బద్మాష్‌.. బల్సిందారా? బొక్కలిరగ్గొడతా!! | Fidaa Teaser is out | Sakshi
Sakshi News home page

బద్మాష్‌.. బల్సిందారా? బొక్కలిరగ్గొడతా!!

Jun 17 2017 5:04 PM | Updated on Sep 5 2017 1:52 PM

బద్మాష్‌.. బల్సిందారా? బొక్కలిరగ్గొడతా!!

బద్మాష్‌.. బల్సిందారా? బొక్కలిరగ్గొడతా!!

‘బద్మాష్‌.. బల్సిందారా? బొక్కలిరగ్గొడతా!!’ దూసుకెళుతున్న రైల్లో తలుపు వద్ద నిలబడి..

‘బద్మాష్‌.. బల్సిందారా? బొక్కలిరగ్గొడతా!!’  దూసుకెళుతున్న రైల్లో తలుపు వద్ద నిలబడి సాయిపల్లవి చూపిన ఫైర్‌ ఇది. కట్‌ చేస్తే.. ‘ఏం పిల్లరా.. వెళ్లట్లేదు మైండ్‌లోంచి.. జీవితాంతం ఎవరితోనో ఉండాలనుకుంటున్నావు కదా.. అదీ ఈమే’ అంటూ ‘ఫిదా’ అయిపోయిన వరుణ్‌తేజ్‌. మ్యాటర్‌ ఈపాటికి మీకు అర్థమైంది కదా? అందమైన కథలను అంతే అందంగా సినీ తెరపై చూపించే శేఖర్‌ కమ్ముల తాజా చిత్రం ‘ఫిదా’ టీజర్‌ ఇది.

ఈ టీజర్‌లో లవ్లీ లుక్‌తో, రఫ్‌ డైలాగులతో సాయిపల్లవి రఫ్పాడించగా.. ఆమెను చూసి ‘ఫిదా’ అయిపోతూ వరుణ్‌ తేజ్‌ సినిమా ఎంత అందంగా ఉండబోతున్నదో హింట్‌ ఇచ్చాడు. దిల్‌ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతోంది ఈ సినిమా టీజర్‌ శనివారం ఆన్‌లైన్‌లో విడుదలైంది. శేఖర్‌ కమ్ముల మ్యాజిక్‌ మార్క్‌ ఈ టీజర్‌లో చూడొచ్చు. మీరూ ఓ లుక్‌ వేయండి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement