'కుబేర' మ్యూజికల్‌ గ్లింప్స్‌ విడుదల | Dhanush Kubera Glimpse Out Now | Sakshi
Sakshi News home page

'కుబేర' మ్యూజికల్‌ గ్లింప్స్‌ విడుదల

Nov 15 2024 6:05 PM | Updated on Nov 15 2024 6:26 PM

Dhanush Kubera Glimpse Out Now

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ విడుదలైంది. రష్మిక మందన్న కీలక పాత్రలో కనిపించనుంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అమిగోస్‌ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు.

తాజాగా విడుదలైన గ్లింప్స్‌ ఎలాంటి డైలాగ్స్‌ అయితే లేవు. కానీ, ధనుష్‌ పాత్రను మాత్రం బిచ్చగాడిగానే కాకుండా డబ్బున్న వ్యక్తిలా చూపించారు. 52 సెకండ్ల పాటు ఉన్న ఈ గ్లింప్స్‌ మొత్తం బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తోనే నడుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్‌ ప్రధాన హైలెట్‌గా ఉంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement