‘విరాజ్ మంచి హీరో అవుతాడు’ | Anaganaga O kadha Song Launched By Sekhar Kammula | Sakshi
Sakshi News home page

Oct 4 2018 2:29 PM | Updated on Oct 4 2018 3:19 PM

Anaganaga O kadha Song Launched By Sekhar Kammula - Sakshi

విరాజ్ జె అశ్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ టి.ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అనగనగా ఓ ప్రేమకథ. కె.సతీష్ కుమార్ సమర్పణలో కె.ఎల్.యన్.రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రిద్ధి కుమార్ ,రాధా బంగారు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర సంబంధించిన టైటిల్ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ..‘అనగనగా ఓ ప్రేమకథ లోని టైటిల్ సాంగ్ ను విడుదల చేయటం ఎంతో ఆనందంగా ఉంది. పాటకు సమకూర్చిన సంగీతం, సాహిత్యం ఎంతో బాగుంది. మార్తండ్ కే వెంకటేష్ గారి మేనల్లుడు అయిన విరాజ్ అశ్విన్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, మార్తండ్ కే వెంకటేష్ గారితో నేను చాల సినిమాలు పని చేశాను. తప్పకుండా విరాజ్ అశ్విన్ మంచి హీరో అవుతాడు అని నమ్మకం ఉంది . డైరెక్టర్ ప్రతాప్‌కి బెస్ట్ విషెస్ చెపుతూ, ఈ సినిమా ని హిట్ ఇవ్వాలి అని కోరుకుంటున్న’ అన్నారు .  

తమ చిత్రంలోని  పాటను దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement