైరెక్ట్ చేసిన రెండు బ్లాక్ బస్టర్స్ ఫిదా, లవ్ స్టోరీలో సాయి పల్లవి నటన హైలైట్ గా నిలిచింది. రెండు సినిమాల్లోనూ ఈ నేచురల్ బ్యూటీ తనదైన నటనతో ఆకట్టుకుంది. డ్యాన్స్ విషయంలోనూ వావ్ అనిపించింది. మొత్తంగా ఫిదా, లవ్ స్టోరీస్ సూపర్ సక్సెస్ లో తనకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. లవ్ స్టోరీ తర్వాత ప్రస్తుతం ధనుష్ తో పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం ఈ సినిమా స్టోరీ రైటింగ్స్ లో బిజీగా ఉన్నాడు డైరెక్టర్. ధనుష్ తో లవ్ స్టోరీ కాకుండా ఒక సీరియస్ సబ్జెక్ట్ ను డీల్ చేస్తాడట. అంతే కాదు తన కొత్త చిత్రంలో సాయి పల్లవి కాకుండా ఓ బాలీవుడ్ హీరోయిన్ కు అవకాశం ఇవ్వనున్నాడట. శేఖర్ కమ్ముల మూవీతో సాయి పల్లవి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టడం ఖాయం అనుకుంటుండగా మరో హీరోయిన్ ఆ అవకాశం అందుకుంటుండటంతో, సాయి పల్లవి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి అనేది క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. -
శేఖర్ కమ్ముల మేకింగ్ లోనూ నటిస్తున్నధనుష్
-
తెలుగులో ధనుష్ స్ట్రయిట్ సినిమా
Dhanush Straight Telugu Film: కోలీవుడ్ స్టార్ ధనుష్‌కు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులో డబ్ అవడమే కాక ఇక్కడ కూడా మంచి హిట్ అందుకున్నాయి. దీంతో అతడు టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. స్ట్రయిట్ తెలుగు సినిమా చేయడానికి అంగీకరించాడు. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ప్రాజెక్టుకు ధనుష్ పచ్చజెండా ఊపాడు. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది. 'తమిళంలో నా నెక్స్ట్ మూవీ, తెలుగులో నా తొలి సినిమా.. రేపు(గురువారం) ఉదయం 9 గంటల 36 నిమిషాలకు టైటిల్ వెల్లడిస్తాం' అంటూ హీరో ధనుష్ ట్వీట్ చేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించనున్నారు.తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. My next Tamil film and my first direct telugu film .. title announcement tom 🙏🙏 Om Namashivaaya pic.twitter.com/cnaeMXO2h0 — Dhanush (@dhanushkraja) December 22, 2021 -
ఓటీటీలో ‘లవ్‌స్టోరి’.. విడుదల ఎప్పుడంటే
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం లవ్‌స్టోరి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత నెలలో(సెప్టెంబర్ 24) విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ టాక్ సొంతం చేసుకుంది. కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అని బడా సినిమా నిర్మాతల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి ‘వావ్’ అనిపించింది. కాగా, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. అక్టోబర్ 22న సాయంత్రం 6 గంటల నుంచి ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుందని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ సరికొత్త ట్రైలర్‌ని విడుదల చేసింది. సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలే ప్రధానంగా శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరి’ మూవీని రూపొందించారు. ఇందులో అణగారిన సామాజిక వర్గానికి చెందిన రేవంత్‌గా చైతూ, పెద్దింటి అమ్మాయి మౌనికగా సాయి పల్లవి అద్భుతంగా నటించి మెప్పించారు. -
Love Stories: ప్రేమ అదే ప్రాబ్లం వేరు
ఉన్నోళ్లు లేనోళ్లు... పట్నం పల్లె... ఆ మతం ఈ మతం... వెజ్ నాన్‌వెజ్... సమాజంలో సినిమాల్లో ప్రేమకు ప్రాబ్లమ్స్ సృష్టించాయి. ప్రేమ అలాగే ఉంది. ఇప్పుడు తెలుగు సినిమా ఇంకా సీరియస్ సమస్యలను చర్చిస్తోంది. మొన్నటి ‘ఉప్పెన’ నిన్నటి ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఇవాళ్టి ‘లవ్‌స్టోరీ’ ఆ సంగతే చెబుతున్నాయి. కె.బాలచందర్ ‘మరో చరిత్ర’తో ప్రేక్షకులకు ప్రేమ అలల ప్రతాపం చూపించాడు. నిప్పులోన కాలదు నీటిలోన నానదు అని క్లయిమాక్స్ చేశాడు. మీరు ప్రేమికుల్ని నాశనం చేయగలరు... ప్రేమను కాదు అని చెప్పాడు. ఆ సినిమాలో హీరోయిన్ తెలుగు, హీరో తమిళం. పెద్దవాళ్లు వారిని ఎన్ని బాధలు పెట్టాలో అన్నీ పెట్టారు. చివరకు వాళ్లు ప్రాణం తీసుకునేదాకా ఊరుకోలేదు. శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరీ’లో ‘పంచాయితీల్లో పడాలని ఎవరనుకుంటారు. ప్రేమ అయిపోతుంది. అంతే’ అనే డైలాగ్ ఉంది. నిజం. ప్రేమ అయిపోతుంది. ఆ వయసు, ఆ ఆకర్షణ, ఆ శక్తి, ఆ సహనం ప్రేమికుల్ని వివశుల్ని చేస్తాయి. ప్రేమను తెగించే స్థాయికి తీసుకెళతాయి. ప్రేమికులు మారలేదు. పెద్దలే ఒక సమస్యను వదిలి ఇంకో సమస్యను ముందుకు తెస్తూ వెళుతున్నారు. భారతీరాజా ‘సీతాకోకచిలుక’ కూడా భారీగా హిట్ అయ్యింది. దానిలో హిందూ క్రిస్టియన్ల మధ్య ప్రేమ. క్లయిమాక్స్‌లో ఊరే తగలబడే స్థాయికి వెళుతుంది. ఆర్థికంగా శక్తిమంతుడైన శరత్‌బాబు తన చెల్లెలు ముచ్చర్ల అరుణ ప్రేమను సంగీత పాఠాలు చెప్పుకునే ఇంటి కార్తీక్‌కు ఇవ్వడానికి ఇష్టపడడు. ఇక్కడ మతంతోపాటు ఆర్థిక స్థాయి కూడా విలన్ కావడాన్ని దర్శకుడు చూపిస్తాడు. అయితే ఆ కథ సుఖాంతం అవుతుంది. చదవండి: (చై-సామ్ విడాకులు: సమంతకు భరణం ఎన్ని కోట్లు ఉంటుందంటే..!) ‘కులం’ ప్రేమకు అడ్డం కారాదని, ప్రేమ అలాంటి సంకుచితాల కంటే ఉన్నతమైనదని కె.విశ్వనాథ్ ‘సప్తపది’ తీసినప్పుడు ఆయన నుంచి అలాంటి ప్రేమకథ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆయన చెప్పిన పద్ధతికి కన్విన్స్ అయ్యారు. సినిమాను హిట్ చేశారు. అందులో అగ్రహారం అమ్మాయి దళిత కుర్రాడిని ప్రేమిస్తుంది. ‘గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన’ పాట ఉంది ఇందులో. పశువు రంగుకీ పాల రంగుకీ సంబంధం లేదు. ఆరాధనకు వర్ణం లేదు. ప్రేమకు కులం లేదు. కలిసిన ఏ రెండు మనసులైనా సప్తపదికి అర్హమైనవే అని దర్శకుడు చెబుతాడు. ఆ తర్వాత చాలారోజులకు హిందీ ‘బాబీ’ స్ఫూర్తితో తేజ ‘నువ్వు నేను’ తీశాడు. ఇందుకు సాంస్కృతిక తారతమ్యం ప్రధానంగా విభేదం తెస్తుంది. డబ్బు రెండు వర్గాల దగ్గర ఉంది. కాని ఒకరు సూటూ బూటూ వేసే బంగళావాళ్లైతే మరొకరు పాడీ పశువూ యాస ఉన్నవారు. ‘మీపెద్దోళ్లున్నారే’ అని హీరో ఉదయ్‌కిరణ్ అన్నట్టు పెద్దోళ్ల లెక్కలు పెద్దోళ్లవి. పిల్లలకు ఆ లెక్కలు పట్టవు. వారి దృష్టిలో వాటి విలువ గుండుసున్నా. చదవండి: (సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనైన సమంత, పోస్ట్ వైరల్) కులపట్టింపు ప్రేమికులు పెళ్లి చేసుకున్నాక కూడా వెంటాడుతుందని తమిళంలో నుంచి తెలుగులోకి డబ్ అయిన ‘ప్రేమిస్తే’ చెప్పింది. అందులో పారిపోయిన ప్రేమికులను వెంటాడి విడదీస్తారు. మరాఠిలో ‘సైరా’ ఇదే పాయింట్‌ను పట్టుకుని పరువు హత్యను చూపించి భారీ విజయం నమోదు చేసింది. అందులో పారిపోయి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాక కూడా ఆ ప్రేమికులను కుల అహంభావులు చంపుతారు. ఇప్పుడు ఈ కుల అహంభావం తెలుగు సినిమాల్లో చర్చకు వస్తోంది. ‘మంచివాడే కానీ మనవాడు కాడు’ అనే డైలాగ్ ఉంది కరుణ కుమార్ తీసిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలో. ఈ ‘మనవాడు’ కాకపోవడమే హీరోయిన్ తండ్రికి సమస్య. అతనిది సోడా వ్యాపారం. కాని కుల పట్టింపు విషయంలో రాజీ పడడు. చివరకు కన్నకూతురినే పరువు కోసం హత్య చేస్తాడు. ‘ఉప్పెన’లో కూడా అంతే. హీరోయిన్‌కు ఆస్తి ఉంది. కులం ఉంది. హీరో కులం వాళ్లకు ‘చాల్లేదు’. సముద్రం మీద సాహసంగా వెళ్లి వేట చేసే కుర్రాడు ఎంత యోగ్యుడైనా హీరోయిన్ తండ్రి అహానికి సరిపోడు. చివరకు హీరో మగతనానికే నష్టం కలిగించే స్థాయికి వెళతాడు. ‘లవ్‌స్టోరీ’లో హీరో కులం హీరోయిన్ ఇంటికి బయట చెప్పులు విడిచి వచ్చే స్థాయికి ‘నెట్టబడిన’ కులం. ఊళ్లో ఉన్న వివక్షను తట్టుకోలేక సిటీకి వచ్చి బతుకుతుంటే ప్రేమ విషయంలో పెళ్లి విషయంలో ఊరు హీరోను తరుముతూనే ఉంటుంది. చివరకు శ్మశానం కూడా అగ్రకులాలకు ఒకటి... అణగారిన కులాలకు ఒకటి. ‘తిరగబడి ప్రేమను సాధించుకుందాం’ అనుకుంటాడు హీరో. తిరగబడే తెగింపుకు నెడుతున్నది ఎవరు? సమాజం అయినా సినిమా అయినా ప్రేమను తప్పించుకోలేదు. సమాజం ప్రేమికులకు ఎన్నో సవాళ్లు విసురుతున్నా ప్రేమికులు ఓడిపోతుండవచ్చు కాని ప్రేమ ఓడిపోవడం లేదు. అది మళ్లీ మళ్లీ జన్మిస్తూనే ఉంది. ఇవాళ చాలా కుటుంబాల్లో ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. వాటిలో కులాంతరం, మతాంతరం, ఖండాంతరం ఉన్నాయి. ఒప్పుకునే మనసుంటే ఎంత పెద్ద సమస్యా సమస్య కాకుండా పోతుంది. ఒప్పుకోకపోతే చిన్న సమస్య కూడా సమస్యే. ప్రేమ పుట్టనే కూడదు. పుట్టాక దానిని సఫలం చేసుకోవడానికి ప్రేమికులు చేసే ప్రతి పోరాటం ఇక ముందు కూడా సినిమా కథే అవుతుంది. -
నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే: శేఖర్ కమ్ముల
Sekhar Kammula: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’సినిమా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. అసలు లవ్‌స్టోరీ సినిమా కథ ఎలా మొదలైంది? ఆర్మూర్, బాన్సువాడ, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లోనే షూటింగ్ చేయడానికి కారణం ఏంటి? బాలీవుడ్లో సినిమా ఎప్పుడు ఉండబోతుంది?లవ్‌స్టోరీ రిలీజ్ అనంతరం శేఖర్ కమ్ముల అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలను సత్తితో 'గరం గరం ముచ్చట్లు'లో చూసేయండి.. -
హైదరాబాద్‌లో ‘లవ్ స్టోరీ’ మ్యాజికల్ సక్సెస్ మీట్
-
'లవ్‌స్టోరీ' సినిమాపై మహేశ్‌బాబు రివ్యూ
Mahesh Babu Comments On Love Story Movie: టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఇప్పుడు 'లవ్ స్టోరీ' మూవీ టాపిక్కే వినిపిస్తోంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరి’ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు లవ్‌స్టోరీపై రివ్యూ ఇచ్చారు. చదవండి : డిన్నర్ పార్టీలో ఎమోషనల్ అయిన నాగార్జున 'శేఖర్ కమ్ముల చాలా బాగా తెరక్కెకించారు. నాగ చైతన్య నటుడిగా చాలా ఎదిగాడు. అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ సినిమా అతనికి గేమ్ చేంజర్ అవుతుంది. ఇక సాయిపల్లవి ఎప్పటిలాగే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈమెకు అసలు బోన్స్(ఎముకలు) ఉన్నాయా? స్క్రీన్‌పై స్క్రీన్ పై ఎవరూ ఇలా డ్యాన్స్ చేయడం చూడలేదు. ఇక వన్ సీహెచ్ మ్యూజిక్ స్కోర్ సంచలనమే చెప్పాలి. రెహమాన్ సార్ శిష్యుడు అని విన్నాను. రెహమాన్ సర్ గర్వపడే సమయం' ఇది అంటూ లవ్‌స్టోరీ టీంపై మహేశ్ ప్రశంసలు కురిపించాడు. చదవండి : Love Story Review: ‘లవ్‌స్టోరి’ మూవీ రివ్యూ @Sai_Pallavi92 sensational as always... does the lady have any bones??? Haven't seen anyone dance like this ever on screen!!! Moves like a dream 🤩🤩🤩 — Mahesh Babu (@urstrulyMahesh) September 25, 2021 @pawanch19.. you'll be hearing a lot more of him... what a music score... Just sensational! Heard he's a disciple of @arrahman.. Rahman sir, you'll be proud of him. — Mahesh Babu (@urstrulyMahesh) September 25, 2021 -
Love Story Review: ‘లవ్‌స్టోరి’ మూవీ రివ్యూ
టైటిల్ : లవ్‌స్టోరి నటీనటులు : నాగ చైతన్య , సాయి పల్లవి, ఈశ్వరీరావు తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాతలు : కె. నారాయణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు దర్శకత్వం: శేఖర్ కమ్ముల సంగీతం : పవన్ సీహెచ్ సినిమాటోగ్రఫీ : విజయ్.సి.కుమార్ ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ విడుదల తేది : సెప్టెంబర్ 24, 2021 సెన్సిబుల్ కథలతో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించడం శేఖర్ కమ్ముల స్టైల్. అప్పట్లో వరుణ్ తేజ్‌తో ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఇపుడు నాగచైతన్య, సాయి పల్లవి జంటగా లవ్‌స్టోరి సినిమా చేశాడు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు నేడు( సెప్టెంబర్24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ‘లవ్‌స్టోరి’ ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం. ‘లవ్‌స్టోరీ’కథేంటంటే? అణగారిన సామాజిక వర్గానికి చెందిన రేవంత్(నాగ చైతన్య) ఏదైనా బిజినెస్ చేయాలని నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు వస్తాడు. అక్కడ ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ జుంబా డ్యాన్స్ సెంటర్ నడుపుతుంటాడు. రేవంత్ గ్రామానికే చెందిన మౌనిక(సాయి పల్లవి) బిటెక్ పూర్తిచేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యోగం లభించకపోవడంతో రేవంత్ జుంబా సెంటర్లో పార్ట్నర్గా జాయిన్ అవుతుంది. ఇలా భిన్నమైన సామాజిక వర్గాలు కలిగిన రేవంత్, మౌనికల మధ్య స్నేహం ఏర్పడుతుంది. అది కాస్త నిదానంగా ప్రేమగా మారుతుంది. ఈ ప్రేమ విషయాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని అనుకున్నప్పుడు మధ్యలో కులం అడ్డు వస్తుంది. ఇక్కడ నుంచి వారిద్దరి ప్రేమ కథా వ్యవహారం ఎలా నడిచింది? కులాల అడ్డంకి దాటుకొని చివరకు మౌనిక, రేవంత్ ఎలా ఒకటయ్యారు? అనేదే మిగిలిన కథ. ఎలా చేశారంటే.. ? రేవంత్ పాత్రలో నాగచైతన్య ఒదిగిపోయాడు. ముఖ్యంగా డ్యాన్స్ విషయంగా చైతూ చాలా మెరుగయ్యాడు. గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీలో కష్టమైన స్టెప్పులేసి అదరగొట్టాడు. ఇక మౌనిక పాత్రలో సాయి పల్లవి ఎప్పటి మాదిరే పరకాయ ప్రవేశం చేసింది. సాయి పల్లవి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కష్టమైన స్టెప్పులను ఈజీగా వేసి అదరగొట్టేసింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఇద్దరూ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తెరపై రేవంత్, మౌనిక పాత్రలు మాత్రమే కనిపిస్తాయి తప్ప చైతూ, సాయి పల్లవిలు అస్సలు కనిపించరు. హీరో తల్లిపాత్రలో ఈశ్వరీరావు తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. మౌనిక బాబాయి నరసింహం పాత్రలో రాజీవ్ కనకాల మెప్పించాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ తనది. హీరోయిన్ తల్లిగా దేవయాని, ఎస్సైగా ఉత్తేజ్ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలే ప్రధానంగా శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరి’ మూవీని రూపొందించారు. ఇవి రెండూ సున్నితమైన అంశాలు. వీటి గురించి మాట్లాడేందుకు ఇప్పటికీ చాలా మంది సంకోచిస్తున్నారు. ఆయా సమస్యలపై వచ్చిన కథనాలు చదివితే చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. అలాంటి సున్నితమైన పాయింట్‌ని తీసుకొని, తెరపై అతి సున్నితంగా చూపించాడు శేఖర్ కమ్ముల. పాత్రల నేపథ్యం చాలా నేచురల్‌గా ఉంటుంది. సినిమాల్లో కొన్ని ఎమోషన్స్ బాగా ఎలివేట్ చేసినా.. స్లోగా సాగే సీన్స్ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో హీరో, హీరోయిన్స్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. ఫస్టాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్గా సాగుతుంది, సెకండాఫ్ వచ్చేసరికి కథలో ఎమోషన్స్ ఎక్కువైపోతాయి. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. క్లైమాక్స్ అయితే పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం పవన్ సీహెచ్ సంగీతం. పాటలతో పాటు నేపథ్యం సంగీతం కూడా అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు. విజయ్.సి.కుమార్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. పల్లెటూరి విజువల్స్‌ని తెరపై అందంగా చూపించాడు. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బ్యానర్ స్థాయికి తగినట్లుగా ఉంది. మొత్తంగా చెప్పాలంటే ‘లవ్‌స్టోరి’ ఓ మంచి సందేశాత్మక చిత్రం. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అందుకే 'లవ్‌స్టోరీ' చూడాలనే క్యూరియాసిటీ పెరిగింది.
Reasons To Watch Love Story Movie: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘లవ్‌స్టోరీ’ ఒకటి. ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న మూవీ ఇది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు సెప్టెంబర్24న ప్రేక్షకల ముందుకు రానుంది. లవ్‌స్టోరీతో థియేటర్లకు పూర్వ వైభవం వస్తుందని సినీ ప్రముఖులు సైతం భావిస్తున్నారు. లవ్‌స్టోరీ సినిమా చూసేందుకు ఉన్న ప్రధాన కారణాలను ఓసారి పరిశీలిస్తే.. సాయి పల్లవికి సమానంగా.. సాయి పల్లవికి నటిగానే కాకుండా, మంచి డ్యాన్స్ర్గానూ పేరుంది. అందుకు తగ్గట్లుగానే ప్రతీ సినిమాలో అంతకంతకు ఢిపరెంట్ డ్యాన్స్ స్టెప్స్‌తో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. అయితే సాయిపల్లవికి సమానంగా నాగ చైతన్య డ్యాన్స్ ఉండనుందని ట్రైలర్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మూవీలో సాయి పల్లవి కంటే నాగ చైతన్య డ్యాన్స్ చూసేందుకు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. సెన్సిటివ్ సబ్జెక్ట్ లవ్‌స్టోరీ సినిమా పాటలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. కులం, పరువు హత్య లాంటి సెన్సిటివ్ అంశాలను తెరపై ఎలా చూపించారన్నది చాలామందిలో ఉన్న క్యూరియాసిటీ. శేఖర్ కమ్ముల స్టైల్ ఫీల్‌గుడ్ సినిమాలు తెరకెక్కించడంలో శేఖర్ కమ్ములది ఢిఫరెంట్ స్టైల్. ఆయన డైరెక్షన్లో వచ్చిన ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ వంటి సినిమాలు ఎప్పుడూ చూసినా అదే ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. ఇదే ఆయన సినిమాల్లో మ్యాజిక్. అలాంటిది లవ్‌స్టోరీగా మన ముందుకు వస్తున్నారంటే కశ్చితంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో ఉంటాయని చెప్పొచ్చు. చైతూ-పల్లవిల కెమిస్ట్రీ నాగ చైతన్య, సాయి పల్లవి ఈ సినిమా కోసం తొలిసారి నటించారు. ట్రైలర్లో చూపించినట్లుగా ఇద్దరి మధ్యా వచ్చే డైలాగ్స్, కెమిస్ట్రీ తెరపై అద్భుతంగా వర్కవుట్ అవుతుందని చాలామంది సినీ ప్రేక్షకుల ఫీలింగ్. జుంబా డ్యాన్సర్‌గా నాగ చైతన్య ఈ సినిమాలో నాగ చైతన్య గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మొదటగా చెప్పుకోవాల్సింది ఆయన డ్యాన్స్. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే, ఈ మూవీలో సాయి పల్లవి కంటే నాగ చైతన్య డ్యాన్స్ పైనే ఫోకస్ పెరిగింది. ఈ సినిమాలో చైతూ జుంబా డ్యాన్సర్‌గా కనిపించడం, తెలంగాణ యాస టచ్ చేయడంతో మరింత ఆసక్తి పెరిగింది. -
'లవ్‌స్టోరీ' నన్ను మార్చేసింది: నాగ చైతన్య
Naga Chaitanya About Love Story: నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్‌స్టోరీ'. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పన్నేండేళ్ల వెండితెర ప్రయాణం తర్వాత తనలో వచ్చిన మార్పులేంటి ? కథల ఎంపికలో తీసుకుంటున్న జాగ్రత్తలు ఎలా ఉండబోతున్నాయి ? లవ్‌స్టోరీలో రేవంత్‌గా తాను ఎలా కనిపించబోతున్నాడు లాంటి విషయాలపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. అప్పుడు తప్పు చేశాను గతంలో నా సినిమా ఒకటి హిట్ అవగానే... దాని తర్వాత వచ్చే సినిమా ఇంకా పెద్ద హిట్ కావాలని ఆలోచించే వాడిని. దానికి తగ్గట్టుగా సినిమాకు మంచి ప్యాకేజీ రావాలని కోరుకునే వాడిని. అందులో భాగంగా మంచి కాంబినేషన్, మంచి లోకేషన్లు, పాటలు, పెద్ద ఫైట్లు అంటూ ఆలోచించే వాడిని. ఇలా కమర్షియల్ ఎలిమెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. ఆ గిమ్మిక్కుల చుట్టూ తిరుగుతూ కథను పక్కన పెట్టాను. సినిమా పట్ల నిజాయితీగా లేకుండా కమర్షియల్ లెక్కల వెంట పరిగెత్తాను. కొన్ని సార్లు ఈ లెక్కలు వర్కవుట్ అవుతాయి, కొన్ని సార్లు కావు. నాకైతే ఫ్లాప్స్ ఎదురయ్యాయి. ఆ సమయంలో సినిమా పట్ల, తీసే కథ పట్ల హానెస్ట్‌గా ఉండాలని డిసైడ్ అయ్యాను. మజిలీతో మారిపోయింది వరుస ప్లాప్స్ తర్వాత లో కాన్ఫిడెన్స్ లెవల్స్‌లో ఉన్నాను. ఎలాంటి కథ ఎంచుకోవాలనే సందిగ్థదంలో ఉన్నప్పుడు మజిలీ వచ్చింది. కథతో ఎమోషనల్ జర్నీ చేశాను. కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా కథే ముఖ్యమని ఆ సినిమా చేశాను. నా జడ్జిమెంట్‌కి అదొక లిట్మస్ టెస్ట్ అనుకున్నా. రిజల్ట్ బాగానే వచ్చింది. తాత, నాన్న గారే స్ఫూర్తి మజిలీ తర్వాత నా పాత సినిమాలను ఒకసారి చూసుకుంటే చాలా సినిమాలో నేను, నాలా లేను. కెరీర్ కొత్తలో మనం చాలా వింటాం. ప్రేక్షకులకు ఇది కావాలి, ఆ సెంటర్ వాళ్లకి అది కావాలి, హీరో అంటే ఇలా ఉండాలి, ఫ్యాన్ బేస్ ఇలా చాలా ఉంటాయి. వాటిని బట్టే ముందుకు వెళ్తాం. కానీ ఒకసారి తాతాగారు, నాన్న కెరీర్లో చేసిన సినిమాలు చూస్తే స్కిప్ట్‌లో ఫ్రెష్‌నెస్ , కొత్తదనం ఉన్నాయి. అందువల్లే ప్రేక్షకులు వాళ్లని ఆదరించారని అర్థమైంది. న్యూ పాయింట్ ఫస్ట్ శేఖర్ కమ్ములతో సినిమా అనగానే ఫిదా లాంటి ఎంటర్టైనర్ సినిమాలా ఉంటుందని అనుకున్నా. కానీ శేఖర్ కమ్ముల క్యాస్ట్ , జెండర్ వివక్ష మీద కథ చెప్పడంతో చాలా కొత్తగా అనిపించింది. ఈ ఇష్యూస్ మీద చాలా వార్తలు చదువుతున్నాం, కానీ సినిమాగా రావడం లేదు అనేది నా మైండ్‌లో ఉండేది. శేఖర్ అదే పాయింట్‌పై కథ చెప్పడంతో హ్యాపీగా ఫీలయ్యాను. రేవంత్ అర్థం కావడానికి లవ్‌స్టోరీలో రేవంత్ క్యారెక్టర్ నాకు చాలా కొత్త. ఈ సినిమాలో రేవంత్ ఎదుర్కొన్న కష్టాలేమీ నిజ జీవితంలో నాకు ఎదురుకాలేదు. కానీ రేవంత్ క్యారెక్టర్ అలా కాదు. అతనికి ఉన్న ఇబ్బందులు, పరిమితులు గురించి శేఖర్ టీమ్ చాలా డిటెయిల్డ్గా వివరించారు. ఈ ప్రయాణం మూడు నెలలు జరిగింది. ఆ క్యారెక్టర్లో డెప్త్ అర్థమైన తర్వాత శేఖర్ కోసం ఎలాగైనా రేవంత్‌లా మారిపోవాలని డిసైడ్ అయ్యాను. యాస పట్టుకోవడమే కష్టం రేవంత్ క్యారెక్టర్ పట్టుకోవడం, అందులో జుంబా ఇన్‌స్ట్రక్టర్‌గా నటించడం కంటే తెలంగాణ యాసలో పర్ఫెక్ట్గా మాట్లాడం కష్టమనిపించింది. పద్దెనిమిదేళ్లు చెన్నైలో ఉండటం కొంతైతే, ఇక్కడ హైదరాబాద్‌లో ఇంగ్లీష్ కలిపిన తెలుగు మాట్లాడే ఫ్రెండ్స్ ఎక్కువ. అయితే మధ్యలో కరోనా లాక్డౌన్ రావడంలో చాలా సమయం దొరికింది. అప్పుడు బాగా ప్రాక్టీస్ చేశాను. పైగా డబ్బింగ్‌కి ముందు సెకండ్ వేవ్ రావడంతో మరోసారి యాస మీద దృష్టి పెట్టాను. షూటింగ్ జరిగేప్పుడు కొన్నేళ్ల పాటు ఓ తరహాలో నటించడానికి అలవాటయ్యాం. లార్జర్ దాన్ లైఫ్ అన్నట్టుగానే హీరో క్యారెక్టర్లు చేశాను. దీంతో లవ్‌స్టోరీలో రేవంత్‌గా కెమెరా ముందు ఉన్నప్పడు పాత ఛాయలు కనిపించగానే శేఖర్ గారు వెంటనే చెప్పేవారు. డౌన్ఇట్ డౌన్ ఇట్ అని. సహాజంగా నటించమని చెప్పారు. ఓ పదిహేను రోజలు తర్వాత షూటింగ్లో మ్యాజిక్ స్టార్టయ్యింది. కెమెరా ఆన్ కాగానే చైతన్య పోయి పూర్తి రేవంత్ వచ్చే వాడు. లవ్‌స్టోరీతో నన్ను మార్చేసింది నాగచైతన్యగా నా లైఫ్ వేరు, రేవంత్ క్యారెక్టర్ వేరు. ఈ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడే కరోనా వచ్చింది. లాక్డౌన్ వచ్చింది. జీవితం అంటే ఎంటీ ? డబ్బు, హోదా, గ్యాడ్జెస్ట్ ఇవేమీ కాదనిపించింది. ఈ మార్పు రేవంత్ క్యారెక్టర్‌కే కాదు నా జీవితంలో కూడా మార్పు తెచ్చింది. మార్పు వస్తోంది ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమా మేకింగ్, ప్రేక్షకుల అభిరుచుల్లో కూడా మార్పు వస్తోంది. ఇకపై ఇటు సినిమాలు, అటు ఓటీటీలకు సమాన ప్రాధాన్యం ఇస్తాను. అయితే కథకు, బౌండెడ్ స్క్రిప్టు మాత్రం కంపల్సరీ. హిందిలో అలా జరిగిపోయింది తెలుగు సినిమాలకే నా తొలి ప్రాధాన్యం. అయితే ఊహించని విధంగా అమీర్‌ఖాన్‌తో లాల్‌సింగ్ చద్ధాలో నటించే అవకాశం వచ్చింది. హిందీలోకి మంచి ఎంట్రీ వచ్చింది. చెన్నైలోనే పెరగడం వల్ల తమిళ భాష , తమిళ్ సెన్సిబులిటీస్ మీద ఐడియా ఉంది. ఓటీటీలో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
పెళ్లెప్పుడు... అని అడిగేవారు: సాయి పల్లవి
‘‘సమాజంలో మహిళలపై జరిగే దాడులు విని, చదివి బాధపడతాను. మనం ఏం చేయలేమా? అనుకుంటాను. ‘లవ్ స్టోరీ’లో మౌనిక పాత్ర చేస్తున్నప్పుడు కనీసం నా సినిమా ద్వారా అయినా నా వాయిస్ చెప్పగలిగాను అనే సంతృప్తి కలిగింది’’ అని సాయిపల్లవి అన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. కె. నారాయణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయిపల్లవి చెప్పిన విశేషాలు. డ్యాన్స్ చేయాలంటేనే నాకు భయం వేస్తుంటుంది. ‘రౌడీ బేబీ..’ పాట కష్టంగా అనిపించింది. ‘ఎమ్సీఏ’ చిత్రంలో ‘ఏవండోయ్ నానిగారు..’ పాటకు బాగా కష్టపడ్డా. వెనక్కి వంగి డ్యాన్స్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. వెన్నెముక దెబ్బతిందేమో? అనుకునేదాన్ని. ►శేఖర్ కమ్ములగారి నుంచి ‘లవ్‌స్టోరీ’కి పిలుపు వచ్చినప్పుడు కచ్చితంగా చేయాలని ఫిక్స్ అయ్యాను. కథలో మౌనిక పాత్ర విన్న తర్వాత నటించాలనే కోరిక ఇంకా గట్టిగా కలిగింది. మౌనిక తన డ్రీమ్స్‌ను ఫాలో అవుతుంది. నేను ఎందులో తక్కువ? అనే ఆత్మవిశ్వాసం మౌనిక పాత్రలో కనిపిస్తుంది. ►మన కుటుంబంలో, సమాజంలో లింగ వివక్షను చూస్తుంటాం. ఈ సమస్యలను టచ్ చేస్తూ ఆలోచింపజేసేలా ‘లవ్‌స్టోరీ’ని తీశారు శేఖర్ కమ్ముల. మా సినిమా చూశాక ప్రేక్షకుల్లో కచ్చితంగా ఒక ఆలోచన కలుగుతుందనే నమ్మకం ఉంది. ►మనలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు, మాస్టర్స్ కాదు.. కానీ సాధించాలనే విల్ పవర్ ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని నాగచైతన్య, నా క్యారెక్టర్ ద్వారా చెప్పించారు. నాగచైతన్యతో వర్క్ చేయడం చాలా కంఫర్ట్‌గా అనిపించింది. ►చిరంజీవి సార్‌కు పెద్ద మనసుంది.. అందుకే నువ్వు డ్యాన్స్ బాగా చేస్తావని కితాబిచ్చారు. నాతో డ్యాన్స్ చేయాలని ఉందని సరదాగా అన్నారు. నా డ్యాన్స్ చూసి ప్రేక్షకులు సంతోషపడితే అదే చాలు. నాకంటే బాగా డ్యాన్స్ చేసేవాళ్లు ఉంటారు. చాన్స్ వస్తే వాళ్లూ నిరూపించుకుంటారు. ►‘ఫిదా, లవ్‌స్టోరీ’ సినిమా షూటింగ్స్ దాదాపు పల్లెటూరిలోనే జరిగాయి. అక్కడి ప్రజల ప్రేమాభిమానాలు మరచిపోలేను. ‘పెళ్లెప్పుడు చేసుకుంటావ్.. అమ్మానాన్న ఏం చేస్తారు?’ ఇలాంటి వ్యక్తిగత విషయాలు అడిగేవారు. ‘లవ్‌స్టోరీ’ షూటింగ్ పూర్తయ్యాక తిరిగి వచ్చేస్తుంటే వారు పండించిన పసుపును బహుమానంగా ఇచ్చారు. -
ఆ విధంగా నాకీ సినిమా ఓ కొత్త అనుభవం!
‘‘నేనే కాదు.. ప్రతి ఒక్కరూ చరిత్రలో నిలిచిపోయే సినిమాలనే తీయాలనుకుంటారు. అందుకే నేను పాత్రలను ప్రేమిస్తూ కథ రాసుకుంటాను. ప్రతి సినిమాను, అందులోని ప్రతి సన్నివేశాన్ని ఇంతకన్నా బాగా ఎవరూ తీయలేరన్నట్లుగా భావించి తెరకెక్కించడానికి ప్రయత్నిస్తాను. ఓ పదేళ్ల తర్వాత కూడా నా సినిమాలను నా పిల్లలు చూడగలిగేలా, వారు గర్వంగా ఫీలయ్యేలా తీయడానికి కష్టపడుతుంటాను. ఇలాగే ‘లవ్‌స్టోరీ’ తీశాను. నా గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లవ్‌స్టోరీ’. కె. నారాయణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల చెప్పిన విశేషాలు. ►‘లవ్‌స్టోరీ’ ఓ మంచి ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్. ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండాల్సిన రొమాన్స్, ప్రేమ.. ఇలా అన్ని అంశాలు ఉంటాయి. ఈ చిత్రంలో కుల వివక్ష, స్త్రీ వివక్ష అనే రెండు బలమైన అంశాలను బ్యాలెన్స్ చేస్తూ చూపించాను. జనరల్‌గా నా సినిమాల్లో కొత్తవారు ఎక్కువగా ఉంటారు. కానీ ‘లవ్‌స్టోరీ’లో ప్రేక్షకులకు ఎక్కువగా తెలిసిన ఆర్టిస్టులే ఉంటారు. ఆ విధంగా ఈ సినిమా నాకు కొంత కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ►‘లీడర్’ చిత్రంలో కుల వివక్షపై ఓ చిన్న సీన్ ఉంది. ఆ సన్నివేశం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ పాయింట్‌నే కొంచెం ఎక్కువగా చూపిస్తూ ‘లవ్‌స్టోరీ’ తీశాం. శతాబ్దాలుగా ఉన్న కుల వివక్ష సమస్యలకు ఎవరు పరిష్కారాలు చూపించారు? అది మన దౌర్భాగ్యమే. ఒకటో తరగతి పుస్తకాల్లోనే మనమంతా ఒక్కటే అని ఉంటుంది. ఇది చెప్పడానికి ఇంకా ఎన్ని సినిమాలు రావాలి? ఇంకా ఎంత సాహిత్యం కావాలి? కుల వివక్ష గురించి పరిష్కార మార్గాలు కాదు కానీ .. నాకు తెలిసింది, నాకు వచ్చింది నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశాను. అలాగే సమాజంలో స్త్రీల పట్ల కనిపించే వివక్ష చూపించాం. ‘లవ్‌స్టోరీ’ చూసిన అమ్మాయిల్లో కొందరైనా ఇది మా కథ అని స్ఫూర్తి పొందినట్లయితే మేం విజయం సాధించినట్లే. ►లాక్డౌన్ వల్ల ఎన్నో కష్టాలు పడ్డాం. ఈ చిత్రనిర్మాతలు నాకు బలాన్ని ఇచ్చారు. వేరే నిర్మాతలు అయితే ఓటీటీకి ఇచ్చేసేవారేమో. వీరికి థియేటర్స్ ఉన్నాయని కాదు... సినిమాను థియేటర్స్‌లో చూడాలని, ప్రేక్షకులకు చూపించాలని తపన. లాక్డౌన్ ప్రతి ఇంట్లో ఏదో రకమైన విషాదాన్ని నింపింది. ఈ సమయంలోనే మా నాన్నగారు దూరమయ్యారు. ►‘లవ్‌స్టోరీ’లో తెలంగాణ కుర్రాడు రేవంత్ పాత్రలో నాగచైతన్య, మౌనిక పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. జుంబా డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా కనిపిస్తాడు చైతు. తెలంగాణలోని ఆర్మూర్ బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుంది. ఈ సినిమా కోసం చైతూయే కాదు చిత్రయూనిట్ అందరూ చాలా కష్టపడ్డారు. తెలంగాణ యాస, మేనరిజమ్, డ్యాన్స్ వంటి అంశాల్లో చైతూ స్పెషల్ కేర్ తీసుకున్నాడు. కొత్త చైతూను చూస్తారు. సాయిపల్లవి మంచి పెర్ఫార్మర్. ‘ఫిదా’లోలానే ఈ సినిమాలోనూ తను బాగా చేసింది. అయితే ‘ఫిదా’లో సాయిపల్లవి చేసిన ‘భానుమతి’ పాత్రకు మౌనిక పాత్ర డిఫరెంట్‌గా ఉంటుంది. మౌనిక క్యారెక్టర్లో ఓ స్ట్రగుల్ కనిపిస్తుంది. ఆమె క్యారెక్టర్లో షేడ్స్ ఉన్నాయి. ►అక్కినేని నాగేశ్వరరావుగారి ‘ప్రేమ్‌నగర్’ విడుదలైన రోజునే ‘లవ్‌స్టోరీ’ విడుదలవుతోందని నాగార్జునగారు అన్నారు. ‘ప్రేమ్‌నగర్’ సక్సెస్ అయిన దాంట్లో 30 శాతం మా సినిమా సక్సెస్ అయినా నేను హ్యాపీ ఫీలవుతాను. ►నా తర్వాతి చిత్రం ధనుష్‌తో ఉంటుంది. ముందుగా తెలుగు, తమిళ భాషల్లో అనుకున్నాం. కానీ ఓటీటీల వల్ల ఆడియన్స్ రీచ్ ఎక్కువగా ఉంది. హిందీలో కూడా ధనుష్‌కు మంచి మార్కెట్ ఉంది. అందుకే మల్టీలాంగ్వేజ్ ఫిల్మ్‌గా తీస్తున్నాం. రానా హీరోగా నా డైరెక్షన్లో వచ్చిన ‘లీడర్’కు సీక్వెల్ చేస్తాను. -
సాయి పల్లవి నా సినిమాను తిరస్కరించింది: చిరంజీవి
Chiranjeevi At Love Story Pre Release Event: సాయిపల్లవి తన సినిమాను తిరస్కరించిందని చిరంజీవి అన్నారు. 'లవ్‌స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘భోళా శంకర్’ సినిమాలో నాకు చెల్లెలిగా సాయిపల్లవిని అడిగితే ముందు ఆమె తిరస్కరించిందని, అయితే ఆమె నో చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగిందని పేర్కొన్నారు. 'సాయి పల్లవి డ్యాన్స్ ఎంతో అద్భుతంగా చేస్తుంది. అలాంటి అమ్మాయితో డ్యాన్స్ స్టెప్పులేయాలనుకుంటా తప్పా అన్నయ్యా అని పిలిపించుకోవాలనుకోలేదు' అంటూ చమత్కరించారు. సారంగదరియా పాట తనకు ఎంతో నచ్చిందని, ఈ పాట కోసమే సినిమాను రెండు-మూడు సార్లు అయినా చూస్తానన్నారు. ఇక నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. 'చాలామంది ఎంగ్ స్టర్స్ ఎగిరెగిరి పడుతుంటారు. కానీ నాగ చైతన్య ఎప్పుడూ కామ్‌గా, కంపోసుడ్‌గా ఉంటాడు. మా తమ్ముడు నాగార్జున లానే.. కూల్ ఫాదర్‌కి కూల్ సన్' అని చిరు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. తనకు రీమేక్ చిత్రాలంటే చాలా భయమని, అందుకే ఆ సినిమాకు నో చెప్పానని సాయి పల్లవి పేర్కొంది. తనకు మరో అవకాశం ఇవ్వాలంటూ చిరంజీవిని కోరింది. ఈ సందర్భంగా స్టేజ్‌పై చిరుతో సాయిపల్లవి వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. -
స్టేజ్‌పై 'సారంగదరియా' అంటూ సాయి పల్లవి స్టెప్పులు
Aamir Khan As A Special Guest For Love Story Pre Release Event: నాగ చైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'లవ్‌స్టోరీ'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల24న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంగ్లీ సారంగదరియా పాటను ఆలపించగా,సాయి పల్లవి స్టెప్పులతో హోరెత్తించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించిన ఈ పాట ఎంతలా ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 30 కోట్లకు పైగా వ్యూస్‌లో యూట్యూబ్ సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది ఈ పాట. మంగ్లీ గాత్రంతో పాటు సాయిపల్లవి డ్యాన్స్ సారంగదరియాకు హైలెట్ అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి, అమీర్ ఖాన్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. -
టాలీవుడ్‌పై ధనుష్ స్పెషల్ ఫోకస్.. మరో ఇద్దరితో చర్చలు!
