నాగార్జున తప్ప మరొకరిని ఊహించుకోలేం : కుబేరా నిర్మాతలు | Producers Suniel Narang, Puskur Ram Mohan Talk About Kuberaa Movie | Sakshi
Sakshi News home page

ధనుష్‌ 20 నిమిషాల కథ విని సైన్‌ చేశారు: ‘కుబేరా’ నిర్మాతలు

Jun 12 2025 5:40 PM | Updated on Jun 12 2025 6:38 PM

Producers Suniel Narang, Puskur Ram Mohan Talk About Kuberaa Movie

దర్శకుడు శేఖర్‌ కుబేరా కథ చెప్పినప్పుడే ఇందులో హీరోగా ధనుష్‌ అయితే బాగుంటుందని చెప్పారు. ధనుష్‌ కూడా కథ విని 20 నిమిషాల్లోనే సైన్‌ చేశాడు. ఇక ఇందులో మరో కీలక పాత్రని నాగార్జున చేశాడు. శేఖర్‌ మొదటి నుంచి ఈ పాత్రకు నాగార్జున తప్పితే మరొకరు చేయలేరని చెప్పాడు. నాగ్‌కి కూడా ఈ కథ బాగా నచ్చింది. దీంతో వెంటనే ఓకే చేశాడు. ఆ  పాత్రలో నాగార్జునని తప్ప మరొకరిని ఊహించేకోలేనంత గొప్పగా పెర్ఫార్మ్‌ చేశాడు. సినిమా ప్రతి ఒక్కరికి కచ్చితంగా నచ్చుతుంది’ అన్నారు నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు . శేకర్‌ కమ్ముల దర్శకత్వంలో సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన పాన్‌ ఇండియా మూవీ కుబేరా.  శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్‌ 20న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా  నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు మీడియాతో ముచ్చటించారు. ఈ విశేషాలు..

- శేఖర్ కమ్ముల గారు 'లవ్ స్టోరీ' తర్వాత  కుబేరా కథ మాకు చెప్పడం జరిగింది. ఈ కథకు ధనుష్ గారు అయితే బాగుంటుందని ఆయన భావించారు. ఆయనకి ఈ కథని చెప్పారు. ధనుష్ గారు కథ 20 నిమిషాలు విని వెంటనే సైన్ చేశారు. తర్వాత ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాము.

ధనుష్ గారు పాన్ ఇండియా స్టార్. ఆయన హిందీలో కూడా సినిమాలు తీశారు. నాగార్జున గారు కూడా ఎప్పటినుంచో హిందీ సినిమాల్లో ఉన్నారు. రష్మిక గారు గురించి అందరికీ తెలుసు. ఇండియాలో ఆమె పాపులర్ యాక్ట్రెస్. కథకి అనుగుణంగానే ఇంత బిగ్ స్టార్ కాస్ట్ తో ఈ సినిమాని చేయడం జరిగింది. ధనుష్ గారు, నాగార్జున గారు. రష్మిక గారు అందరూ అద్భుతంగా సపోర్ట్ చేశారు.

కుబేర తెలుగు, తమిళ్ స్ట్రయిట్ మూవీ. హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నామ. ఫస్ట్ కాఫీ ఆల్రెడీ రెడీ అయింది. సినిమా అద్భుతంగా వచ్చింది.

శేఖర్ కమ్ముల గారు మాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఆయన లీడర్ సినిమా ఎప్పుడు చూసినా సరే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఈసారి మరింత బిగ్గర్ స్టార్ కాస్ట్ తో తీశారు. కచ్చితంగా ఆడియన్స్ కి చాలా న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది.

శేఖర్ కమ్ముల గారు స్టార్స్ ని క్యారెక్టర్స్ గానే చూస్తూ సినిమా తీసే ఫిలిం మేకర్. ఈ సినిమాలో కూడా క్యారెక్టర్స్ కనిపిస్తాయి.

శేఖర్ గారు మంచి ఎమోషన్స్ తో ఆడియన్స్ ని టచ్ చేస్తూ ఫీల్ ఉండే సినిమాలను తీస్తారు. ఈ సినిమా కూడా అలాంటిదే. ఇందులో ఉండే ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి.

రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడం ఎప్పుడూ కూడా సవాల్ తో కూడుకున్నదే. ఈ సినిమా కోసం అన్ని రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశాం. రియల్ స్లమ్స్, గార్బేజ్, డంపింగ్ యార్డ్స్ లో తీసాము.  బొంబాయిలో సినిమాని సూట్ చేయడం మరో ఛాలెంజ్. రియల్ వీధుల్లో సినిమాని సూట్ చేయడం జరిగింది. అది రియల్ ఛాలెంజ్.

మేము బడ్జెట్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కంటెంట్ కు కావలసిన బడ్జెట్ తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశాం. సినిమాని చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాము. దాదాపు 1600 స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ కాబోతోంది. చాలా అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం ఉంది.  

దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా కోసం చాలా డిఫరెంట్ సాంగ్స్ ఇచ్చారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ధనుష్ గారు రెండు పాటలు పాడారు. ఇది డైరెక్టర్ గారు, దేవిశ్రీ గారి కలెక్టివ్ డెసిషన్.

శేఖర్ కమ్ముల గారితో మరో సినిమా చేయనున్నాం. అయితే ఇంకా హీరో ఎవరనేది ఫైనల్ కాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement