
అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 20న విడుదలైంది.

కుబేరలో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషించారు.

శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి ఎస్‌వీసీఎల్‌ఎల్‌పీపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది.

భాషతో సంబంధం లేకుండా విడుదలైన ప్రతిచోట కుబేర హిట్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.