కోలివుడ్ స్టార్ హీరో ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నందుకు ధనుష్ తన కెరీర్ లోనే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని, దాదాపు రూ. 50 కోట్లకు పైగా పారితోషికం బాగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఈ రెమ్యూనరేషన్ రూమర్ కోలీవుడ్ ను షేక్ చేస్తోంది. అయితే శేఖర్ కమ్ములతో తెలుగు మూవీ చేసేసి,మళ్లీ కోలీవుడ్ వెళ్లిపోదాం అనుకోవడం లేదు ధనుష్. (చదవండి: పెళ్లి తర్వాత కూడా నయన్ నటిస్తుందా?, హీరోయిన్ స్పందన) తెలుగులో ధనుష్ మొత్తం మూడు చిత్రాలు చేయనున్నాడని సమాచారం.శేఖర్ కమ్ములతో మూవీ తో పాటు,వెంకీ అట్లూరి, అలాగే ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతితో కూడా చర్చలు జరుపుతున్నాడట. అజయ్ భూపతి మేకింగ్ చాలా వరకు కోలీవుడ్ ఆడియెన్స్ కు దగ్గరగా ఉంటుందనీ అందుకే తనకోసం స్టోరీ రేడీ చేయమని చెప్పాడట. ఆర్ ఎక్స్ 100 తర్వాత మహా సముద్రం తెరకెక్కిస్తున్నాడు అజయ్. ఈ మూవీ పూర్తైన తర్వాత డైరెక్ట్ గా ధనుష్ తో ప్యాన్ ఇండియా సినిమా తెరకెక్కించినా ఆశ్చర్యం లేదు. -
ధనుష్, శేఖర్ కమ్ముల మూవీ: కథ కాన్సెప్ట్ అదేనట!
Dhanush- Sekhar Kammula Movie: యూత్‌ఫుల్, ఫ్యామిలీ, లవ్, పాలిటిక్స్.. ఇలా కాన్సెప్ట్ ఏదైనా ప్రేక్షకులను మెప్పించేలా తెరకెక్కిస్తారు దర్శకుడు శేఖర్ కమ్ముల. కథాంశం ఎలాంటిదైనా అందులోని పాత్రకు తగ్గట్టు మారిపోతారు ధనుష్. ఈ ఇద్దరి కాంబినేషన్లో ప్యాన్ ఇండియా మూవీ అనగానే సబ్జెక్ట్ ఏదై ఉంటుందా? అనే చర్చ ఇటు టాలీవుడ్లోనే కాదు.. అటు కోలీవుడ్‌లోనూ జరుగుతోంది. మద్రాస్ రాజధానిగా తెలుగు, తమిళ ప్రజలు కలిసి ఉన్ననాటి కథతో ఈ సినిమా ఉంటుందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. తాజాగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులో ఆరంభం కానుంది. నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. -
‘లవ్‌స్టోరీ’కి 10 ఓటీటీ ఆఫర్లు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Love Story Movie: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘లవ్‌స్టోరీ’ ఒకటి. ఫిదా తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.ఇటీవల విడుదలైన పాటలు, ప్రోమోలు సినిమాపై ఆ అంచనాలను మరింత పెంచాయి. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయాలనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. దీంతో ఈ సినిమా ఓటీటీలో రాబోతుందని అప్పట్లో పుకార్లు వచ్చాయి. దీనిపై తాజాగా నిర్మాతల్లో ఒకరైన సునీల్ నారంగ్ స్పందించారు. ఈ సినిమాకు ఏకంగా 10 ఓటీటీ ఆఫర్లు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఐతే తమ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో ఏ ఓటీటీకీ సినిమాను ఇవ్వలేదని ఆయన చెప్పారు. బిగ్ స్క్రీన్లలోనే ఈ సినిమా చూస్తారని నారంగ్ వ్యాఖ్యానించారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. జూలై 30న ‘లవ్‌స్టోరీ’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ మాత్రం స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
నాగచైతన్య- సాయి పల్లవి ‘లవ్‌స్టోరీ’విడుదలకు ముహుర్తం ఫిక్స్!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయాలనుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. అయితే రెండు రాష్ట్రాలలో థియేటర్లు మొదలుకానున్న నేపథ్యంలో జులై నెలాఖరు నుండి సినిమాల విడుదలకు పలువురు ఆలోచనలో ఉన్నారు. అసలే మళ్ళీ థర్డ్ వేవ్ టెన్షన్ కూడా నెలకొనడంతో అసలు ఇప్పుడే సినిమాలను విడుదల చేయాలా వద్దా.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే అనుమానాలు కూడా నెలకొనగా లవ్ స్టోరీ మేకర్స్ మాత్రం సినిమాను విడుదల చేసేందుకే ఆసక్తి ఉన్నట్లు తెలుస్తుంది. జూలై 23న ‘లవ్‌స్టోరీ’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని సమాచారం. తాజాగా ఈ విషయంపై నిర్మాత నారాయణ దాస్ నారంగ్ పరోక్షంగా స్పందించారు. జూలై 23న తమ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ 24న వెంకటేశ్ ‘నారప్ప’ఓటీటీలో రాబోతుందని తెలియడంతో కాస్త ఆలోచనలో పడ్డామని తెలిపారు. మరోవైపు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంతన్నది అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. -
ధనుష్‌ని కలిసిన శేఖర్ కమ్ముల
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ హీరో ధనుష్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి పతాకంపై ప్రొడక్షన్ నెం.4గా నారాయణదాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషలలో తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ధనుష్ ఓ తమిళ చిత్రం షూటింగ్ చేస్తూ, హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా తమ హీరోను శేఖర్ కమ్ముల, నారాయణ్ దాస్, సునీల్ నారంగ్, పి. రామ్మోహన్ రావు కలిశారు. యూనివర్సల్ అప్పీల్ మరియు అత్యంత ప్రతిభావంతులైన నటుడు-దర్శకుడితో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సోనాలి నారంగ్ సమర్పకురాలు. ఈ సినిమా కోసం దేశంలోనే అత్యున్నతమైన నటులు,టెక్నీషియన్స్ తో చర్చలు జరుపుతోంది చిత్ర యూనిట్. త్వరలోనే వారి వివరాలు ప్రకటించనున్నారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభంకానున్న ఈ ప్రాజెక్ట్ యొక్క మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. -
తమిళనాడు రియల్ పాలిటిక్స్ ఆధారంగా ధనుష్ మూవీ!
కోలివుడ్ స్టార్ హీరో ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో ఓ త్రిభాష చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ధనుష్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం, అది కూడా శేఖర్ కమ్ముల డైరెక్షన్ కావడంతో ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఇక సినిమా నేపథ్యం ఏమై ఉంటుందన్న క్యూరియాసిటీ కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలతో ముడిపడిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. పొలిటికల్ టచ్‌తో సినిమా ఉండనుందని తెలుస్తోంది. గతంలో రానాను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ శేఖర్ కమ్ముల లీడర్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రానాకు మంచి గుర్తింపు తీసుకురావడంతో పాటు హీరోగానూ నిలబెట్టింది. ఇప్పుడు మరోసారి పొలిటికల్ టచ్‌తో మెప్పించేందుకు శేఖర్ కమ్ముల కథ సిద్ధం చేశారట. చదవండి : మరోసారి రిపీట్ కానున్న ధనుష్-సాయిపల్లవి జోడీ శేఖర్ కమ్ముల సినిమా: ధనుష్ రెమ్యునరేషన్ ఎంతంటే..! -
మరోసారి రిపీట్ కానున్న ధనుష్-సాయిపల్లవి జోడీ
ప్రముఖ స్టార్ హీరో ధనుష్, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో ఓ త్రిభాష చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. దినికి సంబంధించిన ఇప్పటికే అధికారిక ప్రకటన ఊడా వెల్లడైంది. ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు... శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రాన్ని నిర్మించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలిపారు. ధనుష్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం, అది కూడా శేఖర్ కమ్ముల డైరెక్షన్ కావడంతో ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరలవుతుంది. ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా హీరోయిన్ సాయిపల్లవి నటించనుందని సమాచారం. ఇప్పటిఏ మేకర్స్ ఆమెతో చర్చలు జరిపారని, సాయిపల్లవి కూడా పాజిటివ్‌గా రెస్పాండ్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. ఇప్పటికే సాయిపల్లవి ధనుష్‌తో కలిసి 'మారి 2' తమిళ చిత్రంలో జతకట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుందట. లేటెస్ట్గా సాయిపల్లవి శేఖర్ కమ్మలు దర్శకత్వంలో లవ్‌స్టోరీ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ మూవీ రిలీజ్‌కు బ్రేక్ పడింది. చదవండి : శేఖర్ కమ్ముల మూవీపై స్పందించిన ధనుష్ శేఖర్ కమ్ముల సినిమా: ధనుష్ రెమ్యునరేషన్ ఎంతంటే..! -
శేఖర్ కమ్ముల సినిమా: ధనుష్ రెమ్యునరేషన్ ఎంతంటే..!
కోలివుడ్ స్టార్ హీరో ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో ఓ త్రిభాష చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. దినికి సంబంధించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెల్లడైంది. ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు... శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రం తెరకెక్కనుందని మేకర్స్ తెలియజేశారు. ఎవరు ఊహించని కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై అప్పుడే పుకార్లు మొదలయ్యాయి. ఈ మూవీ కోసం ధనుష్ భారీ రెమ్యునరేషన్ తీసుకోతున్నాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు గాను ధనుష్ 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం తెలియ రావట్లేదు. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరీ’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. ధనుష్ బాలీవుడ్లో ‘అత్రాంగి రే’, హాలీవుడ్లో ‘ది గ్రే మ్యాన్’ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన వెంటనే శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. చదవండి: శేఖర్ కమ్ముల మూవీపై స్పందించిన ధనుష్ ప్రశాంత్ వర్మ హనుమాన్ : కీలక పాత్రలో 'జయమ్మ' -
శేఖర్ కమ్ముల మూవీపై స్పందించిన ధనుష్
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ కలిసి ఓ త్రిభాష చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టుపై ధనుష్ స్పందించారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ‘నేను ఆరాధించే దర్శకులలో ఒకరు శేఖర్ కమ్ములతో కలిసి పని చేయడం ఎగ్జైటింగ్ గా ఉంది. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు లతో చేతులు కలపడానికి కూడా సంతోషిస్తున్నాను. వి.ఎస్.వి.సి.ఎల్.ఎల్.పి. బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ త్రిభాషా చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను” అంటూ ధనుష్ ట్వీట్ చేశారు. ధనుష్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇది. ఇందులో సాయిపల్లవి హీరోయిన్గా నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత ఉందో చూడాలి మరి. చదవండి: ఇట్స్ అఫిషియల్: ధనుష్‌తో శేఖర్ కమ్ముల త్రిభాషా చిత్రం ‘జగమే తంత్రం’ మూవీ రివ్యూ -
ఇట్స్ అఫిషియల్: ధనుష్‌తో శేఖర్ కమ్ముల త్రిభాషా చిత్రం
పుకార్లే నిజమయ్యాయి. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ కలిసి ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా అఫీషియల్ ప్రకటన ఈ రోజు వెలువడింది. ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు... శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రం తెరకెక్కనుందని మేకర్స్ తెలియజేశారు. ధనుష్ తెలుగులో నటిస్తున్న తొలి స్ట్రైయిట్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితర వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరీ’ పనుల్లో బిజీగా ఉన్నారు. ధనుష్ బాలీవుడ్లో ‘అత్రాంగి రే’, హాలీవుడ్లో ‘ది గ్రే మ్యాన్’ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన వెంటనే శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. The two Men who crossed the barriers to Celebrate Cinema 🎥 The National Award Winners @dhanushkraja 🤩 & @sekharkammula 🔥 collaborating for a Tamil-Telugu - Hindi Trilingual FILM Proudly Produced by #NarayanDasNarang & #PuskurRamMohanRao under @SVCLLP Banner ! pic.twitter.com/GcBkGqzd1R — Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) June 18, 2021 -
శేఖర్ కమ్ములకు కోపం వస్తే... సీక్రెట్ చెప్పిన చై.. నవ్వులే నవ్వులు
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఏప్రిల్ 16న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఖాలీ సమయంలో దొరకడంతో ఈ మూవీ ప్రమోషన్స్ మొదలెట్టాడు శెఖర్ కమ్ముల. అందులో భాగంగా హీరో రానా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘నం.1 యారి’షోలో ‘లవ్‌స్టోరీ’ టీమ్ సందడి చేసింది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ప్రసారమయ్యే ఈ షోలో శేఖర్ కమ్ముల గురించి హీరో చైతన్య, హీరోయిన్ సాయిపల్లవి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సెట్లో ఆయన ఎలా ఉంటాడు. కోపం వస్తే ఏం చేస్తాడు తదితర విషయాలను బయటపెట్టారు. శేఖర్ కమ్ముల ప్రత్యేక ఏంటని సాయిపల్లవిని అడగ్గా.. ఆయన విషయంలో తాను కొంచెం పొసెసీవ్ అని చెప్పింది. నేను సెట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా చైని మెచ్చుకుంటే నేను శేఖర్ కమ్ములగారి వైపు కోపంగా చూస్తుంటా. అసలు నాకు సంబంధం లేని విషయాల్లో కూడా ఆయనకు సలహాలు ఇస్తాను. ఆయన దానికి ఎలా స్పందిస్తారా..? అని ఎదురుచూస్తుంటా’అని సాయిపల్లవి చెప్పింది. ఇక శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. తాను ఎవరిని ఎక్కువగా పొగడనని, గుడ్ అని చెప్పానని, నచ్చకపోతే మానిటర్ దగ్గర నుంచి వెళ్లిపోతానని శేఖర్ చెబుతుండగా నాగచైతన్య కల్పించుకొని ‘దాదాపు గుడ్ అంటారు. ఈ మధ్య ‘యాక్’అనే పదం కూడా నేర్చుకున్నాడు’ అని అనడంలో అంతా ఘొల్లున నవ్వారు. ఇక రానా స్పందిస్తూ.. ఇది కొత్త పదం అని, తాను మాత్రం ‘యాక్’ అనిపించుకునేంత దారుణంగా ఎప్పుడూ చేయలేదనడంతో షోలో నవ్వులు పూశాయి. -
సారంగదరియా వివాదం.. శేఖర్ కమ్ముల భావోద్వేగం..
క్లాసిక్ చిత్రాలతో హిట్ కొట్టే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఎలాంటి కమర్షయల్ ఎలిమెంట్స్ లేకున్నా విజయవంతమైన సినిమాలు తీయడంలో ఆయనది ప్రత్యేక స్టైల్. ఆయన రూపొందించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా ట్రైలర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న శేఖర్ కమ్ముల తాను డైరెక్ట్ చేసిన సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటగా ఫిదా మూవీని మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌లకు చెప్పానని, వాళ్లు ఆ కథను రిజెక్ట్ చేశారని దీంతో ఆ ప్రాజెక్ట్ వరుణ్‌తేజ్ దగ్గరకు వెళ్లిందని పేర్కొన్నారు. ఇక తన ఫస్ట్ మూవీ ఆనంద్ తనకు ఎంతో స్పెషల్ అని, ఈ సినిమా చిరంజీవి నటించిన 'శంకర్ దాదా' ఒకే రోజు రిలీజ్ అయ్యాయని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా రిలీజైన వారం తర్వాత పలువురు పొగడ్తలతో ముంచేశారని, ఆ సినిమా సూపర్‌హిట్ అవుతుందనే నమ్మకం తనకు ముందు నుంచీ ఉందని పేర్కొన్నాడు. ఇక లవ్‌స్టోరి సినిమాలోని సారంగదరియా వివాదంపై స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: చిత్రం సీక్వెల్.. మరో ఉదయ్‌కిరణ్ దొరికేశాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, ఆ వార్తల్లో నిజం లేదు -
తస్సాదియ్యా! నాగచైతన్య సినిమాకు అంత బిజినెస్సా?
సాయిపల్లవి.. ఈ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చే పాట 'వచ్చిండే, మెల్ల మెల్లగ వచ్చిండే..' కానీ 'లవ్ స్టోరీ' సినిమా పుణ్యాన ఇప్పుడామె పేరు చెప్తే చాలు 'దాని పేరే సారంగదరియా..' అంటూ ఫోక్ సాంగ్‌ను గుర్తు చేసుకుంటూ స్టెప్పులేస్తున్నారు. ఆ జానపద పాట, అందులో సాయిపల్లవి డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్ ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపిస్తోందని అభిమానులు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. పాటే ఇంత బాగుంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందోనని సినిమా రిలీజ్ అయ్యే ఏప్రిల్ 16 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 'ఫిదా' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో ఈ 'లవ్ స్టోరీ' మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ఆంధ్రా హక్కులు రూ.15 కోట్లకు అమ్ముడుపోగా ఓవర్సీస్ హక్కులు రూ.6 కోట్లకు అమ్ముడైనట్లు టాక్ వినిపిస్తోంది. నైజామ్‌లో కూడా మంచి ధర పలికేది కానీ ఇక్కడ ఆసియన్ మూవీస్ సొంతంగా రిలీజ్ చేస్తుందట. మొత్తంగా ఈ సినిమా అప్పుడే 50 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇవి కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే కాగా, ఇవి కాకుండా నాన్ థియేటర్ హక్కులు ఉండనే ఉన్నాయి. మరి ఓవరాల్‌గా ఈ సినిమా ఎంత మార్కెటింగ్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. చదవండి: సాయి పల్లవి ‘సారంగ దరియా’వచ్చేసింది -
సాయి పల్లవి ‘సారంగ దరియా’వచ్చేసింది
నాగచైనత్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మధ్య తరగతి అబ్బాయి, అమ్మాయి చుట్టూ తిరిగే ఈ ప్రేమకథా చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలకు మంచి ఆదరణ లభించింది. తాజాగా ‘లవ్ స్టోరి’ నుంచి మూడో పాటను స్టార్ హీరోయిన్ సమంత ఆదివారం విడుదల చేసింది. ‘ఈ సీజన్లో డాన్స్ సాంగ్‌ను విడుదల చేస్తున్నాను. సాయిపల్లవి నువ్వు మెస్మరైజ్ చేశావు’ అంటూ సాయిపల్లవిని పొగుడుతూ సమంత ఈ పాటను విడుదల చేసింది. ‘సారంగ దరియా’ అంటూ సాగే ఈ మాస్ సాంగ్‌కు నాచ్యురల్ బ్యూటీ సాయిపల్లవి అదిరిపోయే స్టెప్పులేసింది. ‘ఫిదా’ సినిమాలోని ‘వచ్చిండే.. మెల్లమెల్లగా వచ్చిండే’ మాదిరి ఈ పాట కూడా సినిమాకు హైలెట్‌గా నిలవనుంది. ఈ పాట ఎంత బాగుందో.. సాయి పల్లవి ఫెర్ఫార్మెన్స్ కూడా అంతే బాగుంది. తెలంగాణ ఫోక్ జానపదం మాదిరి సాగే ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించగా, మంగ్లీ ఆలపించింది. పవన్ సీహెచ్సంగీతం అందించారు. ఏప్రిల్ 16న చైతూ, సాయి పల్లవిల ‘లవ్‌స్టోరి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
గుండెల్ని పిండేస్తున్న ‘లవ్‌స్టోరీ’ మెలోడీ
యంగ్ హీరో నాగచైనత్య, నాచ్యురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మధ్య తరగతి అబ్బాయి, అమ్మాయి చుట్టూ తిరిగే ఈ ప్రేమకథా చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఒక పాట, టీజర్ మంచి ఆదరణ అభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నీ చిత్రంచూసి’ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆదివారం విడుదలైన ఈ మెలోడి సాంగ్ గుండెల్ని పిండేస్తుంది. ఈ అద్భుతమైన పాటకు మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ అందించగా, ప్రముఖ గాయకుడు కులకర్ణి ఆలపించారు. పవన్ సీహెచ్సంగీతం అందించారు. ఏప్రిల్ 16న చైతూ, సాయి పల్లవిల ‘లవ్‌స్టోరి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
హైదరాబాద్‌ను నిజంగా ప్రేమిస్తే : దర్శకుడు శేఖర్ కమ్ముల
సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం రేపటి(ఆదివారం)తో ముగియనున్న సందర్భంగా రాజకీయ పార్టీల ప్రచార హోరు సాగుతోంది.అటు సోషల్ మీడియాలో సెలబ్రిటీల సందేశాల జోరు కూడా పెరిగింది. ఓటు హక్కు వినియోగంపై ఉత్సాహాన్ని రేకెత్తించేలా విడియోలను పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉరుకుపరుగుల జీవితంలో బిజీ బిజీగా గడిపే నగరవాసుల్లో ఓటు హక్కు వినియోగం శాతం పెంచేలా చైతన్యాన్ని కలిలిస్తున్నారు. ఈ విషయంలో ప్రముఖ యాంకర్ ఉదయ భాను ముందు వరుసగా నిలిచారు. తాజాగా మంచి కాఫీ లాంటి ‘ఆనంద్’ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన శేఖర్ కమ్ముల ఎన్నికలకు సంబంధించి మంచి సందేశంతో ముందుకొచ్చారు. మన నగరాన్ని నిజంగా ప్రేమిస్తే.. మనం తప్పకుండా డిసెంబరు 1 వతేదీన తప్పకుండా ఓటు వేయాలని ఆయన కోరారు. (లక్షలకు లక్షలు దోచేస్తారు : ఉదయభాను వీడియో) -
బర్త్‌డే స్పెషల్ : నాగ చైతన్య న్యూ లుక్
సాక్షి, హైదరాబాద్: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య పల్లెటూరి గెటప్‌లో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. చేతూ పుట్టిన రోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ''లవ్ స్టోరి'' స్పెషల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. లుంగీ, బనియన్‌తో పల్లెటూరి యువకుడి పాత్రలో నాగ చైతన్య లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కొందరితో స్నేహాలు చాలా బావుంటాయి. చైతూతో అసోసియేషన్ అలాంటిదే.. థ్యాంక్యూ.. హ్యాపీ బర్త్ డే చైతన్య'' అంటూ 'లవ్ స్టోరి'' చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల చేకు శుభాకాంక్షలు తెలిపారు. నాగ చైతన్యకు జోడిగా సాయిపల్లవి నటిస్తోంది. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు నాగ చైతన్య తన శ్రీమతి, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా అక్కినేనితో కలిసి మాల్దీవుల్లో విహారయాత్రలో ఉన్నారు. అయితే తన హబ్బీ పుట్టినరోజు సందర్భంగా, సమంతా బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న అద్భుతమైన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. అంతకుముందు స్కూబా డైవింగ్ కోసం సిద్ధమవుతున్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. Some associations are meant to be cherished ...... Thank you .. Happy Birthday Chaitanya ...#HBDNagaChaitanya @chay_akkineni#lovestory #nagachaitanya #saipallavi pic.twitter.com/bfJYFXn4PR — Sekhar Kammula (@sekharkammula) November 23, 2020 . View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) -
దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్లో విషాదం
ప్రముఖ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) శనివారం ఉదయం 6 గంటలకు ఆస్సత్రిలో కన్నుమూశారు. కాగా ఆయన అంత్యక్రియలు ఈ రోజు సాయంత్ర బన్సీలాల్ పేట స్మశాన వాటికలో నిర్వహించనున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖుల తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. -
కాంబినేషన్ కుదిరిందా?
ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలరు వెంకటేష్. తన కథలో ప్రేక్షకులను లీనం చేయగలుగుతారు దర్శకుడు శేఖర్ కమ్ముల. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కడానికి సన్నాహాలు మొదలు కాబోతున్నాయనేది ఫిల్మ్‌నగర్ టాక్. ఈ లాక్డౌన్ సమయంలో ఓ స్క్రిప్ట్‌ను రెడీ చేశారట శేఖర్ కమ్ముల. ఈ కథలో వెంకటేష్ హీరోగా నటించబోతున్నారట. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్ ‘నారప్ప’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. అలాగే నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరీ’ అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
శేఖర్ కమ్ముల తదుపరి చిత్రం ఫిక్స్
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. మరో 15 రోజుల షూటింగ్ మిగిలి ఉండగా లాక్‌డౌన్‌తో అన్నీ వాయిదా పడ్డాయి. అయితే ఈ చిత్రం నిర్మాణదశలో ఉండగానే తన తర్వాతి సినిమాను కన్ఫార్మ్ చేశారు శేఖర్ కమ్ముల. అది కూడా ‘లవ్ స్టోరీ’ చిత్ర నిర్మాతతోనే. ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో నటించనున్నారని సమాచారం. సినిమా సినిమాకు గ్యాప్ తీసుకునే శేఖర్ కమ్ముల ఈ సారి లాక్డౌన్ విరామంలో తన తర్వాతి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను పూర్తి చేసుకున్నారు. లవ్ స్టోరీ మూవీ కంటెంట్ మీదున్న నమ్మకం, శేఖర్ పనితనం నచ్చిన ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ తమ తరవాత సినిమా కూడా శేఖర్ ను చేయమని కోరగానే.. ఆయన వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అవ్వగానే ఈ మూవీ పట్టాలెక్కనుంది. చదవండి: నాగబాబు మరో సంచలన ట్వీట్: వైరల్ అక్కినేని ‘మనం’.. ఎన్నేళ్లైనా మరువం -
తెరపై ‘గోదావరి’ : అందరి మనసుల్లో పదిలంగా
సుమంత్, కమలినీ ముఖర్జీ జంటగా తెరపై కనిపించిన చిత్రం ‘గోదావరి’. విభిన్న శైలి కలిగిన శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్‌ఎస్‌ఆర్ట్స్‌పై జివిజి రాజు నిర్మించారు. రాజమండ్రి నుంచి లాంచీలో భద్రాచలం వరకు జరిగిన ఈ రీల్ ప్రయాణంలో, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని అతి సుందరమైన అందాలను చూపిస్తూ, సున్నితమై మనసులు, కుటంబాల మధ్య ఉండే భావోద్వేగాలను సహజత్వానికి దగ్గరగా, కమర్షియల్ పంథాకు దూరంగా ఉండే ‘గోదావరి’ చిత్రం విడుదలై నేటికి పద్నాలుగేళ్లు పూర్తయింది. సున్నితమైన ఎమోషన్స్, సహజత్వానికి దగ్గరంగా ఉండే సంభాషణలు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సంగీత దర్శకుడు కె.ఎం.రాధాకృష్ణన్ అందించిన ప్రతి పాట సుమధురమైనదే. నేపథ్య సంగీతం ఈ సినిమాకు ఆయువుపట్టు అనే చెప్పాలి. ఈ చిత్రం పూర్తిగా శేఖర్ కమ్ముల స్టైల్లో మంచి సంగీతంతో కూడిన ఓ ఫీల్‌గుడ్‌మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ విశేష ప్రేక్షకాదారణ లభిస్తూనే ఉంది. విడుదలై ఏళ్లు గడుస్తున్నా ఈ చిత్రం టీవీల్లో వచ్చిందంటే రిమోట్ పక్కకు పడేసి ఛానల్ మార్చకుండా ఆసక్తిగా చూస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది అంటూ పద్నాలుగేళ్ల కిత్రం వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ తన చల్లదనాన్ని అభిమానులకు పంచుతూ వారిని రిలాక్స్ మూడ్‌లోకి తీసుకెళుతుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, సాంకేతిక నిపుణులు పడిన కష్టానికి ప్రతిఫలం సినిమా ఘన విజయం సాంధించడంతో పాటు ఏకంగా ఆరు నంది అవార్డులను సొంతం చేసుకుంది. On its anniversary today, remembering #Godavari (May 19, 2006) pic.twitter.com/poayRKoEn2 — Sumanth (@iSumanth) May 19, 2020 చదవండి: హీరో సూర్య నిర్ణయం: దర్శకుడి ప్రశంసలు హరీశ్ మరో చిత్రం.. పవన్ ఫ్యాన్స్‌కు డౌట్ -
హిజ్రాలకు శేఖర్ కమ్ముల చేయూత
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న హిజ్రాలను ఆదుకునేందుకు తన వంతు సాయాన్ని అందించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇప్పటికే ఆయన జీహెచ్ఎంసీ, కర్నూలు పారిశుద్య కార్మికులకు నెలరొజుల పాటు బాదం పాలు, మజ్జిగ అందజేసి తనవంతు సాయం చేస్తూ అందరికీ ఆదర్శకంగా నిలుస్తున్నారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని హిజ్రాలను ఆదుకునేందుకు ఆయన ముందుకు వచ్చారు. అంతేకాకుండా వీళ్లకు సహాయం చేయడానిఇక మరికొంతమంది ముందుకు రావాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. ‘ఈ లాక్డౌన్ సమయంలోలో అత్యంత ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ట్రాన్స్జెండర్లు. వాళ్లు పడుతున్న కష్టాలని ఊహించలేం కుడా. అన్నం లేక, ఉంటానికి గూడు దొరక్క, అద్దెలు కట్టుకోలేక చాలా బాధలు పడుతున్నారు. ఇవి కాక సమాజంలో వారి పట్ల ఉండే వివక్ష, అపోహలతో వాళ్ల ఇబ్బందుల్ని ఇంకా పెంచుతున్నాయి. వాళ్లకి అడ్రస్ ఉండదు. ఓటర్ కార్డ్ ఉండదు. రేషన్ కార్డ్ ఉండదు. హెల్త్‌కేర్ పథకాలు వర్తించవు. సెన్సిటివ్ గా ఉందాం. వాళ్ళని సపోర్ట్ చేద్దాం. ఎవరన్నా కాంటాక్ట్ చేయాలి అంటే rachanamudraboyina@gmail.comకు మెయిల్ చేయండి’అంటూ శేఖర్ కమ్ముల ట్వీట్ చేశారు. ఇక శేఖర్ కమ్ముల చేసిన సాయానికి కృతజ్ఞతగా హిజ్రాలు ‘థాంక్యూ శేఖర్ కమ్ముల’ అంటూ ప్లకార్డులు పట్టుకొని తమ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేశారు. మరింత మంది తమను ఆదుకునేందుకు ముందుకురావాలని కోరారు. #rachanamudraboyina pic.twitter.com/YKQ12IjKpY — Sekhar Kammula (@sekharkammula) May 15, 2020 చదవండి: హరీష్‌పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు భార్యకు విడాకులు.. గాయనితో 9 ఏళ్లుగా -
ఇది నాకు అతి పెద్ద బహుమతి: శేఖర్ కమ్ముల
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములకు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు తమదైన శైలిలో కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిరోజు తమకు శీతల పానియాలు అందిస్తున్నందుకుగానూ గాంధీ ఆస్పత్రి వద్ద ఆయన పేరుతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బుధవారం ట్విటర్ వేదికగా దీనిపై స్పందించిన శేఖర్ కమ్ముల ‘‘ గాంధీ ఆస్పత్రి వద్ద జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు నా కోసం ఇలా చేయటం వెలకట్టలేనిది. ఇది నాకు అతి పెద్ద బహుమతి. నేను చేసిన ఓ పని మిమ్మల్ని కదిలించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ, మీరు రాత్రింబవళ్లు మా కోసం చేస్తున్న దాంతో పోల్చుకుంటే ఇదేం పెద్ద విషయం కాదు. ( రానా పెళ్లిపై సురేష్ బాబు క్లారిటీ ) I'm overwhelmed....... This is a priceless guesture from the GHMC sanitation workers at Gandhi Hospital ......my biggest award. I feel extremely happy that I could do something that touched you but it's nothing compared to what you do for us, day in and day out. pic.twitter.com/EkYAz8Wbnf — Sekhar Kammula (@sekharkammula) May 13, 2020 కాగా, మండే ఎండలను సైతం లెక్క చేయకుండా కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న గాంధీ ఆస్పత్రి పరిధిలోని జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల కోసం శీతల పానియాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు శేఖర్ కమ్ముల. దాదాపు 1000 మందికి బట్టర్ మిల్క్, బాదాం మిల్క్ అందిస్తున్నారు. ఓ నెల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. అంతేకాకుండా కర్నూల్ టౌన్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు కూడా శీతల పానియాలను అందిస్తున్నారాయన. -
ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా..
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌స్టోరి’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ‘ఏయ్ పిల్లా..’ అంటూ సాగే పాట ప్రివ్యూను విడుదల చేశారు. ఇందులో నాగచైతన్యకు ముద్దు పెట్టిన అనంతరం ‘ఏంది ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా..’అని సాయిపల్లవి చెప్పే డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. అలాగే నాగచైతన్య, సాయిపల్లవిల మధ్య వచ్చే కొన్ని సీన్లను ఈ మ్యూజికల్ ప్రివ్యూలో ప్రధానంగా చూపెట్టారు. సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న పవన్ సీహెచ్ మంచి పాటను అందించినట్టుగా అర్థమవుతోంది. కాగా, ఈ చిత్రాన్ని ఎమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ్‌దాస్ కె. నారంగ్, పి. రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ చిత్రం.. వేసవిలో విడుదల కానుంది. -
కొత్త కాంబినేషన్
‘మజిలీ, వెంకీ మామ’ సినిమాల సక్సెస్‌తో జోష్ మీద ఉన్నారు నాగచైతన్య. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. ఇది నాగచైతన్య కెరీర్లో 20వ చిత్రం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘గీత గోవిందం’ చిత్రం తర్వాత పరశురామ్ తెరకెక్కించనున్న చిత్రమిదే. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని చిత్రబృందం తెలిపింది. -
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల సినిమా ప్రారంభం
-
శేఖర్ కమ్ముల కొత్త సినిమా ప్రారంభం
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా పూజ కార్యక్రమాలు సికింద్రాబాద్ వినాయకుడి ఆలయంలో జరిగాయి. ఫిదా వంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న శేఖర్ ఆ తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. వారి ఆసక్తిని డబుల్ చేస్తూ క్రేజీ కాంబినేషన్ తో సినిమా చేయబోతున్నాడు శేఖర్ కమ్ముల. మజిలీ వంటి సూపర్ హిట్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తోన్న నాగచైతన్య హీరోగా ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా సినిమా రూపొందుతుండటంతో ప్రాజెక్ట్ పై క్రేజ్ పెరిగింది. డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభం అయిన ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ఆడియన్స్ ముందుకు రానుంది. సెప్టెంబర్ తొలివారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
మళ్లీ ఫిదా చేసేందుకు శేఖర్ కమ్ముల రెడీ!
క్లాస్ సినిమాలను తీస్తూ.. ప్రతీ ఫ్రేమ్‌లో ఆయన మార్క్‌ను కనపడేలా చిత్రాన్ని తెరకెక్కించడం శేఖర్ కమ్ముల ప్రత్యేకత. గతేడాది ఫిదాతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న శేఖర్ కమ్ముల ఇంతవరకు మరో ప్రాజెక్టును చేపట్టలేదు. అయితే రీసెంట్గా తన కొత్త మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్దమవుతున్నాడు. మళ్లీ కొత్తవారితో ప్రయోగం చేయడానికి రెడీ అవుతున్న శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని కూడా తనదైన శైలిలో ఓ మంచి ప్రేమకథా చిత్రంగా మలచబోతున్నట్లు సమాచారం. ఈ మూవీకి సంబంధించిన పూజ కార్యక్రమాలు సోమవారం సికింద్రాబాద్ లోని గణేష్ ఆలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల తో పాటు నిర్మాతలు సునీల్ నారంగ్, పి.రామ్మోహన్, కో ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్, భరత్ నారంగ్, సదానంద్ పాల్గొన్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలు కానుంది. -
‘విరాజ్ మంచి హీరో అవుతాడు’
విరాజ్ జె అశ్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ టి.ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అనగనగా ఓ ప్రేమకథ. కె.సతీష్ కుమార్ సమర్పణలో కె.ఎల్.యన్.రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రిద్ధి కుమార్ ,రాధా బంగారు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర సంబంధించిన టైటిల్ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ..‘అనగనగా ఓ ప్రేమకథ లోని టైటిల్ సాంగ్ ను విడుదల చేయటం ఎంతో ఆనందంగా ఉంది. పాటకు సమకూర్చిన సంగీతం, సాహిత్యం ఎంతో బాగుంది. మార్తండ్ కే వెంకటేష్ గారి మేనల్లుడు అయిన విరాజ్ అశ్విన్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, మార్తండ్ కే వెంకటేష్ గారితో నేను చాల సినిమాలు పని చేశాను. తప్పకుండా విరాజ్ అశ్విన్ మంచి హీరో అవుతాడు అని నమ్మకం ఉంది . డైరెక్టర్ ప్రతాప్‌కి బెస్ట్ విషెస్ చెపుతూ, ఈ సినిమా ని హిట్ ఇవ్వాలి అని కోరుకుంటున్న’ అన్నారు . తమ చిత్రంలోని పాటను దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు. -
మరో రికార్డ్ ‘ఫిదా’
మెగా హీరో వరుణ్ తేజ్, మల్లార్ బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా నటించిన చిత్రం ఫిదా. ఘనవిజయం సాధించిన ఈ సినిమా బడ్జెట్ కు మించి ఎన్నో రెట్లు కలెక్ట్ చేసిన భారీ రికార్డులు నమోదు చేసింది. చాలా కాలం తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా, వరుణ్ తేజ్ కు మంచి కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయి చాలా కాలం గడుస్తున్నా ఇప్పటికే ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ సినిమా వీడియో సాంగ్స్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. సినిమాలోని ‘వచ్చిండే.. ’ పాట ఏకంగా 150 మిలియన్ల (పదిహేను కోట్ల) వ్యూస్ సాధించి సత్తా చాటింది. శక్తికాంత్ కార్తీక్ సంగీత సారధ్యంలో మధుప్రియ, రాంకీలు ఆలపించిన ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ సాహిత్యమందించారు. -
చిత్ర నిర్మాణ రంగంలోకి ఏషియన్ గ్రూప్
యాభైఏళ్లుగా 600ల సినిమాలకు ఫైనాన్స్ అందించి, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో అగ్రగామి సంస్థగా ఎదిగిన ఏషియన్ గ్రూప్ ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏషియన్ సంస్థ ఓ చిత్రం నిర్మించనుంది. ఈ లవ్ స్టోరీకి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి నిర్మాతలుగా నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు (తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్) వ్యవహరించనున్నారు. ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల చేయబోయే ప్రాజెక్ట్‌పై అటు ఇండ్రస్టీలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. కంటెంట్‌ని తప్ప క్రేజ్‌ని నమ్ముకోని శేఖర్ కమ్ముల నుంచి రాబోతున్న ఈ ప్రేమకథకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. అమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: విజయ్ భాస్కర్. -
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: మోస్ట్ పాపులర్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్ శేఖర్ కమ్ముల
-
టాలీవుడ్‌కి ధృవ్?
కోలీవుడ్, టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విక్రమ్. ఆయన తనయుడు ధృవ్ తమిళంలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్ ‘వర్మ’తో ధృవ్ కోలీవుడ్‌కి హీరోగా పరిచయమవుతున్నారు. బాలా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలో ధృవ్ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్నారట. అది కూడా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో అని సమాచారం. ‘ఫిదా’ సినిమా విడుదలై దాదాపు ఏడాది కావస్తున్నా తర్వాతి చిత్రంపై శేఖర్ ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు. ‘ఫిదా’ తర్వాత ఓ స్టార్ హీరోతో పనిచేయనున్నట్లు అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి. తాజా సమాచారం ప్రకారం ధృవ్ హీరోగా శేఖర్ కమ్ముల ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. డ్యాన్స్ నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందట. -
తమిళ ‘అర్జున్ రెడ్డి’తో శేఖర్ కమ్ముల..!
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్లో ధృవ్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత ధృవ్ ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. విక్రమ్‌కు తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే తన వారసుడ్ని రెండు భాషల్లో పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తమిళ్లో బోల్డ్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ధృవ్, తెలుగులో అందుకు భిన్నంగా ఓ క్లాస్ దర్శకుడితో సినిమా చేయనున్నాడు. కాఫీ లాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధృవ్ టాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా డ్యాన్స్ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
నాకేం సంబంధం లేదు : శేఖర్ కమ్ముల
సాక్షి, హైదరాబాద్: ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. వెంటనే సైబర్ నేరగాళ్లు దీన్ని క్యాష్ చేసుకున్నారు. శేఖర్ పేరుతో క్వికర్‌లో నటీనటులు కావాలంటూ ప్రకటన ఇచ్చి అందినకాడికి దండుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘నేను రూపొందిస్తున్న కొత్త సినిమాలో నటించడానికి యువతీయువకులు కావాలి’ అంటూ శేఖర్ పేరుతో నెల క్రితం క్వికర్‌లో ఓ ప్రకటన వెలువడింది. సాధారణంగానే శేఖర్ కమ్ముల రూపొందించే చిత్రాల్లో కొత్త వారికి అవకాశాలు ఇస్తుంటారు. దీంతో ఈ ప్రకటన నిజమని నమ్మిన రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు ఆ పోస్ట్‌లో ఉన్న నంబర్‌ను సంప్రదించారు. ఫోన్లు రిసీవ్ చేసుకున్న వ్యక్తి.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి రూ.4 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించాడు. ముందుగా రూ.2 వేల వరకు తన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాలని, ఆపై ఈ నెల 25న తుది ఇంటర్వ్యూ హైదరాబాద్‌లో ఉంటుందని నమ్మబలికాడు. ఆ రోజు మిగిలిన మొత్తం చెల్లించాలని చెప్పాడు. దీనికి స్పందించిన వేలాది మంది మోసగాడు సూచించిన ఖాతాలో డబ్బు డిపాజిట్ చేశారు. విషయం వెలుగులోకి వచ్చిందిలా.. సోమవారం(25న) ఒంగోలుకు చెందిన ప్రదీప్ నగరానికి వచ్చి శేఖర్ కమ్ములను కలిశారు. మొదట డిపాజిట్ చేసింది పోగా మిగిలిన మొత్తం చెల్లిస్తానని, తనను ఇంటర్వ్యూ చేయాలని ఆయన్ను కోరారు. దీంతో అవాక్కైన శేఖర్ ఆరా తీయగా ప్రదీప్ అసలు విషయం చెప్పారు. అది మోసపూరిత ప్రకటన అని, తనకు సంబంధం లేదని చెప్పిన శేఖర్ కమ్ముల సైబర్ క్రైమ్స్ అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. -
మనందరి కథలా ఉంది : శేఖర్ కమ్ముల
విభిన్న కథలతో వరుస విజయాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నీదీ నాదీ ఒకే కథ. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బిచ్చగాడు ఫేం సట్నా టైటస్ హీరోయిన్ గా నటించింది. నారా రోహిత్ సమర్పణలో ప్రశాంతి, కృష్ణ విజయ్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల కోసం ప్రత్యేకం ప్రదర్శించారు. సినిమా చూసిన శేఖర్ కమ్ముల చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. సమాజానికి అవసరమైన కథను ఎంతో అందంగా రూపొందించిరనందుకు యూనిట్ సభ్యులకు హ్యాట్సాఫ్ అన్నారు. ప్రస్తుతం సొసైటీలో గెలిచిన వాళ్లకే కెరీర్ ఉంటుందని, ఓడిపోయిన వాళ్లను ఎందుకు పనికి రానివారిగా చూస్తున్నారని.. అలాంటి సంఘటనలను మనసుకు హత్తుకునేలా చిత్రీకరించారని తెలిపారు. శ్రీవిష్ణు యాక్టింగ్ గత చిత్రాల కన్నా ఇంకా బాగుంది. ఇలాంటి సినిమాలు సమాజానికి అవసరమన్నారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - శేఖర్ కమ్ముల
-
బిగ్హిట్
-
శేఖర్ కథకు అర్జున్ రెడ్డి ఫిదా
‘అర్జున్ రెడ్డి’ సినిమాకు ఫిదా కానిది ఎవరు చెప్పండి. ‘అర్జున్ రెడ్డి’ పాత్రలో కనిపించిన ‘విజయ్ దేవరకొండ’ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ‘అర్జున్ రెడ్డి’ సాధించిన సంచలన విజయం తన దిశనే మార్చేసింది. చేతినిండా ఆఫర్లతో బిజీ బిజీగా ఉన్నారు విజయ్. ఆల్రెడీ పట్టాల మీద నాలుగు సినిమాలు ఉన్నాయి. అవి కాకుండా చర్చల దశలో మరికొన్ని ఉన్నాయి. రీసెంట్గా విజయ్ దేవరకొండకు శేఖర్ కమ్ముల కథ వినిపించారట. అన్నీ కుదిరితే ఆ సినిమాను విజయ్ దేవరకొండ హోమ్ ప్రొడక్షన్స్‌లో స్వయంగా నిర్మించొచ్చని సమాచారం. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రంలో హీరో గ్యాంగ్‌లో చిన్న పాత్రలో కనిపించారు విజయ్. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే హీరోగా నటించనుండటం విశేషం. -
'ఫిదా' అయిన ఓవర్ సీస్
మెగా హీరో వరుణ్ తేజ్, మల్లార్ బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా నటించిన తాజా చిత్రం ఫిదా. ఘనవిజయం సాధించిన ఈ సినిమా స్టార్ హీరోల రికార్డులను సైతం బద్ధలు కొడుతూ దూసుకుపోతోంది. చాలా కాలం తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా, వరుణ్ తేజ్ కు మంచి కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా ఓవర్ సీస్ లో 2,000,159 డాలర్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్లతో 2 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరిన 7వ తెలుగు సినిమాగా ఫిదా నిలిచింది. ఫిదా కన్నా ముందు బాహుబలి రెండు భాగాలు, ఖైదీ నెం 150, నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు, అ..ఆ.. సినిమాలు ఉన్నాయి. చాలా మంది స్టార్ హీరోలకు, భారీ బడ్జెట్ చిత్రాలకు కూడా అందని రికార్డ్ ను సొంతం చేసుకొని ఫిదా చరిత్ర సృష్టించింది. -
ఫిదా బ్యూటీ అప్పుడే రావాల్సింది..!
ఒక్క సినిమాతోనే తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేసేసింది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ బ్యూటి. తొలి సినిమాలోన తన నటనతో మంచి మార్కులు సాధించి వరుస ఆఫర్లతో బిజీ అయ్యింది. అయితే ఈ బ్యూటీని చాలా రోజుల కిందటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం చేశాడు, దర్శకుడు శేఖర్ కమ్ముల. తన దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా కోసం సాయి పల్లవిని సంప్రదించాడట శేఖర్. అయితే అప్పుడు సాయి పల్లవి ఎమ్బీబీయస్ చదువుతుండటంతో ఆ సినిమా చేసేందుకు సాయి పల్లవి అంగీకరించలేదు. తన కథలకు సాయి పల్లవి లాంటి నటి అయితే కరెక్ట్ అని భావించిన శేఖర్ మరోసారి ఫిదా కోసం సాయి పల్లవిని సంప్రదించాడు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసి స్టార్ గా మారిపోయింది ఈ మల్లార్ బ్యూటి. -
కలెక్షన్లు 'ఫిదా' చేస్తున్నాయ్..!
వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ ఫిదా. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా హీరోయిన్ సాయి పల్లవి పర్ఫామెన్స్‌కు ఆడియన్స ఫిదా అవుతున్నారు. క్లాస్ సినిమా దర్శకుడిగా తనకున్న ఇమేజ్ను కొనసాగిస్తూ శేఖర్ కమ్ముల రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్‌కు ఆ కోరిక తీరిందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ ఫిదా జోరు కనిపిస్తుంది. గురవారం రోజు ప్రదర్శించిన ప్రీమియర్ షోలతో కలిపి తొలి రోజు 35000 డాలర్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. పాజిటివ్ రివ్యూస్ వస్తుండటంతో లాంగ్ రన్లో మిలియన్ డాలర్ల మార్క్ అందుకుంటుదన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. తెలుగు రాష్ట్రాల్లోనూ ఫిదా కలెక్షన్ల జోరు కనిపిస్తుంది. ముఖ్యంగా మల్టీపెక్ట్స్ ప్రేక్షకులను ఈ సినిమా గట్టిగానే ఫిదా చేస్తోంది. -
'ఫిదా' మూవీ రివ్యూ
టైటిల్ : ఫిదా జానర్ : రొమాంటిక్ లవ్ స్టోరీ తారాగణం : వరుణ్ తేజ్, సాయి పల్లవి, సాయి చంద్, రాజా, శరణ్య ప్రదీప్ సంగీతం : శక్తికాంత్ దర్శకత్వం : శేఖర్ కమ్ముల నిర్మాత : దిల్ రాజు మెగా వారుసుడిగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్, చాలా కాలంగా మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆనంద్, హ్యాపిడేస్ లాంటి సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల తరువాత ఫాం కోల్పోయి కష్టాల్లో పడ్డాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఫిదా. సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఫిదా.. వరుణ్ కు కమర్షియల్ స్టార్ ఇమేజ్ తీసుకురావటంతో పాటు, దర్శకుడు శేఖర్ కమ్ములను సక్సెస్ ట్రాక్ ఎక్కించిందా..? కథ : అమెరికాలో డాక్టర్ చదువుతున్న వరుణ్ (వరుణ్ తేజ్).. అన్న రాజా, తమ్ముడు బుజ్జితో కలిసి ఉంటుంటాడు. తల్లీ తండ్రి లేకపోవటంతో వరుణ్, బుజ్జిలే రాజాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఉండే రేణుక (శరణ్య ప్రదీప్) అనే అమ్మాయితో రాజా పెళ్లి కుదురుతుంది. పెళ్లి కోసం ఇండియాకు వచ్చిన వరుణ్, పెళ్లి కూతురు చెల్లెలు భానుమతి (సాయి పల్లవి) తో ప్రేమలో పడతాడు. భానుమతికి కూడా వరుణ్ అంటే ఇష్టం కలుగుతుంది. కానీ తన తండ్రిని వదిలి వెళ్లటం ఇష్టం లేని భానుమతి, వరుణ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో వరుణ్ తన మామయ్య కూతురు శైలుతో క్లోజ్ గా ఉండటం చూసి మరింతగా దూరమవుతుంది. రాజా పెళ్లి తరువాత అన్నా వదినలతో కలిసి అమెరికా వెల్లినా వరుణ్, భానుమతిని మర్చిపోలేకపోతాడు. చివరకు భానుమతికి తన ప్రేమ గురించి చెప్పేస్తాడు. కానీ భానుమతి వరుణ్ కి నో చెపుతుంది. తరువాత వరుణ్, భానుమతి మనసు ఎలా గెలుచుకున్నాడు..? తండ్రి వదిలి వెల్లటం ఇష్టం లేని భానుమతి, వరుణ్ తో పెళ్లికి ఒప్పుకుందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : వరుణ్ తేజ్.. ఎన్నారై అబ్బాయిగా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. లవర్ బాయ్ లుక్స్ తో అదరగొట్టాడు. రొమాంటిక్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మలయాళీ బ్యూటీ సాయి పల్లవి అందరినీ ఫిదా చేసింది. తెలంగాణ అమ్మాయిగా రఫ్ అండ్ టఫ్ రోల్ లో మెప్పించింది. అల్లరి అమ్మాయిగా బబ్లీగా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్ లోనూ తనదైన నటనతో మెప్పించింది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన సాయిచంద్ తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. ఇతర పాత్రల్లో రాజా, శరణ్య ప్రదీప్, సత్యం రాజేష్ లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : కొంత గ్యాప్ తరువాత ఫిదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల మరోసారి తన మార్క్ చూపించారు. క్యూట్ లవ్ స్టోరిని తనదైన టేకింగ్ లో ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. తన స్టైల్ లోనే ఎలాంటి హడావిడి లేకుండా నెమ్మదిగా సాగే కథలో అద్భుతమైన ఎమోషన్స్ పండించారు. ఇప్పటి వరకు కాలేజ్, కాలనీ బ్యాక్ డ్రాప్ లనే ఎక్కువగా ఎంచుకున్న శేఖర్, ఈ సినిమాతో తెలంగాణ పల్లెటూళ్లను మరింత అందంగా చూపించాడు. కేవలం పరిస్థితులు, యాస మాత్రమే కాదు సాంప్రదాయాలను కూడా చాలా బాగా తెరకెక్కించాడు. శక్తికాంత్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచాయి. తెలంగాణ బాణీలో సాగే 'వచ్చిండే..' పాట విజువల్‌గా కూడా సూపర్బ్. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్, తెలంగాణ పల్లె వాతావరణాన్ని, అమెరికా లోకేషన్స్ ను చాలా అందంగా చిత్రీకరించాడు. మార్తండ్ కె వెంటేష్ ఎడిటింగ్ పరవాలేదు. సినిమా నిడివి ఇంకాస్త తగ్గించి ఉంటే మరింత ఆకట్టుకునేది. దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా రిచ్ గా సినిమాను తెరకెక్కించాడు. ప్లస్ పాయింట్స్ : వరుణ్, సాయి పల్లవి నటన కామెడీ, ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : సినిమా నిడివి క్లైమాక్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
ప్రేమకు ఫిదా : వరుణ్ తేజ్
-
నటిగా దర్శకుడి తల్లి
కాఫీలాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఫిదా. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. మలయాళీ బ్యూటి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీలకమైన పాత్రలో ఓ హిట్ దర్శకుడి తల్లి కనిపించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రకటించారు. పెళ్లి చూపులు సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ తల్లి గీత.. ఫిదా సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్నారు. గతంలో తరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన పలు షార్ట్ ఫిలింస్ లో కనిపించిన గీత.. తొలిసారిగా వెండితెర మీద కనిపించనున్నారు. ఈ సినిమా తరువాత తరుణ్ తల్లి గీత అని కాదు.. గీతగారి కొడుకే తరుణ్ అని చెప్పుకుంటారంటున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. -
బద్మాష్.. బల్సిందారా? బొక్కలిరగ్గొడతా!!
‘బద్మాష్.. బల్సిందారా? బొక్కలిరగ్గొడతా!!’ దూసుకెళుతున్న రైల్లో తలుపు వద్ద నిలబడి సాయిపల్లవి చూపిన ఫైర్ ఇది. కట్ చేస్తే.. ‘ఏం పిల్లరా.. వెళ్లట్లేదు మైండ్లోంచి.. జీవితాంతం ఎవరితోనో ఉండాలనుకుంటున్నావు కదా.. అదీ ఈమే’ అంటూ ‘ఫిదా’ అయిపోయిన వరుణ్‌తేజ్. మ్యాటర్ ఈపాటికి మీకు అర్థమైంది కదా? అందమైన కథలను అంతే అందంగా సినీ తెరపై చూపించే శేఖర్ కమ్ముల తాజా చిత్రం ‘ఫిదా’ టీజర్ ఇది. ఈ టీజర్లో లవ్లీ లుక్‌తో, రఫ్ డైలాగులతో సాయిపల్లవి రఫ్పాడించగా.. ఆమెను చూసి ‘ఫిదా’ అయిపోతూ వరుణ్ తేజ్ సినిమా ఎంత అందంగా ఉండబోతున్నదో హింట్ ఇచ్చాడు. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతోంది ఈ సినిమా టీజర్ శనివారం ఆన్లైన్లో విడుదలైంది. శేఖర్ కమ్ముల మ్యాజిక్ మార్క్ ఈ టీజర్లో చూడొచ్చు. మీరూ ఓ లుక్ వేయండి. -
షూటింగ్లో ఫిదా!
