సందీప్‌ కిషన్‌ ‘సిగ్మా’ విడుదల తేదీ ఇదే.. | Hero Sundeep Kishan, Jason Sanjay Directorial Sigma release Date | Sakshi
Sakshi News home page

సందీప్‌ కిషన్‌ ‘సిగ్మా’ విడుదల తేదీ ఇదే..

Aug 18 2026 7:03 PM | Updated on Aug 18 2026 7:08 PM

Hero Sundeep Kishan, Jason Sanjay Directorial Sigma release Date

కోలీవుడ్‌ స్టార్‌, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ కుమారుడు జాసన్‌ సంజయ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న తొలి చిత్రం ‘సిగ్మా’. సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. తొలుత జూలై 31న విడుదల చేయాలని భావించిన ఈ సినిమాను అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది.

లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాస్కరన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్‌, కామెడీల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్‌రాజ్‌, శివ్‌ పండిట్‌, యోగ్‌ జాపీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. 

ఇదీ చదవండి: గిన్నిస్‌ రికార్డా? బిగ్‌బాస్‌ అవకాశమా? ధనుష్‌ స్పందన ఇదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement