చిరంజీవితో శేఖర్ కమ్ముల.. ఇది చాలా స్పెషల్ | Director Sekhar Kammula Met Chiranjeevi | Sakshi
Sakshi News home page

Sekhar Kammula: చిరంజీవితో శేఖర్ కమ్ముల.. కారణం ఏంటి?

May 31 2025 6:42 PM | Updated on May 31 2025 7:05 PM

Director Sekhar Kammula Met Chiranjeevi

తెలుగు దర్శకుల్లో శేఖర్ కమ్ముల కాస్త డిఫరెంట్. చాలా సాధారణంగా అనిపించే కథలతో సినిమాలు తీసి హిట్స్ కొడుతుంటారు. ప్రస్తుతం 'కుబేర' అనే చిత్రాన్ని రిలీజ్‌కి సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఓ విషయమై కలిశారు. అందుకు సంబంధించిన ఫొటోలని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.

(ఇదీ చదవండి: హైదరాబాద్ పబ్‌లో తెలుగు నటి కల్పిక రచ్చ రచ్చ)

'టీనేజీలో ఒక్కసారి చిరంజీవి గారిని దగ్గరగా చూశాను. 'ఈయనతో సినిమా తీయాలి' అనే ఫీలింగ్ అంతే. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు. 'లెట్స్ సెలబ్రేట్' అని మా టీమ్ అంటే నాకు గుర్తొచ్చింది చిరంజీవిగారే. కొన్ని జనరేషన్స్‌ని ఇన్‌స్పైర్ చేసిన పర్సనాలిటీ ఆయన. 'ఛేజ్ యువర్ డ్రీమ్స్, సక్సెస్ మనల్ని ఫాలో అయి తీరుతుంది' అన్న నమ్మకం ఇచ్చింది ఆయనే'

'కాబట్టి నా 25 ఏళ్ల జర్నీ సెలబ్రేషన్స్ అంటే ఆయన దగ్గరే చేసుకోవాలి అనిపించింది. థ్యాంక్యూ సరే ఈ మూమెంట్స్‪‌లోనే కాదు, నా టీనేజ్ నుండి మీరు నా ముందు ఇలాగే ఉన్నారు' అని శేఖర్ కమ్ముల తన ఆనందాన్ని అక్షరాల రూపంలో రాసుకొచ్చారు. 'డాలర్ డ్రీమ్స్' సినిమాతో దర్శకుడిగా మారిన ఈయన.. ఆనంద్, గోదావరి, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ.. ఇలా చాలా మంచి సినిమాల్ని అందించారు. జూన్ 20న 'కుబేర'తో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)

Advertisement
 
Advertisement
Advertisement