టాలీవుడ్‌పై ధనుష్‌ స్పెషల్‌ ఫోకస్‌.. మరో ఇద్దరితో చర్చలు!

Danush To Act In Three Telugu Movies - Sakshi

కోలివుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌, సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల కాంబోలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నందుకు ధనుష్ తన కెరీర్ లోనే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని, దాదాపు రూ. 50 కోట్లకు పైగా పారితోషికం బాగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఈ రెమ్యూనరేషన్ రూమర్ కోలీవుడ్ ను షేక్ చేస్తోంది. అయితే శేఖర్ కమ్ములతో తెలుగు మూవీ చేసేసి,మళ్లీ కోలీవుడ్ వెళ్లిపోదాం అనుకోవడం లేదు ధనుష్. 
(చదవండి: పెళ్లి తర్వాత కూడా నయన్‌ నటిస్తుందా?, హీరోయిన్‌ స్పందన)

తెలుగులో ధనుష్ మొత్తం మూడు చిత్రాలు చేయనున్నాడని సమాచారం.శేఖర్ కమ్ములతో మూవీ తో పాటు,వెంకీ అట్లూరి, అలాగే ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతితో కూడా చర్చలు జరుపుతున్నాడట. అజయ్ భూపతి మేకింగ్ చాలా వరకు కోలీవుడ్ ఆడియెన్స్ కు దగ్గరగా ఉంటుందనీ అందుకే తనకోసం స్టోరీ రేడీ చేయమని చెప్పాడట. ఆర్ ఎక్స్ 100 తర్వాత మహా సముద్రం తెరకెక్కిస్తున్నాడు అజయ్. ఈ మూవీ పూర్తైన తర్వాత డైరెక్ట్ గా ధనుష్ తో ప్యాన్ ఇండియా సినిమా తెరకెక్కించినా ఆశ్చర్యం లేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top