హైదరాబాద్‌ను నిజంగా ప్రేమిస్తే : దర్శకుడు శేఖర్‌ కమ్ముల | GHMC ELECTIONS 2020 Director Sekhar Kammula about Vote | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ను నిజంగా ప్రేమిస్తే : దర్శకుడు శేఖర్‌ కమ్ముల

Nov 28 2020 8:58 PM | Updated on Nov 28 2020 8:58 PM

GHMC ELECTIONS  2020 Director Sekhar Kammula about Vote - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం రేపటి(ఆదివారం)తో ముగియనున్న సందర్భంగా రాజకీయ పార్టీల ప్రచార హోరు సాగుతోంది.అటు సోషల్‌ మీడియాలో సెలబ్రిటీల సం‍దేశాల జోరు కూడా పెరిగింది. ఓటు హక్కు వినియోగంపై ఉత్సాహాన్ని రేకెత్తించేలా విడియోలను పోస్ట్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఉరుకుపరుగుల జీవితంలో బిజీ బిజీగా గడిపే నగరవాసుల్లో ఓటు హక్కు వినియోగం శాతం పెంచేలా  చైతన్యాన్ని కలిలిస్తున్నారు. ఈ విషయంలో ప్రముఖ యాంకర్‌ ఉదయ భాను ముందు వరుసగా నిలిచారు. తాజాగా మంచి కాఫీ లాంటి ‘ఆనంద్‌’ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన శేఖర్‌ కమ్ముల ఎన్నికలకు సంబంధించి మంచి సందేశంతో ముందుకొచ్చారు.  మన నగరాన్ని నిజంగా ప్రేమిస్తే.. మనం తప్పకుండా డిసెంబరు 1 వతేదీన తప్పకుండా  ఓటు వేయాలని ఆయన  కోరారు. (లక్షలకు లక్షలు దోచేస్తారు : ఉదయభాను వీడియో)

Advertisement
 
Advertisement
Advertisement