ఇట్స్‌ అఫిషియల్‌: ధనుష్‌తో శేఖర్‌ కమ్ముల త్రిభాషా చిత్రం

Tollywood Director Sekhar Kammula To Team Up With Dhanush For Trilingual Film - Sakshi

పుకార్లే నిజమయ్యాయి. సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల, కోలివుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ కలిసి ఓ పాన్‌ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా అఫీషియల్ ప్రకటన ఈ రోజు వెలువడింది. ఎస్వీసీఎల్ఎల్‌పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు... శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాష‌ల‌లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. ధనుష్ తెలుగులో నటిస్తున్న తొలి స్ట్రైయిట్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితర వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల ‘లవ్‌స్టోరీ’ పనుల్లో బిజీగా ఉన్నారు. ధనుష్‌ బాలీవుడ్‌లో ‘అత్రాంగి రే’, హాలీవుడ్‌లో ‘ది గ్రే మ్యాన్‌’ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన వెంటనే శేఖర్‌ కమ్ముల ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top