
నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా నటించిన చిత్రం 'కుబేర'... భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'పోయిరా పోయిరా మావా' సాంగ్ విడుదలైంది. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ విడదులకు ముందు ఈ సాంగ్ బాగా పాపులర్ అయింది. ఈ సాంగ్ను భాస్కరభట్ల రాయగా ధనుష్ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.