ట్రాన్స్ ఆఫ్ కుబేర.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది! | Dhanush Kuberaa Movie Full Video Song out now | Sakshi
Sakshi News home page

Trance Of Kuberaa: ట్రాన్స్ ఆఫ్ కుబేర.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది!

Jul 14 2025 7:44 PM | Updated on Jul 14 2025 9:11 PM

Dhanush Kuberaa Movie Full Video Song out now

ధనుశ్, నాగార్జున కీలక పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా మెప్పించింది. సినిమాలో ధనుశ్ బిచ్చగాడి పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. తాజాగా మూవీ క్రేజీ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. కుబేరలోని నాది నాది నాదే లోకమంతా అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ధనుష్‌, హేమచంద్ర ఈ సాంగ్ను ఆలపించగా.. కిశోర్ లిరిక్స్ అందించారు. కాగా.. సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.

ఓటీటీకి కుబేర

విడుదలకు ముందే 'కుబేర' ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. 4 వారాల అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దీంతో నెలలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement