అనీష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఇట్లు అర్జున'. అనస్వర రాజన్ హీరోయిన్. అక్కినేని నాగార్జున సమర్పణలో ఈ చిత్ర రూపొందుతోంది. ఈనెల 13న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్లు కూడా బాగానే చేస్తున్నారు. తాజాగా మ్యూజికల్ కాన్సర్ట్ ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో రామ్‌చరణ్, అఖిల్, నాగార్జున ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వాయిస్ ఓవర్ ఇచ్చాను
నాగార్జున మాట్లాడుతూ.. ‘అనీష్ ఈ మూవీ గ్లింప్స్ తీసుకొచ్చి వాయిస్ ఓవర్ చేయమని అడిగాడు. నాకు అది నచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఈ సినిమాలో అనీష్ మూగవాడిగా చేశాడు. తొలి సినిమాకే ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ చేయడం అవసరమా? అని అడిగాను. కళ్లతో, బాడీతో మాట్లాడాలి.. హావభావాలు పలికించాలి అని చెప్పాను. అవన్నీ అనీష్ చేశాడు.
రామ్ చరణ్‌కి పదేళ్లు పట్టింది..
'రామ్ చరణ్ ‘రంగస్థలం’లో ఒక చెవిటి పాత్ర చేయడానికి పదేళ్లు పట్టింది. అఖిల్ ఆరో సినిమాకి బ్లైండ్ క్యారెక్టర్ చేశాడు. ఇలాంటివి పాత్రలు చేయడం అంత సులభంకాదని అనీష్‌తో చెప్పాను. ‘ఇట్లు అర్జున’ స్టోరీ మీద అనీష్‌కు చాలా నమ్మకం ఉంది. సినిమా పూర్తయిన తర్వాత నాకు చూపించారు. సినిమా చూసి నేను చాలా సర్‌ప్రైజ్ అయ్యాను’ అని నాగార్జున తెలిపారు.
ఇదీ చదవండి: మూడు సార్లు విడాకులు తీసుకున్న స్టార్స్ వీళ్లే)
#RamCharan took 10 years to play a deaf character Akhil played a blind character in his 6th film - #Nagarjuna https://t.co/7UdhTkPIvb
— Movies4u Official (@Movies4u_Officl) November 9, 2026