ఎన్నారైల కథలతో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. కానీ, అమెరికాలో ఉద్యోగం చేసి తిరిగొచ్చిన శేఖర్ కమ్ముల మాత్రం తెలుగు తెరపై తెలుగు సంప్రదాయాలను ఆవిష్కరించడానికి విలువిచ్చారు. ఇప్పుడు వరుణ్‌తేజ్ హీరోగా తీస్తున్న ‘ఫిదా’లోనూ ఆయన మార్క్ ప్రేమకథను చూపించబోతున్నారట! ‘ప్రేమ – ద్వేషం – ప్రేమకథ’ ఈ సిన్మాకు ఉపశీర్షిక. చిన్న ఛేంజ్ ఏంటంటే... కథకు ఎన్నారై టచ్ ఇచ్చారు. ‘ఫిదా’లో హీరో అమెరికన్ ఎన్నారై. తెలంగాణ అమ్మాయిను చూసి ఫిదా అవుతాడు. ప్రేమలో పడతాడు. తర్వాత ఏం జరిగిందనేది సినిమాలో చూడాలి. ప్రస్తుతం అయితే అమెరికాలో షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ స్పాట్లో దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో వరుణ్‌తేజ్, హీరోయిన్ సాయి పల్లవిల నవ్వులు చూస్తుంటే బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. అప్పట్లో అమెరికాలో శేఖర్ కమ్ముల చేసిన చిలిపి పనులను వరుణ్‌తేజ్‌కి చెబుతున్నారో లేదా సినిమాలో ఆ సీన్లను రాశారో! ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్ సంగీత దర్శకుడు. -
వరుణ్ బర్త్‌డే గిఫ్ట్, ఫిదా మోషన్ పోస్టర్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా నిర్మాత దిల్ రాజు ఫిదా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దిల్ రాజు నిర్మాణంలో శేఖర్ కమ్ముల దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మిస్టర్, ఫిదా సినిమాల షూటింగ్‌లను ఒకేసారి చేసేలా ప్లాన్ చేసినా.. ప్రమాదం కారణంగా వరుణ్ కొంత కాలం షూటింగ్‌లకు దూరం కావటంతో ఫిదాను వాయిదా వేశారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ సినిమా షూటింగ్ పూర్తికాగానే ఫిదాను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఫిదా సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తుండగా శక్తికాంత్ సంగీతం అందిస్తున్నాడు. -
వరుణ్ బర్త్‌డే గిఫ్ట్, ఫిదా మోషన్ పోస్టర్
-
'ఫిదా' బాన్సువాడ షెడ్యూల్ పూర్తి
డైరెక్టర్ శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'ఫిదా' మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుంది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో 'ప్రేమమ్' ఫేమ్ సాయి పల్లవి హీరోయిన్గా మెరవనున్నారు. ఎన్నారై కుర్రాడికి, తెలంగాణ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నిజామాబాద్ బాన్సువాడలో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నట్లు వరుణ్ తేజ్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలుకానుంది. శేఖర్ కమ్ముల మార్క్ స్వీట్ లవ్ స్టోరీగా 'ఫిదా' అలరించనుంది. Wrapped a super fun schedule of #Fidaa in banswada! Hyd it is! With @Sai_Pallavi92 and Shekar See you two soon!😊😊😊 pic.twitter.com/fFZcD5xD4u — Varun Tej (@IAmVarunTej) 8 September 2016 -
ఫిదా మొదలైంది
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్పీడు పెంచాడు. కెరీర్ స్టార్టింగ్‌లో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ డిఫరెంట్ అనిపించుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మాస్ ఇమేజ్ కోసం, కమర్షియల్ ట్యాగ్ కోసం ఊవ్విళ్లూరుతున్నాడు. అందుకే పూరి జగన్నాథ్ లాంటి మాస్ స్సెషలిస్ట్తో లోఫర్ సినిమా చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఒకేసారి క్లాస్, మాస్ బ్యాలెన్స్ చేస్తూ రెండు సినిమాలను రెడీ చేస్తున్నాడు. ఒక సినిమా పూర్తయితే గాని మరో సినిమా గురించి ఆలోచించని ఈ జనరేషన్లో, ఒకే సమయంలో రెండు సినిమాల షూటింగ్లో పాల్గొంటున్నాడు వరుణ్. ఇప్పటికే శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమా షూటింగ్ ప్రారంభించిన ఈ టాల్ హీరో మొదటి షెడ్యూల్ పూర్తి చేసేశాడు. ఇక శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న మరో సినిమా ఫిదా షూటింగ్‌ను కూడా మొదలెట్టేశాడు. ఒకే సమయంలో శ్రీనువైట్ల లాంటి మాస్ డైరెక్టర్‌తో, శేఖర్ కమ్ముల లాంటి క్లాస్ డైరెక్టర్‌తో సినిమాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ రెండు సినిమాలతో మంచి విజయాలు సాధించి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు వరుణ్ తేజ్. -
ప్రేమ.. ద్వేషం... ఓ ప్రేమకథ
‘‘సంవత్సరం ముందే శేఖర్ కమ్ముల నాకీ లైన్ చెప్పారు. స్క్రిప్ట్ రెడీ అయ్యాక చదివాను. చాలా నచ్చింది. ‘కంచె’ సినిమాలో వరుణ్‌తేజ్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఈ సినిమాకు వరుణ్ తేజ్‌ను హీరోగా తీసుకుందామని శేఖర్ చెప్పారు. సాయి పల్లవి నటించిన మలయాళ ‘ప్రేమమ్’ సూపర్ హిట్. వరుణ్‌తేజ్, సాయిపల్లవి జోడి ఈ సినిమా 50 శాతం సక్సెస్ కావడానికి ఉపయోగపడుతుంది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. వరుణ్ తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న ‘ఫిదా’ శుక్రవారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ప్రారంభమైంది. ‘లవ్- హేట్- లవ్‌స్టోరీ’ అనేది ఉపశీర్షిక. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్రవిశేషాలను ‘దిల్’ రాజు చెబుతూ - ‘‘తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయితో అమెరికా అబ్బాయి ప్రేమలో పడతాడు. కథానాయిక తెలంగాణాలోని ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతి కావడంతో ఆ రాష్ట్రంలోని బాన్సువాడను ఎంపిక చేశాం. బాన్సువాడాలో 45 రోజులు, అమెరికాలో మరో 45 రోజులు షూటింగ్ జరుపుతాం’’ అన్నారు. నటుడు నాగేంద్రబాబు, చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల, నటి సాయి పల్లవి తదితరులు పాల్గొన్నారు. -
'ఫిదా' థీమ్ పోస్టర్ రిలీజ్
మంచి కాఫీలాంటి సినిమాల క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, మెగా హీరో వరుణ్ తేజ్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ ఖరారైంది. లవ్.. హేట్.. లవ్ స్టోరీ కాన్సెప్ట్‌గా 'ఫిదా' అనే పేరుతో కూల్ యూత్‌ఫుల్ ఎంటర్టెయినర్ని నిర్మించనున్నారు. శుక్రవారం ఫిదా థీమ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పోస్టర్‌ను వరుణ్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశాడు. మలయాళ 'ప్రేమమ్' ఫేం సాయి పల్లవి వరుణ్ సరసన నటిస్తుంది. హిందీలో హిట్ అయిన కహానీకి రీమేక్‌గా నయనతార ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల తీసిన సినిమా 'అనామిక' తడబడటంతో.. రెండేళ్ల గ్యాప్ తరువాత మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ ఆయన కెరీర్‌కు కీలకం కానుంది. కంచె, లోఫర్ సినిమాలతో నటుడిగా ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించిన వరుణ్.. శేఖర్ మార్క్ హీరోగా అలరించేందుకు సిద్ధమయ్యాడు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న 'ఫిదా'పై అభిమానుల్లో అప్పుడే ఆసక్తి మొదలయ్యింది. Here you go!..the theme poster of my next with Shekar Kamulla #Fidaa #LoveHateLoveStory pic.twitter.com/GHdcoqLcLB — Varun Tej (@IAmVarunTej) 5 August 2016 -
వరుణ్‌కి ఫిదా అంటున్న శేఖర్ కమ్ముల
లోఫర్ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మెగా హీరో వరుణ్ తేజ్, ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే నటుడిగా మంచి మార్కులు సాధించిన వరుణ్.. ఈ సినిమాతో కమర్షియల్ స్టార్‌గా ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తరువాత మరోసారి ఓ కూల్ ఎంటర్టైనర్తో ఆడియన్స్ ముందుకు రావడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు వరుణ్. కాఫీలాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించిన వరుణ్ తేజ్... ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసేస్తున్నాడు. ఇప్పటికే కథా కథనాలు కూడా ఫైనల్ అయిపోగా హీరోయిన్గా మళయాల బ్యూటి సాయి పల్లివిని తీసుకున్నారు. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇక ఈ సినిమాకు ఫిదా అనే టైటిల్‌ను పరిశీలుస్తాన్నారన్న టాక్ వినిపిస్తోంది. వరుణ్‌తో పాటు శేఖర్ కమ్ముల కెరీర్‌కు కూడా ఈ సినిమా కీలకం కావటంతో ఈ కాంబినేషన్‌పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. -
వరుణ్‌తేజ్ సరసన...
మలయాళ చిత్రం ‘ప్రేమమ్’లో మలర్ పాత్రలో అక్కడి వాళ్లనే కాకుండా మొత్తం దక్షిణాదిని తనవైపు తిప్పుకున్న కథానాయిక సాయిపల్లవి. ఇప్పుడామె తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. వరుణ్‌తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సాయిపల్లవిని కథానాయికగా ఎంపిక చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘అమెరికాలో ఉండే అబ్బాయికి , తెలంగాణలో పెరిగిన అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ ఇది. జూలై 25న షూటింగ్ ప్రారంభిస్తాం. అక్టోబరుతో చిత్రీకరణ పూర్తి చేసి డిసెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేశ్, సినిమాటోగ్రఫీ: విజయ్‌కుమార్. -
వరుణ్ సినిమా ఆగిపోలేదు
కొద్ది రోజులుగా వరుణ్ తేజ్ సినిమాలపై వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది. లోఫర్ సినిమా తరువాత శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమాను ప్రారంభించాడు వరుణ్. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొదలవ్వాల్సి ఉన్న కథా కథనాలు పూర్తిగా రెడీ కాకపోవటంతో ఆలస్యమవుతూ వచ్చింది. ఒక దశలో శ్రీనువైట్ల, వరుణ్‌ల సినిమా ఆగిపోయిందన్న వార్త కూడా ఫిలింనగర్లో వినిపించింది. అయితే తాజాగా మిస్టర్ సినిమా మీద వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చాడు వరుణ్ తేజ్. ఈ నెల 27 నుంచి ఈ సినిమా స్పెయిన్‌లో ప్రారంభమవుతుందంటూ తెలిపాడు. గురువారం ఉదయం తన ట్విట్టర్లో ఈ విషయాన్ని ప్రకటించిన వరుణ్, షూటింగ్ మొదలు పెట్టడానికి ఎదురుచూస్తున్నట్టుగా తెలిపాడు. దీంతో శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వరుణ్ హీరోగా తెరకెక్కబోయే సినిమా ఇప్పట్లో లేదన్న విషయం కన్ఫామ్ అయ్యింది. Can't wait to get back to work and back on sets.My film with Srinu Vaitla garu will start rolling in Spain from 27th pic.twitter.com/c06HVYAQ5j — Varun Tej (@IAmVarunTej) 9 June 2016 -
అమెరికా కుర్రాడి లవ్‌స్టోరీ!
‘అనామిక’ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరే చిత్రమూ రాలేదు. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారు. వరుణ్‌తేజ్ హీరోగా ఓ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది ‘‘ఒక అమెరికా అబ్బాయి, తెలంగాణా అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది’’ అని నిర్మాత చెప్పారు. -
మెగా హీరోతో కాఫీలాంటి సినిమా
ఆనంద్, హ్యాపిడేస్, గోదావరి, లీడర్ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల, కొద్ది రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. కహానీ రీమేక్‌గా నయనతార లీడ్ రోల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అనామిక, డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో నెక్ట్స్ సినిమా విషయంలో ఆలోచనలో పడ్డాడు. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకొని ఫర్ఫెక్ట్ కథతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్‌తో శేఖర్ కమ్ముల ఓ సినిమా చేయబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచే డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకుంటున్న వరుణ్, శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మరోసారి కొత్త కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను నిర్మాత దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. శేఖర్, ఈ కథను ముందు రామ్ చరణ్‌కు చెప్పినా అతడు ఇంట్రస్ట్ చూపించకపోవటంతో వరుణ్‌తో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. వరుణ్ తొలిసారిగా మాస్ జానర్లో ట్రై చేసిన లోఫర్, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపొవటంతో ఈ సారి ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ శ్రీనువైట్లతో కలిసి మిస్టర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా పూర్తయిన తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
సంపాదిస్తూ... పోస్ట్ ప్రొడక్షన్ చేశా!
‘‘నాగేశ్ కుకునూర్ ‘హైదరాబాద్ బ్లూస్’, శేఖర్ కమ్ముల ‘డాలర్ డ్రీమ్స్’ లాంటి తరహాలో ఉండే స్వతంత్ర తరహా, చిన్న బడ్జెట్ చిత్రం - నేను తీసిన ‘ది అనుశ్రీ ఎక్స్పరిమెంట్స్’. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథలో పెళ్ళిని వాయిదా వేయడానికి ఒక యువతి చేసే ప్రయత్నాలు వినోదాత్మ కంగా సాగుతాయి’’ అన్నారు దర్శకురాలు అపర్ణా మల్లాది. అమెరికాలో స్థిరపడ్డ ఈ తెలుగు వనిత రూపొందించిన సినిమా ‘ది అనుశ్రీ ఎక్స్పరి మెంట్స్’ ఏప్రిల్ 1న ‘లాంఛనప్రాయంగా రిలీజ్’ కానుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో రోజుకు ఒక ఆట చొప్పున ప్రదర్శిస్తూ, ‘టోకెన్ రిలీజ్’ చేస్తున్నట్లు ఈ ప్రవాస భారతీయ దర్శకురాలు తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన విలేఖరుల సమావేశంలో అపర్ణతో పాటు ప్రముఖ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, ‘బాహుబలి’ - ‘బజ్రంగీ భాయీజాన్’ చిత్రాల ఫేమ్ వి. విజయేంద్రప్రసాద్ పాల్గొని, అపర్ణ ప్రయత్నాన్ని అభినందించారు. అమెరికాలో సినీ రచనలో శిక్షణ పొంది, ఇక్కడకు వచ్చి పరుచూరి, విజయేంద్రప్రసాద్ సహా పలువురు సినీ రచయితలకూ, విద్యార్థులకూ స్క్రీన్‌ప్లే రచనలో మెళకువలను బోధించిన ఘనత ఆమెది. హాలీవుడ్‌కీ, మన భారతీయ పరిశ్రమకూ ఉన్న తేడాలు, స్వీయ అనుభవం గురించి ఈ అచ్చ తెలుగు మహిళ ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాల్లో ముఖ్యాంశాలు... మహిళా దర్శక, రచయితగా సహ జంగానే ఆడవాళ్ళ దృష్టి కోణం నుంచి, వారి కష్టనష్టాలు, సమస్య లతో కూడిన అంశాలనే కథలుగా అల్లుతుంటా. అందుకే, గతంలో తీసిన ‘నూపర్’ షార్ట్‌ఫిల్మ్ కానీ, తొలి సిన్మా ‘మిట్సెన్’ (సాహచర్య మని అర్థం) కానీ, ఇప్పుడీ రెండో సినిమా ‘అనుశ్రీ...’ కానీ ఆ ఛాయ ల్లోనే ఉంటాయి. ఒక రకంగా ఆ కథలన్నీ నావే! ఆ నాయిక నేనే! కుటుంబంలోని అన్ని వర్గాలవారూ, అన్ని వయసులవారూ చూసి ఆనందించే వినోదాత్మక రీతిలో ‘ది అనుశ్రీ ఎక్స్పరిమెంట్స్’ చిత్రం తీశా. పబ్లిసిటీకి కూడా పెద్దగా ఖర్చు పెట్టుకోలేని ఇలాంటి చిన్న సినిమా కోసం విద్యార్థులైన నా యూనిట్ సిబ్బందే స్వయంగా వెళ్ళి, ‘ఐ-ప్యాడ్’లో ట్రైలర్ చూపించి, ముందుగా టికెట్లు అమ్ముతున్నారు. అలా మొదటి ఆటకు ఇప్పటికే 300 టికెట్లు అమ్మేశాం. హాలీవుడ్లో పనితీరుకీ, ఇక్కడి పనితీరుకీ చాలా తేడా ఉంది. కథ రాసుకోవడానికి ఏడాది పడితే, ఇక్కడి పద్ధతులు అర్థం చేసుకొని, సినిమా తీసి, రిలీజ్ చేయడానికి 4 ఏళ్ళు పట్టింది. అక్కడ సినిమాలకూ, లొకేషన్లకూ పర్మిషన్ దగ్గర నుంచి ప్రతీదీ సులభం. కానీ, ఇక్కడ అలా కాదు. ‘అనుశ్రీ...’ తీయడం కోసం ఇక్కడకొచ్చిన కొత్తల్లో కష్టపడ్డాను. మహిళా ప్రధాన సినిమాలు తీయాలంటే, ఇక్కడ సాధారణంగా ఎవరూ ముందుకు రారు. డబ్బు కోసం చాలా కష్టపడ్డాం. 70 శాతం ఇంగ్లీష్, 30 శాతం తెలుగు డైలాగ్లుండే ఈ చిత్ర షూటింగ్ 17 రోజుల్లో ఇక్కడే పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్‌కి డబ్బుల్లేక, అమెరికా వెళ్ళిపోయి అక్కడ పనిచేస్తూ సంపాదించిన డబ్బుతో ఎప్పటికప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ చేశా. హాలీవుడ్ టెక్నిక్, క్రాఫ్ట్ మనకన్నా ముందంజలో ఉంటాయి. వాటిని వాడుకొంటూనే, మనం మన కథలు చెప్పాలి. కానీ, మనం వాళ్ళ సినిమాలు చూసి, అలాంటి కథలు చెబుతున్నాం. దురదృష్టవశాత్తూ, మన ఇండస్ట్రీలో రచయితకి తగిన స్థానమివ్వట్లేదు. హాలీ వుడ్లో కనీసం 5 శాతం బడ్జెట్‌ను రచ నకు కేటాయిస్తారు. అలాగే స్క్రిప్ట్ బాగా వచ్చేదాకా ఎంత టైమైనా వెచ్చిస్తారు. అమెరికాలో ఉంటున్నా, బాగుందన్న తెలుగు, తమిళ చిత్రాలు ఖాళీ దొరికితే చూస్తా. త్వరలో ‘పెళ్ళికూతురి పార్టీ’ పేరిట సిన్మా చేయాలని ప్లాన్ చేస్తున్నా. -
గ్రాఫిక్స్ సినిమాలంటే బోర్
మానవీయ కథనాలతో సినిమాలు చేస్తా నిట్‌లో ప్రీ స్ప్రింగ్ స్ప్రీలో {పముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల విద్యార్థులతో మాటామంతి కాజీపేట రూరల్ :గ్రాఫిక్స్ సినిమాలు చేయడమంటే బోరుఅని, మానవీయ కథనా లతో సినిమాలు చేయడమే ఇష్టమని ప్రముఖ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో మార్చి 11, 12, 13 తేదీల్లో జరిగే స్ప్రింగ్ స్ప్రీ-16 ఈవెంట్‌ను పురస్కరించుకొని శుక్రవారం నిట్ ఆడిటోరియంలో ప్రీ స్ప్రింగ్ స్ప్రీ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యూరు. నిట్ డైరక్టర్ టి.శ్రీనివాసరావు శేఖర్ కమ్ములకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతించారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ నిట్ స్ప్రింగ్ స్ప్రీకి అంబాసిడార్‌గా వ్యవహరిస్తున్నాని చెప్పారు. తాను హైదరాబాద్‌లో సీబీఐటీలో చదివిన జ్ఞాపకాలను గుర్తు చేస్తూ.. కంప్యూటర్ సైన్స్ చదివి జీవితంలో ఉద్యోగం దొరికితే చాలు అనుకుంటే మెకానిక్ ఇంజనీరింగ్‌లో సీటు వచ్చిందన్నారు. అమెరికాలో ఏపీఎన్టీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరి అమెరికాలో ఉంటున్నప్పుడు తన రూమ్మేట్స్ సూచన మేరకు విజన్ మీడియాలో చేరానని తెలిపారు. ఆ తర్వాత చిత్ర పరిశ్రమలోకి వ చ్చినట్లు వెల్లడించారు. తెలుగు భాషలో సినిమాలు చేయాలంటే తెలుగు భాషపై పట్టు ఉండాలన్నారు. లీడర్-2 చిత్రం త్వరలోనే వస్తుందని, అందులో హీరో రాణానే ఉంటాడని తెలిపారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ములతో నిట్ విద్యార్థులు వేదికపై సమావేశమై మాటామంతి జరిపారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. శేఖర్ కమ్ముల హీరోగా సినిమా తీస్తే చూడాలని ఉందని నిట్ విద్యార్థులు అన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లోని పాటలు పాడి నృత్యాలు చేసిన నిట్ విద్యార్థులను శేఖర్ అభినందించారు. కార్యక్రమంలో నిట్ డైరక్టర్ శ్రీనివాస్‌రావు, డీన్ రమణారెడ్డి, ఫ్యాకల్టీ అడ్వయిజర్ కాశీవిశ్వనాథం, నిట్ స్ప్రింగ్ స్ప్రీ విద్యార్థుల బృందం పాల్గొన్నారు. -
మహేష్ సినిమా కోసం ఇద్దరు దర్శకులు
టాలీవుడ్లో కేవలం తన స్టార్ ఇమేజ్‌తో వంద కోట్ల వసూళ్లను రాబట్టగలిగిన హీరోగా ప్రూవ్ చేసుకున్న స్టార్ మహేష్ బాబు. శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్‌లు సృష్టించిన మహేష్ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చేస్తోన్న బ్రహ్మోత్సవం ఇప్పటికే పూర్తి కావస్తుండటంతో తరువాత చేయబోయే సినిమాలను లైన్లో పెడుతున్నాడు. బ్రహ్మోత్సవం పూర్తి కాకముందే మరో రెండు సినిమాలను ఫైనల్ చేశాడు. త్వరలోనే తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు మహేష్. ఇప్పటికే కథా కథనాలు కూడా రెడీ అయిన ఈ సినిమా, ఏప్రిల్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా పూర్తవ్వగానే మరో ఆసక్తికర చిత్రాన్ని పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. కాఫీ లాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నటించడానికి ఓకె చెప్పాడు. ఈ సినిమాను, మహేష్ బాబుతో టక్కరి దొంగ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ నిర్మించనున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా మహేష్ నెక్ట్స్ సినిమా శేఖర్ కమ్ములతోనే అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఒకే సినిమా కోసం ఇద్దరు దర్శకులు కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. -
బాలీవుడ్లో హ్యాపిడేస్
టాలీవుడ్లో కమర్షియల్ సినిమా హవా నడుస్తున్న సమయంలో కూడా కాఫీలాంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. సింపుల్ సబ్జెక్ట్లతో సున్నితమైన భావోద్వేగాలను పలికించే శేఖర్ కమ్ముల తన రూటు మార్చి తెరకెక్కించిన అనామిక సినిమాతో ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో గ్యాప్ తీసుకొని ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. 2007లో తన దర్శకత్వంలో తెరకెక్కి, సూపర్ హిట్ అయిన హ్యాపిడేస్ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కోసం పూణే లోనే ఓ కాలేజ్‌ను సెలెక్ట్ చేసిన శేఖర్, ప్రస్తుతం నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు. మార్చి నుంచి షూటింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్న హ్యాపిడేస్ రీమేక్‌ను సల్మాన్ ఖాన్‌తో కలిసి శేఖర్ కమ్ముల స్వయంగా నిర్మిస్తున్నట్టుగా వార్తలు వినిపించినా చిత్రయూనిట్ మాత్రం అఫీషియల్‌గా కన్ఫామ్ చేయలేదు. -
అమెరికాలో గోదావరి పిల్ల
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘గోదావరి’ చిత్రంలో నటించిన నీతూ చంద్ర గుర్తున్నారా? అదేనండీ ఏ నిర్ణయం తీసుకోవాలన్న అయోమయానికి గురయ్యే యువతి పాత్రలో నటించిన కథానాయిక. నీతూ చంద్రకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 9న న్యూయార్క్‌లో జరగనున్న భారత స్వాతంత్య్ర దినోత్సవాల్లో గ్రాండ్ మార్షల్‌గా వ్యవహరించనున్నారు. ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు అమెరికాలో స్థిరపడిన భారతీయులు పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. -
రానా ‘లీడర్ -2’ చేస్తున్నారా?
