'కుబేర'కు రివ్యూ ఇచ్చిన శేఖర్ కమ్ముల కూతురు | Director Sekhar Kammula Daughter Vandana Kuberaa Review | Sakshi
Sakshi News home page

Kuberaa: శేఖర్ కమ్ములకు ఇంత పెద్ద కూతురు ఉందా?

Jun 20 2025 4:03 PM | Updated on Jun 20 2025 5:24 PM

Director Sekhar Kammula Daughter Vandana Kuberaa Review

ఈ వీకెండ్ రెండు కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. వీటిలో 'కుబేర' ఒకటి. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. సాధారణంగా ఈ డైరెక్టర్ ఇంత పెద్ద మూవీస్ చేయడు. స్టార్స్ లేకుండా సింపుల్ బడ్జెట్‌తో సినిమా తీస్తుంటారు. అలాంటిది ఈసారి భారీ  బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీ తీశారు. థియేటర్లలో చూసిన ప్రతిఒక్కరూ పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు.

(ఇదీ చదవండి: కొత్త కారు కొన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. రేటు ఎంతో తెలుసా?)

'కుబేర' చూసినవాళ్లు శేఖర్ కమ్ముల విజన్‌ని మెచ్చుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో సినిమా చూసేందుకు ఈయన కూతురు కూడా వచ్చింది. బయటకొచ్చి తనదైన రివ్యూ కూడా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇ‍ప్పుడు వైరల్ అవుతోంది. ‍'టీమ్‌ని చూస్తుంటే గర్వంగా ఉంది. మేం చాలా చాలా చెప్పాం. దానికి మించి ఉంది సినిమా' అని శేఖర్ కమ్ముల కూతురు వందన చెప్పింది.

దాదాపు 25 ఏళ్లుగా శేఖర్ కమ్ముల సినిమాలు తీస్తున్నాడు. కాకపోతే మిగతా దర్శకుల్లా కాకుండా బయట కనిపించరు. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా ఉండరు. దీంతో ఈయన కుటుంబం గురించి బయటవాళ్లకు తక్కువగానే తెలుసు. అలాంటిది శేఖర్ కమ్ముల కూతురు వందన.. అప్పుడప్పు కనిపిస్తోంది. మొన్నీమధ్య హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో, ఇప్పుడు తండ్రి సినిమాకు రివ్యూ ఇస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. ఇది చూసిన పలువురు నెటిజన్లు.. శేఖర్ కమ్ములకు ఇంత పెద్ద కూతురుందా అని ఆశ్చర్యపోతున్నారు. చూస్తుంటే తండ్రిలానే సినిమాల్లోకి వస్తుందేమో అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: Kuberaa Review: ‘​కుబేర’ మూవీ రివ్యూ)

Advertisement
 
Advertisement
Advertisement