'విజయ్ దేవరకొండ మామ.. రష్మిక అక్కా.. చిన్నారి క్యూట్ వీడియో' | Vijay Deverakonda Little Fan Reply To Hero Invitation For Lunch, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: 'విజయ్ దేవరకొండ మామ.. రష్మిక అక్కా.. మీకు చాలా ‍థ్యాంక్స్'

Mar 8 2026 3:23 PM | Updated on Mar 8 2026 5:09 PM

Vijay devarakonda little Fan reply hero invitation for lunch

టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్‌ జంట విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. గతనెల ఫిబ్రవరి 26న వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లి తర్వాత ఫ్యాన్స్‌కు స్వీట్స్ పంచిన ఈ జంట ప్రత్యేకంగా అన్నదానాలు నిర్వహించారు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం మార్చి 4న గ్రాండ్ రిసెప్షన్‌ నిర్వహించారు.

అయితే ఓ చిన్నారి విజయ్ దేవరకొండకు అభిమానినని.. తనను ఎందుకు పెళ్లికి పిలవలేదని ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన హీరో విజయ్.. బుజ్జి తల్లికి రిప్లై ఇచ్చాడు. మా ఇంటికి లంచ్‌కి వచ్చేయ్.. నీకిష్టమైన స్వీట్స్, ఫుడ్‌ ఇంట్లోనే చేయించి వడ్డిస్తానని చిన్నారికి బదులిచ్చాడు. ఇది చూసిన చిన్నారి నన్ను మీ ఇంటికి పిలిచినందుకు థ్యాంక్స్ అంటూ మరో వీడియోను రిలీజ్ చేసింది. హాయ్ విజయ్ దేవరకొండ మామ.. రష్మిక ‍అక్కా.. మీరు నాకు రిప్లై ఇచ్చి.. నన్ను ఇంటికి రమ్మని పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్‌ యూ.. బై బై అంటూ క్యూట్‌గా మాట్లాడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement