‘పేషన్’ విజయం సాధించాలి: శేఖర్‌ కమ్ముల | Passion Movie First Look Poster Released By Sekhar Kammula Went Viral | Sakshi
Sakshi News home page

‘పేషన్’ విజయం సాధించాలి: శేఖర్‌ కమ్ముల

Apr 27 2025 4:37 PM | Updated on Apr 27 2025 5:52 PM

Passion Movie First Look Poster Released By Sekhar Kammula

యంగ్ టాలెంట్ సుధీస్, అంకిత హీరో హీరోయిన్లుగా అరవింద్ జాషువా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీ ‘పేషన్’. REDANT క్రియేషన్ బ్యానర్‌పై నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.., అరవింద్ జాషువా రాసిన ‘పేషన్’ నవల చదివాను, అది చాలా అథెంటిక్‌గా ఉంది. ఈ చిత్రం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. అరవింద్‌లో స్టోరీ టెల్లింగ్, రైటింగ్ స్కిల్స్ అద్భుతం. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.

అరవింద్ జాషువా మాట్లాడుతూ, ఫ్యాషన్ కాలేజీలో సామాన్యుడి అనుభవాల నుంచి స్ఫూర్తి పొందిన కథ ఇది. శేఖర్ కమ్ముల నా గురువు, ఆయన స్ఫూర్తితోనే ఈ సినిమా తీశాను. నిర్మాతలు, సాంకేతిక బృందం అద్భుతంగా సహకరించారు. ఈ జనరేషన్‌కు కనెక్ట్ అయ్యే కథతో సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది అన్నారు.ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, శేఖర్ కమ్ముల సపోర్ట్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఛాయా పబ్లికేషన్స్ ప్రచురించిన నవల స్ఫూర్తితో ఈ సినిమా రూపొందిందని చెప్పారు. సినిమా గొప్ప విజయం సాధించాలని టీమ్ ఆకాంక్షిస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement