మరో వీడియో పోస్ట్‌ చేసిన మోదీ.. దేశ ప్రజలకు కీలక పిలుపు | PM Modi asks people to make Har Ghar Tiranga a celebration in every home | Sakshi
Sakshi News home page

మరో వీడియో పోస్ట్‌ చేసిన మోదీ.. దేశ ప్రజలకు కీలక పిలుపు

Aug 11 2026 4:45 PM | Updated on Aug 11 2026 5:15 PM

PM Modi asks people to make Har Ghar Tiranga a celebration in every home

న్యూఢిల్లీ: దేశ ప్రజలు ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగస్వాములు కావాలని, స్వాతంత‍్య్ర దినోత్సవానికి ముందు ప్రతి ఇంట్లో దాన్ని ఒక వేడుకగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పిలుపునిచ్చారు. ఈ ప్రచారానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ పోస్ట్‌ చేశారు. “రండి, #హర్‌ఘర్‌తిరంగా ప్రతి ఇంటి వేడుకగా మార్చుకుందాం” అని పోస్టు చేశారు. ఈ ప్రకటన ఆగస్టు 15న జరిగే 80వ స్వాతంత్య్ర వేడుక సందర్భంగా చేశారు.

“రండి, ఆగస్టు 15ను గర్వంతో, గౌరవంతో జరుపుకుందాం. స్వాతంత‍్య్ర సమరయోధులకు నివాళులు అర్పిద్దాం. అభివృద్ధి చెందిన భారత్‌ (వికసిత్‌ భారత్) నిర్మాణానికి ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం, ప్రతి గృహంలో త్రివర్ణ పతాకం, ప్రతి హృదయంలో త్రివర్ణ పతాకం ఉండాలి. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం” అని ప్రధాని అన్నారు. 2026 హర్ ఘర్ తిరంగా ప్రచారం ఆగస్టులో నిర్వహిస్తున్నారు. దేశ ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశవ్యాప్త వేడుకల్లో పాల్గొనాలని ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రచారం ద్వారా ప్రజలు త్రివర్ణ పతాకాన్ని తమ ఇళ్లకు తీసుకువచ్చి స్వాతంత‍్య్ర స్ఫూర్తిని జరుపుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఎర్రకోట వద్ద ‘వందే మాతరం’ 
స్వాతంత‍్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ గీతానికి ముందు ఎర్రకోట ప్రాకారాలపై నుంచి ‘వందే మాతరం’ను సామూహికంగా ఆలపించనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మంగళవారం తెలిపారు. ఎక్స్‌లో చేసిన గుప్తా స్పందిస్తూ దీనిని “గౌరవప్రదమైన, చారిత్రాత్మక ఘట్టం”గా అభివర్ణించారు. జాతీయ గీతానికి ముందు ఎర్రకోట వద్ద సామూహికంగా ‘వందే మాతరం’ ఆలపించడం ఇదే తొలిసారి అని చెప్పారు.

భారత స్వాతంత‍్య్ర ఉద్యమంలో ‘వందే మాతరం’ ఒక “అమర జాతీయ మంత్రం”గా నిలిచిందని, అది విప్లవకారులకు స్ఫూర్తినిచ్చిందని, స్వాతంత‍్య్ర సమరయోధుల త్యాగాలకు స్వరంగా మారిందని గుప్తా పేర్కొన్నారు. ‘వందే మాతరం’ 150వ వార్షికోత్సవం, పార్లమెంట్‌లో ఆమోదించిన తీర్మానం, ప్రధాని మోదీ నాయకత్వాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఇవన్నీ కలిసి భారత జాతీయ స్మృతి, సాంస్కృతిక గౌరవం, దేశభక్తికి గొప్ప ప్రకటనగా నిలుస్తాయని చెప్పారు. “వందే మాతరం. జై హింద్, భారత మాతాకీ జై!” అని గుప్తా తన పోస్టులో పేర్కొన్నారు.

గోవాలో తిరంగా ర్యాలీ
హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా గోవా రాజధాని పనాజీలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. మిరామార్ సర్కిల్ నుంచి కాలా అకాడమీ మీదుగా ఆజాద్ మైదాన్ వరకు నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్నారు. కాలా అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్.. పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్రసంగించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement