మరోసారి రిపీట్‌ కానున్న ధనుష్‌-సాయిపల్లవి జోడీ

Dhanush To Romance Sai Pallavi In Sekhar Kammula film - Sakshi

ప్రముఖ స్టార్‌ హీరో ధనుష్‌, డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల కాంబోలో ఓ త్రిభాష చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. దినికి సంబంధించిన ఇప్పటికే అధికారిక ప్రకటన ఊడా వెల్లడైంది. ఎస్వీసీఎల్ఎల్‌పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు... శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రాన్ని నిర్మించనున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. తెలుగు, తమిళం, హిందీ భాష‌ల‌లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని తెలిపారు. ధనుష్‌ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం, అది కూడా శేఖర్‌ కమ్ముల డైరెక‌్షన్‌ కావడంతో ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి.

ఇక ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ ఒకటి వైరలవుతుంది. ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా హీరోయిన్‌ సాయిపల్లవి నటించనుందని సమాచారం. ఇప్పటిఏ మేకర్స్‌ ఆమెతో చర్చలు జరిపారని, సాయిపల్లవి కూడా పాజిటివ్‌గా రెస్పాండ్‌ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. ఇప్పటికే సాయిపల్లవి ధనుష్‌తో కలిసి 'మారి 2' తమిళ చిత్రంలో జతకట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌ రిపీట్‌ కానుందట. లేటెస్ట్‌గా సాయిపల్లవి శేఖర్‌ కమ్మలు దర్శకత్వంలో లవ్‌స్టోరీ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ మూవీ రిలీజ్‌కు బ్రేక్‌ పడింది.  

చదవండి : శేఖర్‌ కమ్ముల మూవీపై స్పందించిన ధనుష్‌
శేఖర్‌ కమ్ముల సినిమా: ధనుష్‌ రెమ్యునరేషన్‌ ఎంతంటే..!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top