శేఖర్ కమ్ముల కుబేర.. భారీగా కట్స్‌ చెప్పిన సెన్సార్ బోర్డ్! | Sekhar Kammula Kuberaa Censor board cuts 19 Scenes from this Movie | Sakshi
Sakshi News home page

Kuberaa: శేఖర్ కమ్ముల కుబేర.. భారీగా కట్స్‌.. ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటే?

Jun 18 2025 9:13 PM | Updated on Jun 18 2025 9:25 PM

Sekhar Kammula Kuberaa Censor board cuts 19 Scenes from this Movie

నాగార్జున, ధనుష్‌ హీరోలుగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కుబేర’.  రష్మికా మందన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. దాదాపు రూ.10 వేల కోట్ల స్కామ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో  ఈ సినిమా తెరకెక్కించారు. సునీల్‌ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.

అయితే ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న కుబేర చిత్రానికి భారీగానే కట్స్‌ పడినట్లు తెలుస్తోంది. తెలుగులో 181 నిమిషాలు ఉండగా.. తమిళంలో 182 నిమిషాలు రన్‌టైమ్‌తో సీబీఎఫ్‌సీ అనుమతిచ్చింది. అయితే కుబేర సినిమాలోని 19 సన్నివేశాలకు కట్‌ చెప్పింది. దీంతో రన్‌టైమ్ దాదాపు 14 నిమిషాలు తగ్గిపోయింది. సెన్సార్‌ బోర్డ్‌ ట్రిమ్ చేసిన సీన్స్‌లో ధనుశ్‌, రష్మిక మందన్న, నాగార్జున కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తం 19 సన్నివేశాలు కట్‌ చేసిన సెన్సార్ బోర్డ్ యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అంటే 13 ఏళ్లలోపు పిల్లలు ఈ మూవీ చూసేందుకు అనుమతి లేదు.

k
 

అయితే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇటీవలే కుబేర ట్రైలర్  విడుదల కాగా సినిమాపై అంచనాలు పెంచేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement