మెగా హీరోతో కాఫీలాంటి సినిమా | sekhar kammulas next with varun tej | Sakshi
Sakshi News home page

మెగా హీరోతో కాఫీలాంటి సినిమా

May 13 2016 9:53 AM | Updated on Sep 4 2017 12:02 AM

మెగా హీరోతో కాఫీలాంటి సినిమా

మెగా హీరోతో కాఫీలాంటి సినిమా

ఆనంద్, హ్యాపిడేస్, గోదావరి, లీడర్ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల, కొద్ది రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు.

ఆనంద్, హ్యాపిడేస్, గోదావరి, లీడర్ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల, కొద్ది రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. కహానీ రీమేక్గా నయనతార లీడ్ రోల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అనామిక, డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో నెక్ట్స్ సినిమా విషయంలో ఆలోచనలో పడ్డాడు. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకొని ఫర్ఫెక్ట్ కథతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్తో శేఖర్ కమ్ముల ఓ సినిమా చేయబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచే డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకుంటున్న వరుణ్, శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మరోసారి కొత్త కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను నిర్మాత దిల్రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నాడు.

శేఖర్, ఈ కథను ముందు రామ్ చరణ్కు చెప్పినా అతడు ఇంట్రస్ట్ చూపించకపోవటంతో వరుణ్తో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. వరుణ్ తొలిసారిగా మాస్ జానర్లో ట్రై చేసిన లోఫర్, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపొవటంతో ఈ సారి ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ శ్రీనువైట్లతో కలిసి మిస్టర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా పూర్తయిన  తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement
 
Advertisement
Advertisement