రానా తొలి చిత్రం ‘లీడర్’. అందులో యువ ముఖ్యమంత్రిగా రానా కనబడిన తీరు, పెర్ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషల్లో అంచెలంచెలుగా ఎదుగుతున్నారాయన. ఈ మధ్య విడుదలైన ‘బాహుబలి’లో భల్లాలదేవగా రానా ఆహార్యం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం తమిళంలో ‘బెంగళూరు డేస్’ రీమేక్‌లో నటిస్తున్న రానా చేతిలో మరిన్ని చిత్రాలు ఉన్నాయి. ఆ సంగతలా ఉంచితే... ‘లీడర్’కి కొనసాగింపుగా ‘లీడర్ 2’ చేయాలనుకుంటున్నారు రానా. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని రానా తెలిపారు. మరి.. తొలి భాగానికి దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ములే దీనికి కూడా దర్శకత్వం వహిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
ఉప్పొంగెలే..
ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరీ మా సీమకే చీనాంబరి వెతలు తీర్చుమా దేవేరీ వేదమంటి మా గోదారి శబరి కలసిన గోదారీ రామచరితకే పూదారి ‘‘నీకు గోదావరి గురించి తెలుసా?’’ అడిగాడు శేఖర్ కమ్ముల. ‘‘అది... బిగ్ రివర్ కదా’’ అంది కమలినీ ముఖర్జీ. ‘ఆనంద్’ షూటింగ్ లంచ్ బ్రేక్‌లో ఇద్దరూ భోంచేస్తూ మాట్లాడుకుంటున్నారు. గోదావరి గురించి అడిగిన శేఖర్, తర్వాత కామ్ అయిపోయి, తన మానాన తాను భోంచేస్తున్నాడు. కమలినికేం అర్థం కాలేదు. ‘‘ఏంటి శేఖర్? ఏదో చెప్తావనుకుంటే... ఏం మాట్లాడవ్?’’ అడిగింది. ‘‘ఆ... ఏం లేదు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ఓ స్టోరీ అనుకుంటున్నా’’ అన్నాడు శేఖర్ చాలా సింపుల్‌గా. ‘‘అవునా! ఆ స్టోరీ ఏంటో చెప్పవా ప్లీజ్’’ అడిగింది కమలిని. చెప్పడానికి కాసేపు తటపటాయించాడు శేఖర్. ‘‘నేనేం లీక్ చేయను. ధైర్యంగా చెప్పొచ్చు’’ నవ్వుతూ చెప్పింది కమలిని. శేఖర్ చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘సోషల్ ఎవేర్నెస్ ఉన్న అబ్బాయి... ఇండివిడ్యువాలిటీ కోరుకునే అమ్మాయి... ఇద్దరూ కలసి గోదావరి నదిలో లాంచీ ప్రయాణం... రాజమండ్రి నుంచి భద్రాచలం వయా పాపికొండలు... బ్యూటిఫుల్ జర్నీ’’ అంటూ కొన్ని సీన్లు ఎక్స్ప్లెయిన్ చేశాడు శేఖర్. కమలిని విభ్రమంగా శేఖర్ వైపు చూస్తూ వింటోంది. ‘‘బ్యూటిఫుల్ స్టోరీ శేఖర్! హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది. నన్ను దృష్టిలో ఉంచుకునే రాశావు కదా. ఆ పాత్ర నేనే చేస్తాను’’ అని గలగలా మాట్లాడేస్తోంది కమలినీ. శేఖర్ కంగారుపడ్డాడు. ‘‘ఇంకా నేనేం అనుకోలేదు. ముందు ‘ఆనంద్’ రిలీజ్ కావాలి. ఆ తర్వాత చూద్దాం’’ అని చెప్పి తప్పించుకున్నాడు. కొన్ని తప్పించుకోవడం చాలా కష్టం. ఆ విషయం శేఖర్ కమ్ములకు ‘ఆనంద్’ రిలీజైన ఏడాదికి అర్థమైంది. ‘ఆనంద్’ ట్రెండ్ సెట్టింగ్ హిట్. చాన్నాళ్లకు బాపు లాంటి డెరైక్టరొచ్చా డంటూ కితాబులు. వింటూనే ఉన్నాడు శేఖర్ కమ్ముల. తనపై ఓ ఎక్స్పెక్టేషన్ రావడం ఓ పక్క ఆనందం... మరో పక్క భయం. అందుకే ఒళ్లు దగ్గరపెట్టుకుని కథ చేసుకుంటున్నాడు. ‘గోదావరి’... తనకు ఇష్టమైన కథ. ఎప్పుడో 33 ఏళ్ల క్రితం బాపు తీసిన ‘అందాల రాముడు’లా గోదావరి జర్నీ నేపథ్యంలో కథ. పోలికలు పెట్టినా ఫర్లేదు. ఈ జర్నీ మిస్ కాకూడదు. ఎప్పుడో తాను టెన్త్ క్లాసులో టీవీలో చూసిన ‘అందాల రాముడు’ ఇప్పటికీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ గుర్తుంది. తన సినిమా కూడా అలానే గుర్తుండిపోవాలి. ‘ఆనంద్’ లాగానే జీవితానికి దగ్గరగా ఉండాలి. నో అతిశయోక్తులు... నో అభూత కల్పనలు... కథ విషయంలో కిందా మీదా పడుతున్నాడు శేఖర్. ఇందులో హీరో పాత్రకు రాజకీయాలంటే ఇష్టం. దాన్నో వృత్తిగా స్వీకరించాలనుకుంటా డతను. ఈ పాత్ర కోసం శేఖర్ కొంత రీసెర్చ్ చేశాడు. తన టీమ్ మెంబర్స్‌ని చాలా పొలిటికల్ పార్టీ ఆఫీసులకి పంపించాడు. దాదాపుగా కథ ఓ కొలిక్కి వచ్చింది. వాళ్ల బావ రాసిన ఓ షార్ట్ స్టోరీ ఇన్స్పిరేషన్తో శేఖర్ చిలక జ్యోతిషం సీన్ క్రియేట్ చేశాడు. కుక్క పాత్ర కూడా అంతే. ఓ జర్నలిస్ట్ రాసిన షార్ట్ స్టోరీ దానికి ఇన్స్పిరేషన్. శేఖర్ కజిన్ సిస్టర్ తన కుక్కకు కోటేశ్వరరావు అని పేరు పెట్టుకుంది. అది గుర్తొచ్చి, ఇందులో కుక్కకి కొంచెం మాస్‌గా ‘కోటిగాడు’ అని పేరుపెట్టాడు. ఫైనల్‌గా స్క్రిప్ట్ లాక్ చేశాడు శేఖర్ కమ్ముల. చాలామంది ప్రొడ్యూసర్లొచ్చారు - ‘‘ఆనంద్’ లాంటి సినిమా తీసిపెట్టమని’’. ఒక్క జీవీజీ రాజు మాత్రం ‘‘మీకు నచ్చిన సినిమా తీయండి’’ అన్నాడు. ‘తొలిప్రేమ’ తీసిన నిర్మాత. ఫ్రీడమ్ ఇచ్చే నిర్మాత. శేఖర్‌కు ఓకే. స్క్రిప్ట్ తీసుకుని ఫిలిమ్ నగర్ మీద పడ్డాడు. పవన్ కల్యాణ్... మహేశ్‌బాబు... గోపీచంద్... ఎవ్వరూ ఖాళీగా లేరు. మరి ఈ ‘గోదావరి’ని ఈదే హీరో ఎవరు? ఇంకెవరు ‘అందాల రాముడి’ మనవడే. గుడ్ ఐడియా. సుమంత్ డేట్స్ ఓకే. ఇప్పుడు హీరోయిన్ కావాలి. మోడ్రన్‌గా కనబడాలి. ట్రెడిషనల్‌గా ఉండాలి. గూగుల్ సెర్చ్ చేసినట్టుగా చాలామందిని వెతికాడు శేఖర్. ‘‘ఎందుకండీ... మీ ‘ఆనంద్’ హీరోయిన్ ఉంది కదా!’’ అందరిదీ ఇదే సలహా. శేఖర్‌కి తప్పలేదు. కమలిని వచ్చింది. కొంటెగా నవ్వింది. ‘‘నేను చెప్పానా! ఆ క్యారెక్టర్ నా కోసమే పుట్టిందని!’’. ఓ పక్క మ్యూజిక్ సిట్టింగ్స్... మరో పక్క లొకేషన్స్ సెర్చింగ్... ‘ఆనంద్’కి మెయిన్ పిల్లర్స్ రైటర్స్ వేటూరి, మ్యూజిక్ డెరైక్టర్ కె.ఎం. రాధాకృష్ణన్. దీనికీ అంతే. పెద్దాయన వేటూరి, శేఖర్ బాగా క్లోజ్ అయి పోయారు... ఫ్రెండ్స్ అయిపోయారు. ‘గోదావరి’ కథంతా చెప్పి, ‘‘ఏ పాట ఎలా రాస్తారో మీ ఇష్టం సార్’’ అన్నాడు శేఖర్. వేటూరి ఉప్పొంగిపోయారు. ఈ రోజుల్లో ఇలా అడిగేవాళ్లు ఎక్కడున్నారు? ఎప్పుడు రాశారో ఎలా రాశారో కానీ... ఆరు పాటలూ చిటికలో రెడీ. చాలా రోజులైంది... వేటూరి ఇంత వేగంగా రాసి! చాలా రోజులైంది... వేటూరి ఇంత పొయిట్రీ రాసి!! శేఖర్ కమ్ముల, కెమెరామేన్ విజయ్.సి.కుమార్, ఆర్ట్ డెరైక్టర్ కిశోర్ కలసి రాజమండ్రి వెళ్లారు. అక్కణ్నించీ లాంచీ వేసుకుని పాపి కొండలు, భద్రాచలం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రెక్కీ చేశారు. ఎక్కడెక్కడ షూటింగ్ చేయొచ్చు, యూనిట్ ఎక్కడ స్టే చేయాలి... ఇలా పేద్దదే డిస్కషన్. రెండు లాంచీలు... 12 బోట్లు... 200 మంది యూనిట్ సభ్యులు... గోదావరిలో షూటింగ్ స్టార్ట్. గోదావరి తీరంలో సింగన్నపల్లి దగ్గర బస. తిండి, నిద్ర- అంతా అక్కడే. పొద్దున మూడింటికి లేస్తే, రాత్రి పదయ్యేది పడుకునేసరికి. మధ్యమధ్యలో వర్షాలు. అవుట్డోర్ యూనిట్‌కైతే ఒళ్ళు పులిసిపోయేది. షూటింగ్ ఎక్విప్మెంట్ నీళ్లలో తడవకుండా జాగ్రత్తగా చూసుకోవడం ఇంకో రిస్కు. అర్ధరాత్రి 2 గంటలకు గోదావరి మధ్యలో షూటింగ్... అలాంటి టైమ్‌లో శేఖర్ మొబైల్ ఫోన్‌కి కాల్ వచ్చింది. కంగారుగా తీసి చూస్తే, కమలినీ మదర్ అండ్ ఫాదర్. ‘‘మా అమ్మాయికి చెత్త రూమ్ ఇచ్చారంట? అసలు ఇంత రాత్రివేళ ఇంతమందితో షూట్ చేస్తున్నారు. సెక్యూరిటీ ఏది? ప్రొటెక్షన్ ఏది? లైఫ్ జాకెట్స్ ఏవి? ఏమైనా జరిగితే...’’ అంటూ నాన్‌స్టాప్‌గా క్లాస్ పీకేశారిద్దరూ. శేఖర్‌కి కాసేపు ఏం అర్థం కాలేదు. తర్వాత పేరెంట్స్‌గా వాళ్ల టెన్షన్‌ని అర్థం చేసుకున్నాడు. ‘‘ఇదేమన్నా టైటానిక్ షిప్పా. అన్ని జాగ్రత్తలూ తీసుకోవడానికి’’ అంటూ కమలినిని ఆటపట్టించాడు శేఖర్. ‘‘అందంగా లేనా? అసలేం బాలేనా?’’... పాట సినిమాలో చాలా ఇంపార్టెంట్. కొంచెం గ్లామరస్‌గా తీయాలి. శేఖర్ ఎలా తీస్తాడా అని అందరూ ఫుల్ వెయిటింగ్. పాపం... నిజంగానే శేఖర్ చాలా కష్టపడ్డాడు - ఈ పాట తీయడానికి. ఎక్కడా అతి లేకుండా... మితిమీరకుండా గ్లామరస్‌గానే తీయగలిగాడు. కుక్క కావాలి. అవును. ఈ సినిమాలో కుక్కది ఇంపార్టెంట్ రోల్. కానీ జంతువులతో షూటింగ్ చేయాలంటే బోలెడన్ని రిస్ట్రిక్షన్స్. అందుకే శేఖర్ తెలివిగా యానిమేటెడ్ డాగ్‌ని క్రియేట్ చేయించాడు. అలీతోనో, వేణుమాధవ్ తోనో డబ్బింగ్ చెప్పిస్తే కుక్క పాత్ర హిట్టయిపోతుంది. ఇక్కడ శేఖర్ ప్లాన్ వర్కవుట్ కాలేదు. మరి కుక్కకు డబ్బింగ్ ఎలా? ఫైనల్‌గా తనే రంగంలోకి దిగాడు. తనే కుక్కకు డబ్బింగ్ చెప్పాడు. 100 రోజులు షూటింగ్. స్మూత్‌గానే అయిపోయింది. కానీ బడ్జెట్ గోదావరిలో తడిసి మోపెడయ్యింది. ఫోర్ క్రోర్స్ అనుకుంటే, సెవెన్ క్రోర్స్ అయ్యింది. శేఖర్ రెమ్యూనరేషన్ తీసుకోకూడదని డిసైడైపోయాడు. సినిమా చూసి ప్రేక్షకులు... సినిమా తీసి నిర్మాత హ్యాపీ ఫీలవ్వాలి. ఇదే శేఖర్ స్ట్రాటజీ. 2006 మే 19... ‘ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది’... అంటూ ‘గోదావరి’ సినిమా రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర సముద్రమంత సందడి చేయకపోయినా, ‘గోదావరి’ గలగలా పారింది. ‘అందాల రాముడు’ రాసిన ముళ్లపూడి వెంకటరమణ ఈ సినిమా చూసి ఒకటే మాట అన్నారు - ‘ సినిమా హాయిగా ఉంది’. శేఖర్‌కి ఇంతకు మించిన హాయైన మాట ఏముంటుంది! - పులగం చిన్నారాయణ -
శేఖర్ కమ్ములతో మహేశ్?
హీరో మహేశ్‌బాబు ఇప్పుడు మంచి జోరు మీద ఉన్నారు. ఒకపక్క ‘శ్రీమంతుడు’ సినిమా షూటింగ్లో పాల్గొంటూనే, మరోపక్క తరువాత సినిమాల ప్లానింగ్ స్పీడ్‌గా చేసేస్తున్నారు. ఆగస్టు తొలి వారంలో మహేశ్ జన్మదిన కానుకగా ‘శ్రీమంతుడు’ రిలీజ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతలోనే తరువాత నటించే రెండు చిత్రాల ప్లానింగ్ సిద్ధమైంది. ‘శ్రీమంతుడు’ పూర్తవుతూనే, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ సినిమా రెగ్యులర్ షూటింగ్లో మహేశ్ పాల్గొననున్నారు. ఇప్పుడు తాజా కబురేమిటంటే, దర్శకుడు శేఖర్ కమ్ములతో మరో సినిమాకు కూడా ఈ ప్రిన్స్ సిద్ధమవుతున్నారట! అందుకు తగ్గట్లే శేఖర్ కమ్ముల, మహేశ్‌ల మధ్య చర్చలు జరిగాయనీ, ప్రాథమికంగా సినిమా చేయడానికి అంగీకారం కుదిరిందనీ కృష్ణానగర్ కబురు. ‘ఆనంద్’, ‘లీడర్’ లాంటి సెన్సిబుల్ సినిమాలు తీసిన శేఖర్ కమ్ముల, హీరో మహేశ్‌బాబుల కాంబినేషన్లో సినిమాకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. నిజానికి, ‘గోదావరి’ సినిమాను మహేశ్‌తోనే తీయాలని అప్పట్లో శేఖర్ కమ్ముల భావించారు. ఆ ప్రయత్నం సఫలం కాకపోయినప్పటికీ, శేఖర్‌తో సినిమాకు మహేశ్ ఆసక్తి చూపుతూ వచ్చారు. కానీ, ఆ ప్రయత్నం అలా అలా వాయిదా పడుతూనే వచ్చింది. ఇది ఇలా ఉండగా, గత ఏడాది మొదట్లో రిలీజైన మహేశ్ సినిమా ‘1... నేనొక్కడినే’ పోస్టర్ వ్యవహారం వారి మధ్య కొంత గ్యాప్‌ను పెంచినట్లు సినీజనం చెవులు కొరుక్కున్నారు. ఆ పోస్టర్ ఆడవారిని ఆత్మాభిమానం దెబ్బతీసేలా ఉందంటూ నటి సమంత చేసిన వ్యాఖ్యను శేఖర్ కమ్ముల కూడా సమర్థించారు. ఆ వ్యవహారంతో సంబంధాలు కొంత దెబ్బతిన్నప్పటికీ, క్రమంగా మళ్ళీ సత్సంబంధాలు నెలకొన్నాయట! ప్రస్తుతం మహేశ్‌తో శేఖర్ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ వచ్చిందట! ఆ స్క్రిప్ట్ పనిలో శేఖర్ కమ్ముల బిజీగా ఉన్నారట! ‘బ్రహ్మోత్సవం’లో నిర్మాణ భాగస్వామి కూడా అయిన మహేశ్ ఈ సినిమా ఎప్పుడు చేస్తారన్న క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఈ కొత్త సినిమాకు కూడా మహేశ్ నిర్మాణంలో పాలుపంచుకుంటారా? సెన్సిబుల్ ఫీల్ గుడ్ స్టోరీలు తెరకెక్కించే శేఖర్ కమ్ములకూ, కమర్షియల్ హీరో మహేశ్‌కు లంకె కుదిర్చే ఆ స్క్రిప్ట్ ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ప్రస్తుతానికి సస్పెన్సే! -
‘ఆంధ్రాపోరి’ఆడియో ఆవిష్కరణ
-
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో..?
దర్శకుడు శేఖర్ కమ్ములదో విలక్షణమైన శైలి. యువతను ఆకట్టుకునే విధంగా సెన్సిటివ్ సినిమాలూ తీయగలరు.. ‘లీడర్’వంటి శక్తిమంతమైన సినిమానూ చేయగలరు. అయితే ఇప్పటివరకు స్టార్ హీరోలతో శేఖర్ సినిమా చేయలేదు. ఈ ఏడాది అది జరగనుందని సమాచారం. ఇటీవల బన్నీ (అల్లు అర్జున్)కి శేఖర్ కమ్ముల ఓ స్టోరీలైన్ వినిపించారట. అది బన్నీకి బాగా నచ్చిందని భోగట్టా. ఈ చిత్రంలో నటించడానికి ఆయన సుముఖంగా ఉన్నారని తెలిసింది. దాంతో పూర్తి కథ తయారు చేయడానికి శేఖర్ కమ్ముల సన్నాహాలు మొదలుపెట్టారట. ప్రస్తుతం ‘హ్యపీ డేస్’ హిందీ రీమేక్‌కి దర్శకత్వం వహించడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్‌తో కలిసి శేఖర్ నిర్మించనున్నారు. అది పూర్తయిన తర్వాత బన్నీతో చేసే చిత్రం మొదలుపెడతారేమో. ఇది ఇలా ఉంటే బన్నీ మంచి మాస్ హీరో. ఇప్పటివరకు తను చేసిన తరహా మాస్ చిత్రాలను శేఖర్ కమ్ముల తీయలేదు. మరి.. బన్నీ తరహాలో మాస్ చిత్రం చేస్తారా? లేక తనదైన శైలిలో బన్నీని వేరే విధంగా ఆవిష్కరిస్తారా? అనేది వేచి చూడాల్సిందే. -
డాక్టర్ కవితగా..!
‘‘నేను సీరియల్లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, అనుకోనివి జరగడమే జీవితం’’ అని అక్కినేని అమల అన్నారు. ప్రస్తుతం ఆమె చెన్నయ్‌లో ఉన్నారు. తమిళ ధారావాహిక ‘ఉయిర్మెయ్’లో నటిస్తూ బిజీగా ఉన్నారు. నాగార్జునను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు ఫుల్స్టాప్ పెట్టేసి, ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ బ్లూ క్రాస్ కార్యకలాపాలు చూసుకుంటూ గడిపేవారు అమల. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా ద్వారా, ఇరవయ్యేళ్ల విరామం తర్వాత వెండితెరపై మెరిశారామె. అయితే ఆ సినిమా విడుదలై రెండేళ్లవుతోంది కానీ, వేరే సినిమాలేవీ అమల అంగీకరించలేదు. కానీ, ‘ఉయిర్మెయ్’ ధారావాహికను మాత్రమే అంగీకరించి, ఆ సీరియ్ల్లో నటించడానికి గల కారణాన్ని అమల చెబుతూ -‘‘ఈ కథ, కథనం చాలా బాగున్నాయి. పైగా ప్రతి ఎపిసోడ్‌లోనూ ప్రేక్షకులను ఆలోచింపజేసే మంచి సందేశం ఉంది. అందుకే చేస్తున్నా. ఇందులో నా పాత్ర పేరు డాక్టర్ కవిత. ఎమర్జెన్సీ కేర్‌కి హెడ్‌ని అన్నమాట. కేవలం మందుల వల్ల మాత్రమే అనారోగ్యం దూరం కాదని, రోగి పట్ల ప్రేమాభిమానాలు కనబర్చడం కూడా ముఖ్యం అని నా పాత్ర చెబుతుంది’’ అన్నారు. గత నెల 18న ఈ ధారావాహిక ప్రసారం ఆరంభమైంది. తమిళ చిత్రం ‘మైథిలీ ఎన్నయ్ కాదలి’ ద్వారానే అమల కథానాయికగా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత, ‘మెల్ల తిరందదు కదవు’, ‘వేలైక్కారన్’, ‘వేదం పుదిదు’, ‘సత్య’... ఇలా పలు చిత్రాల్లో నటించారామె. ఆ విధంగా తమిళనాడులో బోల్డంత మంది అభిమానులను సంపాదించుకున్నారు అమల. వాళ్లందరికీ అమల మళ్లీ తెరపై కనిపించడం ఆనందంగా ఉంది. -
హిందీలో హ్యాపీ డేస్?
ఈ ఏడేళ్లల్లో వచ్చిన యూత్‌ఫుల్ చిత్రాల్లో ‘హ్యాపీ డేస్’కి ప్రత్యేక స్థానం ఉంటుంది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఆస్వాదించేలా శేఖర్ కమ్ముల ఆ చిత్రాన్ని మలిచారు. ఇక్కడివారినే కాదు.. బాలీవుడ్వారిని సైతం ఆకట్టుకున్న చిత్రం ఇది. ఎంతగా ఆకట్టుకుందంటే కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ చిత్రాన్ని హిందీలో పునర్నిర్మించాలనుకుంటున్నారట. ఇటీవలే ఆయన ఓ సొంత సంస్థను ఆరంభించారు. సల్మాన్ ఆప్తమిత్రుల్లో ఒకరు ‘హ్యాపీ డేస్’ గురించి ఆయన దగ్గర చెప్పారట. దాంతో ఈ చిత్రం గురించి సల్మాన్ వాకబు చేసి, రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారని భోగట్టా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. -
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
అమెరికాలో ఎవరైనా ‘మీ దేశం గురించి చెప్పండి’ అని అడిగితే.. శేఖర్ కమ్ముల నూటికి తొంభై విషయాలు హైదరాబాద్ గురించే చెప్పేవారట. పతంగుల కోసం ముషీరాబాద్ జైలు కంచెలు దాటిన క్షణాలు.. లిఫ్ట్‌ల కోసం స్నేహితులతో పోటీపడ్డ సంగతులు.. నగరానికొచ్చిన బంధువుల ముందు లిటిల్గైడ్లా పోజు కొట్టిన జ్ఞాపకాలను తలచుకుంటున్నప్పుడు శేఖర్ కమ్ముల ముఖంలో సిసలైన హైదరాబాదీ కనిపిస్తాడు. సిటీ గురించి ఆయన మాటల్లోనే... ఎవరో అంటే విన్నాను... హైదరాబాద్‌లాంటి నగరం కడతానని. హైదరాబాద్ అంటే బిల్డింగులు, బ్రిడ్జీలు కాదు! బంధాలు.. అనుబంధాలు!! సింగపూర్ లాంటి నగరాన్ని కట్టగలరు. కానీ, హైదరాబాద్‌ని మరపించే నగరాన్ని నిజాం కూడా తిరిగి కట్టలేడు. ‘పతంగులు ఎగరేసే రోజులొచ్చాయంటే.. ముషీరాబాద్ జైలు ఖైదీలతో బోలెడు పనులుండేవి. పతంగులకు, ఖైదీలకు లింక్ ఏమిటంటారా..! పద్మారావునగర్‌లో మా ఇల్లు ముషీరాబాద్ జైలుకి దగ్గరగా ఉండేది. జనవరి వచ్చిందంటే కాలనీలో పిల్లలమంతా పెద్ద పెద్ద పతంగులు తయారు చేసి ఎగరేసేవాళ్లం. పతంగులు వెళ్లి జైలు ప్రాంగణంలో పడేవి. ఖైదీలు వాటిని తీసి జాగ్రత్తగా దాచి పెట్టేవారు. అప్పట్లో ఆ జైలుకి గోడ బదులు కంచె ఉండేది. చాలా తేలిగ్గా అందులోకి వెళ్లిపోయి ఖైదీలకు సిగరెట్లు, పాన్లు, వక్కపొడుల ప్యాకెట్లు ఇచ్చి పతంగులు తెచ్చుకునే వాళ్లం. నాకు మూడేళ్లున్నపుడు నాన్న ఉద్యోగరీత్యా ఏలూరు నుంచి హైదరాబాద్‌కి వచ్చేశారు. రావడమే పద్మారావునగర్‌లో ఇల్లు కొనుక్కున్నారు. అప్పట్నుంచీ ఇక్కడే ఉంటున్నాం. ఆ రోజులు తిరిగిరావు... నా చిన్నప్పుడు హైదరాబాద్.. ఓ అందమైన స్వప్నంలా ఉండేది. నో ఓవర్ పాపులేషన్. నో పొల్యూషన్.. అన్నిటికన్నా గొప్ప విషయం.. హైదరాబాదీల అభిమానం. ఎముకలు కొరికే చలికాలం, ముచ్చెమటలు పట్టే వేసవికాలం ఇక్కడి వారికి తెలియదు. నేను సికింద్రాబాద్‌లోని సెయింట్ ప్రాక్టిన్స్ స్కూల్లో చదువుకున్నాను. ఇంటి దగ్గర నుంచి మూడు కిలోమీటర్లు.. మధ్యలో రైల్వే ట్రాక్. నడుచుకుంటూ వెళ్లిపోయేవాళ్లం. చాలా వరకూ లిఫ్ట్‌లపై వెళ్లిపోయేవాళ్లం. ఇప్పుడు కొత్తవారి బండి ఎక్కాలంటే భయపడాల్సి వస్తోంది. అప్పుడు.. ఆడపిల్లలు, చిన్న పిల్లలు ఒంటరిగా రాత్రి తొమ్మిదింటి వరకూ తిరిగేవారు. నేనే గైడ్‌ని... వేసవి సెలవులు వచ్చాయంటే గోదావరి జిల్లాల నుంచి సిటీకి వచ్చే మా బంధువులకు నేనే గైడ్‌ని. నగరానికి ఎవరొచ్చినా బిర్లామందిర్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, జూపార్క్.. తప్పక చూసేవారు. బంజారాహిల్స్‌లోని భాస్కర్ ప్యాలెస్ స్థానంలో ఇప్పుడు కేర్ ఆసుపత్రి ఉంది. అప్పట్లో హైదరాబాద్ హోటళ్లకు ప్రసిద్ధి. కాస్త డబ్బున్న వాళ్లయితే ఫేమస్ హోటళ్లకు వెళ్లేవారు. ఇక ఆస్పత్రులంటే గాంధీ, ఉస్మానియా. ఎంతటి వారికైనా అక్కడి వైద్యమే. యూఎస్ రిటర్న్.. నేను ఇంజనీరింగ్ సీబీఐటీలో పూర్తిచేశాను. స్కూలు, కాలేజీ చదువులు చాలా సరదాగా గడిచాయి. స్టూడెంట్స్‌కి 45 రూపాయలు కడితే జనరల్పాస్ వచ్చేది. నెలంతా ఫుల్ ఎంజాయ్. నా సినిమాల్లో చాలావరకు హైదరాబాద్ వాతావరణం కనపడేలా ప్లాన్ చేసుకోవడం వెనక నా అనుభవాలే ఎక్కువగా ఉంటాయి. అలాగే నా సినిమాల్లో కుర్రాళ్లు మాట్లాడే భాష కూడా చాలా సహజంగా ఉంటుంది. మాటకు ముందూవెనకా బే, సాలే.. అనే పదాలు వాడటం హైదరాబాదీలకు మాత్రమే సొంతం. ఇక్కడ మాట్లాడే హిందీ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చాలా సులువుగా నేర్చేసుకోవచ్చు. అప్పట్లో ఆటోవాళ్లు, రిక్షావాళ్లు చాలా వరకూ హిందీలోనే మాట్లాడేవారు. అలాగే ఇక్కడ కల్చర్ చాలా గొప్పది. ఏ పండగొస్తే జనమంతా ఆ దేవుడి భక్తులయిపోతారు. రంజాన్ వచ్చిందంటే తెలుగువారింట్లో కూడా బిర్యానీ వాసన గుప్పుమనేది. వినాయక చవితి వచ్చిందంటే.. ముస్లిం యువకుల హడావుడి ఎక్కువగా ఉంటుంది. క్రిస్మస్ టైంలో చర్చిల చుట్టూ హంగామా. ఇలాంటి గొప్ప కల్చర్ ఇండియా కాదు, ప్రపంచం మొత్తం తిరిగినా కనిపించదు. నో హిల్స్.. ఓన్లీ నగర్.. చాలామంది అడుగుతుంటారు.. సినిమావాళ్లంతా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలో ఉంటే మీరింకా పద్మారావునగర్లోనే ఉన్నారెందుకని. ఆ ప్రశ్నకు ఒక్కమాటలో సమాధానం చెప్పాలంటే చాలా కష్టం. నేను అమెరికాలో ఉన్నప్పుడు అక్కడి వాళ్లు ‘మీ దేశం గురించి చెప్పండ’ని అడిగితే.. పద్మారావునగర్ గురించే చెప్పేవాడ్ని. ఒక పెద్ద భవనంలో బంధించినట్టు బతకడం నా వల్ల కాదు. పొద్దున లేవగానే చప్పుళ్లు వినిపించాలి. దగ్గరలో గుడి, బడి ఉండాలి. ఇంటెదురుగా కిరాణాకొట్టుండాలి. తెల్లారేసరికి పేపరమ్మే వాడు, సాయంత్రం పూలమ్మేవాడు వీధిలో కనిపించాలి. ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇప్పటికీ ‘బ్లూ సీ’కెళ్లి చాయ్ తాగొస్తుంటాను. మెట్రో మారుస్తుంది.. త్వరలో మన సిటీలో మెట్రోరైలు తిరగబోతుంది. మెట్రో వచ్చాక ట్రాఫిక్ తగ్గుతుంది. పెట్రోల్ వాడకం తగ్గుతుంది. మెట్రో ప్రయాణం వల్ల మనుషుల మధ్య పరిచయాలు, అనుబంధాలు పెరుగుతాయని ఆశిస్తున్నాను. -భువనేశ్వరి ఫొటోలు: ఎం.అనిల్ కుమార్ -
అప్పుడు క్లాస్.. ఇప్పుడు మాస్
ఈ కుర్రాణ్ణి గుర్తుపట్టారా? శేఖర్ కమ్ముల పరిచయం చేసిన యంగ్ హీరో ఇతను. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో బ్యూటిఫుల్ ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడి పేరు అభిజిత్. ఆ సినిమాలో చాలా క్లాస్‌గా కనిపించిన అభిజిత్, తన రెండో చిత్రం ‘మిర్చిలాంటి కుర్రాడు’ కోసం మాస్‌గా తయారయ్యాడు. ఇందులో తను సిక్స్‌ప్యాక్ దేహంతో యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా అలరించనున్నాడు. ఈ విశేషాలను అభిజిత్ వివరిస్తూ - ‘‘ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత సిక్స్‌ప్యాక్ కోసం కసరత్తులు మొదలుపెట్టాను. లక్కీగా అలాంటి పాత్రే నాకు లభించింది. సిక్స్ ప్యాక్ సన్నివేశాలు తీస్తున్నపుడు వారం ముందు నుంచే కొంత ప్రిపరేషన్ ఉండాలి. వాటర్ కంటెంట్ బాగా తగ్గించేయాలి. అలాగే ఉప్పు అస్సలు వాడకూడదు’’ అన్నారు. ‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమా గురించి మాట్లాడుతూ -‘‘మనసుకు నచ్చిన అమ్మాయి కోసం ఓ యువకుడు సాగించిన అన్వేషణే ఈ సినిమా. అన్ని రకాల వాణిజ్య విలువలూ ఉన్న పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇంకా పాటల చిత్రీకరణ చేయాలి. ఈ జూన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత నాకొచ్చి ఏడాదిన్నర విరామాన్ని ఈ సినిమా మరిచిపోయేలా చేస్తుంది’’ అని అభిజిత్ చెప్పారు.