
తమిళ స్టార్ హీరో ధనుష్‌పై నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna ) ప్రశంసల వర్షం కురిపించింది. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఆయన చేసే పనులు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడింది. అందరితో చాలా మర్యాదగా మాట్లాడతాడని చెప్పు, అలాంటి గొప్ప నటుడితో పని చేయడం ఆనందంగా ఉందని సోషల్ మీడియా వేదికగా ధనుష్‌ని పొగడ్తలతో ముంచేస్తూ.. ఆయనతో దిగిన సెల్ఫీ ఫోటోని షేర్ చేసింది.
‘మీతో అంతపెద్ద సినిమా(కుబేర) చేసినప్పటికీ.. మనమిద్దరం కలిసి ఒక్క సెల్ఫీ మాత్రమే తీసుకున్నాం. మీరు చాలా అద్భుతమైన వ్యక్తి. ప్రతి రోజు కష్టపడి పని చేస్తున్నందుకు ధన్యవాదాలు. మనం మాట్లాడుకున్న ప్రతి సారి వేరు వేరు నగరాల్లో ఉండేవాల్లం. విశ్రాంతి ఎంత అవసరమో చర్చించుకునే వాళ్లం కానీ..మనం మాత్రం విశ్రాంతి తీసుకోలేదు. కుబేరలో మాత్రమే కాదు..ప్రతి సినిమాలోనే మీ నటన అద్భుతంగా ఉంటుంది. నాతోనే కాదు చుట్టూ ఉన్నవాళ్లతో చాలా మర్యాదగా మాట్లాడతారు. సెట్‌లో నాకోసం తెచ్చిన లడ్డూలను ఎప్పటికీ గుర్తించుకుంటాను. అలాగే నాకు తమిళ డైలాగుల విషయంలో మీరు చేసి సాయం.. నేను ఏదైనా డైలాగు చెబితే మీరు ప్రశంసించిన తీరు.. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అయినా.. జీవితాంతం గుర్తుంటాయి ధనుష్ సార్’ అని రష్మిక ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.
కుబేర( Kuberaa ) విషయానికొస్తే.. ధనుష్, నాగార్జున హీరోలుగా నటించిన ఈ చిత్రంలో రష్మిక కీలక పాత్ర పోషించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలైన హిట్ టాక్‌ని సంపాదించుకుంది. ధనుష్ నటనపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.