మై డియర్‌ శేఖర్‌.. నీలాంటి అభిమాని ఉండడం ఆనందకరం: చిరంజీవి | Chiranjeevi Tweet On Shekar Kammula | Sakshi
Sakshi News home page

మై డియర్‌ శేఖర్‌.. నీలాంటి అభిమాని ఉండడం ఆనందకరం: చిరంజీవి

Jun 3 2025 2:16 PM | Updated on Jun 3 2025 3:13 PM

Chiranjeevi Tweet On Shekar Kammula

మెగాస్టార్‌ చిరంజీకి సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల వీరాభిమాని. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని సినిమాల్లోకి వచ్చాడట. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరంజీవిని కలిసి.. ఆయన ఈ విషయాన్ని చెప్పారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. శేఖర్‌ కమ్ములపై ప్రశంసలు కురిపించారు.

‘మై డియర్ శేఖర్,  మీలాంటి ఒక అభిమాని ఉండటం నాకూ అంతే ఆనందకరం. మీ ప్రస్థానానికి స్ఫూర్తి నిచ్చానని తెలిసి మరింత సంతోషించాను. మీ 25 ఏళ్ల జర్నీలో ఆ విధంగా నేనూ ఒక  భాగమైనందుకు గర్వంగా ఉంది. సున్నితమైన వినోదంతో పాటు, ఒక  సోషల్ కామెంట్ ని జత చేసి ఆలోచనాత్మకంగా తీసే మీ సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం. ఫిలిం మేకింగ్ లో మీ కంటూ ఒక ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకున్న మీరు ఇలాగే మరో 25 ఏళ్ళు, మరెన్నో  జనరంజకమైన సినిమాలు 'వ్రాస్తూ’, తీస్తూ, మరెన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తున్నాను’ అని చిరంజీవి ట్వీట్‌ చేశాడు.

'డాలర్ డ్రీమ్స్' సినిమాతో దర్శకుడిగా మారిన శేఖర్‌ కమ్ములు.. ఆనంద్ మూవీతో సూపర్‌ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. గోదావరి, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన తొలి పాన్‌ ఇండియా మూవీ కుబేర ఈ నెల 20న రిలీజ్‌ కాబోతుంది. ధనుష్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో నాగార్జున, రష్మిక కీలక పాత్రలు పోషించారు. 

Advertisement
 
Advertisement
Advertisement