కొత్త కారు కొన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా | Director Sandeep Reddy Vanga New Car And Cost Details | Sakshi
Sakshi News home page

Sandeep Reddy Vanga: 'స్పిరిట్' డైరెక్టర్ డిఫరెంట్ కారు.. రేటు ఎంతంటే?

Jun 20 2025 2:54 PM | Updated on Jun 20 2025 3:38 PM

Director Sandeep Reddy Vanga New Car And Cost Details

సందీప్ రెడ్డి పేరు చెప్పగానే అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలే గుర్తొస్తాయి. ఈ చిత్రాలతో దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన ఇతడు.. ప్రస్తుతం ప్రభాస్‌తో 'స్పిరిట్' అనే మూవీ చేస్తున్నాడు. ఇదివరకే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా.. త్వరలో షూటింగ్ మొదలవనుంది. ఈ క్రమంలోనే సందీప్ తాజాగా కొత్త కారుని కొనుగోలు చేశాడు. అందరితో పోలిస్తే డిఫరెంట్‌గా ఉండేదాన్ని తీసుకున్నాడు. ఇంతకీ దాని రేటు ఎంత? స్పెషల్ ఏంటి?

(ఇదీ చదవండి: ఇన్ స్టా ఫాలోవర్స్ లేరని హీరోయిన్‌గా తీసేశారు: రాజశేఖర్ కూతురు)

స్వతహాగా డాక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగా.. అటువైపు కాకుండా డైరెక్షన్ వైపు వచ్చాడు. విజయ్ దేవరకొండతో 'అర్జున్ రెడ్డి' తీసి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. 'యానిమల్'తో తన సక్సెస్ స్ట్రీక్ కొనసాగించాడు. అయితే సందీప్ సినిమాల్లో సీన్ల గురించి ఎప్పటికప్పుడు ఏదో ఓ చర్చ నడుస్తూనే ఉంది. ఎవరో ఓ మాట అన్నారంటే వాళ్లకు కౌంటర్ ఇచ్చేంత వరకు సందీప్ నిద్రపోడు. రీసెంట్‌గా కూడా 'స్పిరిట్' నుంచి తప్పుకొన్న దీపికా పదుకొణెని పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చాడు.

సరే ఇదంతా పక్కనబెడితే కొన్నిరోజుల క్రితం హైదరాబాద్‌లో కొత్తగా ఆఫీస్ పెట్టిన సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు మినీ కూపర్ అనే కారుని కొనుగోలు చేశాడు. ఈ కారు రిజిస్ట్రేషన్ అయిపోగా.. గురువారం నాడు పూజ చేయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చూడటానికి సింపుల్‌గా కనిపించే ఈ కారు ధర మార్కెట్‌లో భారీగానే ఉందండోయ్. ప్రస్తుతం రూ.60-70 లక్షల మధ్య దీని రేటు ఉంది.

(ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్.. ఉపాసన పోస్ట్ వైరల్)

Advertisement
 
Advertisement
Advertisement