
ధనుష్, నాగార్జున కాంబినేషన్‌లో దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekhar kammula) తెరకెక్కించిన చిత్రం 'కుబేర'.. ఇందులో రష్మిక మందన్న కీలకపాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ఈ మూవీ రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తాజాగా ఈ మూవీ నుంచి 'పీ పీ డుమ్ డుమ్' అంటూ సాగే వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఇందులో రష్మిక వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా కావాల్సిందే. అయితే, ఈ పాట సినిమాలో లేదు. రన్‌టైమ్ ఎక్కువగా ఉండటంతో దీనిని తొలగించారు. ఓటీటీ విడుదల సమయంలో మళ్లీ యాడ్ చేసే ఛాన్స్ ఉంది. చైతన్య రాసిన ఇంగ్లిష్ లిరిక్స్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సాంగ్ మొత్తం ఇంగ్లిష్ పదాలతోనే ఉండడం విశేషం. మంగ్లీ సోదరి ఇంద్రావతి ఈ పాటను ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించారు.