లాక్‌డౌన్‌: సెన్సిటివ్‌గా ఉందాం.. వారిని సపోర్ట్‌ చేద్దాం

Sekhar Kammula Provides Basic Essentials To Transgenders Across Telugu States - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న హిజ్రాలను ఆదుకునేందుకు తన వంతు సాయాన్ని అందించారు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. ఇప్పటికే ఆయన జీహెచ్‌ఎంసీ, కర్నూలు పారిశుద్య కార్మికులకు నెలరొజుల పాటు బాదం పాలు, మజ్జిగ అందజేసి తనవంతు సాయం చేస్తూ అందరికీ ఆదర్శకంగా నిలుస్తున్నారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని హిజ్రాలను ఆదుకునేందుకు ఆయన ముందుకు వచ్చారు. అంతేకాకుండా వీళ్లకు సహాయం చేయడానిఇక మరికొంతమంది ముందుకు రావాలని సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. 

‘ఈ లాక్‌డౌన్‌ సమయంలోలో అత్యంత ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ట్రాన్స్‌జెండర్లు‌. వాళ్లు పడుతున్న కష్టాలని ఊహించలేం కుడా. అన్నం లేక, ఉంటానికి గూడు దొరక్క, అద్దెలు కట్టుకోలేక చాలా బాధలు పడుతున్నారు. ఇవి కాక సమాజంలో వారి పట్ల ఉండే వివక్ష, అపోహలతో వాళ్ల ఇబ్బందుల్ని ఇంకా పెంచుతున్నాయి. వాళ్లకి అడ్రస్ ఉండదు. ఓటర్ కార్డ్ ఉండదు. రేషన్ కార్డ్ ఉండదు. హెల్త్‌కేర్‌ పథకాలు వర్తించవు. సెన్సిటివ్ గా ఉందాం. వాళ్ళని సపోర్ట్ చేద్దాం. ఎవరన్నా కాంటాక్ట్ చేయాలి అంటే rachanamudraboyina@gmail.comకు మెయిల్‌ చేయండి’అంటూ శేఖర్‌ కమ్ముల ట్వీట్‌ చేశారు. ఇక శేఖర్ కమ్ముల చేసిన సాయానికి కృతజ్ఞతగా హిజ్రాలు ‘థాంక్యూ శేఖర్ కమ్ముల’ అంటూ ప్లకార్డులు పట్టుకొని తమ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేశారు. మరింత మంది తమను ఆదుకునేందుకు ముందుకురావాలని కోరారు.

చదవండి:
హరీష్‌పై బండ్ల గణేష్‌ సంచలన వ్యాఖ్యలు
భార్యకు విడాకులు.. గాయనితో 9 ఏళ్లుగా

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top